22 Nov 2011

3gorjes


చైనా ది డ్రాగ‌న్‌..దాదాపు 140 కోట్ల జ‌నాభా. ప్ర‌పంచంలో అధిక జ‌నాభా గ‌ల అగ్ర‌దేశం.22 ప్రావిన్సుల గ‌ల క‌మ్యూనిస్టు దేశం. ఏదైనా త‌ల‌పెడితే సాధించాల‌నే త‌ప‌న న‌ర‌న‌రాన్న జీర్ణించుకున్న జ‌నం. అగ్ర‌రాజ్యం స్థానం పొందాల‌ని ఉవ్విళ్లూరే పాల‌కులు..పాల‌న‌యినా ప్రాజెక్ట‌యినా క‌డ‌దాకా కంక‌ణ‌బ‌ద్ధులై కొన‌సాగిస్తారు. అందుకో ఉదాహ‌ర‌ణ త్రీగోర్జెస్ డ్యాం. యాంగ్జె న‌ది..ప్ర‌తి ప‌దేళ్ల‌కు ఓసారి భారీ వ‌ర‌ద‌ల‌తో త‌న త‌డ‌ఖా చూపిస్తోంటోంది. 1954లో అయితే ఏకంగా 33 వేల మందిని త‌న‌లో క‌లిపేసుకుంది. 1998లో సైతం మ‌రోసారి బిలియ‌న్ డాల‌ర్ల ఆస్తి న‌ష్టాన్ని దేశ ప్ర‌జ‌ల‌కు మిగిల్చింది. ఆ వ‌ర‌ద‌ల‌కు ముగింపు ప‌ల‌కాల‌నే ప్ర‌థాన ఉద్దేశంతో త్రీగోర్జెస్ డ్యాంకు అక్క‌డ ప్రభుత్వం న‌డుం బిగించింది. ఈ డ్యాం ద్వారా ఉత్ప‌త్త‌య్యే హైడ్రో ఎల‌క్ట్రిక్ ప‌వ‌ర్ ఎంతంటే 22,500 మెగావాట్లు. ఓ వైపు వ‌ర‌ద‌ల న‌ష్టాన్ని నివారించ‌డ‌మే కాక దేశానికి అవ‌స‌ర‌మైన విద్యుత్‌ను చౌక‌గా త‌యారు చేయ‌డ‌మే ఈ త్రీగోర్జెస్ డ్యాం లక్ష్యం. అదే ఆ దేశానికి ప్ర‌పంచంలోనే అతి పెద్ద హైడ్రో ప్రాజెక్టు అమ‌ర‌డానికి కార‌ణ‌మైంది. త‌ద్వారా వివిధ కాల్వ‌ల ద్వారా మిగులు జ‌లాల్ని వ్య‌వ‌సాయానికి వినియోగించ‌డాన్ని ఆ దేశ పాల‌కులు చేప‌ట్టారు. దాదాపు మూడు కోట్ల మంది నిర్వాసితుల్ని 2008 నాటికే ఇత‌ర ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌కు త‌ర‌లించి ఆవాసం క‌ల్పించారు. ఈ భారీ ప్రాజెక్టు వ‌ల్ల భూకంపాలు, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డ‌మ‌నే ప్ర‌మాదం ఉన్నా క‌ల్గే ప్ర‌యోజ‌న‌మే మిన్న‌గా భావించి 1994లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును 2008 అక్టోబ‌ర్ 30 నాటికి పూర్తి స్థాయిలో నిర్మించి ప్రారంభించారు. ఇందుకు వాళ్లు వ్య‌యం చేసిన మొత్తం అక్ష‌రాల 26 బిలియ‌న్ అమెరికా డాల‌ర్లు. ఈ ప్రాజెక్టు ఊహ 1919 నాటిది. 1932లో మ‌రోసారి మ‌దిలో మెద‌ల‌గా పాల‌కులు 1934లో ప్రాథ‌మిక అంచానా ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టారు.
1944లో అమెరికాకు చెందిన బ్యూరో ఆఫ్ రిక్ల‌మేష‌న్ చీఫ్ డిజైన్ ఇంజినీర్ జాన్ ఎల్‌.సేవెజ్ ఆధ్వ‌ర్యంలో స‌ర్వే జ‌రిగింది. 54 మంది చైనా ఇంజినీర్ల బృందం ఈ ప్రాజెక్టు కోసం శిక్ష‌ణ‌కు అమెరికా వెళ్లారు.అయితే చైనా సివిల్ వార్ వ‌ల్ల 1947లో ఈ ప్రాజెక్టుకు ఆటంకం ఏర్ప‌డింది. 1949లో క‌మ్యూనిస్ట్‌ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక మావో జెడాంగ్ కూడా త్రీగోర్జెస్ డ్యాంకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అయితే ముందు మాత్రం గెజ్హాబా డ్యాంను ప్రారంభించారు. త‌ర్వాత గ్రేట్ లీప్‌ ఫార్వార్డ్‌, సాంస్కృతిక విప్ల‌వం, యాంగ్జె వ‌ర‌ద‌ల వ‌ల్ల 1956లో డ్యాం ప‌నులు అట‌కెక్కాయి. ఈ డ్యాం నిర్మాణాన్ని మావోజెడాంగ్ ఎంత‌గా ప్రేమించారంటే 1958లో దీనిపై ఆయ‌న ఏకంగా `స్విమింగ్‌` పేరిట ఓ ప‌ద్యాన్నే రాసేశారు. ఎట్ట‌కేల‌కు 1992లో నేష‌న‌ల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆమోదంతో మ‌ళ్లీ త్రీగోర్జెస్ ప్రాజెక్టు ప‌ట్టాల‌కెక్కింది.క‌న్‌స్ట్ర‌క్ష‌న్ 1994 డిసెంబ‌ర్ 14న మొద‌ల‌యింది. అక్క‌డ నుంచి ఒక్కో ద‌శ శ‌ర‌వేగంగా పూర్త‌వుతూ త్వ‌ర‌లోనే అందుబాటులోకి వ‌చ్చింది. ఈ డ్యాంను చూడ్డానికి మావో జెడాంగ్ నోచుకోక‌పోవ‌డ‌మే చైనీయుల‌కు బాధ‌ను క‌ల్గించే విష‌యం.
త్రీగోర్జెస్-త్రీబెనిఫిట్స్:వ‌ర‌ద‌ల నివార‌ణ, చౌక‌గా విద్యుదుత్పాద‌న, వ్య‌వ‌సాయ అవ‌స‌రాల‌కు స‌మృద్ధిగా జ‌లాలు. ఈ మూడింటిని సాధించేందుకు చైనా క‌మ్యూనిస్టులు దేశ‌, విదేశాల్లో ఎదురైన వ్య‌తిరేక‌త‌కు ఎదురునిలిచి ప్రాజెక్టును పూర్తి చేశారు. ప్ర‌పంచంలో భారీ డ్యాంగా పేరొందిన త్రీగోర్జెస్ ఎత్తు 181 మీట‌ర్లు కాగా పొడ‌వు 2,335 మీట‌ర్లు. ఏటా విద్యుదుత్ప‌త్తి 80 టిడ‌బ్ల్యూహెచ్. ఈ ప్రాజెక్టుకే మ‌రో హైలైట్ షిప్‌లిఫ్ట్‌. ఈ ప‌నులు 2012 నాటికి మొత్తంగా పూర్తి కానున్నాయి. థ‌ర్మ‌ల్‌,విండ్‌,న్యూక్లియ‌ర్ త‌దిత‌ర ఏ ఇత‌ర విద్యుదుత్పాద‌న‌ల క‌న్నా హైడ్రో విద్యుదుత్పాద‌నే కారుచౌక‌. 66 దేశాల్లో 50% విద్యుత్ ఉత్ప‌త్తి హైడ్రో ప‌వ‌ర్ కావ‌డ‌మే అందుకో చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణ‌. అస‌లు ప్ర‌పంచంలోనే అన్ని దేశాల విద్యుదుత్పాద‌న‌లో హైడ్రో వాటా 20%. పైగా కాలుష్య ర‌హితం. త్రీగోర్జెస్ రాక‌తో చైనాలోని 31 మిలియ‌న్ ట‌న్నుల బొగ్గు ఆదా అయిన‌ట్లు నేష‌న‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ రిఫార్మ్స్ క‌మిష‌న్ పేర్కొంది. అంతేకాదు 100 మిలియ‌న్ ట‌న్నుల గ్రీన్‌హౌస్ వాయువుల్ని నివారించ‌గ‌లిగార‌ట. ఇదో చారిత్ర‌క సాంకేతిక‌ నైపుణ్యాల‌కు నిలువుట‌ద్దంగా చైనా పేర్కొంటోంది. ఇంత‌కీ త్రీగోర్జెస్ చైనాలో ఎక్క‌డుందంటే హుబె ప్రావిన్స్‌లో సాండేపింగ్,యిచాంగ్ ప‌ట్ట‌ణాల మ‌ధ్య‌న ఉంది. షాంఘై న‌గరానికి ఈ ప్రాజెక్టు 1000 మైళ్ల దూరం. తొలిసారిగా హైడ్రో ప‌వ‌ర్ వెలుగులీనింది మాత్రం 1878లో నార్తంబెర్లాండ్‌(ఇంగ్లాండ్‌)లోని క్రాగ్‌స‌యిడ్ హౌస్‌లోనే. 1882లో అమెరికాలోని ఫాక్స్ రివ‌ర్ నుంచి ఉత్ప‌త్తి చేసిన హైడ్రో ప‌వ‌ర్‌ను రెండు చిన్న‌త‌ర‌హా పేప‌ర్‌మిల్స్‌లో వినియోగించారు.
హైడ్రో ప‌వ‌ర్ ఉత్ప‌త్తిలో టాప్ టెన్ దేశాలు
త‌జికిస్థాన్-5,27,700 (మెగావాట్లు); 
కెన‌డా-3,41,312(మెగావాట్లు); 
అమెరికా-3,19,484 (మెగావాట్లు); 
బ్రెజిల్-2,85,603 (మెగావాట్లు); 
చైనా-2,04,300 (మెగావాట్లు);   
ర‌ష్యా-1,60,500 (మెగావాట్లు); 
నార్వే-1,21,824(మెగావాట్లు); 
జ‌పాన్-84,500 (మెగావాట్లు); 
ఇండియా-82,237 (మెగావాట్లు); 
ఫ్రాన్స్‌-77,500 (మెగావాట్లు).
వ‌ర‌ల్డ్ టాప్-10 హైడ్రో ప‌వ‌ర్ ప్రాజెక్ట్స్‌
*త్రీగోర్జెస్ డ్యాం: 2008-22.5(జి.డ‌బ్ల్యూ)-చైనా(యాంగ్జె న‌ది)
*ఇట‌యిపు హైడ్రో ఎల‌క్ట్రిసిటీ ప‌వ‌ర్ ప్లాంట్‌:2003-14,000(ఎం.డ‌బ్ల్యూ)-బ్రెజిల్‌
*గురి డ్యాం: 10.2(జి.డ‌బ్ల్యూ)-వెనిజులా(క‌రోని న‌ది)
*టుకురాయ్ డ్యాం:1975-8.5(జి.డ‌బ్ల్యూ)-టుకురాయ్ కౌంటీ, బ్రెజిల్‌ 
*గ్రాండ్ కౌలీ హైడ్రో ఎల‌క్ట్రిక్ ప‌వ‌ర్ ప్లాంట్‌-7000(ఎం.డ‌బ్ల్యూ)-అమెరికా
*స‌యానొ-షుష్నెస్క్యా-1978-6,400(ఎం.డ‌బ్ల్యూ)-ర‌ష్యా
*క్ర‌స్నోయార్స్క్ హైడ్రో ఎల‌క్ట్రిక్ ప‌వ‌ర్ ప్లాంట్‌-1972-6000(ఎం.డ‌బ్ల్యూ)-ర‌ష్యా(మెనిసె న‌ది)
*రాబ‌ర్ట్ బౌర్సా హైడ్రో ఎల‌క్ట్రిక్ ప‌వ‌ర్ ప్లాంట్‌-5,600(ఎం.డ‌బ్ల్యూ)-కెన‌డా(లిగ్రాండె)
*చ‌ర్చిల్ ఫాల్స్ జ‌న‌రేటింగ్ స్టేష‌న్‌-5,400(ఎం.డ‌బ్ల్యూ)-కెన‌డా
*లాంగ్టాన్ డ్యాం-2(జి.డ‌బ్ల్యూ)-చైనా(హొమ్ష్యా న‌ది)
______________________________________________________________
వెయిటింగ్ రికార్డ్స్:ముంబాయి..వెస్టిండీస్‌-భార‌త్ సీరీస్‌లో చివ‌రిద‌యిన మూడో టెస్ట్‌..ఇందులో ఏముంది కొత్త విష‌యం..ఎందుకంటే ఇప్ప‌టికే సీరీస్‌ను ఇండియా గెలిచేసింది. మ‌రి మ‌జా ఏంటంటే మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ నూరో
శ‌త‌కం కోస‌మే ప్ర‌పంచ క్రికెట్ అభిమానుల ఆత్రం.అదీ స‌చిన్ త‌న సొంత గ్రౌండ్‌లో సాధిస్తాడ‌నే స‌గ‌టు అభిమానులంతా వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు.ఇంతేనా అంటే ఇంకా ఉంది..గ్రేట్‌వాల్ ద్ర‌విడ్ టెస్టుల్లో 13వేల ప‌రుగుల రికార్డు చెంత‌, డాషింగ్ రేస‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ 8 వేల ప‌రుగుల ముంగిట ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవ‌రిప్పుడు త‌మ‌ రికార్డును లిఖిస్తారో రేప‌టి వ‌ర‌కు వేచి చూడాలి.
  ‌

19 Nov 2011

GUYS


GUYS
V.Uma Shankar,Mechanical engineer
VIZAG STEEL PLANT (VSP)

Message from Guys column 
(Guts Utilized Youth`s Success)
The first and foremost duty of parents is they have to inculcate virtues and moral values of life in their children right from the elementary stage itself. They are to be explained clearly the prospects of various faculties of learning such as engineering,medical science, law, literature,social sciences, humanities, fine arts etc. during their secondary and higher Secondary phases. Children should be given full freedom and choice to choose a career. They are interested in after they make thorough and promoted study. If the children are so encouraged, they developed mental enlightment, grow in a healthy congenial atmosphere and build their career. Hence they can become the proud citizens of the nation by excelling in their much desirous fields and come of with flying colours.
______________________________________________________________

World Top10 engineering institutes


1. Massachusetts Institute of Technology:
If you are studying in MIT then it’s just like drinking from a fireplug. Profs are unique, strange and seems that they have just landed to attend lecture from a mysterious planet. Enough environment to keep any nerd on the edge. Apart from partying and sporting, hacking is one of the most preferable timepass for students here.
2. Stanford University:
If you have “Stanford University” on your resume then doors are open for you all along the way. If once you are trapped in the vibrancy of intellectual and driven people then it’s hard to go back into the real world. If you’re given the chance, come to Stanford. You won’t regret it.
3. University of Cambridge:
If you love challenges, love to throw yourself at whatever comes your way then you are welcome to Cambridge. An outstanding reputation for teaching, research and solving nerdiest assignments, Cambridge offers world class educational facilities as well as a platform to show yourself something different in society.
4. University of California:
Combination of talented and energetic students, a world class faculty, a beautiful campus, a spirit to look beyond and a place where students come from variety of socio-economic backgrounds. Don’t feel shocked when you are going to attend your introductory class and finds your prof a Nobel prize winner.
5. Georgia Institute of Technology:
Georgia Tech is distinguished by its commitment to improving the human condition through advance science and technology. Friends, support and extracurricular activities make your not studying time more enjoyable.
6. California Institute of Technology:
It’s a kind of place that is very rare indeed and teaches you how to innovate and think creatively. Commonly referred as Caltech, this landmark engineering institute provides you the truly superior understanding of all the basic aspects of technology.
7. University of Illinois:
Absolute blast and a perfect fit for your skills. U of I is known for its notable faculty and alumni list and also its detachment from odd craps such as – manipulating your teachers, displaying your effort and hoping that prof will give you the benefit of doubt and up your grade.
8. Imperial College London:
In 1907 three colleges were merged to create one university. It is a different world, everyone is nerd and serious about work. Hectic schedule in day with profs and books (In lecture hall) and hectic schedule in night with pretty partners and beer (In pubs or dance floor). It enables you to take part in any activity you could possibly want to.
9. University of Michigan:
Ever since it’s inception in 1854 this university has consistently formulated new standards of excellence in study and research. Go ahead and meet students from all across the world who have come to study just like you.
10. National University of Singapore:
Launched in 1968, the Faculty of Engineering (FOE) is the largest faculty of NUS. This university provides a strong foundation to students, willing to build up a society through innovation, leadership and banging out the strangest stuff.

(you can see other posts from this blog, go threw with mozilla firefox/google chrome)


18 Nov 2011

siberian crane

 (you can see other posts from this blog, go threw with mozilla firefox/google chrome)
అందానికే అందం..ప‌క్షి జాతికే  మ‌కుటాయ‌ మానం.. సైబీరియా ప‌క్షులు . చాలా బ‌లిష్ట‌మైన‌వి కూడా. దాదాపు 4000 వేల మైళ్ల సుదూర తీరం నుంచి ఇవి వ‌ల‌స‌గా అలుపుసొలుపు లేకుండా ఎగురుకుంటూ రావ‌డ‌మే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. సైబీరియా వాస్త‌వానికి ర‌ష్యాలో ఓ ప్రాంతం. యూర‌ప్ ఖండ‌మే అయినా ఉత్త‌ర ఆసియా ఖండానికి స‌రిహ‌ద్దుల్లో ఉంది. సైబీరియా మొత్తం వైశాల్యం మొత్తం 10 మిలియ‌న్ చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్లు. సుమారు 3 వేల మైళ్ల ప‌ర్వ‌తశ్రేణుల‌తో కూడిన ప్రాంతం. శీతాకాలంలో ఇక్క‌డ ఉష్ణోగ్ర‌త -68 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరుకుంటుంది. ఈ అతిశీత‌ల వాతావ‌ర‌ణానికి దూరంగా వెచ్చ‌ని ప్రాంతంగా భార‌త్‌ను ఎంచుకొని ఈ ప‌క్షులు ఇలా వ‌ల‌స వ‌చ్చేస్తాయి. వీటి వ‌ల‌స‌కు ప్ర‌ధాన కారణాలు మూడు పున‌రుత్ప‌త్తి, మంచి ఆహారం, నీరు, ఆహ్లాద‌క‌ర (వెచ్చ‌ని) వాతావ‌ర‌ణాన్ని ఆశించే సైబీరియా ప‌క్షులు పెద్ద సంఖ్య‌లో వేల మైళ్ల‌ను లెక్క‌చేయ‌కుండా వ‌ల‌స‌ వ‌స్తాయి. తెల్ల‌నైన ఈ కొంగ‌ల రూపు బ‌హు ఆక‌ర్ష‌ణీయం. వీటి క‌ళ్ల రంగు ప‌సుపు.త‌ల భాగం ఇరువైపుల‌ ఇటుక రంగుతో ఉంటుంది. ముక్కు రంగు ఎరుపు కాగా కాళ్లు ఎరుపు లేదా గులాబీ రంగులో ఆక‌ర్షిస్తుంటాయి. చేప‌లు, కీట‌కాలే వీటి ఆహారం. 
సైబీరియా నుంచి భార‌త్‌కు వ‌ల‌స వ‌చ్చే క్ర‌మంలో ఆప్ఘ‌నిస్థాన్‌లోని అబ్‌-ఇ-ఎస్ట‌డా స‌ర‌స్సు ప్రాంతంలో సేద తీరి మ‌ళ్లీ ప్ర‌యాణాన్ని కొన‌సాగిస్తాయి. హిమాల‌యాల మార్గంలో ఇవి ప్ర‌యాణిస్తుండ‌గా పాకిస్థాన్ స‌రిహ‌ద్దుల్లో ఇవి పెద్ద సంఖ్య‌లో వేట‌గాళ్ల బారిన ప‌డుతున్నాయి. దాంతో మొత్తం ఈ జాతి ప‌క్షుల ఉనికికే పెనుముప్పు పొంచి ఉంది. ఈ శీతాకాలంలో ఎక్కువ దూరం ఎగ‌ర‌డం ద్వారా త‌మ సామ‌ర్థ్యాన్ని పెంచుకోజూడ్డం కూడా వీటి ప్రాథ‌మిక ల‌క్ష‌ణంగా శాస్త్ర‌వేత్త‌లు పేర్కొంటున్నారు. సైబీరియా కొంగ‌ల‌కు వొల్ఫ్‌,స్నో క్రేన్ల‌గాను పేరుంది. ఇవి దాదాపు 30 ఏళ్లు జీవిస్తాయ‌ట‌.ఇవి తొలుత‌ రాజ‌స్థాన్‌, పంజాబ్‌, హ‌ర్యానాల్లోనే దిగుతాయి.

భార‌త్‌లో టాప్‌-10 ప‌క్షి సంర‌క్ష‌ణ కేంద్రాలు
ప్రపంచంలో మొత్తం 8650 ప‌క్షి జాతులుండ‌గా వాటిలో 1200 ర‌కాలు భార‌త్‌లో ఉన్నాయి. భార‌త్ జాతీయ ప‌క్షి
నెమ‌లి కాగా ఇండియ‌న్ ఈగిల్ (గరుడ‌) హిందువుల‌కు ఆరాధ్య ప‌క్షి జాతి. బ‌స్ట‌ర్డ్‌, ఇండియ‌న్ హార్న్‌బిల్‌,
కింగ్‌ఫిష‌ర్స్ వంటి ఆక‌ర్ష‌ణీయమైన ప‌క్షులెన్నో దేశ‌,విదేశీ సంద‌ర్శ‌కుల్ని అల‌రించే ప‌దికిపైగా ప్ర‌పంచ ప్ర‌సిద్ధ‌ ప‌క్షి సంర‌క్ష‌ణ కేంద్రాలు భార‌త్‌లో ఉన్నాయి. 
*భ‌ర‌త్‌పూర్ బ‌ర్డ్ సాంక్చురి: రాజ‌స్థాన్‌లోగ‌ల దీనికే కియోల‌డియో ఘ‌నా నేష‌న‌ల్ పార్కుగా కూడా పేరు. ప్ర‌పంచంలోనే ప్ర‌సిద్ధి చెందిన కేంద్ర‌మిది. థార్ ఎడారి స‌మీపంలో గ‌ల ఈ పార్క్‌లో ప‌లు స‌ర‌స్సులూ సంద‌ర్శ‌కుల‌కు
క‌నువిందు చేస్తాయి. ముఖ్యంగా ఇక్క‌డ‌కు వ‌చ్చే వేల‌కొద్దీ సైబీరియా కొంగ‌లు, ఇత‌ర విదేశీ వ‌ల‌స ప‌క్షులు సంద‌ర్శ‌కుల్ని, ప‌క్షి ప్రేమికుల్ని ఆక‌ట్టుకుంటుంటాయి. 
*సుల్తాన్‌పూర్ బ‌ర్డ్ సాంక్చురి: 100 ర‌కాల ప్ర‌పంచ ప‌క్షులు ఇక్క‌డ‌కు వ‌ల‌స వ‌స్తుంటాయి. హ‌ర్యానాలోని గుర్గాన్ జిల్లాలోని ఈ కేంద్రం వివిధ అట‌వీ జంతువుల‌కు అనేక ర‌కాల రంగుల్లోని వ‌ల‌స ప‌క్షుల‌కే పెద్ద వేదిక‌. ప‌క్షుల కిల‌కిలా రావాల‌తో ఇక్క‌డ‌కు వ‌చ్చే సంద‌ర్శ‌కులు మైమ‌ర‌చిపోతుంటారు.
* స‌లీం అలీ బ‌ర్డ్ సాంక్చురి: గోవాలో గ‌ల ఈ ప‌క్షి సంర‌క్ష‌ణ కేంద్రం మందోని న‌దీ తీరంలోని చొరావ్ ఐలాండ్‌లో ఉంది. వివిధ ర‌కాల పిచ్చుక‌ల‌కు, అందాల చిలుక‌ల‌కు, పిపొర‌ల్ బ‌ర్డ్స్‌, పెలికాన్‌, ఇండియ‌న్ జెయింట్‌ స్క్విర‌ల్స్‌, ఫౌనాల‌కు పేరెన్నిక ఈ సాంక్చురి. 
*కుమ‌ర‌కోమ్ బ‌ర్డ్ సాంక్చురి: కేర‌ళ‌లోని వెంబాన‌ద్ ప‌క్షి సంర‌క్ష‌ణ క్షేత్రంగా కూడా పేరు. వెంబాన‌ద్ స‌ర‌స్సు వ‌ల్లే ఈ కేంద్రానికి ఆ పేరు కూడా ఉంది. ఫ్లైకేచ‌ర్‌, టియ‌ల్ త‌ద‌త‌ర విదేశీ ప‌క్షి జాతుల‌కు ప్ర‌సిద్ధి. ఈ రాష్ట్రంలోనే
మంగ‌ళ‌వ‌నం, త‌ల్తెక‌ద్‌ సంర‌క్ష‌ణ కేంద్రాలూ ఉన్నాయి.
*రంగంత‌ట్టు బ‌ర్డ్ సాంక్చురి: క‌ర్ణాట‌క‌లోని కావేరి తీరంలో కొలువుదీరింది. లైట్ ఇబిస్‌, ఈగ్రెట్‌, పార్ట్రిడ్జ్‌, హెరాన్‌, రివ‌ర్ తెర్న్‌, స్నేక్‌బ‌ర్డ్‌, స్టోన్ ఫ్లార్ త‌దిత‌ర ఎన్నో వ‌ల‌స ప‌క్షుల‌తో అల‌రారే కేంద్ర‌మిది. ఈ కేంద్రం మైసూర్‌లోని ప్ర‌సిద్ధ బృందావ‌న్ గార్డెన్స్‌కు కేవ‌లం 20 కిలోమీట‌ర్ల దూరంలోనే ఉంది. 
*వేదాంత‌గ‌ల్ బ‌ర్డ్ సాంక్చురి: త‌మిళ‌నాడులోని ఈ సంర‌క్ష‌ణాల‌యంలోని పింటెయిల్‌, గార్గెని, గ్రే వాగ్ట‌యిల్‌, బ్లూ వింగ్డ్ టియ‌ల్‌, కామ‌న్ సాండ్ పైపెర్ ప‌క్షుల‌కు ప్ర‌సిద్ధి చెందింది. త‌మిళ‌నాడులో ఆరో వంతు అట‌వీ ప్రాంత‌మే దాంతో వివిధ ప‌క్షి జాతుల‌కు అనువుగా భాసిల్లుతోంది. ఈ కేంద్రంతో పాటు స‌మీపంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన పులికాట్ స‌ర‌స్సు తీరంలోను ప‌లు వ‌ల‌స ప‌క్షులు సంద‌ర్శ‌కుల‌కు క‌నువిందు క‌ల్గిస్తుంటాయి.
*కౌండిన్య ప‌క్షి సంర‌క్ష‌ణ కేంద్రం: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉంది. ఎత్తైన కొండ‌లు, లోతైన జ‌ల‌పాతాలు, కైగ‌ల్, కౌండిన్య అనే జ‌ల‌త‌రంగాలు ఈ కేంద్రానికే అద‌న‌పు ఆక‌ర్ష‌ణ తెచ్చేవి. ప‌లు దేశాల వ‌ల‌స‌ ప‌క్షులే కాక ప‌లు అట‌వీ జంతువుల‌తో సంద‌ర్శ‌కుల‌ను అల‌రించే కేంద్ర‌మిది. దీంతోపాటు కొల్లేరు స‌ర‌స్సు కూడా సైబీరియా ప‌క్షులు, ఇత‌ర విదేశీ ప‌క్షుల‌కు కేంద్రంగా వ‌ర్థిల్లుతోంది.
*చిల‌క్ లేక్ బ‌ర్డ్ సాంక్చురి: ఒరిస్సాలోగ‌ల ఈ కేంద్రం సంద‌ర్శ‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటుంది. ఇక్క‌డ స‌ర‌స్సు ప్ర‌పంచ ప్ర‌సిద్ధి చెందింది. ఆసియాలోనే ప్ర‌సిద్ధ‌మైన ప‌క్షిజాతుల‌తో అల‌రారుతుంది. ముత్య‌పు ఆకారంలో గ‌ల చిల‌క్‌లేక్ ఓ అద్భుత అనుభూతి. 
*మియాని బ‌ర్డ్ సాంక్చురి: మ‌హారాష్ట్ర‌లోని సతార్ జిల్లాలోగ‌ల ఈ కేంద్రం ప‌లు విదేశీ ప‌క్షి జాతుల‌కు వేదిక‌. ఈ మార్గం గుండా ప‌లు విదేశీ ప‌క్షులు భార‌త్‌కు వ‌ల‌స వ‌స్తుంటాయి. ఇక్క‌డ నుంచే దేశంలోని ఇత‌ర ప్రాంతాల‌కు ఎగిరి వెళ్తుంటాయి. సైబీరియాకు చెందిన ఫ్లెమింగోస్ పెద్ద సంఖ్య‌లో ఇక్క‌డ‌కు త‌ర‌లి వ‌స్తుండ‌డం రివాజు.
*న‌ల్స‌రోవ‌ర్ బ‌ర్డ్ సాంక్చురి: గుజ‌రాత్‌లో గ‌ల అహ్మ‌దాబాద్ లోగ‌ల ఈ కేంద్రం ఫ్లెమిగోస్‌, పెలికాన్స్‌, స్పూన్‌బిల్ప్‌, ఎవోసిట్స్‌, పిన్‌టైల్స్‌, స్మాల్ కార్మొరెంట్స్‌, స్మాల్‌గ్రేబ్స్‌, పోన‌ల‌ర్స్ ప‌క్షుల‌కు పేరొందిన కేంద్రం. ఈ రాష్ట్రంలోనే పోర్‌బంద‌ర్ బ‌ర్డ్ సాంక్చురి కూడా ఉంది. దేశంలోనే తొలి మెరైన్ నేష‌న‌ల్ పార్కు ఇది. 

16 Nov 2011

statue of liberty

Space post you can see from this blog on october 20
IceMan post on october 21
  • సీపీఐ,సీపీఎం విడివిడిగా ఉంటేనే ప్ర‌యోజ‌న‌క‌ర‌మ‌ని ఎబిబ‌ర్ద‌న్ పేర్కొన్నారు.
  • 2030 నాటికి డ‌యాబెటిక్స్ సంఖ్య 55 కోట్ల‌కు చేరుకుంటుంద‌ని ప‌లువురు మ‌ధుమేహంతో మ‌ర‌ణించే ప్ర‌మాద‌ముంద‌ని అంత‌ర్జాతీయ మ‌ధుమేహ స‌మాఖ్య‌(ఐడిఎఫ్‌) హెచ్చ‌రించింది.
  • కేంద్ర‌మంత్రి విలాశ్ రావ్ దేశ్‌ముఖ్ కుమారుడు బాలివుడ్ న‌టుడు రిషి దేశ్‌ముఖ్‌ను పెళ్లాడ‌నున్న‌ టాలివుడ్ హీరోయిన్ జెనీలియా
_______________________________________________________________

అమెరికా అన‌గానే ఠ‌క్కున గుర్తొచ్చేది స్టాట్యూ ఆఫ్ లిబ‌ర్టీ. ప్ర‌పంచంలో మ‌రో రెండు స్టాట్యూ ఆఫ్ లిబ‌ర్టీలు పారిస్‌(ఫ్రాన్స్‌), ల‌గ్జెంబ‌ర్గ్‌(ఇంగ్లాండ్‌)ల్లో ఉన్నా అంద‌రి మ‌దిలో మెదిలేది న్యూయార్క్ న‌గ‌ర‌మే. లిబ‌ర్ట‌స్ అనే రోమ‌న్ దేవ‌త పేరిట‌నే లిబ‌ర్టీ అనే ప‌దం పుట్టింది. అమెరికా స్వేచ్ఛ‌, స్వాతంత్ర్యాల‌కు నిలువెత్తు నిద‌ర్శ‌న‌మే స్టాట్యూ ఆఫ్ లిబ‌ర్టీ. అమెరికా 100వ పుట్టినరోజు కానుక‌గా ఫ్రెంచ్ ప్ర‌జ‌లిచ్చిన కానుకిది. 1886 అక్టోబ‌ర్ 28న‌ అమెరికా అధ్య‌క్షుడు గ్రోవ‌ర్ క్లెవ్‌లాండ్ ఈ నేష‌న‌ల్ మాన్యుమెంట్‌ను జాతికి అంకితం చేశారు. 
భూత‌ల స్వ‌ర్గంగా భాసిల్లుతున్న అమెరికాకే మ‌కుటాయ‌మానం ఈ స్టాట్యూ ఆఫ్ లిబ‌ర్టీ. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌ర్యాట‌కుల్నిఅమితంగా ఆక‌ర్షించే ప‌ర్యాట‌క క్షేత్రం ఈ విగ్ర‌హం కొలువుదీరిన నేష‌న‌ల్ పార్క్‌. నార్వేలోని విస్న‌స్ గ‌నుల్లో ఉత్ప‌త్తి అయిన రాగితో దీన్ని రూపొందించారు. విగ్ర‌హ రూప‌శిల్పి ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రెడ‌రిక్ అగ‌స్టే బార్ట్‌హోల్డి.
తీర్చిదిద్దింది ఎడ్వ‌ర్డ్ రెనే కాగా ఈఫిల్ ట‌వ‌ర్ సృష్టిక‌ర్త అలెగ్జాండ‌ర్ గుస్ట‌నోవ్ త‌న వంతు స‌హ‌కారాన్ని అందించారు.
1776 జులై 4 అమెరికా రివ‌ల్యూష‌న్‌కు ప్ర‌తీక‌గా స్టాట్యూ ఆఫ్ లిబ‌ర్టీని ప‌రిగ‌ణిస్తారు. ఈ డేట్‌ను విగ్ర‌హంపై 23 అడుగుల మేర 2 అడుగుల మందంతో రోమ‌న్‌లిపిలో చెక్కారు. విగ్ర‌హానికి వైట్ పెయింట్‌ను లోప‌ల‌,వెలుప‌ల వేయ‌డంతో శాంతికి ప్ర‌తీక‌గా ద‌వ‌ళ వ‌ర్ణంతో శోభిల్లుతోంది. 151 అడుగుల ఈ విగ్ర‌హాన్ని ఫ్రాన్స్ సొంత ఖ‌ర్చుతో త‌యారు చేసింది. పెడ‌స్ట‌ల్‌ను అమెరికా ప్ర‌భుత్వం నిర్మించ‌గా పౌరులిచ్చిన విరాళాల‌తో బేస్‌మెంట్ త‌ద్వారా ఈ ప్రాజెక్టు పూర్త‌యింది. 22 అంత‌స్తులు గ‌ల ఈ విగ్ర‌హ స‌ముదాయంలో మొత్తం 354 వంపులు తిరిగిన మెట‌ల్ మెట్ల వ‌రుస ద్వారా స్టాట్యూ ఆఫ్ లిబ‌ర్టీ శిఖ‌ర భాగానికి చేరుకోవ‌చ్చు. ఇందులో192 మెట్ల‌ను ఎక్కే స‌రికే సంద‌ర్శ‌కుల‌కు ఇల్లిస్ ఐలాండ్ అందాలు క‌నువిందు చేస్తాయి. న్యూయార్క్‌ హార్బ‌ర్ సొబ‌గులు మైమర‌పిస్తాయి. బేస్‌మెంట్ నుంచి విగ్ర‌హం కుడి చేతిలోని కాగ‌డా వ‌ర‌కు మొత్తం ఎత్తు 305 అడుగులు. విగ్ర‌హం ఎత్త‌యితే 151 అడుగులు. విగ్ర‌హం క‌ళ్ల మ‌ధ్య దూరమే దాదాపు 3 అడుగులు. ముక్కు పొడ‌వు 4 అడుగులు కాగా, నోటి వెడ‌ల్పు 3 అడుగులు, న‌డుం వెడ‌ల్ప‌యితే ఏకంగా 35 అడుగులు. చూపుడు వేలు 8 అడుగుల పొడ‌వుంటుంది. రెండు చేతుల మ‌ధ్య దూర‌మ‌యితే 17 అడుగులు. విగ్ర‌హం బ‌రువ‌యితే 205 మెట్రిక్ ట‌న్నులు. కిరీటంపై గ‌ల ఏడు కోణాలు ప్ర‌పంచంలో గ‌ల ఏడు ఖండాలు, ఏడు స‌ముద్రాల‌కు చిహ్నాలుగా పేర్కొంటారు. కాగ‌డాపై బంగారు వ‌ర్ణ కాంతుల్ని 1986లోనే ఏర్పాటు చేశారు. అదే సంవ‌త్స‌రం విగ్ర‌హ స‌ముదాయం రెండో అంత‌స్తులో ఈ స్టాట్యూకు సంబంధించిన చ‌రిత్ర‌, వ‌స్తువుల‌ ఫొటోలు, వీడియోల‌తో ఎగ్జిబిష‌న్‌ను ఏర్పాటు చేశారు. పెడ‌స్టాల్ ద్వారా సంద‌ర్శ‌కులు కాగడా, కిరీటం వ‌ర‌కు వెళ్లేవారు. అయితే ట్విన్ ట‌వ‌ర్స్ విధ్వంసం త‌ర్వాత 2001 నుంచి కిరీటం పైకి సంద‌ర్శ‌కుల్ని అనుమ‌తించ‌డం లేదు. 1916 నుంచే కాగ‌డా పైకి వెళ్ల‌డాన్ని నిషేదించారు. 
నేష‌న‌ల్ పార్క్ స‌ర్వీస్ ఆధ్వ‌ర్యంలోని ఈ స్టాట్యూ ఆఫ్ లిబ‌ర్టీ ప్రాంగ‌ణంలోకి ఉద‌యం 9.30 నుంచి సాయంత్రం 5 వ‌ర‌కు సంద‌ర్శ‌కుల్ని అనుమ‌తిస్తారు. వేస‌విలో మ‌రికొంత స‌మ‌యం పొడిగిస్తుంటారు.
యావ‌త్ ప్ర‌పంచపు స్వేచ్ఛ‌,స్వాతంత్ర్యాల‌కు ప్ర‌తిబింబ‌మైన స్టాట్యూ ఆఫ్ లిబ‌ర్టీ సూర్య‌చంద్రాదులున్నంత‌ వ‌ర‌కు తిరుగులేని చైత‌న్య దీపికే.

Popular Posts

Wisdomrays