16 Mar 2012
Keukenhof Garden
ఒత్తిడి...మనిషి మనుగడలో ఇప్పుడు విడదీయలేని ఓ చిక్కుముడి. తమ జీవితకాలంలో ఏదో ఒక సందర్భంలో దీని బారిన పడని వారే ఉండరు. దీన్ని అధిగమించేందుకు ఒక్కోరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటుంటారు. పబ్‌లు, థెక్‌లు,రేస్‌లు ఇలా రకరకాలుగా వీకెండ్స్‌ను ఖుషీ చేసి మళ్లీ తమ పనుల్లో తలమునకలవుతున్న వారే ప్రస్తుతం అధికం.అయితే అన్ని వయస్సుల వారిని సేద తీర్చేది మళ్లీ కొత్త ఉత్సాహంతో ఉరకలెత్తించేది ప్రకృతే.ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకర అందాలను తిలకిస్తూ ఉంటే ఒత్తిడీ గిత్తిడీ హుష్ కాకే అంటున్నారు మానసిక నిపుణులు.ఉదాహరణకు పూదోటలనే తీసుకుంటే అవి అందర్ని ఆనందపర్చి సాంత్వన చేకూరుస్తాయి.మరి అలాంటి వరల్డ్ వండర్ ఫుల్ ఫ్లవర్ గార్డెన్ ఎక్కడుందో తెలుసా? ఇంకెక్కడ నెదర్లాండ్స్‌లో.అదే క్యుకెన్‌హొఫ్ ఫ్లవర్ గార్డెన్.
సొగసుల పూదోట: క్యుకెన్‌హొఫ్ ఫ్లవర్ గార్డెన్ సౌత్ హాలెండ్లోని లిస్సే అనే పట్టణంలో 1949లో పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. 15వ శతాబ్దం నుంచే దీని ఉనికి ఉందంటుంటారు. ఈ అందాల పూల వనానికి కిచెన్ గార్డెన్, గార్డెన్ ఆఫ్ యూరప్ అనే పేర్లూ ఉన్నాయి. దీని ఘనత ఏంటంటే ప్రపంచంలోనే ఇది అతి పెద్ద పూలతోట.60 ఏళ్లకు పైగా ఈ రికార్డును నిలబెట్టుకుంటోందిది. అమెస్టర్డమ్కు దగ్గర్లోనే గల ఈ క్యుకెన్‌హొఫ్ ఫ్లవర్ గార్డెన్ 32 హెక్టార్లలో విస్తరించింది. ఈ పరిమళభరిత అందాల పూలవనంలో లక్షల రకాల పువ్వులు మనకు కనువిందు కల్గిస్తాయి. దీని సందర్శన భాగ్యం మాత్రం ఏడాదిలో రెణ్నెల్లే. ఈ ఏడాది 22 మార్చి నుంచి 20 మే వరకు పర్యాటకుల్ని క్యుకెన్‌హొఫ్ గార్డెన్ అలరించనుంది. ఫ్లవర్ పెరెడ్ ఈ ఏప్రిల్ 21 నుంచి ప్రారంభంకానుంది. ఆకర్షణీయ టులిప్ ఫ్లవర్స్‌ను మాత్రం ఏప్రిల్ రెండో వారం నుంచే చూడగలం.
కేస్ట్లే క్యుకెన్‌హొఫ్ గ్రౌండ్స్: వివిధ ఫెస్టివల్స్‌కు ఈ గ్రౌండ్స్ గొప్ప వేదిక.ఏడాది పొడవునా ఇక్కడకు సందర్శకుల్ని అనుమతిస్తారు. వేడుకల్లో కేస్ట్లే ఫెస్ట్, లేడీస్ వింటర్మైట్ ఫ్యామస్.ఇక్కడ క్లాసికల్ మ్యూజిక్ సందర్శకులకు వీనులవిందే.ఇందులోని రెస్టారాంట్లలో రుచికర ఆహార పదార్థాలు, పానీయాలకు కొదవులేదు.
అందాల పూల వనాలు:క్యుకెన్‌హొఫ్ ఫ్లవర్ గార్డెన్ తరహాలో ప్రపంచంలో మరికొన్ని పేరెన్నికగన్న పూదోటలు ఉన్నాయి.అవి..* Butchart Gardens:This is a whole group of floral gardens which are situated in Brentwood Bay, British Colombia, Canada.
* Bodnant Garden:This garden is situated in the county of Conwy, Wales; above the River Conwy. It is a traditional flower garden of an ancestral family home in the United Kingdom.
* Bagatelle: Now it is known for the exquisite rose gardens,Paris. There are two rosaries in Bagatelle.
14 Mar 2012
Sea Horse
ఆడ,మగ సృష్టికి ప్రతిసృష్టి స్వరూపాలు. ఇది సహజం...సాధారణం. కానీ మగ వారే పిల్లల్ని కంటే అసాధారణమే కదూ! ఆ మధ్య కాలంలో ఓ అయ్య అమ్మ అయ్యాడు. అది లింగమార్పిడితో సాధ్యమైన అమ్మతనమే అనుకోండి.అందులో వింత లేదు. ఆధునిక కాలంలో సైన్స్ పురోగతి అని సరిపెట్టుకోవచ్చు. అందుకు భిన్నంగా ఓ మగజీవి పిల్లల్ని కనడం మాత్రం వింతల్లో కెల్లా వింత.ఆ జీవే సీహార్స్.ఇది గుర్రం కాదు. ఓ జల చరం.చేప జాతి జీవి.
చూడ చక్కని `గుర్రం`: సముద్ర జల చరమైన ఈ సీహార్స్ అసలు పేరు హిప్పో కెంపస్.ప్రాచీన గ్రీకు పదం నుంచి వచ్చిందా పేరు.హిప్పోస్ అంటే గుర్రమని కెంపస్ అంటే సముద్రమని ఆ గ్రీకు పదానికి అర్థం.సమ ఉష్ణోగ్రత కల్గిన సముద్రాల్లో ఈ చేపలు జీవిస్తాయి.ఇవి నిశ్చలంగా ఉండే సముద్రగర్భంలోనే ఉంటాయి. అక్కడ మొలిచిన గడ్డి, ఉప్పుకయ్యలు, పగడపు చిప్పలు, రావి చెట్టు జాతి మొక్కలు గల ప్రాంతంలో మనుగడ సాగిస్తుంటాయి.వీటిలో దాదాపు 47 రకాలు ఉన్నాయి. ఇందులో నాలుగు రకాలు ఉత్తర, దక్షిణ అమెరికా ప్రాంతాల్లోని అట్లాంటిక్ సముద్రాల్లో నివసిస్తున్నాయి. నోవా స్కాషియా, ఉరుగ్వే, బ్రహ్మస్ ప్రాంతాల్లోనూ మరి కొన్ని రకాల సీహార్స్‌లు కనిపిస్తాయి. పసిపిక్ సముద్ర జలాల్లో వివిధ రకాల సీహార్స్ల ఉనికి ఉంది. వీటిలో మగవి కేవలం ఓ చదరపు మీటర్ ప్రాంతంలోనే తిరుగాడుతుంటాయి. ఆడవయితే 100 చదరపు మీటర్ల మేర ఈదులాడతాయి. ఇంతకు వీటి గమన వేగమెంతంటే కేవలం గంటకు 150 సెంటీమీటర్లేనట.
పిల్లల్ని కనే మేల్ సీహార్స్: మొసళ్ల మాదిరిగా పొడుచుకొచ్చిన ఎముకలతో ఈ సీహార్స్‌లు గమ్మతుగా కనిపిస్తాయి. తోక వంటి భాగం వీటికో అదనపు ఆకర్షణ.కాగా మగ సీహార్స్లకు కంగార్లకు ఉన్నట్లే సంచి వంటి భాగం కూడా అమరి ఉంటుంది. సంభోగ సమయంలో ఆడవి తమ అండాలను మగ సీహార్స్ల సంచిలో వదిలి పెడతాయి. ఇలా దాదాపు 1500 అండాలను మగ సీహార్స్‌లు తమ సంచిలో 10 నుంచి 45 రోజులు ఉంచుకుంటాయి. సముద్ర గర్భంలోనే గడ్డి, మొక్కలున్న ప్రాంతంలో ఆ అండాలను విడిచిపెడతాయి. ఆ తర్వాత వాటి వద్ద ప్రొలాక్టిన్ అనే తమ వీర్య కణాల్ని విసర్జిస్తాయి. అలా బాహ్యంగానే సహజసిద్ధ ఇంక్యుబేటర్ల్లో పిల్ల సీహార్స్‌లు ఊపిరిపోసుకుంటాయి. అంతటితో తల్లి+తండ్రి కూడా అయిన మేల్ సీహార్స్ల బాధ్యత తీరిపోతుంది. ఇక అప్పటి నుంచి పిల్లల్నిఇవి పట్టించుకోవు.
మందు-ముప్పు:ఈ సీహార్స్లతో పలు రకాల మందులు తయారవుతున్నాయి. ముఖ్యంగా వీటిపై చైనీయులకు మక్కువ ఎక్కువ. అదే వీటి ఉనికికే ఎసరు తెస్తోంది. పైగా వీటి సంచార పరిధిని బట్టి అక్వెరియాల్లో వీటి పెంపకం బహు సులభం. దాంతో చాలా మందికి ఇవి పెంపుడు జీవులయ్యాయి.అయితే అద్భుతమైన వీటి మనుగడపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. మరోవైపు ఈ సీహార్స్ల అక్రమ రవాణా అడ్డుకట్టకు చర్యలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా 2004 నుంచి నిఘా తీవ్రతరమైంది. ఇండోనేసియా, జపాన్, నార్వే, దక్షిణ కొరియా తదితర దేశాలపైనే అన్ని దేశాలు దృష్టి కేంద్రీకరిస్తున్నాయి.
Subscribe to:
Posts (Atom)
Popular Posts
-
light house దేశ భాషలందు తెలుగు లెస్సా. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్..తెలుగు పలుకు తేనెలొలుకు.. ఇలా తెలుగును ఎన్ని విధాలుగానయినా అభివర్ని...
-
Check out #payhip #WGU #UOP #UAGC https://t.co/qujlRpsgQR — Jim (@termpaperexpers) March 31, 2024


