10 Jan 2012

water car


స‌క‌ల చ‌రాచ‌ర సృష్టికి నీరే మూలం.ప్ర‌కృతి వ‌ర‌ప్ర‌సాదితం నీరు.జీవులన్నింటికి ప్రాణాధారం.మ‌రి యంత్రాల‌కూ ఆ నీరే శ‌క్తిగా మారితే? అవి ఆ నీటితోనే క‌ద‌లాడితే అబ్బుర‌మే క‌దా!కాలం మారింది..వేగం పెరిగింది.ఎన్నో ఆవిష్క‌ర‌ణ‌లు..గ‌తంలో ఆడంబ‌రాల‌నుకునేవి నేడు అవ‌స‌రాల‌య్యాయి.ఇది యాంత్రిక‌యుగం కావ‌డంతో వాహ‌నాలు సామాన్యుల‌కు సైతం త‌ప్ప‌నిస‌రిగా కావాల్సి వ‌స్తోంది.ఆ క్ర‌మంలోనే వాహ‌నాల సంఖ్య వాహ‌న వినియోగ‌దారుల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది.అంత‌ర్జాతీయ విప‌ణిలోకి ఎన్నోన్నో వాహ‌నాలు కొత్త ఫీచ‌ర్లు,మోడ‌ళ్ల‌తో దూసుకువ‌స్తున్నాయి.అయితే ఆ వాహ‌నాలన్నింటికీ ప్ర‌ధాన ఇంధ‌నం పెట్రోలే.అందుకే నిత్యం పెట్రో ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు.అదే సామాన్య వాహ‌న‌దారుల గుండెల్లో గుబులు రేపుతోంది.గ‌తంలో డీజిల్ వాహ‌నాలు ఆ త‌ర్వాత పెట్రోలు వాహ‌నాలు ఆపై ఎల‌క్ట్రిక్ ఇప్పుడు సి.ఎన్‌.జి(కంప్రెస్డ్ నేచుర‌ల్ గ్యాస్‌) ఆధారిత వాహ‌నాలు తెర‌పైకి వ‌చ్చాయి.ఇవ‌న్నీ వాహ‌న‌దారుల జేబు చ‌మురునే వ‌దిలిస్తున్నాయి.దీనికి ప్ర‌త్యామ్నాయం ఏమిటి?ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి.త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్కువ దూరం ప్ర‌యాణించే ఆవిష్క‌ర‌ణ‌లు అంద‌రికీ ఆనంద‌దాయ‌క‌మే అన‌డంలో సందేహం లేదు.90వ ద‌శ‌కంలో భార‌త్‌((త‌మిళ‌నాడు)లో రామ‌న్‌పిళ్లై మూలికా ఇంధ‌నాన్ని సృష్టించాన‌న్నారు.పెట్రోల్‌కు ఇదే క‌చ్చిత‌మైన ప్ర‌త్యామ్నాయమ‌ని ఎన్నో ప్ర‌ద‌ర్శ‌న‌లు చేశారు.అయితే ఆ త‌ర్వాత పిళ్లై ప్ర‌యోగాలు విఫ‌లం కావ‌డం భార‌త్ వంటి వ‌ర్థ‌మాన‌దేశాల వాహ‌న వినియోగ‌దారుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది.కానీ ప్ర‌పంచ వ్యాప్తంగా శాస్త్ర‌వేత్త‌లు త‌మ మెద‌ళ్ల‌కు పదును పెట్టి సరికొత్త ప‌రిశోధ‌న‌లను ముమ్మ‌రంగా కొన‌సాగిస్తూనే ఉన్నారు.
డ‌బ్లూ.ఇ.ఎస్‌..:కేవ‌లం నీరు,గాలి ద్వారానే కార్ల‌ను న‌డిపిస్తే..ఆ ఆలోచ‌న ఉద‌యించే సూర్యుని దేశం జ‌పాన్‌కి రానే వ‌చ్చింది.ఆటోమొబైల్ రంగంలో ప్ర‌పంచ రారాజుగా ఆధిప‌త్యాన్ని చ‌లాయిస్తున్న మ‌న జ‌పనీయులు వాట‌ర్ ఎన‌ర్జీ సిస్ట‌మ్‌(డ‌బ్లూ.ఇ.ఎస్‌)ను ప‌రిచ‌యం చేసి మ‌రోసారి త‌మ స‌త్తాను చాటారు.ప్ర‌సిద్ధ జెనెప‌క్స్ కంపెనీ ఈ వాట‌ర్ కారును రూపొందించింది.నీళ్లలో ఉండే ఆక్సిజ‌న్‌,హైడ్రోజ‌న్‌ల‌ను విభ‌జించి ఆ హైడ్రోజ‌న్ ద్వారా శ‌క్తిని సృష్టించి యంత్రాన్ని న‌డ‌ప‌డ‌మ‌న్న‌దే ఈ స‌రికొత్త టెక్నాల‌జీ.ప్ర‌స్తుతం న‌డుస్తున్న డీజిల్‌,పెట్రోల్‌,ఎల‌క్ట్రిక్‌,సి.ఎన్‌.జి త‌దిత‌ర వాహ‌నాల్లో క‌న్వ‌ర్ట‌ర్ల‌ను మార్చి ఈ డ‌బ్లూ.ఇ.ఎస్ ప‌రిజ్ఞానంతో `కారు`చౌక ప్ర‌యాణాల ల‌బ్ధిని వాహ‌న‌దారుల‌కు అందించ‌డ‌మే దీని లక్ష్యం.ఎంత ల‌గ్జ‌రీ కారైనా,చౌక‌ర‌క‌మైన‌దైనా పెట్రోల్‌,సి.ఎన్‌.జి చార్జీల చెల్లింపు వాహ‌న‌దారులంద‌రికీ స‌మాన‌మే.వాహ‌నాల్లో వినియోగించే ఇంధ‌నం ధ‌ర‌లు అంద‌రికీ అందుబాటులో ఉండ‌డ‌మ‌న్న‌దే ప్రధానాంశం.ఆ దిశ‌గానే ఇప్పుడు అడుగులు ప‌డుతున్నాయి.ఈ సాంకేతిక ప‌రిజ్ఞానం పూర్తిగా విజ‌యవంత‌మై విశ్వ‌వ్యాప్తంగా అన్ని త‌ర‌హా వాహ‌న‌దారుల‌కు అక్క‌ర‌కు వ‌స్తేనే ప్ర‌యోజ‌న‌దాయ‌క‌మ‌వుతుంది.వాట‌ర్ ప‌వ‌ర్డ్ వెహిక‌ల్ ఒక్కో ఇంజిన్ త‌యారీకి 2 కోట్ల యెన్‌లు(18,500 అమెరికా డాల‌ర్లు)ఖ‌ర్చ‌వుతోంద‌ట‌.ఆ ధ‌ర‌ల‌ను 5 ల‌క్ష‌ల యెన్‌లు(4,600 అమెరికా డాల‌ర్ల‌) స్థాయికి తీసుకురాగ‌ల్గితేనే తాము ఆశించిన ఫ‌లితం సిద్ధిస్తుంద‌ని ఆ కంపెనీ భావిస్తోంది.
ప‌ర్యావ‌ర‌ణం-భ‌ద్రం:సిఎన్‌జి,ఎల‌క్ట్రిక్ మోడ్ వాహ‌నాల మాదిరిగా ఈ వాట‌ర్ కార్ల వ‌ల్ల ఎటువంటి వాతావ‌ర‌ణ కాలుష్యం ఉండ‌దు.ఈ డ‌బ్లూఇఎస్ ప‌రిజ్ఞానంపై నిజానికి నూరేళ్ల క్రితం నుంచే బ్రిట‌న్‌,ఆస్ట్రేలియా,అమెరికా,ర‌ష్యా త‌దిత‌ర దేశాల శాస్త్ర‌వేత్త‌లు దృష్టిని సారించారు.ర‌ష్యా శాస్త్ర‌వేత్త‌లు తొలుత ఓ నౌక‌ను నీటి ద్వారా న‌డిపించేందుకు ఈ ప‌రిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు.స‌ముద్ర‌పు జ‌లాల నుంచే హైడ్రోజ‌న్‌ను సేక‌రించి షిప్ న‌డిచేలా సాంకేతిక‌త‌ను రూపొందించారు.ఈ ప‌రిజ్ఞానాన్ని ఓ.ఎమ్‌. గా వారు స్థిర‌ప‌రిచారు.ఈ డ‌బ్లూ.ఇ.ఎస్ ప‌రిజ్ఞానం మ‌రింత ప్ర‌గ‌తిని సాధిస్తే ఒక్క కార్లేంటి ఏకంగా విమానాలు,రాకెట్లు,స‌బ్‌మెరైన్ల‌ను కూడా నీళ్ల‌తోనే న‌డిపించేయొచ్చంటున్నారు.

No comments:

Post a Comment

Popular Posts

Wisdomrays