అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం కొలిమిలా మారుతుంది..ఎగసే పొగలు, రగిలే భగభగలతో వెలువడే లావా జనం గుండెల్లో ప్రమాద ఘంటికల్ని మోగిస్తుంది. నింగి,నేల అగ్నిగోళమే..ఈ దృశ్యం అగ్ని పర్వతాలు ఆకస్మికంగా బద్ధలైన వేళ యావత్ మానవాళి నోరెళ్ల బెట్టాల్సి వస్తోంది. భూమ్మీద 500 వరకు అగ్నిపర్వతాలున్నాయి. వాటిలో జపాన్‌లో 100 ఉంటే అమెరికాలో 50 వరకు ఉన్నాయి. ప్రపంచంలో దాదాపు 51 కోట్ల మంది ఈ అగ్నిపర్వతాల నీడలోనే కాలం గడుపుతున్నారంటేనే ఆశ్చర్యం కల్గించే విషయం. 1900-..86 మధ్య సగటున 845 మంది అగ్నిపర్వతాల ప్రమాదాల్లో అశువులు బాశారు. ఇప్పటికీ మనది ప్రకృతితో నిరంతర సమరమే. భూకంపాలు, సునామీలు, హరికేన్లతోపాటు మనల్ని హడలెత్తించేవి ఈ అగ్నిపర్వతాలు. అయితే మిగిలిన ప్రకృతి వైపరీత్యాలతో పోలిస్తే అగ్నిపర్వతాలు బద్దలవ్వడం వల్ల అంత వినాశం జరగదు కానీ అవీ ముప్పుతెచ్చేవే.
ఇటలీలోని ఎయివియన్ దీవులకు వొల్కనో ఐలాండ్‌గా పేరు. రోమన్లు అగ్నిదేవుణ్ని వొల్కనో అంటారు. ఆ పేరు అగ్నిపర్వతాలకు వొల్రనోగా స్థిరపడింది.
ప్రపంచంలో పేరు మోసిన అగ్నిపర్వతాలు
^*ఔబిన్స్కీ, కర్క్యాస్కీ, కమ్చాత్కా(రష్యా) * నెవడాడె కలిమ, జలస్కా కలిమ(మెక్సికో) * మౌంట్ఎత్నా, సిసిలీ(ఇటలీ) * గలెరస్, నర్రియా(కొలంబియా) * మౌన్లో హరాయి(అమెరికా) * మౌంట్మెరపి, సెంట్రల్ జావా(ఇండోనేసియా) * మౌంట్ నియరాగాంగో(కాంగో) *మౌంట్ లైనర్, వాషింగ్టన్(అమెరికా) * సకార్జిమ, కగోషియా ప్రిఫిక్చర్(జపాన్) * సాంటా, మారియా, సాంటిగ్విట్ (గ్వాటిమాల) * సాంతోరిని,సైక్లాడ్స్(గ్రీస్) * టోల్ వొల్కనో, లుజొన్(ఫిలిప్పీన్స్) * టైడ్, కానరీ ఐలాండ్స్ (స్పెయిన్) *ఉలివాన్, న్యూట్రిడాన్, ప్రఫిక్చర్ (జపాన్) * వెసువియన్, నెపుల్స్ (ఇటలీ).
---- 9000 ఏళ్ల తర్వాత దక్షిణ చీలెలోగల చైతన్ అగ్నిపర్వతం 2008లో విస్ఫోటం చెంది వేల మైళ్ల మేర లావా, బూడిదలో వరదలెత్తింది. తరచూ చిన్న, పెద్ద ఘటనలతో ఇప్పటికీ ఉరుముతోంది.ప్రతిసారీ చోటుచేసుకొనే ఈ ప్రమాదాల్లో కనీసం ఒకరు మృత్యుదరి చేరుతున్నారు.-
ఇటలీలోని మౌంట్ వెసువియన్ ఎ.డి.79లో ఘోరంగా బద్ధలై పాంపె,హెర్కులెనిమ్ నగరాల్ని భూగర్భంలో కలిపేసింది. వేల సంవత్సరాల తర్వాత ప్రస్తుతం ఈ పర్వతం సమీపంలో జనం నివసిస్తున్నారు. అయితే ప్రమాదం పొంచే ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
నార్త్ అమెరికాలోని మెక్సికో నగరానికి 40 మైళ్ల దూరంలోని పాపౌకెట్పాటల్ అగ్నిప్రమాదం కూడా ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దిగా శాస్త్రవేత్తల భావన. ఈ పర్వతం 1920-.. -22 మధ్య కాలంలోపలుమార్లు బద్ధలయింది. ఈ పర్వత సాణువుల నుంచి అప్పుడప్పుడు పొగలు, బూడిద వెలువడుతూనే ఉంటాయి.సువియన్ ఎ.డి.79లో ఘోరంగా బద్ధలై పాంపె,హెర్కులెనిమ్ నగరాల్ని భూగర్భంలో కలిపేసింది. వేల సంవత్సరాల తర్వాత ప్రస్తుతం ఈ పర్వతం సమీపంలో జనం నివసిస్తున్నారు. అయితే ప్రమాదం పొంచే ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
-ఇండోనేసియాలోని మెరిపి కూడా అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వతమే. ఇక్కడ నుంచి వాయువులు, బూడిద వెలువడుతూనే ఉన్నాయి. ఈ అగ్నిపర్వతం 1930లో 1300 మందిని 1944లో60 మందిని బలిగొంది.
-ఆఫ్రికాలోని నియరాగాంగో అగ్నిపర్వతం బద్దలయినప్పుడు వెలువడిన లావా వరదనే తలపించింది.2002లో ఈ పర్వతం నుంచి లావా గంటకు 60 మీటర్ల వేగంతో ఆకస్మికంగా గోమా పట్టణాన్ని కాల్చేసింది. ఈ పట్టణంలో ప్రస్తుతం 5 లక్షల మంది నివసిస్తున్నారు.
-కొలంబియాలోని నెవడా డెల్మాజ్ అగ్నిపర్వతం 1985 నవంబర్ 13న చిన్చినాలోని 1,927 మందినిబలిగొంది. ఆ తర్వాత అర్మెరోలోనూ 2,300 మందిని కాలగర్భంలో కలిపేసింది. ఇది కొలంబియా చరిత్రలోనే అత్యంత ఘోరప్రమాదం. ఈ తరహా ప్రమాదాల్ని ముందుగా పసిగడితే పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరగకుండా నిలువరించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అయితే ప్రకృతి విలయతాండవాన్ని ముందుగా కనుగొనడం ఇప్పటికైనా సాధ్యమా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
-జపాన్‌లో ఏటా ఏదో ఒకచోట స్వల్ప భారీ అగ్నిపర్వత విస్ఫోటాలు సంభవిస్తూనే ఉంటాయి. 1707లోఫుజి పర్వతం ఈ విధంగానే ప్రతాపాన్ని చూపింది. మళ్లీ 300 ఏళ్లకు 2000..-01 మధ్య మరోసారిఈ పర్వతం ప్రమాద ఘంటికల్ని మోగించింది. ఈ పర్వతం వల్ల టోక్యో ప్రమాదపుటంచున ఉంది.కారణం ఈ పర్వతానికి టోక్యో నగరానికి మధ్య ఉన్న దూరం 70 మైళ్లు మాత్రమే. టోక్యో సిటీ 70 మైళ్లపరిధిలోనే సుమారు 3 కోట్ల మంది నివసిస్తున్నారు.
- వాషింగ్టన్ పరిధిలోని 14,410 అడుగుల ఎత్తున గల మౌంట్ లైనర్ పర్వతం నీడలోనే 30 లక్షల మంది
నివసిస్తున్నారు. స్వల్ప ప్రకంపనలు సంభవించినా ఈ పర్వతం విపరీతంగా వాయువులు, బూడిదవెదజల్లుతూ భయపెడుతోంది.
నిద్రాణంగా ఉండే జ్వాలానలం
తాజాగా ఐలాండ్‌లోని ఇయిజాఫ్జ లాజకల్ పరిస్థితి ఎప్పుడైనా బద్ధలయ్యేట్టుగానే ఉంది. మెరపి 2009లో విస్ఫోటం చెందడంతో ఒక క్యూబిక్ కిలోమీటర్ మాగ్మ, 20 నుంచి 50 కిలోమీటర్ల మేర బూడిదను విరజిమ్మింది.ప్రతి వెయ్యి సంవత్సరాలకు ఇదేవిధంగా ప్రతాపాన్ని చూపుతోంది. 1930లో 1400 మందిని1994లో 43 మందిని బలిగొంది.
అసలు ఈ అగ్నిపర్వతాలు ఎలా ఏర్పడతాయి ఎందుకు బద్ధలై వినాశకారులౌతున్నాయంటే..
భూమి ప్రధానంగా క్రిస్ట్, మోల్టన్, కోర్ అనే మూడు పొరలుగా ఉంటుంది. క్రిస్ట్ పొర శిలారూపంలో 60కిలోమీటర్లు మేర అత్యంత మందంగా ఉంటుంది. మందమెంతంటే ఆల్ఫ్స్, హిమాలయాల కంటే ఎక్కువే. కోర్ అయితే కేంద్రభాగం గట్టిగా ఉంటుంది. చుట్టూ పైభాగం మాత్రం ద్రవరూపంలో ఉండే పొర.భూగర్భంలోఉష్ణోగ్రత అపరిమితం. కోర్లో 5000 డిగ్రీల సెల్సియస్ ఉండొచ్చని అంచనా. మనం ఆ మండే భూమి పై భాగానే జీవిస్తున్నాం. అందుకే భూపలకల అంచులపైనే అనేక అగ్నిపర్వతాలు ఏర్పడ్డాయి. భూమిలో పలకల కదలికల వల్ల రాపిడి, ఏర్పడిన ఒత్తిడి తత్ఫలితంగా తలెత్తే అపరిమిత ఉష్ణోగ్రతల వల్లే అగ్నిపర్వతాలు బద్ధలై భూఉపరితలానికి ఎగజిమ్ముతాయి.శిలలు, ఖనిజాలు స్తబ్దుగా ఉన్న వాయువులతో కూడినదే మాగ్మ అదే భూమిపైకొస్తే లావాగా రూపాంతరం చెందుతుంది. ఈ సిలికా మిశ్రమంలో 50-63 శాతం మెగ్నీషియం, ఐరన్ ఉంటుంది. భూమి పైకి చేరి ఘనీభవించిన లావానే లావారాక్గా పిలుస్తారు. ఈ అగ్నిపర్వతాల్ని సబ్డిక్షన్, రిఫ్ట్ వొల్కనోస్, హాట్స్పాట్లనే మూడు రకాలుగా శాస్త్రవేత్తలు విభజించారు. మళ్లీ వీటిలో యాసిడ్ లావా వొల్కనోస్, షీల్డ్ వొల్కనోస్, కంపోజిట్ కోర్ సహా పలు రకాలున్నాయంటున్నారు.
____________________________________________________________________________
*కపిల్‌దేవ్, సచిన్‌ల మాదిరిగానే గౌరవ లెఫ్ట్‌నెంట్ కల్నల్‌గా ధోనీ బాధ్యతలు స్వీకరించాడు. కపిల్ రిటైరయ్యాక బాధ్యతలు తీసుకోగా సచిన్ ఆడుతుండగానే ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అయ్యాడు. ఒలింపిక్స్ లో భారత్‌కు స్వర్ణానందించిన స్టార్ షూటర్ అభినవ్ బింద్రా కూడా ధోనితోపాటు ఈ హోదాను పొందాడు.
*ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో జరుగుతున్న జి-20 సమావేశాలకు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరౌతున్నారు. ఈ సమావేశాలు మూడు రోజుల పాటు జరుగనున్నాయి. అమెరికా, ఐరోపాల్లో ఆర్థిక మందగమనంపైనే ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించనున్నారు.
No comments:
Post a Comment