7 Jan 2012

bamboo forest







ప్ర‌కృతిని ప‌రిర‌క్షించేవి అడ‌వులు. అవి ప‌చ్చ‌గా ఉంటేనే ప‌ర్యావ‌ర‌ణ స‌మతౌల్యం సాధ్యం. అలాంటి అడ‌వుల్ని ఓసార‌యినా చూడాల‌ని వీల‌యితే అక్క‌డ గ‌డిపి రావాల‌ని కోరుకోని మ‌న‌స్సులుండ‌వు. ముఖ్యంగా నేటి యాంత్రిక యుగంలో వీకెండ్స్ ఎంజాయిమెంట్ క‌ల్చ‌ర్ అమెరికా త‌ర‌హా పాశ్చాత్య దేశీయులకే ప‌రిమితం కాలేదు. యావ‌త్ దేశాల ప్ర‌జ‌ల్లో నేడు ప్ర‌బ‌లుతోంది. అటువంటి వారిని భార‌త్‌లోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ అడ‌వులు సేద‌తీర్చి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఏపీ విస్తీర్ణంలో ఇవి 23 శాతం ప‌రుచుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి  ఫారెస్టు అందులో భాగ‌మే. ఇక్క‌డ ఈస్ట్ర‌న్‌గాట్స్‌లోని అడ‌వుల అందాల్ని ఎంత‌చూసినా త‌నివితీర‌దు.వెదురు చెట్ల‌కు ఈ అడ‌వులు ప్ర‌సిద్ధి. తూర్పు,ప‌శ్చిమ‌,విశాఖ‌,ఖ‌మ్మం జిల్లాల స‌రిహ‌ద్దుల్లో ఈ సుందర అడ‌వులు కొలువుదీరాయి.అనేక ప‌క్షులు,జంతువులు,క్రూర‌మృగాల‌కు ఆల‌వాలం ఇవి.ఇక్క‌డ నుంచే పేరెన్నిక‌గ‌న్న రాజ‌మండ్రి పేప‌ర్‌మిల్‌కు వెదురు స‌ర‌ఫ‌రా అవుతుంటుంది.ఆ క్ర‌మంలోనే వెదురు ర‌వాణా లారీల్లో అడ‌వుల నుంచి వ‌చ్చేసిన పులి,చిరుతలు రాజ‌మండ్రి న‌గ‌రంలో హ‌ల్‌చ‌ల్ చేసిన ఘ‌ట‌న‌లూ ఉన్నాయి.
మారేడుమిల్లి అడ‌వి: రాజ‌మండ్రికి 80 కిలోమీట‌ర్ల దూరంలో భ‌ద్రాచ‌లం రోడ్డులో ఉందీ మారేడుమిల్లి ఏజెన్సీ గ్రామం.ఈ గ్రామం నుంచి కేవ‌లం 4 కిలోమీట‌ర్ల దూరం నుంచే ద‌ట్ట‌మైన అడవి మొద‌ల‌వుతుంది. ఇదో గొప్ప పిక్‌నిక్ స్పాట్‌.అక్టోబ‌ర్ నుంచి స్వదేశీ,విదేశీ సంద‌ర్శ‌కుల‌తో ఈ అడ‌వులు సంద‌డిగా మార‌తాయి.సంద‌ర్శ‌కుల్ని అల‌రించేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌(ఎపిటిడిసి) త‌గిన ఏర్పాట్ల‌ను చేస్తుంటుంది.శ‌నివారం సాయంత్రానికి సంద‌ర్శ‌కులు మారేడుమిల్లికి చేరుకుంటుంటారు. రాత్రి ఈ అడ‌వుల్లోని రిసార్టుల్లోనే వారి బ‌స‌.వారికి ఫారెస్టు గార్డులు,సాయుధ గిరిజ‌నులే ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంటారు.కార్తీక‌వ‌నం,మ‌ద‌నికుంజ్‌,జ‌ల‌త‌రంగ‌ణి త‌దిత‌ర ప్రాంతాల్లో సంద‌ర్శ‌కుల తాకిడి ఎక్కువ‌గా క‌నిపిస్తూంటుంది.
వ‌ర‌ల్డ్ బ్యాంక్ చేయూత‌: ఏపీ క‌మ్యూనిటి ఫారెస్టు మేనేజ్‌మెంట్ ప్రాజెక్టుకు వ‌ర‌ల్డ్ బ్యాంక్ చేయూత‌ నందిస్తోంది. త‌ద‌నుగుణంగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చెందుతోంది. 250 హెక్టార్ల‌లో వాలి- సుగ్రీవ మెడిసిన‌ల్ ప్లాంట్స్ క‌న్జ‌ర్వేష‌న్ ఏరియా అలాగే ముందంజ వేస్తోంది. ఇక్క‌డ దాదాపు 203 ర‌కాల వైద్య ఉప‌యోగ‌క‌ర మొక్క‌ల్ని పెంచుతున్నారు. గోదావ‌రి న‌దిపై పాపికొండ‌ల న‌డుమ జ‌ల‌యానం చేస్తూ సంద‌ర్శ‌కులు పుల‌కించిపోతుంటారు. కొండ రెడ్ల‌నే గిరిజ‌నులే ఈ ఏజెన్సీలో అత్య‌ధిక సంఖ్యాకులు. ఈ అడవుల్లో కొండ‌ల మాటు నుంచి పొంగి పోర్లే పెద్ద ఏరు వ‌ల‌మూరు. ఇది మూడు పాయ‌లుగా చీలి కొండల నుంచి దిగువన‌కు పారుతూంటుంది. అలా ఈ ఏరు 30 మీట‌ర్ల ఎత్తు నుంచి పారే ఫాల్స్‌నే అమృత‌ధార అని 15 మీట‌ర్ల ఎత్తు నుంచి మ‌రో కొండ నుంచి జాలువారే నీటిని స్వ‌ర్ణ‌ధార అని పిలుస్తుంటారు. వీటితోపాటు నీల‌కంఠేశ్వ‌ర వాట‌ర్‌ఫాల్స్ కూడా ప్ర‌సిద్ధి చెందాయి. వ‌ల‌మూరు, సోమిరెడ్డి పాలెం, వాల్మీకి పేట‌, వ‌న‌సంర‌క్ష‌ణ స‌మితి వారు ఎపిటిడిసికి ఇతోధిక స‌హ‌కారాన్ని అందిస్తున్నారు. ఇక్క‌డి గిరిజ‌నుల కొమ్ము నృత్యం కూడా ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది.
బేంబూ చికెన్‌ :  వెదురు బొంగులో ఉడికించిన కోడి మాంసం రుచి గురించి ఎంత వ‌ర్ణించినా త‌క్కువేనంటారు ఈ ప్రాంత సంద‌ర్శ‌కులు. ఉప్పు,ప‌సుపు,కారం,మాసాలాలు ద‌ట్టించిన ప‌చ్చి కోడి మాంసాన్ని మీట‌రు పొడ‌వాటి ప‌క్వానికి వ‌చ్చిన ప‌చ్చ‌టి వెదురు బొంగులో ఉంచి ఆకులు, మ‌ట్టితో అంచుల‌ను క‌ప్పేసి నిప్పుల్లో కాలుస్తారు. వెదురు బొంగు పూర్తిగా న‌ల్ల‌గా మాడిపోయే వ‌ర‌కు బాగా కాల్చాక చ‌ల్లార్చి పొగ‌లు క‌క్కుతున్న ఉడికిన ఆ కోడికూర‌ను అడ‌వి చెట్ల ఆకుల్లో పెట్టుకొని లొట్ట‌లేసుకొని తిన‌డం సంద‌ర్శ‌కులంద‌రికి నిజంగా మ‌రుపురాని మ‌ధురానుభూతే.






5 Jan 2012

niagara falls


(you can see other posts from this blog, go threw with mozilla firefox/google chrome) న‌యగ‌రా..న‌య‌నానంద‌క‌ర జ‌ల హేల‌. భూత‌ల స్వ‌ర్గ‌మ‌ని మ‌నం పిలుచుకునే అమెరికా,కెన‌డా స‌రిహ‌ద్దుల‌లో ఉందీ జ‌ల‌పాతం. వ‌ర‌ల్డ్‌లో అతిపెద్ద జ‌ల‌పాత‌మైన విక్టోరియా(ద‌క్షిణాఫ్రికా)త‌ర్వాత స్థానం దీనిదే. అందుకే ఏటా కోటిన్న‌ర‌కు పైబ‌డి ప‌ర్యాట‌కుల సంద‌ర్శ‌న‌తో ఈ జ‌ల‌పాత ప్రాంతాలు కిట‌కిట‌లాడుతూ ఉంటాయి.అమెరికన్ ఫాల్స్‌((ప్రాస్పెక్ట్ పాయింట్‌-లునా ఐలాండ్‌))), బ్రిడ‌ల్ వీల్‌ఫాల్స్‌(((లునా ఐలాండ్‌- గోట్- ఐలాండ్‌),కెన‌డియ‌న్ ఫాల్స్‌(గోట్ ఐలాండ్‌--- టేబుల్ రాక్)అనే మూడు జ‌ల‌పాతాల స‌మాహార‌మే ఈ  న‌యగ‌రా  జ‌ల‌పాతం.అమెరిక‌న్ ఫాల్స్‌,బ్రిడ‌ల్ వీల్‌ఫాల్స్ 176 అడుగుల ఎత్తున ఉన్న కొండ కొన‌ల నుంచి పాల నుర‌గ‌ల్ని త‌ల‌పించే జ‌లసిరులు దిగువ‌న‌కు ఎగ‌సిప‌డుతూ ఉర‌క‌లెత్తుతుంటాయి.ఈ ప్రాంతంలో దాదాపు ల‌క్షా 50 వేల గ్యాల‌న్ల నీరు పారుతుంది.జూన్‌,జులై,ఆగ‌స్టుల్లో అధిక సంఖ్య‌లో ప‌ర్యాట‌కులు ఇక్క‌డ‌కు విచ్చేస్తుంటారు.
కెన‌డియ‌న్(హార్స్‌షూ)ఫాల్స్ నుంచి జ‌లాలు 167 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతుంటాయి.ఇక్క‌డ సుమారు ఆరు ల‌క్ష‌ల గ్యాల‌న్ల నీరు ప్ర‌వ‌హిస్తూంటుంద‌ని యూఎస్ జియోలాజిక‌ల్‌ (యూఎస్‌జిఎస్‌)) పేర్కొంది.ఈ జ‌ల‌పాతానికి మూలం  న‌యగ‌రా  న‌ది.మంచు యుగం కాలం నాటిదిది.దీని వ‌య‌స్సు 18వేల ఏళ్లు.మూడు కిలోమీట‌ర్ల ఎత్తున పేరుకుపోయిన మంచుప‌ల‌క వేల ఏళ్ల క్రితం క‌ర‌గ‌డంతోనే న‌దులు,స‌ర‌స్సులు ఈ ప్రాంతాల్లో ఏర్ప‌డ్డాయి.ద‌క్షిణ అంటారియో ప్రాంతంలో నెల‌కొందీ అద్భుత జ‌ల‌పాతం. న‌యగ‌రా  పెనిన్సులాలో 12 వేల ఏళ్ల క్రిత‌మే మంచుప్రాంతం అదృశ్య‌మ‌యింది.ఈ మంచుఖండం మాయ‌మ‌య్యాకే ఎరై స‌ర‌స్సు, న‌యగ‌రా  న‌ది,అంటారియో స‌ర‌స్సు,లారెన్స్ న‌దులు ఏర్ప‌డ్డాయి.ఈ మొత్తం జ‌లాల‌న్నీ కొండ‌ల‌కోన‌ల నుంచి పారుతూ చూడచ‌క్క‌ని జ‌ల‌పాతాలై దిగువ‌న‌కు ప్ర‌వ‌హిస్తూ చివ‌ర‌కు స‌ముద్రంలో క‌లుస్తున్నాయి.
వండ‌ర్ న‌యాగ‌రా:క్వీన్‌స్ట‌న్‌-.-లూయిస్ట‌న్‌ ప్రాంతంలో  న‌యగ‌రా  జ‌ల‌పాత హోయ‌ల్ని ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి వ‌చ్చే ప‌ర్యాట‌కులు ఆనందోత్సాహాల‌తో తిల‌కించి పుల‌కించిపోతుంటారు.ఈ జ‌ల‌పాత ప్రాంత స‌మీపంలోకి చేరుకుంటుండ‌గానే మంచు బిందువులు,నీటి తుంప‌ర్లతో అతిథుల‌ను ప‌ల‌క‌రిస్తూ  న‌యగ‌రా  స్వాగ‌తం ప‌లుకుతుంది.ఇక్క‌డ బ‌ట‌ర్‌ఫ్లై క‌న్జ‌ర్వేట‌రీ,మేరీలాండ్ ఆహ్లాదాన్ని పంచుతాయి.బ‌ఫెలో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నుంచి,టొరంటో(కెన‌డా)వైపు నుంచి ఈ జ‌ల‌పాత ప్రాంతానికి అర‌గంట ప్ర‌యాణించి చేరుకోవ‌చ్చు. న‌యగ‌రా  జ‌ల‌పాత మార్గంలో ఆరు అపురూప‌మైన బ్రిడ్జిలూ భ‌లే ఆక‌ట్టుకుంటుంటాయి.ఈ వంతెన‌ల‌న్నీ కెన‌డా,అమెరికా అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుల‌ వెంబ‌డే  న‌యగ‌రా  న‌దిపై నిర్మిత‌మ‌య్యాయి.నాలుగు చ‌క్రాల వాహ‌న‌దారులు,పాద‌చారులు కూడా ఈ వంతెన‌ల‌పై ప్ర‌యాణిస్తుంటారు.వీటిలోనే రెండు రైలు వంతెన‌లు కూడా ఉన్నాయి.అవి..పీస్ బ్రిడ్జ్‌,రెయిన్‌బో బ్రిడ్జ్‌,వ‌ర్ల్‌పుల్ బ్రిడ్జ్‌,లూయిస్ట‌న్‌-క్వీన్‌స్ట‌న్ బ్రిడ్జ్‌,మిచిగ‌న్ సెంట్ర‌ల్ రైల్వే బ్రిడ్జ్‌,ఇంట‌ర్నేష‌న‌ల్ రైల్వే బ్రిడ్జ్‌.

జ‌ల విద్యుదుత్పాద‌న‌:అమెరికాలోని రాబ‌ర్ట్ మోజెస్‌((జిఎస్‌)24 ల‌క్ష‌ల కిలోవాట్స్‌,లూయిస్ట‌న్ పంప్‌((జిఎస్‌)3 ల‌క్ష‌ల కిలోవాట్స్ చొప్పున 27 ల‌క్ష‌ల కిలోవాట్స్ జ‌ల విద్యుత్ ఉత్ప‌త్తి అవుతోంది.కెన‌డా వైపు నుంచి స‌ర్ అడమ్ బెక్‌(1(జిఎస్‌)5ల‌క్ష‌ల కిలోవాట్స్‌,స‌ర్ అడ‌మ్ బెక్‌బ(2జిఎస్‌)ల‌క్ష‌ల కిలోవాట్స్‌,స‌ర్ అడ‌మ్ బెక్‌పీస్‌((జిఎస్‌)ల‌క్షా 75వేల కిలోవాట్స్‌,డెక్యూ(జిఎస్‌)కెథ‌రిన్ 23వేల కిలోవాట్స్‌,డెక్యూ(2జిఎస్‌)కెథ‌రిన్ ల‌క్షా44వేల కిలోవాట్స్ చొప్పున మొత్తం సుమారు 24ల‌క్ష‌ల కిలోవాట్స్ జ‌ల విద్యుదుత్పాద‌న చేస్తున్నారు.


3 Jan 2012

under sea feast


(you can see other posts from this blog, go threw with mozilla firefox/google chrome)
లోకో భిన్న‌రుచి!..ఆ రుచినీ ప్ర‌కృతిని ఆస్వాదిస్తూ స్వీక‌రిస్తుంటే భ‌లే మ‌జా.అందుకు భూమి,ఆకాశం,నీటిపైనే కాదు స‌ముద్ర‌గ‌ర్భం కూడా వేదిక అయిందంటే ఆశ్చ‌ర్యంతోపాటు వింత అనుభూతినే క‌ల్గిస్తుంది.స‌రిగ్గా అలాంటి థ్రిల్‌ను మ‌న‌కు క‌ల్పించే రెస్టారెంటే ప్ర‌కృతి అందాల‌కు ప‌ర్యాయ‌ప‌ద‌మైన మాల్దీవుల్లో ఉంది.2007లో మాల్దీవుల్లోని(రంగ‌లిఐలాండ్‌)హిందూ మహాస‌ముద్ర జ‌లాల అడుగున నిర్మిత‌మైన‌ హిల్ట‌న్ మాల్దీవ్స్ రిసార్ట్ అండ్ స్పాకు చెందిన ఇథా ప్ర‌పంచంలోనే తొలి రెస్టారెంట్‌గా చ‌రిత్ర‌ను లిఖించ‌డ‌మే కాక అల‌రిస్తోంది.అల‌ల ఉధృతి లేని ప్ర‌శాంత స‌ముద్ర జ‌లాల్లో ఒదిగి ఉన్న ఈ అద్దాల‌((అక్‌రిలిక్)హోట‌ల్లో చూడ చ‌క్క‌ని చేప‌లు అసాంతం క‌ద‌లాడు‌తుండ‌గా ఊహ‌ల్లో తేలిపోతూ విందు ఆర‌గించ‌డం ఎవ‌రికైనా మ‌ర‌పురాని మ‌ధుర జ్ఞాప‌క‌మే.ఈ రెస్టారెంట్‌కు వ‌చ్చే అతిథులు 270 డిగ్రీల కోణంలో స‌ముద్ర గ‌ర్భాన నెల‌కొన్న అందాల‌ను క‌న్నుల పండ‌గ్గా తిల‌కిస్తుంటార‌ని హిల్ట‌న్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ కార్‌స్ట‌న్ షైక్ పేర్కొన్నారు.న్యూజిలాండ్‌కు చెందిన ఎంజె మ‌ర్ఫీ లిమిటెడ్ ఈ హోట‌ల్‌ను రూపుదిద్దింది.సాధారణంగా అక్వెరియాల్లో తిరుగాడే రంగురంగుల చేప‌ల‌నే మ‌నం సంభ్ర‌మంగా చూస్తుంటాం.ఈ హోట‌ల్‌కెళ్తే మ‌న‌మే అక్వెరియంలో ఉండ‌గా చుట్టూ ప‌రుచుకున్న స‌ముద్ర జ‌లాల్లో సంచ‌రించే చేప‌ల మ‌ధ్య ఇష్ట‌మైన రుచుల‌ను ఆస్వాదించ‌డమ‌న్న‌ది క‌చ్చితంగా స‌రికొత్త అనుభూతే.దాదాపు ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత వంట‌కాల‌న్నీ ఈ రెస్టారెంట్‌లో ల‌భ్య‌మౌతాయి.అయితే మాల్దీవుల ప్రాంత జ‌లాల్లో మాత్ర‌మే దొరికే వైట్ ఫిష్‌,ఫెన్నెల్(ఓ ర‌కం మొక్క‌)సాస్‌,కూర ఈ హిల్ట‌న్ రెస్టారెంట్ స్పెష‌ల్‌.ఈ హోట‌ల్లో నుంచి తాబేళ్లు,వివిధ ర‌కాల చేప‌లు,మొక్క‌లు,అనేక జ‌ల‌చ‌రాల స‌హా షార్క్‌ల‌ను చూడ్డం అతిథుల్లో క్ష‌ణ‌క్ష‌ణం అనంత ఉత్కంఠ‌నే కల్గిస్తూంటుంది.
జూల్స్ లాడ్జ్‌-ఫ్లోరిడా(యూ.ఎస్‌):).. స‌ముద్ర గ‌ర్భాన నిర్మిత‌మైన హోట‌ళ్ల‌కు నిఖార్స‌యిన వేదిక దుబాయ్‌.ఇక్క‌డ ఈ త‌ర‌హా ‌హోట‌ళ్లు అనేకం.అయితే అమెరికాలోని ఫ్లోరిడా(కీలార్గో)లోని జూల్స్ లాడ్జ్ స‌ముద్ర జ‌లాల అడుగున నిర్మిత‌మైన తొలి హోట‌ల్‌గా చ‌రిత్ర‌కెక్కింది.స‌ముద్ర ఉప‌రిత‌లం నుంచి 21 అడుగుల లోతున ఈ హోట‌ల్ ప్ర‌ధాన ద్వారం స్వాగ‌తం ప‌లుకుతూ క‌నిపిస్తుంది.విలాస‌వంత‌మైన విశ్రాంత గ‌దుల‌కే కాదు స్కూబా డైవింగ్ కోర్సుకు ఈ జూల్స్ పేరొందింది.అంతేనా వివిధ న‌మూనా క్రీడా ప్రాంగ‌ణాలు,పార్క్‌ల‌తో ఈ హోట‌ల్ అతిథుల్ని ఉల్లాస‌ప‌రుస్తోంది.అదేవిధంగా స్వీడ‌న్‌(వెస్టార‌స్‌)లోని అట్ట‌ర్ ఇన్ కూడా ఈ త‌ర‌హా హోట‌ళ్ల‌లో ఒక‌టిగా ఖ్యాతి గ‌డించింది.ఈ హోట‌ల్ స‌ముద్ర ఉప‌రిత‌లం నుంచి మూడు మీట‌ర్ల లోతున నిర్మిత‌మైంది.ఇక ఫిజిలోని పొజిడ‌న్ హోట‌ల్ కూడా ఇదే విధంగా స‌ముద్ర జ‌లాల్లో 40 అడుగుల లోతున నెల‌కొంది.2010లో ట‌ర్కీలో ఇస్తాంబుల్ హోట‌ల్ కొలువుదీరింది.సెవెన్ స్టార్ హోదా గ‌ల ఈ హోట‌ల్ ఏడు అంత‌స్తుల‌తో స‌ముద్ర గ‌ర్భంలో ఠీవీని ఒల‌క‌బోస్తోంది.అలాగే చైనాకు చెందిన షాంగై షిమొవ్ వండ‌ర్‌లాండ్ హోట‌ల్‌ది ఫైవ్ స్టార్ స్టేట‌స్‌.వ‌ర‌ల్డ్ అండ‌ర్ సీ టాప్ ఫైవ్ హోట‌ళ్ల జాబితాలో చోటు ద‌క్కించుకున్న హోట‌ల్ ఇది.2009 నుంచి ఈ హోట‌ల్ అతిథుల‌కు అందుబాటులోకి వ‌చ్చింది.
______________________________________________________________
సిడ్నీ@100:వందో టెస్టుకు ఆతిథ్యం ఇస్తోన్న సిడ్నీ గ్రౌండ్‌లోనే భార‌త మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ 100@100...

31 Dec 2011

wishes



 

navayuva

Pageviews by Countries


India
1,567
United States
562
Russia
153
Latvia
16
Germany
15
Malaysia
5
Indonesia
3
Brazil
1
Chile
1
Sweden                                                                                                                         1
Saudi Arabia
1
New Caledonia                                                                                                            1
      
Malta
1
Thailand
1
Italy
1
Iraq
1
  

Popular Posts

Wisdomrays