కష్టే ఫలికి బదులు కలే ఫలి అని సవరించుకోవాల్సిన తరుణమిది. ఆకాశమా అదెంత దూరం మా చెయ్యెత్తంతే అని నిరూపిస్తున్నారు ఆసియా వాసులు. ఆకాశానికి నిచ్చెన వేయగలమని నిరూపిస్తున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన ఆకాశ హార్మ్యాల్ని నిర్మిస్తూ ప్రతిభను చాటుతున్నారు. ఈ 21వ శతాబ్దంలో వరల్డ్ టాప్‌టెన్ బిల్డింగ్స్‌లో తొమ్మిది అతి పెద్ద భవన నిర్మాణాలు ఆసియాలోనే జరిగాయి. వరల్డ్ వండర్ టెన్ బిల్డింగ్స్‌లో తొమ్మిది ఆసియాలోనే కొలువుదీరాయి. ఏ విభాగాల్లో చూసినా 2010 జనవవరి 4న ప్రారంభమైన బూర్జ్ ఖలిఫాదే అగ్రస్థానమని కౌన్సిల్ ఆన్ టాల్ బిల్డింగ్స్ అండ్ అర్బన్ హెబిటెట్ (సిటిబియుహెచ్) పేర్కొంది.
బూర్జ్ ఖలిఫా
యూఏఈ లోని దుబాయ్‌లో 2004 జనవరిలో నిర్మాణం ప్రారంభమై 2010 జనవరిలో పూర్తయి ప్రారంభోత్సవం చేసుకుంది.
ఈ 163 అంతస్తుల భవనం సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. యావత్ ప్రపంచమే తలెత్తి చూడాల్సిన శిఖర సమానమీ భవనం. 9వ అంతస్తు నుంచి 108వ అంతస్తు వరకు గల 900 ప్రైవేట్ అపార్టుమెంట్స్‌లో సుమారు 25 వేల మంది శాశ్వత నివాసితులు. ఎస్‌డబ్ల్యూఏ గ్రూప్ డిజైన్ చేసిన ఈ భవన నిర్మాణానికి మొత్తం7,500 మంది సిబ్బంది నడుంకట్టారు. 3 లక్షల టన్నుల కాంక్రీట్‌ను నిర్మాణానికి వినియోగించారు. సుమారు 1.5 బిలియన్ డాలర్ల అంచానా వ్యయంతో ప్రాజెక్టు ప్రారంభమయింది. మొత్తం అభివృద్ధికి 20 బిలియన్ డాలర్లను వెచ్చించారు. ప్రాజెక్టు డెవలప్మెంట్ ఛైర్మన్‌గా మహ్మద్ అలీ అల్బర్(ఎమార్ ప్రాపర్టీస్) వ్యవహరించారు. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో మసీదు ఉన్న బిల్డింగ్‌గా బూర్జ్ ఖలిపా రికార్డు నెలకొల్పింది. ఈ భవంతి 158వ అంతస్తులో మసీదు ఉంది. అదేవిధంగా రెండో అత్యంత ఎత్తైన ప్రదేశంలోని ఈతకొలనుగా కూడా బూర్జ్ ఖలిపాకు రికార్డు ఉంది. ఈ భవనం 76వ అంతస్తులో ఈ ఈత కొలను ఉంది. 43వ అంతస్తులో మరో ఈతకొలనూ ఈ బిల్డింగ్‌లో ఏర్పాటైంది. 27 ఎకరాల సువిశాల స్థలంలో నెలకొన్న ఈ శిఖర సమానంలో రోజువారీ నీటి వినియోగం దాదాపు 9 లక్షల 46 వేల లీటర్లు.ఇందుకు 100 కిలోమీటర్ల నీటి పైపులు ఏర్పాటై ఉన్నాయి. భూమి నుంచి 2,723 అడుగుల ఎత్తున ఉన్న ఈ భవనం పైకి కిందకు నిత్యం తిరుగాడిన తొలి వ్యక్తి కేరళ(భారత్)కు చెందిన శశి. ఈయన క్రేన్ ఆపరేటర్‌గా విధుల్లో ఉండి ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలోనే ఎక్కువ మంది జనం తిరుగాడే ఏకైక భనం కూడా ఇదే. భారీగా వ్యాపార కార్యకలాపాలు జరిగే ప్రాంతంగాను బూర్జ్ ఖలిఫాది తిరుగులేని రికార్డే. వ్యాపార సముదాయాలు, హోటళ్లు, అనేకానేక సంస్థలు, కార్యాలయాలు, నివాసాలు, ఒకటేమిటి ఇదో మినీ వరల్డ్ అంటే అతిశయోక్తి కాదు. అందుకే బూర్జ్ ఖలిఫా 2010 సెప్టెంబర్‌లో మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా ప్రోజెక్ట్స్ నుంచి ప్రోజెక్ట్ అవార్డును సైతం సొంతం చేసుకోగల్గింది.

వరల్డ్ టాప్ టెన్ బిల్డింగ్స్
. 2010 బూర్జ్ ఖలిఫా..828 మీటర్లు(2717 అడుగులు)..163 అంతస్తులు..దుబాయ్(యూఏఈ)
. 2011 అబ్రాజ్ అల్ బాయిత్ టవర్స్..601 మీ.(1971 అ)..95 అంతస్తులు..మెక్కా(సౌదీ అరేబియా)
. 2004 తైపే101..509 మీ.(1670 అ)..103 అంతస్తులు..తైపే(తైవాన్)
. 2008 షాంగై వరల్డ్ ఫైనాన్షియల్ సెంటర్..492 మీ.(1614 అ)..101 అంతస్తులు..షాంగై(చైనా)
. 2010 ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్..484 మీ(1588 అ)..108 అంతస్తులు..హాంకాంగ్(హాంకాంగ్)
. 1998 పెట్రోనస్ టవర్స్1అండ్2..452 మీ.(1483 అ)..88 అంతస్తులు..కౌలాలంపూర్(మలేసియా)
. 2010 నాన్జింగ్ గ్రీన్‌ల్యాండ్ ఫైనాన్షియల్ సెంటర్..450 మీ.(1476 అ) 89 అంతస్తులు..నాన్జింగ్(చైనా)
. 1974 విల్లిస్ టవర్..442 మీ.(1451 అ)..108 అంతస్తులు..షికాగో(అమెరికా)
. 2011 కింగ్ కే100..442మీ.(1449 అ)..98 అంతస్తులు..షెంజెన్(చైనా)
______________________________________________________________
^ మనస్సున్న మారాజు యువ క్రికెటర్ గౌతం గంబీర్. ఇటీవల తన అవయవాల్ని దానం చేస్తానని ప్రకటించాడు.
^ 28 ఏళ్ల తర్వాత మదుర మీనాక్షి దేవాలయంలోకి దళితుల ప్రవేశానికి అనుమతి లభించింది.