16 Mar 2012
Keukenhof Garden
ఒత్తిడి...మనిషి మనుగడలో ఇప్పుడు విడదీయలేని ఓ చిక్కుముడి. తమ జీవితకాలంలో ఏదో ఒక సందర్భంలో దీని బారిన పడని వారే ఉండరు. దీన్ని అధిగమించేందుకు ఒక్కోరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటుంటారు. పబ్‌లు, థెక్‌లు,రేస్‌లు ఇలా రకరకాలుగా వీకెండ్స్‌ను ఖుషీ చేసి మళ్లీ తమ పనుల్లో తలమునకలవుతున్న వారే ప్రస్తుతం అధికం.అయితే అన్ని వయస్సుల వారిని సేద తీర్చేది మళ్లీ కొత్త ఉత్సాహంతో ఉరకలెత్తించేది ప్రకృతే.ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకర అందాలను తిలకిస్తూ ఉంటే ఒత్తిడీ గిత్తిడీ హుష్ కాకే అంటున్నారు మానసిక నిపుణులు.ఉదాహరణకు పూదోటలనే తీసుకుంటే అవి అందర్ని ఆనందపర్చి సాంత్వన చేకూరుస్తాయి.మరి అలాంటి వరల్డ్ వండర్ ఫుల్ ఫ్లవర్ గార్డెన్ ఎక్కడుందో తెలుసా? ఇంకెక్కడ నెదర్లాండ్స్‌లో.అదే క్యుకెన్‌హొఫ్ ఫ్లవర్ గార్డెన్.
సొగసుల పూదోట: క్యుకెన్‌హొఫ్ ఫ్లవర్ గార్డెన్ సౌత్ హాలెండ్‌లోని లిస్సే అనే పట్టణంలో 1949లో పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. 15వ శతాబ్దం నుంచే దీని ఉనికి ఉందంటుంటారు. ఈ అందాల పూల వనానికి కిచెన్ గార్డెన్, గార్డెన్ ఆఫ్ యూరప్ అనే పేర్లూ ఉన్నాయి. దీని ఘనత ఏంటంటే ప్రపంచంలోనే ఇది అతి పెద్ద పూలతోట.60 ఏళ్లకు పైగా ఈ రికార్డును నిలబెట్టుకుంటోందిది. అమెస్టర్‌డమ్‌కు దగ్గర్లోనే గల ఈ క్యుకెన్‌హొఫ్ ఫ్లవర్ గార్డెన్ 32 హెక్టార్లలో విస్తరించింది. ఈ పరిమళభరిత అందాల పూలవనంలో లక్షల రకాల పువ్వులు మనకు కనువిందు కల్గిస్తాయి. దీని సందర్శన భాగ్యం మాత్రం ఏడాదిలో రెణ్నెల్లే. ఈ ఏడాది 22 మార్చి నుంచి 20 మే వరకు పర్యాటకుల్ని క్యుకెన్‌హొఫ్ గార్డెన్ అలరించనుంది. ఫ్లవర్ పెరెడ్ ఈ ఏప్రిల్ 21 నుంచి ప్రారంభంకానుంది. ఆకర్షణీయ టులిప్ ఫ్లవర్స్‌ను మాత్రం ఏప్రిల్ రెండో వారం నుంచే చూడగలం.


* Butchart Gardens:This is a whole group of floral gardens which are situated in Brentwood Bay, British Colombia, Canada.
* Bodnant Garden:This garden is situated in the county of Conwy, Wales; above the River Conwy. It is a traditional flower garden of an ancestral family home in the United Kingdom.
* Bagatelle: Now it is known for the exquisite rose gardens,Paris. There are two rosaries in Bagatelle.
14 Mar 2012
Sea Horse
ఆడ,మగ సృష్టికి ప్రతిసృష్టి స్వరూపాలు. ఇది సహజం...సాధారణం. కానీ మగ వారే పిల్లల్ని కంటే అసాధారణమే కదూ! ఆ మధ్య కాలంలో ఓ అయ్య అమ్మ అయ్యాడు. అది లింగమార్పిడితో సాధ్యమైన అమ్మతనమే అనుకోండి.అందులో వింత లేదు. ఆధునిక కాలంలో సైన్స్ పురోగతి అని సరిపెట్టుకోవచ్చు. అందుకు భిన్నంగా ఓ మగజీవి పిల్లల్ని కనడం మాత్రం వింతల్లో కెల్లా వింత.ఆ జీవే సీహార్స్.ఇది గుర్రం కాదు. ఓ జల చరం.చేప జాతి జీవి.
చూడ చక్కని `గుర్రం`: సముద్ర జల చరమైన ఈ సీహార్స్ అసలు పేరు హిప్పో కెంపస్.ప్రాచీన గ్రీకు పదం నుంచి వచ్చిందా పేరు.హిప్పోస్ అంటే గుర్రమని కెంపస్ అంటే సముద్రమని ఆ గ్రీకు పదానికి అర్థం.సమ ఉష్ణోగ్రత కల్గిన సముద్రాల్లో ఈ చేపలు జీవిస్తాయి.ఇవి నిశ్చలంగా ఉండే సముద్రగర్భంలోనే ఉంటాయి. అక్కడ మొలిచిన గడ్డి, ఉప్పుకయ్యలు, పగడపు చిప్పలు, రావి చెట్టు జాతి మొక్కలు గల ప్రాంతంలో మనుగడ సాగిస్తుంటాయి.వీటిలో దాదాపు 47 రకాలు ఉన్నాయి. ఇందులో నాలుగు రకాలు ఉత్తర, దక్షిణ అమెరికా ప్రాంతాల్లోని అట్లాంటిక్ సముద్రాల్లో నివసిస్తున్నాయి. నోవా స్కాషియా, ఉరుగ్వే, బ్రహ్మస్ ప్రాంతాల్లోనూ మరి కొన్ని రకాల సీహార్స్‌లు కనిపిస్తాయి. పసిపిక్ సముద్ర జలాల్లో వివిధ రకాల సీహార్స్‌ల ఉనికి ఉంది. వీటిలో మగవి కేవలం ఓ చదరపు మీటర్ ప్రాంతంలోనే తిరుగాడుతుంటాయి. ఆడవయితే 100 చదరపు మీటర్ల మేర ఈదులాడతాయి. ఇంతకు వీటి గమన వేగమెంతంటే కేవలం గంటకు 150 సెంటీమీటర్లేనట.

మందు-ముప్పు:ఈ సీహార్స్‌లతో పలు రకాల మందులు తయారవుతున్నాయి. ముఖ్యంగా వీటిపై చైనీయులకు మక్కువ ఎక్కువ. అదే వీటి ఉనికికే ఎసరు తెస్తోంది. పైగా వీటి సంచార పరిధిని బట్టి అక్వెరియాల్లో వీటి పెంపకం బహు సులభం. దాంతో చాలా మందికి ఇవి పెంపుడు జీవులయ్యాయి.అయితే అద్భుతమైన వీటి మనుగడపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. మరోవైపు ఈ సీహార్స్‌ల అక్రమ రవాణా అడ్డుకట్టకు చర్యలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా 2004 నుంచి నిఘా తీవ్రతరమైంది. ఇండోనేసియా, జపాన్, నార్వే, దక్షిణ కొరియా తదితర దేశాలపైనే అన్ని దేశాలు దృష్టి కేంద్రీకరిస్తున్నాయి.
13 Mar 2012
Large Bridge

రోడ్‌కంరైల్ బ్రిడ్జ్: గోదావరి జలాలు నిరుపయోగంగా సముద్రంలో కలిసిపోవడాన్ని గుర్తించిన బ్రిటిష్ పాలకుడు సర్ ఆర్ధర్ థామస్ కాటన్ 1850లో ధవళేశ్వరం వద్ద ఆనకట్టను నిర్మించారు.ఆయనే 1900లో రాజమండ్రి-కొవ్వూరులను కలుపుతూ గోదావరి నదిపై తొలి వంతెన కట్టారు.ఇది రైలు వంతెన. కేవలంరాతి సున్నం,ఇనుప దిమ్మెలతోనే నిర్మితమైన ఈ పాత వంతెన దాదాపు 100 ఏళ్లు సేవలందించి ఇప్పటికీ నిలిచి ఉంది.అప్పటి ఇంజనీరింగ్ నైపుణ్యానికిదో మచ్చు తునక.ఈ వంతెనతోపాటు మరో వంతెన అవసరాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం రోడ్ కంరైల్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టింది.63 కోట్ల స్వల్ప మొత్తంతోనే ఏర్పడిన ఈ కొత్త వంతెనను 1972లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారు.ఈ కొత్త బ్రిడ్జి నిరాటంకంగా సేవలందిస్తోంది.డబుల్ డెకర్ బస్సులు,రైళ్లను తలపించే ఈ వంతెనపై గల రోడ్డు మార్గంలో బిలబిల మంటూ ప్రయాణించే వాహనశ్రేణులు,ఆ కిందనే దూసుకుపోయే రైళ్లను చూడ్డం భలే కనువిందు. లెక్కకు మించి వాహనాలు ప్రయాణించే సౌకర్యమే కాక కిందన గల ట్రాక్‌పై గంటకు 75 మైళ్ల వేగంతో రైళ్లను పరిగెత్తించగల సామర్థ్యం ఈ కొత్త బ్రిడ్జి సొంతం.ఈ రోడ్ కం రైల్ బ్రిడ్జిని భరత్ బారీ ఉద్యోగ నిగం లిమిటెడ్ నిర్మించింది.ఈ వంతెన ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌లోగల గ్రాఫ్టన్ బ్రిడ్జ్‌ను పోలి ఉంటుంది. ప్రస్తుతం ఈ వంతెనపై ఒత్తిడిని తగ్గించేందుకు రోడ్డు రవాణా కోసం మరో పొడవైన వారధి నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.
ఆర్క్ బ్రిడ్జి: రాజమండ్రి-కొవ్వూరుల మధ్య ముచ్చటగా మూడో రైలు వంతెన కూడా నిర్మితమైంది.1997 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ స్విట్జర్లాండ్ మోడల్ ఆర్క్ బ్రిడ్జికీ ప్రత్యేకత ఉంది. ఇది డబుల్ ట్రాక్ రైల్ బ్రిడ్జ్.పక్కపక్కనే గల ట్రాక్‌లపై ఏకకాలంలో రెండు రైళ్లు ప్రయాణించొచ్చు.అదీ గంటకు 350 కిలోమీటర్ల వేగంతో రైళ్లు దూసుకుపోయే సామర్థ్యాన్ని ఈ వంతెన కల్గి ఉండడం విశేషం.అయితే ఈ వంతెనపై ప్రస్తుతానికి ఒక ట్రాక్‌ను మాత్రమే రైల్వే శాఖ వినియోగించుకుంటుంది.ఈ ఆర్క్ బ్రిడ్జ్‌ను హిందుస్థాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ తీర్చిదిద్దింది.
Top-10 longest bridges in the World
![]() |
Danyang–Kunshan Grand Bridge |
2. Tianjin Grand Bridge – As of 2011 Guinness World Records recorded it as the second longest bridge in the world. runs between Langfang and Qingxian, part of the Beijing–Shanghai High-Speed Railway. It is one of the longest bridges in the world with a total length of about 373,000 ft, or 113.7 kilometres (70.6 mi).
3. The Weinan Weihe Grand Bridge – connects Zhengzhou and Xi’an, in China. The bridge is 79,732 m (261,588 ft) (49.5 Miles) long crossing the Wei River twice, as well as many other rivers, highways and railways.
4. The Bang Na Expressway –The Bang Na Expressway, officially Burapha Withi Expressway, is a 54 km long six-lane elevated highway in Bangkok, Thailand.
5. Beijing Grand Bridge –Is a 48.153 kilometres (29.921 mi) long railway viaduct on the Beijing–Shanghai High-Speed Railway, located in Beijing.
6. Jiaozhou Bay Bridge - T” shaped with 3 entry/exit points roadway bridge in eastern China’s Shandong province. It transects Jiaozhou Bay, connecting Huangdao District, the city of Qingdao and Hongdao Island. Jiaozhou Bay Bridge is 42.5 kilometres (26.4 mi) long.
7. The Lake Pontchartrain Causeway - Consists of two parallel bridges crossing Lake Pontchartrain in southern Louisiana, United States. The longer of the two bridges is 23.83 miles (38.35 km) long. Since 1969 it was listed by Guinness World Records as the longest bridge over water in the world.
8. The Manchac Swamp Bridge - Is a twin concrete trestle bridge in the US state of Louisiana. With a total length of 22.80 miles (36.69 km. Opening in 1979.
9. Yangcun Bridge – People´s Republic of China presents with pleasure various ostentatious constructions. One of them is Yangcun (35,8 kms), the fourth longest bridge of the world. It makes a part of railway between towns of Beijing and Tian-jin
10. Hangzhou Bay Bridge - Is a long highway bridge with a cable-stayed portion across Hangzhou Bay in the eastern coastal region of China. It connects the municipalities of Jiaxing and Ningbo in Zhejiang province. At 35.673 km (22 mi) in length, Hangzhou Bay Bridge is one of the longest trans-oceanic bridges in the world.
Subscribe to:
Posts (Atom)
Popular Posts
-
Many of us have heard the saying `An apple a day keeps the doctor away` . The apple is crisp and light tasting. ...
-
Rarest of the rare disease..The `Kawasaki disease` (mucocutaneous lymph node syndrome) is a form of vasculitis identified by an acute fe...
-
http://royalloyal007.blogspot.in/2013/04/szoo.html Since Virat Kohli made his debut in 2008, he and India have played just four ODIs ag...
-
http://royalloyal007.blogspot.in/2011/11/litigeron.html