15 Nov 2011

LI(TIGER)ON



http://royalloyal007.blogspot.in/2011/11/cannibals.html
సృష్టి అద్భుతం...ప్ర‌తిసృష్టి మ‌హాద్భుతం...స‌హ‌జ సిద్ధ‌మైన ప్ర‌కృతినే ప్ర‌తిసృష్టి చేస్తున్న మాన‌వమేధ‌కు న‌క‌ళ్లు ఎన్నో. అవి జంతువుల్లోనూ చొప్పించి చూపుతున్న అబ్బురం వ‌ర్ణ‌నాతీతం. ముఖ్యంగా వ‌న్య ప్రాణులైన పులులు, సింహాలు క‌ల‌గ‌లిసి విభిన్న రూపులో మ‌న‌కిప్పుడు క‌నిపిస్తున్న లైగ‌ర్‌, టైగ‌న్‌లు క‌చ్చితంగా అద్భుతాలేగా! పాంథ‌ర్ లియో జాతికి చెందిన మ‌గ‌సింహం, పాంథ‌ర్ టైగ్ర‌స్ జాతి ఆడ‌పులుల క్రాస్‌బ్రీడింగ్ ద్వారా రూపుదిద్దుకున్నవే లైగ‌ర్లు. క్రూర‌మృగాలైన సింహాలు, పులులు జ‌త క‌ట్ట‌డం స‌హ‌జ‌సిద్ధంగా జ‌రిగి ఉండొచ్చు, ఉండ‌క‌పోనూ వ‌చ్చు. కానీ సింహం త‌ల, పులి చార‌ల‌తో క‌నిపించే ఓ విభిన్న జంతువును జూ ల్లో చూడ్డ‌మ‌న్న‌ది నిజంగా  ఓ వింత అనుభూతే. 19వ శ‌తాబ్దంలోనే ఈ విభిన్న జంతువుల ఉనికి భార‌త్‌లో ఉంద‌ట‌. అంత‌కు ముందే పాశ్చాత్య‌ దేశాల్లో ఈ త‌ర‌హా జంతువుల్ని ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచిన‌ట్లు ప‌లు క‌థ‌నాలున్నాయి. 1837లో విలియం4, విక్టోరియా మ‌హారాణిల ఎదుట రెండు లైగ‌ర్ పిల్ల‌ల్ని సృష్టిక‌ర్త హెగ‌న్‌విక్ ప్ర‌ద‌ర్శించారు. మ‌గ సింహం, ఆడ‌పులికి పుట్టినవి లైగ‌ర్ల‌యితే, మ‌గ‌పులి, ఆడ సింహానికి పుట్టిన‌వి టైగ‌న్లు. వీటిలో మ‌ళ్లీ లిటిగ‌న్లు, టిలిగ‌ర్‌, లిలిగ‌ర్ల‌నే ర‌కాలూ ఉన్నాయి.
ఇవ‌న్నీ హైబ్రీడ్ నుంచి హైబ్రీడ్‌గా ఉద్భ‌వించే విభిన్న జీవులు. అయితే వీటి పున‌రుత్ప‌త్తికి సంబంధించి జంతు శాస్త్ర‌వేత్త‌లు ప‌లు ప‌రిశోధ‌నాంశాల్ని వెల్ల‌డించారు. 
లాంగ్ లివ్‌...రికార్డులు
ఈ హైబ్రీడ్ జంతువుల్లో కొన్ని స్టెరైల్‌, మ‌రికొన్నిఫెర్ట‌ల్ సామ‌ర్థ్యాన్ని క‌ల్గి ఉంటాయి.త‌ద్వారానే మ‌ళ్లీ ప‌లు ర‌కాల హైబ్రీడ్ జీవులు రూపుదిద్దుకున్నాయి. లైగ‌ర్ల సంఖ్య‌తో పోలిస్తే టైగ‌న్ల‌ సంఖ్య బాగా త‌క్కువ‌. ఈ విభిన్న జీవులు స‌హ‌జ జీవులైన సింహాలు, పులుల‌క‌న్నా బ‌లిష్టంగా పొడ‌వు ఎక్కువ‌గానూ ఉంటాయ‌ని క్రిప్టో జువాలజిస్టులు పేర్కొంటున్నారు. అడ‌విలో స‌హ‌జ‌సిద్ధ వాతావ‌ర‌ణంలో స్వ‌యంగా వేటాడుతూ పెరిగిన లైగ‌ర్ల‌యితే 10 అడుగుల పొడ‌వు దాదాపు 350 కేజీల బ‌రువుతో దృఢంగా ఉంటాయి. వివిధ ప్ర‌పంచ ప్ర‌సిద్ధ జూ ల్లో ఉన్న లైగ‌ర్లు గిన్నీస్ రికార్డుల‌ను సైతం సొంతం చేసుకున్నాయి.  మియామిలోని జంగిల్ ఐలాండ్ థీమ్ పార్కులోగ‌ల 3 ఏళ్ల లైగ‌ర్‌(ఇక్క‌డ హెర్క్యుల‌స్‌గా పిలుస్తారు) ఇదే విధంగా రికార్డు సొంతం చేసుకుంది. భూమ్మీద జీవిస్తున్న పిల్లి జాతికి చెందిన అతి పెద్ద జంతువుగా పేరొందింది. దీని బ‌రువు 410 కేజీలు కావ‌డ‌మే ఆ రికార్డు. ఇది పూర్తి జీవిత‌కాలాన్ని పూర్తి చేసుకుంద‌ని 2005లో అండ‌ర్స‌న్ కూప‌ర్ త‌న ఆర్టిక‌ల్‌లో పేర్కొన్నారు. సాల్ట్‌లేక్ సిటీలోని హొగ‌ల్ జూలో 1924 మే 14న‌ జ‌న్మించిన ష‌స్టా అనే లైగ్రెస్‌(ఆడ లైగ‌ర్‌) 1948 వ‌ర‌కు 24 ఏళ్ల‌పాటు జీవించింది. బ్లామ్‌ఫాంటీన్‌(సౌత్ ఆఫ్రికా)జూలో 1888లో పుట్టిన మ‌గ లైగ‌ర్ ఆరేళ్ల వ‌య‌సుకి 798 కేజీల బ‌రువుకు చేరుకుంద‌ట‌. అయితే ఈ వార్త నిర్ధార‌ణ కాలేదు. ఈ లైగ‌ర్ 18 ఏళ్లు జీవించింది. విస్కోసిన్‌లోని కింగ్స్ యానిమ‌ల్ సాంక్చ‌రీలో 1953లో పుట్టిన నూక్ అనే లైగ‌ర్ 550 కేజీల బ‌రువుతో 21 ఏళ్ల‌పాటు జీవించి 2007లో క‌న్నుమూసింది. 410 కేజీల‌ బ‌రువుగ‌ల హోబ్స్ మ‌గ లైగ‌ర్ సియ‌ర్ర స‌ఫారీ జూ (రెనో, నెవ‌డా)లో 15 ఏళ్ల‌పాటు బ‌తికింది. లివ‌ర్ సంబంధ‌ వ్యాధి కార‌ణంగానే ఇది చ‌నిపోయింద‌ట‌. ఒక‌జాతి జంతువు మ‌రో విభిన్న జాతి జంతువు క్రోమోజోమ్‌ల‌తో ఫ‌ల‌దీక‌ర‌ణ చేయ‌డ‌మ‌నే ప‌ద్ధ‌తే హెటెరోజెనిటిక్. ఈ విధానం ద్వారా తెల్ల‌పులి, తెల్ల సింహం ద్వారా తెల్ల లైగ‌ర్ల సృష్టి సాధ్య‌మే.  
అలిపోర్ జులాజిక‌ల్ గార్డెన్స్‌
ఇండియాలోని కోల్‌క‌తాలోని ఈ జూ 250 ఏళ్ల నాటి చ‌రిత్ర గ‌ల‌ది. ఇక్క‌డ 1971, 73ల్లో రెండు టైగ‌న్లు సంద‌ర్శ‌కుల్ని అల‌రించేవి. 1971లో రుద్రాణి, 1973లో రంజిని అనే పేర్లు గ‌ల‌ ఈ టైగ‌న్లు త‌మ పిల్ల‌ల‌కి జ‌న్మ‌నిచ్చాయి. ఈ జూ లో ఇవే  చివ‌రి టైగ‌న్లు. రుద్రాణి 7 లిటిగ‌న్ల‌కు జ‌న్మ‌నిచ్చింది. 1991లో రుద్రాణి చ‌నిపోగా 1999లో రంజ‌ని క‌న్నుమూసింది. టైగ‌న్ల  ప్ర‌పంచం మొత్తం మీద కేవ‌లం జ‌పాన్‌, ఇట‌లీల్లోని జూ ల్లో మాత్ర‌మే ప్ర‌స్తుతం క‌నిపిస్తున్నాయి. ఇందులో నేష‌న‌ల్ జూ అండ్ అక్వారియం(కాన్‌బెర్ర‌) ఒక‌టి కాగా ఒహియో పార్క్ జూ (సాండుస్కి ఒహియో) లోను వీటిని చూడొచ్చు. 1969 నాట‌కి మాత్రం ఇక్క‌డ కేవ‌లం నాలుగే టైగ‌న్లుండేవి. లైగ‌ర్ల‌యితే ప్ర‌పంచంలో పేరొందిన తైవాన్ జూ, సియ‌ర్ర స‌ఫారీ,షాంబ్‌ల ప్రిజ‌ర్వ్‌, నోహ‌స్ ఆర్క్ జూ, పిన్ మౌంట్ జార్జియా యానిమ‌ల్ స‌ఫారీ, మ్యూనిచ్ హెల‌బ్ర‌న్ జూ ల్లో మ‌నం చూడొచ్చు. 1980లోనే గిర్ (ఇండియా) అడ‌వుల్లో లైగ‌ర్ల హైబ్రీడ్‌ ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించిన‌ట్లు మిన్సుట జూ డైరెక్ట‌ర్ రోనాల్డ్ పేర్కొన్నారు.
లైగ‌ర్ల‌కు పాలిచ్చిన కుక్క‌
చైనాలోని జిజ్కీ జూలో 2011లో రెండు లైగ‌ర్ కూన‌ల‌కు ఓ కుక్క‌పాలిచ్చి సాకుతున్న‌ వైనాన్ని బీబీసీ స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ‌ల ప‌లు వార్తా సంస్థ‌లు ఫొటోల‌తో స‌హా క‌థ‌నాల్ని ప్ర‌సారం చేశాయి.
----------------------------------------------------------------------------------------------
Legend Lenin post see from this blog on october 25

12 Nov 2011

burj khalifa


క‌ష్టే ఫ‌లికి బ‌దులు క‌లే ఫ‌లి అని స‌వ‌రించుకోవాల్సిన త‌రుణ‌మిది. ఆకాశ‌మా అదెంత దూరం మా చెయ్యెత్తంతే అని నిరూపిస్తున్నారు ఆసియా వాసులు. ఆకాశానికి నిచ్చెన వేయ‌గ‌ల‌మ‌ని నిరూపిస్తున్నారు. ప్ర‌పంచంలోనే ఎత్తైన ఆకాశ హార్మ్యాల్ని నిర్మిస్తూ ప్ర‌తిభ‌ను చాటుతున్నారు. ఈ 21వ శ‌తాబ్దంలో వ‌ర‌ల్డ్ టాప్‌టెన్ బిల్డింగ్స్‌లో తొమ్మిది అతి పెద్ద భ‌వ‌న నిర్మాణాలు ఆసియాలోనే జ‌రిగాయి. వ‌ర‌ల్డ్ వండ‌ర్ టెన్ బిల్డింగ్స్‌లో తొమ్మిది ఆసియాలోనే కొలువుదీరాయి. ఏ విభాగాల్లో చూసినా 2010 జ‌న‌వవ‌రి 4న ప్రారంభ‌మైన బూర్జ్ ఖ‌లిఫాదే అగ్ర‌స్థానమ‌ని కౌన్సిల్ ఆన్ టాల్ బిల్డింగ్స్ అండ్ అర్బ‌న్ హెబిటెట్ (సిటిబియుహెచ్‌) పేర్కొంది.
బూర్జ్ ఖ‌లిఫా
యూఏఈ లోని దుబాయ్‌లో 2004 జ‌న‌వ‌రిలో నిర్మాణం ప్రారంభ‌మై 2010 జ‌న‌వ‌రిలో పూర్త‌యి ప్రారంభోత్స‌వం చేసుకుంది.
ఈ 163 అంత‌స్తుల భ‌వ‌నం సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. యావ‌త్ ప్ర‌పంచ‌మే త‌లెత్తి చూడాల్సిన‌ శిఖ‌ర స‌మానమీ భ‌వ‌నం.                                                                                                                                                                                                                                                                                                     9వ అంత‌స్తు నుంచి 108వ అంత‌స్తు వ‌ర‌కు గల  900 ప్రైవేట్  అపార్టుమెంట్స్‌లో సుమారు 25 వేల మంది శాశ్వ‌త నివాసితులు. ఎస్‌డ‌బ్ల్యూఏ గ్రూప్ డిజైన్ చేసిన ఈ భ‌వ‌న నిర్మాణానికి మొత్తం7,500 మంది సిబ్బంది న‌డుంక‌ట్టారు. 3 లక్ష‌ల ట‌న్నుల కాంక్రీట్‌ను నిర్మాణానికి వినియోగించారు. సుమారు 1.5 బిలియ‌న్ డాల‌ర్ల అంచానా వ్య‌యంతో ప్రాజెక్టు ప్రారంభ‌మ‌యింది. మొత్తం అభివృద్ధికి 20 బిలియ‌న్ డాల‌ర్లను వెచ్చించారు.  ప్రాజెక్టు డెవ‌ల‌ప్‌మెంట్ ఛైర్మ‌న్‌గా మ‌హ్మ‌ద్ అలీ అల్బ‌ర్‌(ఎమార్ ప్రాప‌ర్టీస్‌) వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌పంచంలోనే ఎత్తైన ప్ర‌దేశంలో మ‌సీదు ఉన్న బిల్డింగ్‌గా బూర్జ్ ఖ‌లిపా రికార్డు నెల‌కొల్పింది. ఈ భ‌వంతి 158వ అంత‌స్తులో మ‌సీదు ఉంది. అదేవిధంగా  రెండో అత్యంత ఎత్తైన ప్ర‌దేశంలోని ఈత‌కొల‌నుగా కూడా బూర్జ్ ఖ‌లిపాకు రికార్డు ఉంది. ఈ భ‌వ‌నం 76వ అంత‌స్తులో ఈ ఈత కొల‌ను ఉంది. 43వ అంత‌స్తులో మ‌రో ఈత‌కొల‌నూ ఈ బిల్డింగ్లో ఏర్పాటైంది. 27 ఎక‌రాల సువిశాల‌ స్థ‌లంలో నెల‌కొన్న ఈ శిఖ‌ర స‌మానంలో రోజువారీ నీటి వినియోగం దాదాపు 9 ల‌క్ష‌ల 46 వేల లీట‌ర్లు.ఇందుకు 100 కిలోమీట‌ర్ల నీటి పైపులు ఏర్పాటై ఉన్నాయి. భూమి నుంచి 2,723 అడుగుల ఎత్తున ఉన్న‌ ఈ భ‌వ‌నం పైకి కింద‌కు నిత్యం తిరుగాడిన తొలి వ్య‌క్తి కేర‌ళ‌(భార‌త్‌)కు చెందిన శ‌శి. ఈయ‌న క్రేన్ ఆప‌రేట‌ర్‌గా విధుల్లో ఉండి ఈ ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. ప్ర‌పంచంలోనే ఎక్కువ మంది జ‌నం తిరుగాడే ఏకైక భ‌నం కూడా ఇదే. భారీగా వ్యాపార కార్య‌క‌లాపాలు జ‌రిగే ప్రాంతంగాను బూర్జ్ ఖ‌లిఫాది తిరుగులేని రికార్డే. వ్యాపార స‌ముదాయాలు, హోట‌ళ్లు, అనేకానేక సంస్థ‌లు, కార్యాల‌యాలు, నివాసాలు, ఒక‌టేమిటి ఇదో మినీ వ‌ర‌ల్డ్ అంటే అతిశ‌యోక్తి కాదు. అందుకే బూర్జ్ ఖ‌లిఫా 2010 సెప్టెంబ‌ర్‌లో మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా ప్రోజెక్ట్స్ నుంచి ప్రోజెక్ట్ అవార్డును సైతం సొంతం చేసుకోగ‌ల్గింది. 
వ‌ర‌ల్డ్ టాప్ టెన్ బిల్డింగ్స్‌
. 2010 బూర్జ్ ఖ‌లిఫా..828 మీట‌ర్లు(2717 అడుగులు)..163 అంత‌స్తులు..దుబాయ్‌(యూఏఈ)
. 2011 అబ్రాజ్ అల్ బాయిత్ ట‌వ‌ర్స్‌..601 మీ.(1971 అ)..95 అంత‌స్తులు..మెక్కా(సౌదీ అరేబియా)
. 2004 తైపే101..509 మీ.(1670 అ)..103 అంత‌స్తులు..తైపే(తైవాన్‌)
. 2008 షాంగై వ‌ర‌ల్డ్ ఫైనాన్షియ‌ల్ సెంట‌ర్‌..492 మీ.(1614 అ)..101 అంత‌స్తులు..షాంగై(చైనా)
. 2010 ఇంట‌ర్నేష‌న‌ల్ ట్రేడ్ సెంట‌ర్..484 మీ(1588 అ)..108 అంత‌స్తులు..హాంకాంగ్‌(హాంకాంగ్‌)
. 1998 పెట్రోన‌స్ ట‌వ‌ర్స్‌1అండ్‌2..452 మీ.(1483 అ)..88 అంత‌స్తులు..కౌలాలంపూర్‌(మ‌లేసియా)
. 2010 నాన్జింగ్ గ్రీన్‌ల్యాండ్ ఫైనాన్షియ‌ల్ సెంట‌ర్‌..450 మీ.(1476 అ) 89 అంత‌స్తులు..నాన్జింగ్‌(చైనా)
. 1974 విల్లిస్ ట‌వ‌ర్‌..442 మీ.(1451 అ)..108 అంత‌స్తులు..షికాగో(అమెరికా)
. 2011 కింగ్ కే100..442మీ.(1449 అ)..98 అంత‌స్తులు..షెంజెన్‌(చైనా)
______________________________________________________________
^ మ‌న‌స్సున్న మారాజు యువ క్రికెట‌ర్ గౌతం గంబీర్. ఇటీవ‌ల త‌న అవ‌య‌వాల్ని దానం చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు.
^ 28 ఏళ్ల త‌ర్వాత మదుర మీనాక్షి దేవాల‌యంలోకి ద‌ళితుల ప్ర‌వేశానికి అనుమ‌తి ల‌భించింది.


11 Nov 2011

11-11-11


  పుట్టిన రోజు మ‌న‌లో చాలామందికి ఓ పండుగ రోజు. అందుకు హాలివుడ్ తార‌లు అతీతులు కారు.న‌వంబ‌ర్ 11, హ్యాపీ బ‌ర్త్‌డే హాలివుడ్ తార‌లే వీరు. టైటానిక్ సినిమా ల‌వ‌ర్ బాయ్ లియొనార్డొ డికాప్రియో,డెమిమోర్‌, బిబి అండ‌ర్స‌న్ (స్పెయిన్).


అమెరికాలో ఈ రోజును వెట‌ర‌న్స్ డేగా నిర్వ‌హిస్తారు. కెన‌డా, ఆస్ట్రేలియాల్లో రిమెంబ‌రెన్స్‌డేగా పాటిస్తున్నారు.అమెరికా, కెన‌డా, ఆస్ట్రేలియా ప్ర‌జానీకం ఈ రోజున 11 గంట‌ల‌కు త‌మ కోసం, దేశం కోసం అమ‌రులైన‌సైనికుల‌కు మౌనంగా నివాళుల‌ర్పిస్తారు. 

కాల‌చ‌క్ర భ్ర‌మణంలో సెక‌న్లు, నిమిషాలు, గంట‌లు ఒక‌టేమిటి రోజులు,నెల‌లు, ఏళ్లు గిర్రున తిరాగాల్సిందే.వ‌ర్త‌మానం రేపొచ్చే భ‌విష్య‌త్‌కు భూత‌కాల‌మే. అలాగే కాల‌మ‌నే వాహ‌నంలో మ‌న ముంగిట‌కొచ్చిందీ 11-11-11. ఇదో న్యూమ‌రిక‌ల్ వండ‌ర్ డే. అందుకే యావ‌త్ మాన‌వాళి ఈరోజుకు వెల్‌కం చెప్పి సంబ‌ర‌ప‌డుతోంది.



నాటి నుంచి నేటి వ‌ర‌కు 11/11 ఘ‌ట‌న‌లు 
* 1493:  లుసాబాను కొలంబ‌స్ క‌నుగొన్న రోజు.
* 1688:  ప్రిన్స్ విలియ‌మ్స్‌3 ఇంగ్లాండ్‌లోకి ప్ర‌వేశించారు.
* 1811:  కొలంబియా (స్పెయిన్ నుంచి) స్వాతంత్ర్యం పొందింది.
* 1851: అల్వ‌న్ క్లార్క్ టెలిస్కోప్‌పై పేటేంట్ ద‌క్కించుకున్నారు.
* 1865: మేరి ఎడ్వ‌ర్డ్ వాక‌ర్ (ఫ‌స్ట్ ఆర్మీ ఫిమేల్ స‌ర్జ‌న్‌)కు మెడ‌ల్ ఆఫ్ ఆన‌ర్ ల‌భించింది.
* 1889: వాషింగ్ట‌న్ 42వ అమెరికా సంయుక్త రాష్ట్రంగా ఆవిర్భావం.
* 1909: పెర‌ల్ హార్బ‌ర్ నేవీబేస్ ప‌నుల ప్రారంభం.
* 1918: పోలాండ్‌కు స్వాతంత్ర్యం వ‌చ్చింది.
* 1925: కాస్మిక్‌రేస్‌ను క‌నుగొన్న‌ట్లు రాబ‌ర్ట్ మిలిక‌న్ ప్ర‌క‌ట‌న‌.
* 1930: రిఫ్రిజిరేట‌ర్ పేటేంట్‌ను అల్బ‌ర్ట్ ఐన్‌స్టీన్‌, లియో సిజిలార్‌లు పొందారు.
* 1938: నాజిలో జ‌ర్మ‌న్‌, ఆస్ట్రియాల‌కు బిలియ‌న్ డాల‌ర్ల న‌ష్టం వాటిల్లింది.
* 1942: ఫ్రాన్స్‌ను హ‌స్త‌గ‌తం చేసుకున్న జ‌ర్మ‌నీ.
* 1966: నాసా అంత‌రిక్ష‌నౌక జెమినీ12ను ప్ర‌యోగించింది.
* 1968: మాల్దీవులు రిప‌బ్లిక్‌గా అవ‌త‌ర‌ణ‌.
* 1975: పోర్చుగ‌ల్ నుంచి అంగోలాకు స్వాతంత్ర్యం. 
* 1980: సోయ‌జ్‌35 బృందం భూమికి సుర‌క్షితంగా తిరిగొచ్చారు.
* 1985: ఛాలెంజ‌ర్ కెన్నెడీ స్పేస్ సెంట‌ర్‌లో సేఫ్‌గా ల్యాండ‌యింది.
* 1992: ఆంగ్లిక‌న్ చ‌ర్చ్ ఫిమేల్ ప్రిస్ట్స్‌ను అనుమ‌తిచ్చింది.
* 2004: యాస‌ర్ అరాఫ‌త్ మ‌ర‌ణం. ఆయ‌న స్థానంలో పిఎల్ఒ ఛైర్మ‌న్‌గా మ‌హ్మ‌ద్ అబ్బాస్ ఎంపిక‌.
* 2008: ఎలిజ‌బిత్ రాణి2 దుబాయ్ విచ్చేశారు.
_____________________________________________________________
నెల‌ల పేర్లు ఇలా ...
జ‌న‌వ‌రి: janu`s month, ఫిబ్ర‌వ‌రి: month of februa, మార్చి: mar`s month, ఏప్రిల్:aphrodite`s month, మే: maia`s month, జూన్‌: juni`s month, జులై: juliu`s caesar`s month, ఆగ‌స్ట్‌: augustus caesar`s monthసెప్టెంబ‌ర్‌: the seventh month, అక్టోబ‌ర్‌: the eighth month, న‌వంబ‌ర్‌: the nineth month, డిసెంబ‌ర్‌: the tenth month.

జాను అనే రోమ‌న్ దేవుడు పేరిట‌నే ఈ నెల వ‌చ్చింది. ఈ దేవుడికి  రెండు ముఖాలుంటాయి. దేవుడికి ఉత్స‌వం నిర్వ‌హించే నెల‌యినందునే జ‌న‌వ‌రి పేరు వ‌చ్చింది. రోమ‌న్ కేలండ‌ర్ప్ర‌కారం అయితే ఏడాదికి 10 నెల‌లే. అయితే 700 బిసి లో రోమ్ సిర్కా ప్ర‌భువు త‌న హ‌యాంలో జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి నెల‌ల్నిఅద‌నంగా చేర్చారు. త‌ద‌నుగుణంగా నెల‌లో అంత‌కు ముందుండే రోజుల్ని స‌వ‌రించి 12 నెల‌లుగా స‌ర్దుబాటుచేశారు. అలాగే ఫిబ్ర‌వరి లీపు సంవ‌త్స‌రం ప్రారంభ‌మ‌యింది.


10 Nov 2011

mughal gardens


 ప్ర‌పంచ‌మే నేడో కుగ్రామం. ఇదో యాంత్రిక యుగం కూడాను. అల‌సిసొల‌సిన మ‌నసులు కోకొల్ల‌లు. ఆ మ‌న‌సుల‌కు కాసింత ఆహ్లాదం క‌చ్చితంగా అవ‌సరం. అందుకే ప్ర‌తివారూ స్థ‌ల‌మార్పు కోరుకుంటారు.
ఓ కొత్త చోటుకు వెళ్లి సేద తీరుతారు..మ‌ళ్లీ కొంగొత్త శ‌క్తితో పాత జీవితంలో నిమ‌గ్న‌మైపోతుంటారు. అందుకే నేడు ప్ర‌పంచంలో టూరిజం అంత‌గా బిజీబిజీ రంగ‌మై పోయింది. భూమిపై ప్ర‌కృతి ప‌రుచుకున్న అందాల‌కు కొద‌వేముంది. కొన్ని మాన‌వ నిర్మితాల‌యితే మ‌రికొన్ని ప్ర‌కృతి ప్ర‌సాదితాలు. ఆ మాన‌వ అద్భుత సృష్టిల గురించి చెప్పుకుంటేపోతే ఎన్నెన్నో. అందులో ఒక‌టిగా  చెప్పుకోద‌గ్గ గార్డెన్ భార‌త రాజ‌ధాని ఢిల్లీలోని మొగల్ గార్డెన్‌. ఈ పూదోట తాజ్‌మ‌హ‌ల్ గార్డెన్‌, షాలిమార్‌ గార్డెన్ (కాశ్మీర్‌)ల స్థాయిలోనే అల‌రించే ఆహ్లాదం. ఇంకా వ‌ర్ణించి పోల్చి చెప్పాలంటే యూఎస్‌.గార్డెన్స్‌, హ‌లాండ్ గార్డెన్స్ (ఇట‌లీ), గార్డెన్స్ ఇన్ స్పెయిన్‌ల‌కు స‌రిసాటి. అల‌రించే ప్ర‌కృతి అందాల‌తోనే కాక అనేక‌ ఔష‌ధ‌మొక్క‌లు, కూర‌గాయ‌లు, ర‌క‌ర‌కాల చెట్లకు నిల‌యం. మ‌నస్సును ఊహాల్లో తేలియాడించే ఫౌంటెన్లు ఇక్క‌డ అనేకం కొలువు దీరాయి. 
రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్-మొగ‌ల్‌గార్డెన్స్‌: ఈ అందాల పూదోట భార‌త ప్ర‌ధమ‌పౌరుడు ఉండే రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో నెల‌కొని ఉంది.
ఆరు హెక్టార్ల‌లో (15ఎక‌రాల‌) ఈ అందం మొగ‌ల్ ,బ్రిటిష్ స‌మ్మిళిత శైలీ రూపం. స‌ర్ ఎడ్వ‌ర్డ్ లిటిన్స్ ఈ గార్డెన్స్‌ రూప‌శిల్పి. ఈ గార్డెన్ మొత్తం మూడు భాగాలుగా ఉంటుంది. రెక్టాంగ్ల‌ర్‌, లాంగ్‌, స‌ర్క్యూల‌ర్ గార్డెన్ల‌గా క‌నువిందు 
చేస్తుంది. అయితే ఏడాదిలో రెండు నెల‌లు ఫిబ్ర‌వ‌రి, మార్చిల్లో మాత్ర‌మే మొగల్ గార్డెన్స్ సంద‌ర్శ‌న‌కు ప్ర‌జ‌ల్ని అనుమ‌తిస్తారు. ఉద‌యం 9.30-2.30 వ‌ర‌కు సంద‌ర్శ‌కుల‌కు అనుమ‌తి ఉంటుంది. సోమ‌వారాల్లో మాత్రం నిర్వ‌హ‌ణ నిమిత్తం ఈ గార్డెన్స్‌ను మూసివేస్తారు. ఈ గార్డెన్‌ను జె.ఎఫ్‌.కెన్న‌డీ, ఎలిజ‌బిత్ రాణి, అబ్ర‌హం లింక‌న్‌, క్రిస్టియ‌న్ డైర్ త‌దిత‌ర విదేశీ ప్ర‌ముఖులు సంద‌ర్శించారు.
స‌ర్క్యూల‌ర్ గార్డెన్‌:గార్డెన్‌లోకి ప్ర‌వేశించ‌గానే ప్ర‌ధాన భ‌వ‌నం ప‌క్క‌గా ఉండేది స‌ర్క్యూల‌ర్ గార్డెన్‌. ఇందులో గుభాళించే పూల‌ మొక్క‌ల‌తో పాటు ఔష‌ధ మొక్క‌లు, చెట్లు అనేకం కనిపిస్తాయి. ఒబెసిటి, డ‌యాబెటిస్‌, కేన్స‌ర్ నివార‌ణ‌ మొక్క‌లు అనేకం ఉంటాయి. బ్ర‌హ్మి, స్టేవియా, పావింకిల్ త‌ర‌హా మొక్క‌ల్ని మ‌నం చూడొచ్చు. కాస్త ముందుకు వ‌స్తే వివిధ మ్యూజిక‌ల్ ఫౌంటెన్లు మ‌న‌ల్ని ప‌ల‌క‌రిస్తాయి. ఇక్క‌డ ఎగిరే రంగురంగుల సీతాకోక‌చిలుక‌ల‌ అందాలూ క‌నువిందే. 
రెక్టాంగ్ల‌ర్ గార్డెన్‌: ప్ర‌ధాన భ‌వ‌నం వెనుక‌నుండే గార్డెన్ ఇది. పూల మొక్క‌లు,  చెట్లు, చిన్న‌చిన్న క‌మ‌లాల‌తో కూడిన‌ నీటి మ‌డుగులు ఉల్లాస‌ప‌రుస్తాయి. ఈ గార్డెన్లో వివిధ కూర‌గాయ‌ల పంట‌లు ఎన్నో క‌నిపిస్తాయి. మైమ‌ర‌పించే లాన్ల‌తోపాటు అనేక క‌ట్ట‌డాలు చూపుతిప్పుకోనివ్వ‌వు. గులాబీలు, మేరీగోల్డ్‌, బైగ‌నివెలి, స్వీట్ విలియ‌మ్‌,విస్కోరియా త‌దిత‌ర పూల మొక్క‌లు ఎన్నో అందంగా కొలువుదీరి ఉంటాయి.
లాంగ్ గార్డెన్‌:అందానికే అందం ఈ రోజ్ గార్డెన్‌. రెడ్‌రోజ్‌, పింక్‌, వైట్‌, డార్క్‌రెడ్‌, ఎల్లో, ఆరెంజ్ రోజ్‌లు మ‌న‌ల్ని ముగ్ధుల్ని చేస్తాయి. ఈ పూదోట‌ల‌కు మొగ‌ల్‌గార్డెన్‌లో నాలుగు ప్ర‌ధాన నీటి మార్గాల ద్వారా నీళ్లు స‌ర‌ఫ‌రా అవుతాయి.  
_______________________________________________________________________

భార‌త రాష్ట్ర‌ప‌తుల జాబితా

* బాబూ రాజేంద్ర ప్ర‌సాద్‌:1950-62(రెండుసార్లు రాష్ట్ర‌ప‌తి)
* స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్‌:1962-67
* జాకీర్ హుస్సేన్‌:1967-69
* వి.వి.గిరి:1969-74
* ఫ‌కురిద్దీన్ అలీ మ‌హ్మ‌ద్‌:1974-77
* నీలం సంజీవ‌రెడ్డి:1977-82
* జైల్‌సింగ్‌:1982-1987
* ఆర్‌.వెంక‌ట్రామ‌న్‌:1987-92
* శంక‌ర‌ద‌యాళ్ శ‌ర్మ‌:1992-97
* కె.ఆర్‌.నారాయ‌ణ‌న్‌:1997-2002(లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఓటేసిన తొలి రాష్ట్ర‌ప‌తి)
* అబ్దుల్ క‌లాం:2002-2007
* ప్ర‌తిభాపాటిల్‌:2007-(తొలి మ‌హిళా రాష్ట్ర‌ప‌తి)
_______________________________________________________________

^ టెస్టుల్లో స‌చిన్ 15,000 ప‌రుగులు చేసి చ‌రిత్ర సృష్టించాడు. ఢిల్లీ ఫిరోజ్‌షాకోట్ల మైదానంలో వెస్టిండిస్‌పై మాస్ట‌ర్‌బ్లాస్ట‌ర్ ఈ ఘ‌న‌త‌ను అందుకోగా ఇక్క‌డే స్కిప్ప‌ర్ ధోని వికెట్ కీప‌ర్‌గా 200వ వికెట్‌ను త‌న ఖాతాలో వేసుకుని రికార్డు లిఖించాడు.

Popular Posts

Wisdomrays