22 Nov 2011

3gorjes


చైనా ది డ్రాగ‌న్‌..దాదాపు 140 కోట్ల జ‌నాభా. ప్ర‌పంచంలో అధిక జ‌నాభా గ‌ల అగ్ర‌దేశం.22 ప్రావిన్సుల గ‌ల క‌మ్యూనిస్టు దేశం. ఏదైనా త‌ల‌పెడితే సాధించాల‌నే త‌ప‌న న‌ర‌న‌రాన్న జీర్ణించుకున్న జ‌నం. అగ్ర‌రాజ్యం స్థానం పొందాల‌ని ఉవ్విళ్లూరే పాల‌కులు..పాల‌న‌యినా ప్రాజెక్ట‌యినా క‌డ‌దాకా కంక‌ణ‌బ‌ద్ధులై కొన‌సాగిస్తారు. అందుకో ఉదాహ‌ర‌ణ త్రీగోర్జెస్ డ్యాం. యాంగ్జె న‌ది..ప్ర‌తి ప‌దేళ్ల‌కు ఓసారి భారీ వ‌ర‌ద‌ల‌తో త‌న త‌డ‌ఖా చూపిస్తోంటోంది. 1954లో అయితే ఏకంగా 33 వేల మందిని త‌న‌లో క‌లిపేసుకుంది. 1998లో సైతం మ‌రోసారి బిలియ‌న్ డాల‌ర్ల ఆస్తి న‌ష్టాన్ని దేశ ప్ర‌జ‌ల‌కు మిగిల్చింది. ఆ వ‌ర‌ద‌ల‌కు ముగింపు ప‌ల‌కాల‌నే ప్ర‌థాన ఉద్దేశంతో త్రీగోర్జెస్ డ్యాంకు అక్క‌డ ప్రభుత్వం న‌డుం బిగించింది. ఈ డ్యాం ద్వారా ఉత్ప‌త్త‌య్యే హైడ్రో ఎల‌క్ట్రిక్ ప‌వ‌ర్ ఎంతంటే 22,500 మెగావాట్లు. ఓ వైపు వ‌ర‌ద‌ల న‌ష్టాన్ని నివారించ‌డ‌మే కాక దేశానికి అవ‌స‌ర‌మైన విద్యుత్‌ను చౌక‌గా త‌యారు చేయ‌డ‌మే ఈ త్రీగోర్జెస్ డ్యాం లక్ష్యం. అదే ఆ దేశానికి ప్ర‌పంచంలోనే అతి పెద్ద హైడ్రో ప్రాజెక్టు అమ‌ర‌డానికి కార‌ణ‌మైంది. త‌ద్వారా వివిధ కాల్వ‌ల ద్వారా మిగులు జ‌లాల్ని వ్య‌వ‌సాయానికి వినియోగించ‌డాన్ని ఆ దేశ పాల‌కులు చేప‌ట్టారు. దాదాపు మూడు కోట్ల మంది నిర్వాసితుల్ని 2008 నాటికే ఇత‌ర ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌కు త‌ర‌లించి ఆవాసం క‌ల్పించారు. ఈ భారీ ప్రాజెక్టు వ‌ల్ల భూకంపాలు, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డ‌మ‌నే ప్ర‌మాదం ఉన్నా క‌ల్గే ప్ర‌యోజ‌న‌మే మిన్న‌గా భావించి 1994లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును 2008 అక్టోబ‌ర్ 30 నాటికి పూర్తి స్థాయిలో నిర్మించి ప్రారంభించారు. ఇందుకు వాళ్లు వ్య‌యం చేసిన మొత్తం అక్ష‌రాల 26 బిలియ‌న్ అమెరికా డాల‌ర్లు. ఈ ప్రాజెక్టు ఊహ 1919 నాటిది. 1932లో మ‌రోసారి మ‌దిలో మెద‌ల‌గా పాల‌కులు 1934లో ప్రాథ‌మిక అంచానా ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టారు.
1944లో అమెరికాకు చెందిన బ్యూరో ఆఫ్ రిక్ల‌మేష‌న్ చీఫ్ డిజైన్ ఇంజినీర్ జాన్ ఎల్‌.సేవెజ్ ఆధ్వ‌ర్యంలో స‌ర్వే జ‌రిగింది. 54 మంది చైనా ఇంజినీర్ల బృందం ఈ ప్రాజెక్టు కోసం శిక్ష‌ణ‌కు అమెరికా వెళ్లారు.అయితే చైనా సివిల్ వార్ వ‌ల్ల 1947లో ఈ ప్రాజెక్టుకు ఆటంకం ఏర్ప‌డింది. 1949లో క‌మ్యూనిస్ట్‌ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక మావో జెడాంగ్ కూడా త్రీగోర్జెస్ డ్యాంకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అయితే ముందు మాత్రం గెజ్హాబా డ్యాంను ప్రారంభించారు. త‌ర్వాత గ్రేట్ లీప్‌ ఫార్వార్డ్‌, సాంస్కృతిక విప్ల‌వం, యాంగ్జె వ‌ర‌ద‌ల వ‌ల్ల 1956లో డ్యాం ప‌నులు అట‌కెక్కాయి. ఈ డ్యాం నిర్మాణాన్ని మావోజెడాంగ్ ఎంత‌గా ప్రేమించారంటే 1958లో దీనిపై ఆయ‌న ఏకంగా `స్విమింగ్‌` పేరిట ఓ ప‌ద్యాన్నే రాసేశారు. ఎట్ట‌కేల‌కు 1992లో నేష‌న‌ల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆమోదంతో మ‌ళ్లీ త్రీగోర్జెస్ ప్రాజెక్టు ప‌ట్టాల‌కెక్కింది.క‌న్‌స్ట్ర‌క్ష‌న్ 1994 డిసెంబ‌ర్ 14న మొద‌ల‌యింది. అక్క‌డ నుంచి ఒక్కో ద‌శ శ‌ర‌వేగంగా పూర్త‌వుతూ త్వ‌ర‌లోనే అందుబాటులోకి వ‌చ్చింది. ఈ డ్యాంను చూడ్డానికి మావో జెడాంగ్ నోచుకోక‌పోవ‌డ‌మే చైనీయుల‌కు బాధ‌ను క‌ల్గించే విష‌యం.
త్రీగోర్జెస్-త్రీబెనిఫిట్స్:వ‌ర‌ద‌ల నివార‌ణ, చౌక‌గా విద్యుదుత్పాద‌న, వ్య‌వ‌సాయ అవ‌స‌రాల‌కు స‌మృద్ధిగా జ‌లాలు. ఈ మూడింటిని సాధించేందుకు చైనా క‌మ్యూనిస్టులు దేశ‌, విదేశాల్లో ఎదురైన వ్య‌తిరేక‌త‌కు ఎదురునిలిచి ప్రాజెక్టును పూర్తి చేశారు. ప్ర‌పంచంలో భారీ డ్యాంగా పేరొందిన త్రీగోర్జెస్ ఎత్తు 181 మీట‌ర్లు కాగా పొడ‌వు 2,335 మీట‌ర్లు. ఏటా విద్యుదుత్ప‌త్తి 80 టిడ‌బ్ల్యూహెచ్. ఈ ప్రాజెక్టుకే మ‌రో హైలైట్ షిప్‌లిఫ్ట్‌. ఈ ప‌నులు 2012 నాటికి మొత్తంగా పూర్తి కానున్నాయి. థ‌ర్మ‌ల్‌,విండ్‌,న్యూక్లియ‌ర్ త‌దిత‌ర ఏ ఇత‌ర విద్యుదుత్పాద‌న‌ల క‌న్నా హైడ్రో విద్యుదుత్పాద‌నే కారుచౌక‌. 66 దేశాల్లో 50% విద్యుత్ ఉత్ప‌త్తి హైడ్రో ప‌వ‌ర్ కావ‌డ‌మే అందుకో చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణ‌. అస‌లు ప్ర‌పంచంలోనే అన్ని దేశాల విద్యుదుత్పాద‌న‌లో హైడ్రో వాటా 20%. పైగా కాలుష్య ర‌హితం. త్రీగోర్జెస్ రాక‌తో చైనాలోని 31 మిలియ‌న్ ట‌న్నుల బొగ్గు ఆదా అయిన‌ట్లు నేష‌న‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ రిఫార్మ్స్ క‌మిష‌న్ పేర్కొంది. అంతేకాదు 100 మిలియ‌న్ ట‌న్నుల గ్రీన్‌హౌస్ వాయువుల్ని నివారించ‌గ‌లిగార‌ట. ఇదో చారిత్ర‌క సాంకేతిక‌ నైపుణ్యాల‌కు నిలువుట‌ద్దంగా చైనా పేర్కొంటోంది. ఇంత‌కీ త్రీగోర్జెస్ చైనాలో ఎక్క‌డుందంటే హుబె ప్రావిన్స్‌లో సాండేపింగ్,యిచాంగ్ ప‌ట్ట‌ణాల మ‌ధ్య‌న ఉంది. షాంఘై న‌గరానికి ఈ ప్రాజెక్టు 1000 మైళ్ల దూరం. తొలిసారిగా హైడ్రో ప‌వ‌ర్ వెలుగులీనింది మాత్రం 1878లో నార్తంబెర్లాండ్‌(ఇంగ్లాండ్‌)లోని క్రాగ్‌స‌యిడ్ హౌస్‌లోనే. 1882లో అమెరికాలోని ఫాక్స్ రివ‌ర్ నుంచి ఉత్ప‌త్తి చేసిన హైడ్రో ప‌వ‌ర్‌ను రెండు చిన్న‌త‌ర‌హా పేప‌ర్‌మిల్స్‌లో వినియోగించారు.
హైడ్రో ప‌వ‌ర్ ఉత్ప‌త్తిలో టాప్ టెన్ దేశాలు
త‌జికిస్థాన్-5,27,700 (మెగావాట్లు); 
కెన‌డా-3,41,312(మెగావాట్లు); 
అమెరికా-3,19,484 (మెగావాట్లు); 
బ్రెజిల్-2,85,603 (మెగావాట్లు); 
చైనా-2,04,300 (మెగావాట్లు);   
ర‌ష్యా-1,60,500 (మెగావాట్లు); 
నార్వే-1,21,824(మెగావాట్లు); 
జ‌పాన్-84,500 (మెగావాట్లు); 
ఇండియా-82,237 (మెగావాట్లు); 
ఫ్రాన్స్‌-77,500 (మెగావాట్లు).
వ‌ర‌ల్డ్ టాప్-10 హైడ్రో ప‌వ‌ర్ ప్రాజెక్ట్స్‌
*త్రీగోర్జెస్ డ్యాం: 2008-22.5(జి.డ‌బ్ల్యూ)-చైనా(యాంగ్జె న‌ది)
*ఇట‌యిపు హైడ్రో ఎల‌క్ట్రిసిటీ ప‌వ‌ర్ ప్లాంట్‌:2003-14,000(ఎం.డ‌బ్ల్యూ)-బ్రెజిల్‌
*గురి డ్యాం: 10.2(జి.డ‌బ్ల్యూ)-వెనిజులా(క‌రోని న‌ది)
*టుకురాయ్ డ్యాం:1975-8.5(జి.డ‌బ్ల్యూ)-టుకురాయ్ కౌంటీ, బ్రెజిల్‌ 
*గ్రాండ్ కౌలీ హైడ్రో ఎల‌క్ట్రిక్ ప‌వ‌ర్ ప్లాంట్‌-7000(ఎం.డ‌బ్ల్యూ)-అమెరికా
*స‌యానొ-షుష్నెస్క్యా-1978-6,400(ఎం.డ‌బ్ల్యూ)-ర‌ష్యా
*క్ర‌స్నోయార్స్క్ హైడ్రో ఎల‌క్ట్రిక్ ప‌వ‌ర్ ప్లాంట్‌-1972-6000(ఎం.డ‌బ్ల్యూ)-ర‌ష్యా(మెనిసె న‌ది)
*రాబ‌ర్ట్ బౌర్సా హైడ్రో ఎల‌క్ట్రిక్ ప‌వ‌ర్ ప్లాంట్‌-5,600(ఎం.డ‌బ్ల్యూ)-కెన‌డా(లిగ్రాండె)
*చ‌ర్చిల్ ఫాల్స్ జ‌న‌రేటింగ్ స్టేష‌న్‌-5,400(ఎం.డ‌బ్ల్యూ)-కెన‌డా
*లాంగ్టాన్ డ్యాం-2(జి.డ‌బ్ల్యూ)-చైనా(హొమ్ష్యా న‌ది)
______________________________________________________________
వెయిటింగ్ రికార్డ్స్:ముంబాయి..వెస్టిండీస్‌-భార‌త్ సీరీస్‌లో చివ‌రిద‌యిన మూడో టెస్ట్‌..ఇందులో ఏముంది కొత్త విష‌యం..ఎందుకంటే ఇప్ప‌టికే సీరీస్‌ను ఇండియా గెలిచేసింది. మ‌రి మ‌జా ఏంటంటే మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ నూరో
శ‌త‌కం కోస‌మే ప్ర‌పంచ క్రికెట్ అభిమానుల ఆత్రం.అదీ స‌చిన్ త‌న సొంత గ్రౌండ్‌లో సాధిస్తాడ‌నే స‌గ‌టు అభిమానులంతా వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు.ఇంతేనా అంటే ఇంకా ఉంది..గ్రేట్‌వాల్ ద్ర‌విడ్ టెస్టుల్లో 13వేల ప‌రుగుల రికార్డు చెంత‌, డాషింగ్ రేస‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ 8 వేల ప‌రుగుల ముంగిట ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవ‌రిప్పుడు త‌మ‌ రికార్డును లిఖిస్తారో రేప‌టి వ‌ర‌కు వేచి చూడాలి.
  ‌

No comments:

Post a Comment

Popular Posts

Wisdomrays