| ||||
|
|
|
|
|
|
|
|
|
| ||||||
|
New Caledonia 1
| ||||||||||||||||||
| ||||
|
|
|
|
|
|
|
|
|
| ||||||
|
| ||||||||||||||||||
అతి పొడవైన పువ్వు: చెట్లను తలపించే మొక్కలు వాటికి భారీ పువ్వులు,పొడవైన పుష్పాలు ఇలా అనేక రకాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి.రఫ్లేసియా అర్నాల్డీకి పూర్తి భిన్నమైనది అమెర్ఫాఫలస్(టైటన్ అరమ్).ఇది ప్రపంచంలోనే అతి పొడవైన పువ్వు.దాదాపు 10 అడుగుల ఎత్తుకు ఎదుగుతుంది.రోజుకు ఈ పువ్వు నాలుగు నుంచి 20 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది.ఏకంగా 50 కిలోల బరువు తూగుతుంది.ఈ పువ్వులో కనిపించని రంగే ఉండదు.ఎరుపు,తెలుపు,ఆకుపచ్చ,పసుపు వర్ణాల సమాహారంగా భారీ ఆకారంతో వారెవ్వా అనిపిస్తుంది.అయితే ఈ పువ్వు రెండు మూడు రోజులకే వాడిపోతుంది.ఈ పువ్వు వెన్నంటి ఉండే ఆకులూ చాలా పెద్దగా ఉంటాయి.ఎంతంటే 20 అడుగుల మేరంటే ఆశ్చర్యమేగా.ఈ మొక్క ఆకులు ఏడాదికోసారి రాలిపోతాయి.మళ్లీ నాలుగు నెలల్లోగా కొత్త ఆకులు మొలుస్తుంటాయి.మీజ్‌లో గల బెల్జియన్ బొటానిక్ గార్డెన్స్‌కు వచ్చే సందర్శకులకు ఈ పువ్వు ఓ కనువిందే.లండన్‌లోని రాయల్ బొటానికల్ గార్డెన్స్‌లో ఈ పువ్వులు 100 వరకు ఉండడంతో జనం వీటిని చూసి పులకించిపోతుంటారు.బాన్(జర్మనీ)లోని బొటానికల్ గార్డెన్స్‌లో 2003లో ఈ పువ్వు 8అడుగుల 11 అంగుళాల ఎత్తుకెదిగి గిన్నీస్‌బుక్ రికార్డులకెక్కింది.2005లో జర్మనీలోని స్టట్‌గార్ట్‌లోగల బొటానికల్ అండ్ జులాజికల్ గార్డెన్స్‌లో ఉన్న ఈ జాతి పువ్వు 9 అడుగుల 6 అంగుళాల ఎత్తుతో అంతకుముందు నమోదైన రికార్డును బద్దలకొట్టింది.
తైవాన్‌లో కౌసిఅంగ్,తైపీల మధ్య బుల్లెట్ ట్రైన్ గంటకు దాదాపు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. టర్కీ,సౌత్ కొరియాల సంయుక్త ప్రాజెక్టుగా ఈ వాయు వేగ రైళ్లు పరిగెడుతున్నాయి. రష్యాలో 2002 చివరి నుంచే మాస్కో,సెయింట్ పీటర్స్‌బర్గ్‌ల నడుమ బుల్లెట్ ట్రైన్‌ను ప్రారంభించింది. యు.కెలో అండర్ గ్రౌండ్‌లోనూ ఈ వాయువేగ రైళ్లు నడుస్తుండడం విశేషం. అయితే ఈ రైళ్ల వేగంతోపాటు భయంకర ప్రమాదాలను రుచి చూపిస్తున్నాయి. జర్మనీలో 2004లో హైస్పీడ్ ట్రైన్ ఇలాగే ప్రమాదం బారినపడి 25 నిండు ప్రాణాలు బలయ్యాయి.
కొందరు వ్యక్తులు..వారి పేర్లు,రూపాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనే ఉండదు. వారు కనిపించినా, వినిపించినా జనసామాన్యం ఉర్రూతలూగిపోతుంది. వారి చరిత్ర,గొప్పతనం వివరాలు అనేక మందిలో గిర్రున తిరిగి గుర్తొచ్చేస్తాయి. అత్యంత ప్రభావశీలురైన సెలబ్రెటిలే వారు. అటువంటి ప్రత్యేక వ్యక్తుల్ని ముమ్మూర్తులా పోలిన మైనపు బొమ్మల కొలువే ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక స్థలం టుస్సాడ్ మ్యూజియం. లండన్‌లో బెకెర్ స్ట్రీట్‌లో నెలకొందిది. దీన్ని రూపొందించింది ఓ స్త్రీ.రోల్‌మోడల్ వ్యక్తుల నమూనాల రూపకల్పన ఆమె హాబీ.అలా మొదలై 1835లో టుస్సాడ్ మ్యూజియంగా పేరొందింది. ఈ మ్యూజియానికి అంకురార్పణ చేసిన మేరి టుస్సాడ్(అన్నా మరియా గ్రోషాల్జ్-ఫస్ట్ నేమ్)1761లో స్ట్రాస్‌బర్గ్, ఫ్రాన్స్‌లో జన్మించింది. 1777లో తొలిసారిగా వొల్టైర్ ప్రతిమను తీర్చిదిద్దింది. అదే సమయంలో జీన్‌జాక్వెస్ రొజేవ్, బ్రెంజిమన్ ఫ్రాంక్లిన్ ప్రతిమలకు వరుసగా రూపకల్పన చేసింది. ఫ్రెంచ్ విప్లవం సందర్భంగా ఆ చరిత్రకు దర్పణం పట్టేలా అనేకమంది యోధులు, బాధితుల బొమ్మలను రూపొందించింది. ఫ్రాంకియస్ టుస్సాడ్‌ను 1795లో వివాహమాడిన ఆమె లండన్‌లో స్థిరపడింది.ఆ తర్వాత వందల మంది ప్రముఖుల రూపాలను బొమ్మలతో పునఃప్రతిష్ట చేసింది. 1850లో ఈ లేడీ టుస్సాడ్ మరణించే వరకు ఎందరో ప్రముఖుల ప్రతిమలు అలాగే జీవకళతో ఆమె చేతుల్లో ప్రాణం పోసుకున్నాయి.
విశ్వవ్యాప్తం:టుస్సాడ్ మ్యూజియం ఒక్క లండన్‌కే పరిమితం కాలేదు. ప్రపంచం నలుచెరగులా ఈ మ్యూజియానికి బ్రాంచ్‌లు వెలిశాయి. లాస్‌వెగాస్, హాలివుడ్( (కాలిఫోర్నియా), న్యూయార్క్ సిటీ, వాషింగ్టన్ డి.సి., అమెస్టర్డమ్, బెర్లిన్, బ్లాక్‌పూల్, వియన్నా, బ్యాంకాక్, హాంగ్‌కాంగ్,షాంఘై, సిడ్నీల్లోనూ టుస్సాడ్ మ్యూజియాలు సందర్శకులకు కనువిందు కల్గిస్తున్నాయి. తాజాగా జకార్తాలో మరో బ్రాంచ్ జన సందర్శనకు సిద్ధమౌతోంది. 2012 జులై నాటికి అంకోల్ బీచ్ సిటీలో ఈ టుస్సాడ్ మ్యూజియం 3వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొలువుదీరనుంది. టుస్సాడ్ మ్యూజియాల్నింటిలో కల్లా అతి పెద్దదిగానూ ఈ బ్రాంచ్ రికార్డు నెలకొల్పనుండడం మరో విశేషం.ఇంతకూ టుస్సాడ్ మ్యూజియాల్లో ఒక్కో ప్రతిమకు ఎంత ఖర్చవుతుందంటే..అక్షరాల లక్షా 50వేల పౌండ్లు.నిపుణులైన శిల్పులు,ఇతర శరీర భాగాల తయారీదారులు ఒక్కో బొమ్మను తీర్చిదిద్దేందుకు దాదాపు నాలుగు నెలల సమయం తీసుకుంటారు.ఈ టుస్సాడ్‌లో ప్రతిమ నెలకొనడమే ఆయా వ్యక్తుల ఘనతకు గొప్ప నిదర్శనం.ఇప్పుడు ఆ ఛాన్స్ బాలివుడ్ మాజీ నంబర్ వన్ హీరోయిన్ మాధురి దీక్షిత్‌కు వచ్చింది.మార్చిలో ఆమె ప్రతిమ టుస్సాడ్‌లో దర్శనమీయనుంది.ఇప్పటికే భారత్ తరఫున అమితాబ్,ఐశ్వర్యరాయ్,హృతిక్,సల్మాన్,షారుఖ్,కరీనా,సచిన్ ప్రతిమలు ఈ మ్యూజియంలో తళుకులీనుతున్నాయి.
డబ్లూ.ఇ.ఎస్..:కేవలం నీరు,గాలి ద్వారానే కార్లను నడిపిస్తే..ఆ ఆలోచన ఉదయించే సూర్యుని దేశం జపాన్‌కి రానే వచ్చింది.ఆటోమొబైల్ రంగంలో ప్రపంచ రారాజుగా ఆధిపత్యాన్ని చలాయిస్తున్న మన జపనీయులు వాటర్ ఎనర్జీ సిస్టమ్(డబ్లూ.ఇ.ఎస్)ను పరిచయం చేసి మరోసారి తమ సత్తాను చాటారు.ప్రసిద్ధ జెనెపక్స్ కంపెనీ ఈ వాటర్ కారును రూపొందించింది.నీళ్లలో ఉండే ఆక్సిజన్,హైడ్రోజన్‌లను విభజించి ఆ హైడ్రోజన్ ద్వారా శక్తిని సృష్టించి యంత్రాన్ని నడపడమన్నదే ఈ సరికొత్త టెక్నాలజీ.ప్రస్తుతం నడుస్తున్న డీజిల్,పెట్రోల్,ఎలక్ట్రిక్,సి.ఎన్.జి తదితర వాహనాల్లో కన్వర్టర్లను మార్చి ఈ డబ్లూ.ఇ.ఎస్ పరిజ్ఞానంతో `కారు`చౌక ప్రయాణాల లబ్ధిని వాహనదారులకు అందించడమే దీని లక్ష్యం.ఎంత లగ్జరీ కారైనా,చౌకరకమైనదైనా పెట్రోల్,సి.ఎన్.జి చార్జీల చెల్లింపు వాహనదారులందరికీ సమానమే.వాహనాల్లో వినియోగించే ఇంధనం ధరలు అందరికీ అందుబాటులో ఉండడమన్నదే ప్రధానాంశం.ఆ దిశగానే ఇప్పుడు అడుగులు పడుతున్నాయి.ఈ సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా విజయవంతమై విశ్వవ్యాప్తంగా అన్ని తరహా వాహనదారులకు అక్కరకు వస్తేనే ప్రయోజనదాయకమవుతుంది.వాటర్ పవర్డ్ వెహికల్ ఒక్కో ఇంజిన్ తయారీకి 2 కోట్ల యెన్‌లు(18,500 అమెరికా డాలర్లు)ఖర్చవుతోందట.ఆ ధరలను 5 లక్షల యెన్‌లు(4,600 అమెరికా డాలర్ల) స్థాయికి తీసుకురాగల్గితేనే తాము ఆశించిన ఫలితం సిద్ధిస్తుందని ఆ కంపెనీ భావిస్తోంది.
ప్రకృతి కాల పరీక్షను తట్టుకొని మనుగడ సాగిస్తున్న ఏకైక భారీ జీవి మొసలి. ఏదో గ్రహ శకలం భూమిని ఢీకొనడమో లేదా అగ్ని పర్వతాలు బద్ధలై లావా పెల్లుబికడం వల్లనో రాక్షసబల్లుల జాతే ఈ భూమి మీద నుంచి కనుమరుగయిపోయింది.కానీ రెండు వేల ఏళ్లుగా మొసళ్లు తమ ఉనికిని నిలుపుకుంటున్నాయి. వీటిలో 23 రకాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి.నీటిలో ఉన్న మొసలి గజరాజు కన్నా బలశాలే.ఇవి నూరేళ్లకు పైబడి కూడా బతుకుతాయి. ఇలాగే 115 ఏళ్ల పాటు ఓ మొసలి రష్యాలోని జూలో 1997 వరకు జీవించి రికార్డు సృష్టించింది. దాన్ని 1890లో పట్టుకొని అప్పటి నుంచి ఆ జూలో పెంచారు.
క్రోకడైల్ రివర్‌గా దక్షిణాఫ్రికాలోని లింపొపొ నది పేరొందింది. ఆ దేశంలోనే మరో మొసళ్ల నదిగా పుమ్‌లాంగ కూడా గుర్తింపు పొందింది.ఇది క్రూగర్ నేషనల్ పార్క్‌కు సమీపంలో ఉంది. అలాగే మినెసొటలో కూడా క్రోకడైల్ రివర్ ఉంది.
మారేడుమిల్లి అడవి: రాజమండ్రికి 80 కిలోమీటర్ల దూరంలో భద్రాచలం రోడ్డులో ఉందీ మారేడుమిల్లి ఏజెన్సీ గ్రామం.ఈ గ్రామం నుంచి కేవలం 4 కిలోమీటర్ల దూరం నుంచే దట్టమైన అడవి మొదలవుతుంది. ఇదో గొప్ప పిక్‌నిక్ స్పాట్.అక్టోబర్ నుంచి స్వదేశీ,విదేశీ సందర్శకులతో ఈ అడవులు సందడిగా మారతాయి.సందర్శకుల్ని అలరించేందుకు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎపిటిడిసి) తగిన ఏర్పాట్లను చేస్తుంటుంది.శనివారం సాయంత్రానికి సందర్శకులు మారేడుమిల్లికి చేరుకుంటుంటారు. రాత్రి ఈ అడవుల్లోని రిసార్టుల్లోనే వారి బస.వారికి ఫారెస్టు గార్డులు,సాయుధ గిరిజనులే రక్షణ కల్పిస్తుంటారు.కార్తీకవనం,మదనికుంజ్,జలతరంగణి తదితర ప్రాంతాల్లో సందర్శకుల తాకిడి ఎక్కువగా కనిపిస్తూంటుంది.
బేంబూ చికెన్ : వెదురు బొంగులో ఉడికించిన కోడి మాంసం రుచి గురించి ఎంత వర్ణించినా తక్కువేనంటారు ఈ ప్రాంత సందర్శకులు. ఉప్పు,పసుపు,కారం,మాసాలాలు దట్టించిన పచ్చి కోడి మాంసాన్ని మీటరు పొడవాటి పక్వానికి వచ్చిన పచ్చటి వెదురు బొంగులో ఉంచి ఆకులు, మట్టితో అంచులను కప్పేసి నిప్పుల్లో కాలుస్తారు. వెదురు బొంగు పూర్తిగా నల్లగా మాడిపోయే వరకు బాగా కాల్చాక చల్లార్చి పొగలు కక్కుతున్న ఉడికిన ఆ కోడికూరను అడవి చెట్ల ఆకుల్లో పెట్టుకొని లొట్టలేసుకొని తినడం సందర్శకులందరికి నిజంగా మరుపురాని మధురానుభూతే.
కెనడియన్(హార్స్‌షూ)ఫాల్స్ నుంచి జలాలు 167 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతుంటాయి.ఇక్కడ సుమారు ఆరు లక్షల గ్యాలన్ల నీరు ప్రవహిస్తూంటుందని యూఎస్ జియోలాజికల్ (యూఎస్‌జిఎస్)) పేర్కొంది.ఈ జలపాతానికి మూలం నయగరా నది.మంచు యుగం కాలం నాటిదిది.దీని వయస్సు 18వేల ఏళ్లు.మూడు కిలోమీటర్ల ఎత్తున పేరుకుపోయిన మంచుపలక వేల ఏళ్ల క్రితం కరగడంతోనే నదులు,సరస్సులు ఈ ప్రాంతాల్లో ఏర్పడ్డాయి.దక్షిణ అంటారియో ప్రాంతంలో నెలకొందీ అద్భుత జలపాతం. నయగరా పెనిన్సులాలో 12 వేల ఏళ్ల క్రితమే మంచుప్రాంతం అదృశ్యమయింది.ఈ మంచుఖండం మాయమయ్యాకే ఎరై సరస్సు, నయగరా నది,అంటారియో సరస్సు,లారెన్స్ నదులు ఏర్పడ్డాయి.ఈ మొత్తం జలాలన్నీ కొండలకోనల నుంచి పారుతూ చూడచక్కని జలపాతాలై దిగువనకు ప్రవహిస్తూ చివరకు సముద్రంలో కలుస్తున్నాయి.
వండర్ నయాగరా:క్వీన్‌స్టన్-.-లూయిస్టన్ ప్రాంతంలో నయగరా జలపాత హోయల్ని ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులు ఆనందోత్సాహాలతో తిలకించి పులకించిపోతుంటారు.ఈ జలపాత ప్రాంత సమీపంలోకి చేరుకుంటుండగానే మంచు బిందువులు,నీటి తుంపర్లతో అతిథులను పలకరిస్తూ నయగరా స్వాగతం పలుకుతుంది.ఇక్కడ బటర్‌ఫ్లై కన్జర్వేటరీ,మేరీలాండ్ ఆహ్లాదాన్ని పంచుతాయి.బఫెలో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి,టొరంటో(కెనడా)వైపు నుంచి ఈ జలపాత ప్రాంతానికి అరగంట ప్రయాణించి చేరుకోవచ్చు. నయగరా జలపాత మార్గంలో ఆరు అపురూపమైన బ్రిడ్జిలూ భలే ఆకట్టుకుంటుంటాయి.ఈ వంతెనలన్నీ కెనడా,అమెరికా అంతర్జాతీయ సరిహద్దుల వెంబడే నయగరా నదిపై నిర్మితమయ్యాయి.నాలుగు చక్రాల వాహనదారులు,పాదచారులు కూడా ఈ వంతెనలపై ప్రయాణిస్తుంటారు.వీటిలోనే రెండు రైలు వంతెనలు కూడా ఉన్నాయి.అవి..పీస్ బ్రిడ్జ్,రెయిన్‌బో బ్రిడ్జ్,వర్ల్‌పుల్ బ్రిడ్జ్,లూయిస్టన్-క్వీన్‌స్టన్ బ్రిడ్జ్,మిచిగన్ సెంట్రల్ రైల్వే బ్రిడ్జ్,ఇంటర్నేషనల్ రైల్వే బ్రిడ్జ్.
జల విద్యుదుత్పాదన:అమెరికాలోని రాబర్ట్ మోజెస్((జిఎస్)24 లక్షల కిలోవాట్స్,లూయిస్టన్ పంప్((జిఎస్)3 లక్షల కిలోవాట్స్ చొప్పున 27 లక్షల కిలోవాట్స్ జల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.కెనడా వైపు నుంచి సర్ అడమ్ బెక్(1(జిఎస్)5లక్షల కిలోవాట్స్,సర్ అడమ్ బెక్‌బ(2జిఎస్)) లక్షల కిలోవాట్స్,సర్ అడమ్ బెక్‌పీస్((జిఎస్)లక్షా 75వేల కిలోవాట్స్,డెక్యూ(జిఎస్)కెథరిన్ 23వేల కిలోవాట్స్,డెక్యూ(2జిఎస్)కెథరిన్ లక్షా44వేల కిలోవాట్స్ చొప్పున మొత్తం సుమారు 24లక్షల కిలోవాట్స్ జల విద్యుదుత్పాదన చేస్తున్నారు.
జూల్స్ లాడ్జ్-ఫ్లోరిడా(యూ.ఎస్):).. సముద్ర గర్భాన నిర్మితమైన హోటళ్లకు నిఖార్సయిన వేదిక దుబాయ్.ఇక్కడ ఈ తరహా హోటళ్లు అనేకం.అయితే అమెరికాలోని ఫ్లోరిడా(కీలార్గో)లోని జూల్స్ లాడ్జ్ సముద్ర జలాల అడుగున నిర్మితమైన తొలి హోటల్‌గా చరిత్రకెక్కింది.సముద్ర ఉపరితలం నుంచి 21 అడుగుల లోతున ఈ హోటల్ ప్రధాన ద్వారం స్వాగతం పలుకుతూ కనిపిస్తుంది.విలాసవంతమైన విశ్రాంత గదులకే కాదు స్కూబా డైవింగ్ కోర్సుకు ఈ జూల్స్ పేరొందింది.అంతేనా వివిధ నమూనా క్రీడా ప్రాంగణాలు,పార్క్‌లతో ఈ హోటల్ అతిథుల్ని ఉల్లాసపరుస్తోంది.అదేవిధంగా స్వీడన్(వెస్టారస్)లోని అట్టర్ ఇన్ కూడా ఈ తరహా హోటళ్లలో ఒకటిగా ఖ్యాతి గడించింది.ఈ హోటల్ సముద్ర ఉపరితలం నుంచి మూడు మీటర్ల లోతున నిర్మితమైంది.ఇక ఫిజిలోని పొజిడన్ హోటల్ కూడా ఇదే విధంగా సముద్ర జలాల్లో 40 అడుగుల లోతున నెలకొంది.2010లో టర్కీలో ఇస్తాంబుల్ హోటల్ కొలువుదీరింది.సెవెన్ స్టార్ హోదా గల ఈ హోటల్ ఏడు అంతస్తులతో సముద్ర గర్భంలో ఠీవీని ఒలకబోస్తోంది.అలాగే చైనాకు చెందిన షాంగై షిమొవ్ వండర్‌లాండ్ హోటల్‌ది ఫైవ్ స్టార్ స్టేటస్.వరల్డ్ అండర్ సీ టాప్ ఫైవ్ హోటళ్ల జాబితాలో చోటు దక్కించుకున్న హోటల్ ఇది.2009 నుంచి ఈ హోటల్ అతిథులకు అందుబాటులోకి వచ్చింది.