16 Mar 2012

Tornado The Size Of The EARTH With 300,000 MPH Winds Spotted On The Sun!

WAP5 Bhopal Shatabdi India's Fastest Train




  

world's fastest train-must watch

Keukenhof Garden


ఒత్తిడి...మ‌నిషి మ‌నుగ‌డ‌లో ఇప్పుడు విడ‌దీయ‌లేని ఓ చిక్కుముడి. త‌మ జీవిత‌కాలంలో ఏదో ఒక సంద‌ర్భంలో దీని బారిన ప‌డ‌ని వారే ఉండ‌రు. దీన్ని అధిగ‌మించేందుకు ఒక్కోరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటుంటారు. ప‌బ్‌లు, థెక్‌లు,రేస్‌లు ఇలా ర‌క‌ర‌కాలుగా వీకెండ్స్‌ను  ఖుషీ చేసి మ‌ళ్లీ త‌మ ప‌నుల్లో త‌ల‌మున‌క‌ల‌వుతున్న వారే ప్ర‌స్తుతం అధికం.అయితే అన్ని వ‌య‌స్సుల వారిని సేద తీర్చేది మ‌ళ్లీ కొత్త ఉత్సాహంతో ఉర‌క‌లెత్తించేది ప్ర‌కృతే.ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ఆహ్లాద‌క‌ర అందాల‌ను తిల‌కిస్తూ ఉంటే ఒత్తిడీ గిత్తిడీ హుష్ కాకే అంటున్నారు మాన‌సిక నిపుణులు.ఉదాహ‌ర‌ణ‌కు పూదోట‌ల‌నే తీసుకుంటే అవి అంద‌ర్ని ఆనంద‌ప‌ర్చి సాంత్వ‌న చేకూరుస్తాయి.మ‌రి అలాంటి వ‌ర‌ల్డ్ వండ‌ర్ ఫుల్ ఫ్ల‌వ‌ర్ గార్డెన్ ఎక్క‌డుందో తెలుసా? ఇంకెక్క‌డ నెద‌ర్లాండ్స్‌లో.అదే క్యుకెన్‌హొఫ్ ఫ్ల‌వ‌ర్ గార్డెన్‌.
సొగ‌సుల పూదోట‌: క్యుకెన్‌హొఫ్ ఫ్ల‌వ‌ర్ గార్డెన్ సౌత్ హాలెండ్‌లోని లిస్సే అనే ప‌ట్ట‌ణంలో 1949లో పూర్తి స్థాయిలో ప్రారంభ‌మైంది. 15వ శ‌తాబ్దం నుంచే దీని ఉనికి ఉందంటుంటారు. ఈ అందాల పూల వ‌నానికి కిచెన్ గార్డెన్‌, గార్డెన్ ఆఫ్ యూర‌ప్ అనే పేర్లూ ఉన్నాయి. దీని ఘ‌న‌త ఏంటంటే ప్ర‌పంచంలోనే ఇది అతి పెద్ద పూల‌తోట‌.60 ఏళ్ల‌కు పైగా ఈ రికార్డును నిల‌బెట్టుకుంటోందిది. అమెస్ట‌ర్‌డ‌మ్‌కు ద‌గ్గ‌ర్లోనే గ‌ల ఈ క్యుకెన్‌హొఫ్ ఫ్ల‌వ‌ర్ గార్డెన్ 32 హెక్టార్లలో విస్త‌రించింది. ఈ ప‌రిమ‌ళ‌భ‌రిత అందాల పూల‌వ‌నంలో ల‌క్ష‌ల‌ ర‌కాల పువ్వులు మ‌న‌కు క‌నువిందు క‌ల్గిస్తాయి. దీని సంద‌ర్శ‌న భాగ్యం మాత్రం ఏడాదిలో రెణ్నెల్లే. ఈ ఏడాది 22 మార్చి నుంచి 20 మే వ‌ర‌కు ప‌ర్యాట‌కుల్ని క్యుకెన్‌హొఫ్ గార్డెన్ అల‌రించ‌నుంది. ఫ్ల‌వ‌ర్ పెరెడ్ ఈ  ఏప్రిల్ 21 నుంచి ప్రారంభంకానుంది. ఆక‌ర్ష‌ణీయ టులిప్ ఫ్ల‌వ‌ర్స్‌ను మాత్రం ఏప్రిల్ రెండో వారం నుంచే చూడ‌గ‌లం.

కేస్ట్లే క్యుకెన్‌హొఫ్ గ్రౌండ్స్‌: వివిధ ఫెస్టివ‌ల్స్‌కు ఈ గ్రౌండ్స్ గొప్ప వేదిక‌.ఏడాది పొడ‌వునా ఇక్క‌డ‌కు సంద‌ర్శ‌కుల్ని అనుమ‌తిస్తారు. వేడుక‌ల్లో కేస్ట్లే ఫెస్ట్‌, లేడీస్ వింట‌ర్‌మైట్ ఫ్యామ‌స్‌.ఇక్క‌డ క్లాసిక‌ల్ మ్యూజిక్ సంద‌ర్శ‌కుల‌కు వీనుల‌విందే.ఇందులోని రెస్టారాంట్ల‌లో రుచిక‌ర ఆహార ప‌దార్థాలు, పానీయాలకు కొద‌వులేదు.
అందాల పూల వ‌నాలు:క్యుకెన్‌హొఫ్ ఫ్ల‌వ‌ర్ గార్డెన్ త‌ర‌హాలో ప్ర‌పంచంలో మ‌రికొన్ని పేరెన్నిక‌గ‌న్న పూదోట‌లు ఉన్నాయి.అవి..
* Great Dixter Garden:This is a house in Northiam, East Sussex near the South Coast of England.
* Butchart Gardens:This is a whole group of floral gardens which are situated in Brentwood Bay, British Colombia, Canada.
* Bodnant Garden:This garden is situated in the county of Conwy, Wales; above the River Conwy. It is a traditional flower garden of an ancestral family home in the United Kingdom.
* Bagatelle: Now it is known for the exquisite rose gardens,Paris. There are two rosaries in Bagatelle.

Popular Posts

Wisdomrays