26 Nov 2011

dead sea

http://royalloyal007.blogspot.in/2011/10/legend-lenin.html
చేప‌లు నీటిలో జీవిస్తాయి. ప‌క్షులు గాల్లో ఎగురుతాయి. జంతువులు భూమిపైన మ‌న‌గ‌ల్గుతాయి. నీటిలోనూ, భూమిపైన జీవించేగ‌ల్గే ఉభ‌య‌చ‌రాలు తాబేళ్ల త‌ర‌హా జీవులూ ఉన్నాయి. మ‌నుషులు నీటిపైన‌, గాల్లోనూ ప్ర‌యాణించ‌గ‌ల‌రు. వివిధ సాధ‌నాలు,వాహ‌నాలు అందుకు అవ‌స‌రం. ఈత నేర్చి సప్త స‌ముద్రాల్లో రికార్డులు సృష్టించిన వారూ ఉన్నారు. యోగా సాధ‌న‌ను ఈత‌కు జ‌త చేసి నీటిలో తేలియాడే వ్య‌క్తుల్ని చూసిన సంద‌ర్భంలో మ‌నం ఆశ్చ‌ర్యానికి గుర‌వుతుంటాం. మ‌రి ఏ ఈత‌,యోగా,ఇత‌ర ప‌రిక‌రాలు, వాహ‌నాలు ఏవీ లేకుండా నీట్లో తేలుతూ పేప‌ర్ చ‌దివ‌డం, క‌బుర్లాడుతూ కేరింత‌లు కొట్ట‌డం య‌మా మ‌జాయే క‌దూ! ఆ య‌థార్థ‌మే ఇది. అదే..ఈ డెడ్ సీ. ఇజ్రాయిల్, జోర్డాన్ దేశాల మ‌ధ్య నెల‌కొందీ స‌ముద్రం.
డెడ్ సీ : భూమండ‌లం మొత్తం మీద అతి త‌క్కువ ప‌రిధిలో విస్త‌రించిన స‌ముద్ర‌మిది. కేవ‌లం 1300 అడుగుల(400 మీట‌ర్లు) స‌ముద్ర‌మ‌ట్టంతో 377 మీట‌ర్ల లోతు క‌ల్గినదిది. నిజానికి ఈ స‌ముద్రం ఓ స‌ర‌స్సు. జోర్డాన్ న‌దీ జ‌లాలు, జోర్డాన్, ఇజ్రాయిల్ ప‌ర్వ‌త‌శ్రేణుల నుంచి జాలువారిన వ‌ర్ష‌పు నీరే ఈ స‌ముద్ర‌పు జ‌ల‌వ‌న‌రు.దీనికి ప్రాచీన నామం అమోర స‌ర‌స్సు. ఆధునిక కాలంలో లిసాన్ స‌ర‌స్సుగా పేరు. ఈ డెడ్ సీలో 30% ఉప్పు నీరే. ప్ర‌పంచంలో ఇత‌ర స‌ముద్రాల‌తో పోలిస్తే దీంట్లోని ఉప్పుశాతం దాదాపు 9% ఎక్కువ. అందుకే ఈ జ‌లాల్లో ఏజ‌లా చ‌రాలు జీవించ‌లేవు. స‌ముద్ర‌గ‌ర్భంలో సైతం ఏ మొక్క‌లు బ‌త‌క‌వు. అందుకే దీనికి డెడ్‌సీ (మృత స‌ముద్రం)గా పేరు. షేల్‌,క్లే,శాండ్ స్టోన్‌,రాక్‌సాల్ట్‌,జిప్సంల స‌మ్మిళ‌త‌మైన జ‌లాల స‌మాహార‌మీ స‌ముద్రం. అందుకే ఏ జీవి ఇందులో బ‌త‌క‌లేదు. కానీ మ‌నుషుల‌కు మాత్రం ఈ స‌ముద్రం పెద్ద ఆహ్లాదం. ఈ స‌ముద్ర‌పు మ‌ట్టి, గాలి కూడా మ‌న‌కు ఆరోగ్య‌దాయ‌క‌మే.ఈ స‌ముద్ర‌పు గాలిలో ఆక్సిజ‌న్ శాతం మెండు.ఇక్క‌డ మ‌ట్టి కొన్ని రోగాల‌కు చ‌క్క‌టి మందు.అదే ఈ స‌ముద్ర‌తీరానికో క‌ళ తెచ్చింది. ఏటా జోర్డాన్‌, ఇజ్రాయిల్ దేశాల్లో గ‌ల ఈ స‌ముద్ర తీరం పెద్ద సంఖ్య‌లోసంద‌ర్శ‌కుల్ని ఆక‌ర్షిస్తోంది అనేక రిసార్టులు, స్పాల‌కు వేదిక‌గా నిలుస్తోంది. ఈ స‌ముద్రంలో పైకి క‌నిపిస్తోంది జ‌ల‌మే అయినా అదో ర‌సాయ‌న స‌మ్మేళ‌నం. ఈ ముడి ర‌సాయ‌నాల్ని, మ‌ట్టిని విదేశాలు దిగుమ‌తి చేసుకుంటుంటాయి. అగ్రిక‌ల్చ‌ర్,మెడిసిన్స్,కాస్మోటిక్స్ త‌యారీలో ఈ జ‌లాల్ని ఉప‌యోగిస్తుంటారు.ఇక్క‌డ మ‌ట్టిపూత‌తో సోరియాసిస్;ఆర్థ‌రైటిస్‌,రినోసినుసిల‌స్ త‌దిత‌ర బాధ‌ల నివార‌ణ‌కు బాగా ఉప‌క‌రిస్తుంది. ముదురు నీలి రంగులో ఉండే ఈ డెడ్‌సీ 1980 త‌ర్వాత నుంచి ఎర్ర‌బారింది. ల‌వ‌ణ సాంద్ర‌త అత్య‌ధికంగా ఉండ‌డం వ‌ల్ల సాల్ట్‌సీగానూ పేరొందింది. జోర్డాన్‌,ఇజ్రాయిల్ దేశాల తీరాల్లో స్పాలు కోకొల్ల‌లు. ఇవి పెద్ద సంఖ్య‌లో సంద‌ర్శ‌కుల్ని, రోగ బాధితుల్ని అల‌రిస్తూ మూడు పువ్వులు, ఆరు కాయ‌లుగా వ‌ర్ధిల్లుతున్నాయి. 
జీస‌స్ న‌డిచిన స‌ముద్రం: ఏసు సొడం,గొమార్హ్ ప‌ట్ట‌ణాల గుండా ప‌య‌నిస్తూ ఒక సంద‌ర్భంలో గెలిలీ స‌ముద్రంపై న‌డిచిన‌ట్లు క్రైస్త‌వులు విశ్వ‌సిస్తారు. ఈ ప్రాంత సంద‌ర్శ‌న‌కు అరిస్టాటిల్‌,కింగ్ సొల్మ‌న్‌, షెబారాణి,క్లియోపాత్ర త‌దిత‌రులు వ‌చ్చిన‌ట్లు ప‌లు క‌థ‌నాలున్నాయి. అయితే ఈ జ‌లాల్లోకి నేరుగా దిగి ఈత కొడితే ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌నే హెచ్చ‌రిక‌లు చేస్తుంటారు. ఇక్క‌డ ఓ సినిమా షూటింగ్‌కు వ‌చ్చిన సమ‌యంలో అప్ప‌టి హాలివుడ్ న‌టుడు సిల్వ‌ర్‌స్టెర్ స్టాలెన్ ఇందులో జ‌ల‌కాలాడిన కొన్నేళ్ల‌కు ఆసుప‌త్రి పాల‌య్యాడ‌నే ప‌లు క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.
ఓల‌లాడించే జ‌లాలు: ఊహాల్లో విహ‌రించిన‌ట్టే ఈ డెడ్‌సీకి సంబంధించి కొన్ని తీరాల్లో హాయిగా అలా అలా తేలిపోవ‌చ్చు.ప‌డుకొని పేప‌ర్ చ‌దివేయొచ్చు.కొంత దూరం వ‌ర‌కు ఎటువంటి ప్ర‌త్యేక సాధ‌నాల్లేకుండా న‌డిచిపోవ‌చ్చ‌ట‌.అత్య‌ధిక ల‌వ‌ణాల సాంద్ర‌త వ‌ల్ల ఏర్ప‌డిన ఉప్పు తెట్టుల‌పై ఇది సాధ్య‌మేన‌ట‌.అంతేకాకుండా ఈ నీటిపై మ‌నిషి ఓ కార్క్‌(బెండు) మాదిరిగా  తేలిపోతాడ‌ని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొంటున్నారు.
.................................................................
రంగుస‌ముద్రాలు
^ రెడ్ సీ: ఈజిప్టు,సుడాన్‌,ఎర్త్రియా,సౌదీ అరేబియా,యెమ‌న్‌
^ యెల్లో సీ: చైనా,ఉత్త‌ర‌కొరియా,ద‌క్షిణ‌కొరియా
^ బ్లాక్ సీ: ట‌ర్కీ,బ‌ల్గేరియా,రొమేనియా,ఉక్రేయిన్‌,ర‌ష్యా,జార్జియా
^ వైట్ సీ: ర‌ష్యా

25 Nov 2011

killer plants


మ‌నుషుల్ని తినే మొక్క‌లు ఉన్నాయా? ఈ విష‌య‌మై ప్ర‌పంచ ప్రసిద్ధ జీవ‌శాస్త్ర‌వేత్త చార్లెస్ డార్విన్ 15ఏళ్ల‌పాటు సుదీర్ఘంగా ప‌రిశోధ‌న‌లు సాగించారు. మొక్క‌లు ప‌గ‌టిపూట గాలిలోని కార్బ‌న్‌డ‌యాక్సైడ్‌ను స్వీక‌రించి ఆక్సిజ‌న్‌ను విడుద‌ల చేస్తాయి. అదే రాత్రి వేళ‌ల్లో అందుకు పూర్తి భిన్నంగా సృష్టిలోని ఇత‌ర జీవుల మాదిరిగానే ఆక్సిజ‌న్‌ను స్వీక‌రించి కార్బ‌న్‌డ‌యాక్సైడ్‌ను వ‌దులుతాయి. భూమిపొర‌ల్లోని నీటిని త‌మ వేర్ల ద్వారా గ్ర‌హించి బ‌తుకుతాయి. అయితే  మొక్క‌ల‌కు మిన‌ర‌ల్స్‌,న్యూట్రింట్స్ అవ‌స‌ర‌మే. కేవ‌లం మ‌ట్టిలో ల‌భించే వాటి ద్వారానే చాలా మొక్క‌లు జీవిస్తాయి. కొన్ని మొక్క‌లు రాక్ష‌స‌జాతి మొక్క‌లు. అవి మిన‌ర‌ల్స్‌,న్యూట్రింట్స్‌ను కీట‌కాలు,జంతువుల్ని భ‌క్షించ‌డం ద్వారా కూడా పొందుతాయ‌ని జీవ‌శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ఈ త‌ర‌హా మొక్క‌లు కీట‌కాలు, జంతువులు త‌మ ద‌రికి చేర‌గానే ఓ జిగురులాంటి విష‌పూరిత ర‌సాల‌ను విడుద‌ల చేసి వాటిని చంపేస్తాయి. ముఖ్యంగా ఈ ర‌సాలు కీట‌కాలు, జంతువుల ఊపిరితిత్తుల‌కు చేర‌గానే అవి చ‌నిపోయి ప‌డిపోతాయి. అప్పుడు అచ్చు ఓ జంతువు, మ‌రో జంతువును వేటాడి చంపి తిన్న‌ట్టుగానే ఇవీ ఆ మృత జీవాల నుంచి కావాల్సిన ఆహారాన్ని సంగ్ర‌హిస్తాయి.
 ఇంత‌కీ వీటి పేరు ఏమిటంటే కార్నివొర‌స్‌, మీట్ ఈటింగ్ ప్లాంట్స్‌. డార్విన్ వీటిని ఫ్లోరా ఇన్సెక్టివొన్స్‌గా పేర్కొన్నారు. ఆ త‌ర్వాత కాల‌పు శాస్త్ర‌వేత్త‌లు వీటి పేరును కార్నివోర్స్‌గా స్థిర‌ప‌రిచారు. అయితే వీటి వ‌ల్ల మ‌నుషుల‌కు ఎంత‌మాత్రం హాని లేద‌ట‌. ఈ రాక్ష‌స‌ మొక్క‌లు అమొర్‌ఫొఫ‌ల్స్ జాతికి చెందిన‌వి. వీటిలో ప్ర‌ధాన‌మైంది కార్ప్స్ ఫ్ల‌వ‌ర్‌.ఇది 9 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడ‌ల్పుతో దృఢంగా ఉండే సార్థ‌క‌నామ‌ధేయురాలు. ఈ త‌ర‌హా రాక్ష‌స‌మొక్క‌ల్లో జంతువుల‌కున్న‌ట్లే కోర‌లు, వాడైన గోళ్లులాగా  కాండాల్లో ప‌దునైన ముళ్లుంటాయి. ఏదైనా జీవి చిక్కిందంటే కొండ‌చిలువ చుట్టేసిన‌ట్లే ఇవీ త‌మ‌ గుబుర్ల‌లోకి లాగేసుకొని చంపేస్తాయి. ఇక కార్ప్స్ ఫ్ల‌వ‌ర్ విష‌యానికి వ‌స్తే ఇది రోజుకు 4 అంగుళాల చొప్పున ఒక‌ద‌శ వ‌ర‌కు పెరిగిపోతూంటుంది. ప్రపంచంలో వాస‌న వెద‌జ‌ల్లే మొక్క‌ల‌న్నింట్లోనో ఈ మొక్క నుంచి వెలువ‌డే వాస‌నే ఘాట‌యిన‌దిగా రికార్డు ఉంది. ఆ వాస‌న కూడా ఓ జీవి క‌ళేబ‌రం కుళ్లిపోతే వ‌చ్చే వాస‌న‌లాగే ఉంటుంది. ఈ మొక్క ఉనికిని ఆసియా దేశాల్లోనే క‌నుగొన్నారు. ఈ మొక్క ఇక్కడే పుష్పిస్తుంది. మ‌రే ఖండంలోని దేశాల్లో నాటినా అక్క‌డ వీటి మొగ్గ‌లు పుష్పించ‌వు. ప్ర‌స్తుతం వీటి జాడ అడ‌వుల్లోనూ కరవ‌యింది.1937లో అమెరికాలోని న్యూయ‌ర్క్ బొటానిక‌ల్ గార్డెన్‌లోనే శాస్త్ర‌వేత్త‌ల విశ్వ ప్ర‌య‌త్నాల వ‌ల్ల తొలిసారిగా పుష్పించింది. అదీ ఇప్ప‌టికి ఓ డ‌జ‌న్‌సార్లు మాత్ర‌మే పుష్పించింద‌ట‌.
రాక్ష‌స‌మొక్క‌లు:వీన‌స్ ఫ్లైట్రాప్స్‌,సండ్యూస్‌,పిచ‌ర్ ప్లాంట్స్‌,బ‌ట‌ర్‌వొర్డ్స్‌,బ్లాడ‌ర్ వొర్ట్స్ త‌దిత‌రాలున్నాయి.అయితే దాదాపు 40% మొక్క‌లు మాంసాహారులేన‌నే వాద‌నా ఉంది. ఫిలిప్పీన్స్‌లో పిచ‌ర్ ప్లాంట్‌ను ఇటీవ‌లే క‌నుగొన్నారు. ఈ మొక్క ఏకంగా ఎలుక‌లు,తొండ‌లు స‌హా కుందేళ్ల‌నే ఆరగించేస్తుంద‌ట‌. ప్ర‌స్తుతం ఈ మాంసాహార మొక్క‌ల్లో ఇదే అతి పెద్ద‌దిగా బ్రిటిష్ బ్రాడ్ కాస్ట‌ర్ డేవిడ్ ఎటెన్‌బ‌రో 2009లో పేర్కొన్నారు.
______________________________________________________________
* మావోయిస్టు అగ్ర‌నేత కిష‌న్‌జీ ప‌శ్చిమ‌బెంగాల్లో భ‌ద్ర‌తా ద‌ళాల‌తో జ‌రిగిన ఎదురుకాల్పుల్లో మ‌ర‌ణించారు.
* ఈజిప్టు ఇంకా అట్టుడుకుతోంది. కైరోలోని తెహ్రిన్‌స్క్వేర్ వ‌ద్ద  సైన్యం జ‌రిపిన కాల్పుల్లో 40 మంది ఆందోళ‌న‌కారులు అశువులు బాశారు.
* ద‌క్షిణియా కొరియా పార్లమెంట్‌లో డిప్యూటీ స్పీక‌ర్‌పై కిమ్‌సంగ్ అనే స‌భ్యుడు భాష్ప‌వాయుగోళాన్ని విసిరి క‌ల‌కలం సృష్టించాడు.
* ధ‌ర‌ల పెరుగుద‌ల‌,కుంభ‌కోణాల‌కు నిర‌స‌న‌గా కేంద్రమంత్రి శ‌ర‌ద్‌ప‌వార్‌పై హ‌రీంద‌ర్ సింగ్ అనే వ్య‌క్తి దాడి చేశాడు.


23 Nov 2011

sabari mala


‬గ్రహాలెన్ని?ఇ0కా లెక్క తేల్లేదు. అసలు అక్కడ ఏము0దో కూడా ఇ0కా ఎవరికీ తెలియదు. ఈ నేపథ్య0లో సూపర్ పవర్ ఉ0దా లేదా అన్నది అప్రస్తుతమే కదా! అ0దుకే ఈ స్పీడ్ యుగ0లోనూ ప్రప0చవ్యాప్త0గా నేటికీ కోట్లాది మ0ది తమతమ ఇష్ట దైవాలను భక్తిగా కొలుస్తున్నారు. ముఖ్య0గా భారత్ లో ఆ స0ఖ్య ఇ0కా ఎక్కువ. లౌకిక రాజ్యమైన భారత్ అనేక మతావల0భికులకు వేదిక. ఇక్కడ ముక్కోటి దేవతలను ఆరాధిస్తు0టారు. దేవాలయాలు బోలెడున్నాయి. అ0దులో కొన్ని అతి పురాతనమైనవి. వాటిలో శబరిమల అయ్యప్ప గుడి ఒకటి. 4,000 ఏళ్ల నాటిదిది. ఏటా రె0డు నెలలు మాత్రమే తెరుచుకొనే ఈ ఆలయానికి దాదాపు 4 కోట్ల మ0ది వచ్చి వెళ్తు0టారు. వీరిలో అయ్యప్ప మాలాధారులే ఎక్కువ. గుడి నవ0బర్ రె0డో వార0లో తెరుచుకోగా మ0డల దీక్షకు వచ్చే స్వాములు అయ్యప్పను దర్శి0చుకు వెళ్తు0టారు.మాలాధారులు 41 రోజుల దీక్ష చేపట్టి ఇరుముడిని ధరి0చి శబరి కొ0డకు వస్తారు. స్వాములు దీక్షాకాల0లో పరమనిష్టగా ఉ0టారు. కాళ్లకు చెప్పులు సైత0 ధరి0చక కాలినడకతోనే దట్టమైన అటవీ మార్గ0లోనే వీరు కొ0డెక్కుతారు. మకరజ్యోతి దర్శనానికి జనవరిలో ఇ0కా పెద్ద స0ఖ్యలో భక్తులు వస్తు0టారు.
కాంతిక్షేత్రం: శ‌బ‌రిమ‌ల‌కు మ‌దంగమ‌ల‌,పొటుల‌క అనే పేర్లూ ఉన్నాయి. మ‌దంగ‌స్వామి తిరుగాడిన ప్రాంత‌మైనందున `మ‌దంగ‌మ‌ల‌`అని పేరు వ‌చ్చింది.పొట్టు అంటే ప్రాచీన తమిళంలో కాంతి అని అర్థం.ఉల‌క అంటే ప్రాంత‌మ‌ని అర్థం ఉన్నందున పొటుల‌క అనే పేర్లూ ఉన్న‌ట్లు తెలుస్తోంది. రామాయ‌ణ‌కాలంలో శ‌బ‌రిని క‌లిసేందుకు ఇక్క‌డ‌కు గిరిజ‌నుడైన రామ్‌తో క‌లిసి స్వామి మ‌దంగ‌ వ‌చ్చార‌ని పురాణాలు చెబుతున్నాయి.పాండ్య రాజ వంశీకులు ఇప్ప‌టికీ ఆల‌య సంప్ర‌దాయాల్ని కాపాడ్డంలో కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు. మోహినీ అవ‌తారంలోని విష్ణువుకి, శివునికి లోక‌క‌ల్యాణార్థం క‌ల్గిన సంతాన‌మే స్వామి అయ్య‌ప్ప‌.మ‌త విశ్వాసానికి, లౌకిక‌త‌త్వానికి ప్ర‌తీక‌.అందుకే గురుస్వాముల్ని భ‌క్తులంతా ఈశ్వ‌ర స్వ‌రూపుడిగా కొలుస్తారు.శ‌బ‌రిగిరిపై 18 కొండ‌ల మ‌ధ్య గ‌ల ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతంలో అయ్య‌ప్ప వెలిశాడు. అందుకే పంచ‌లోహాల‌తో త‌యార‌యిన 18 మెట్ల‌పైకెక్కే మాలాధారులు అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకుంటారు. ఇందులో తొలి అయిదు మెట్లు పంచేంద్రీయ క‌ర్మ‌ల‌కు సంబంధించిన‌వి. చూపు,వినికిడి,వాస‌న,రుచి,స్ప‌ర్శ‌లే అవి. 
త‌ర్వాత ఎనిమిది మెట్లు కామ‌, క్రోద, లోభ, మోహ, మ‌ధ, మ‌త్స‌ర్య, అసూయ, దూష‌ణ‌ల‌కు సంబంధించిన‌వ‌వి.ఆ త‌ర్వాత మూడు మెట్లు గుణ‌,త్రిగుణ‌లైన సాత్వ‌,రాజ‌స‌,త‌మా గుణాలు. చివ‌రి రెండు మెట్లు జ్ఞానం, అజ్ఞానాల‌కు సంబంధించిన‌వి.వీటిని దాటితేనే మాలాధారుల‌కు స్వామి అయ్య‌ప్ప ద‌ర్శ‌నం ల‌భిస్తుంది. నీలిమ‌ల కొండ‌ల్లోని అతి క్లిష్ట‌మైన‌ అట‌వీ మార్గంలో 3కిలోమీట‌ర్లు న‌డిచే స్వాములు అయ్య‌ప్ప స‌న్నిధానానికి చేరుకుంటారు.పంపా వ‌ర‌కే వాహ‌నాల‌కు ప్ర‌వేశం ఉంటుంది. కేర‌ళ‌లోని ప‌ట‌నారితెట్ట జిల్లాలోని ర‌న్నీ తాలూకాలోని పెరినాడ్ గ్రామానికి స‌మీపంలో ఉందీ పురాత‌న అయ్య‌ప్ప ఆల‌యం.సినీస్టార్లు అమితాబ్‌,ర‌జ‌నీకాంత్‌,రామ్‌చ‌ర‌ణ్‌,నిర్మాత సురేశ్‌బాబు,ప్ర‌ముఖ ఇండ‌స్ట్రిలిస్టులెంద‌రో త‌ర‌చు మాల ధ‌రిస్తూ అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకుంటుంటారు.ఉర‌కుజి తీర్థం లోని(సంక్టం సంక్టోరం)వ‌ద్ద కొలువు దీరాడు స్వామి అయ్య‌ప్ప‌.ఈ ఆల‌యం స‌ముద్ర మ‌ట్టానికి 1260 మీట‌ర్ల ఎత్తున ఉంది. మాలాధారులు ఇరుమెలి,వండి పెరియార్‌,చ‌ల్కాయం అనే మూడు వేర్వేరు మార్గాల మీదుగా కొండ‌కు వెళ్తారు. 
మ‌క‌ర‌జ్యోతి:ఈ దివ్య జ్యోతి మాన‌వ‌క‌ల్పిత‌మేన‌ని చాలామందికి తెలుసున‌ని అయితే అత్య‌ధిక సంఖ్యాకులైన హిందువులు దీన్నో ప‌విత్ర‌జ్యోతిగా భావిస్తార‌ని శ‌బ‌రిమ‌ల ఆల‌య,ట్రావెన్‌కోర్ దేవ‌స్థానం బోర్డు(టిడిబి) పేర్కొంది. పొన్నంబ‌ల‌మేడు వ‌ద్ద గిరిజ‌నులు కొంద‌రు ఈ జ్యోతిని వెలిగిస్తార‌ని త‌మ‌కూ తెలుస‌ని బోర్డు ప్రెసిడెంట్ ఎం.రాజ‌గోపాల‌న్ నాయ‌ర్ పాత్రికేయుల‌కు ఓ సంద‌ర్భంలో తెలిపారు.అయితే ఈ విష‌యానికి తాము ప్ర‌చారం క‌ల్పించ‌ద‌లుచుకోలేద‌ని ఎందుకంటే అత్య‌ధిక హిందువుల మ‌నోభావాల‌కు సంబంధించిన విష‌య‌మ‌ని ఆయ‌న గుర్తు చేశారు. జ‌న‌వ‌రి14,2011లో పులిమేడు వ‌ద్ద‌ ఏవో వ‌దంతులు రాజ్యమేల‌డంతో నెల‌కొన్న తొక్కిస‌లాట‌లో 102 మంది భ‌క్తులు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఇటువంటి  ప్ర‌మాదాల నివార‌ణ‌కు ఏడాది పొడ‌వునా గుడిని తెరిస్తే ర‌ద్దీ త‌గ్గుతుంద‌న్న కేర‌ళ హైకోర్టు సూచ‌న‌ను బోర్డు సున్నితంగా తిర‌స్క‌రించింది.అనాదిగా వ‌స్తున్న సంప్ర‌దాయాల‌కు విరుద్ధంగా తామిప్పుడు వ్య‌వ‌హ‌రించ‌లేమ‌ని పూజ్య పూజార్లు,ట్రావెన్‌కోర్ అండ్ పాండ్యాలం రాజ‌వంశీకులు,అధికారుల‌తో కూడిన టిడిబి పేర్కొంది. వేల సంవ‌త్స‌రాల‌గా ఆచ‌రిస్తున్న సంస్కృతి,సంప్ర‌దాయాలు,ఆల‌య విధివిధానాల్లో భాగంగా 18 మెట్ల విస్త‌ర‌ణ కూడా సాధ్యం కాద‌ని బోర్డు సభ్యు‌లైన పూజార్లు కంద‌రామ రాజ‌వ‌రు,వాస్తు నిపుణులు క‌న్నిప‌యార్ నారాయ‌ణ‌న్ నంబూద్రి త‌దిత‌రుల బృందం కోర్టుకు విన్న‌వించింది.ఏది ఏమైనా అత్య‌ధిక సంఖ్య‌లో భ‌క్తుల‌తో అల‌రారుతున్న ఈ ఆల‌యం వ‌ద్ద ప్ర‌మాద నివార‌ణ చ‌ర్య‌ల‌కు కేర‌ళ ప్ర‌భుత్వం, బోర్డు న‌డుం బిగిస్తేనే ఆల‌య సంప్ర‌దాయాల్ని కాపాడ్డంతోపాటు స్వాముల‌కు ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.
_______________________________________________________________

భార‌త్‌కు డ‌బుల్:ప‌్ర‌పంచ క‌బ‌డ్డీలో భార‌త్ జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. పంజాబ్‌లో జ‌రిగిన 14 దేశాల ఈ టోర్నీ ఫైన‌ల్లో భార‌త పురుషులు, మ‌హిళా జ‌ట్లు విజ‌యం సాధించాయి. భార‌త పురుషుల జ‌ట్టు కెన‌డాపై 59-29 పాయింట్ల తేడాతో గెలుపొందింది.పాకిస్థాన్ జ‌ట్టు మూడో స్థానం ద‌క్కించుకుంది. వ‌రుస‌గా రెండోసారి భార‌త్ ప్ర‌పంచ విజేత‌గా నిలిచింది.

22 Nov 2011

3gorjes


చైనా ది డ్రాగ‌న్‌..దాదాపు 140 కోట్ల జ‌నాభా. ప్ర‌పంచంలో అధిక జ‌నాభా గ‌ల అగ్ర‌దేశం.22 ప్రావిన్సుల గ‌ల క‌మ్యూనిస్టు దేశం. ఏదైనా త‌ల‌పెడితే సాధించాల‌నే త‌ప‌న న‌ర‌న‌రాన్న జీర్ణించుకున్న జ‌నం. అగ్ర‌రాజ్యం స్థానం పొందాల‌ని ఉవ్విళ్లూరే పాల‌కులు..పాల‌న‌యినా ప్రాజెక్ట‌యినా క‌డ‌దాకా కంక‌ణ‌బ‌ద్ధులై కొన‌సాగిస్తారు. అందుకో ఉదాహ‌ర‌ణ త్రీగోర్జెస్ డ్యాం. యాంగ్జె న‌ది..ప్ర‌తి ప‌దేళ్ల‌కు ఓసారి భారీ వ‌ర‌ద‌ల‌తో త‌న త‌డ‌ఖా చూపిస్తోంటోంది. 1954లో అయితే ఏకంగా 33 వేల మందిని త‌న‌లో క‌లిపేసుకుంది. 1998లో సైతం మ‌రోసారి బిలియ‌న్ డాల‌ర్ల ఆస్తి న‌ష్టాన్ని దేశ ప్ర‌జ‌ల‌కు మిగిల్చింది. ఆ వ‌ర‌ద‌ల‌కు ముగింపు ప‌ల‌కాల‌నే ప్ర‌థాన ఉద్దేశంతో త్రీగోర్జెస్ డ్యాంకు అక్క‌డ ప్రభుత్వం న‌డుం బిగించింది. ఈ డ్యాం ద్వారా ఉత్ప‌త్త‌య్యే హైడ్రో ఎల‌క్ట్రిక్ ప‌వ‌ర్ ఎంతంటే 22,500 మెగావాట్లు. ఓ వైపు వ‌ర‌ద‌ల న‌ష్టాన్ని నివారించ‌డ‌మే కాక దేశానికి అవ‌స‌ర‌మైన విద్యుత్‌ను చౌక‌గా త‌యారు చేయ‌డ‌మే ఈ త్రీగోర్జెస్ డ్యాం లక్ష్యం. అదే ఆ దేశానికి ప్ర‌పంచంలోనే అతి పెద్ద హైడ్రో ప్రాజెక్టు అమ‌ర‌డానికి కార‌ణ‌మైంది. త‌ద్వారా వివిధ కాల్వ‌ల ద్వారా మిగులు జ‌లాల్ని వ్య‌వ‌సాయానికి వినియోగించ‌డాన్ని ఆ దేశ పాల‌కులు చేప‌ట్టారు. దాదాపు మూడు కోట్ల మంది నిర్వాసితుల్ని 2008 నాటికే ఇత‌ర ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌కు త‌ర‌లించి ఆవాసం క‌ల్పించారు. ఈ భారీ ప్రాజెక్టు వ‌ల్ల భూకంపాలు, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డ‌మ‌నే ప్ర‌మాదం ఉన్నా క‌ల్గే ప్ర‌యోజ‌న‌మే మిన్న‌గా భావించి 1994లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును 2008 అక్టోబ‌ర్ 30 నాటికి పూర్తి స్థాయిలో నిర్మించి ప్రారంభించారు. ఇందుకు వాళ్లు వ్య‌యం చేసిన మొత్తం అక్ష‌రాల 26 బిలియ‌న్ అమెరికా డాల‌ర్లు. ఈ ప్రాజెక్టు ఊహ 1919 నాటిది. 1932లో మ‌రోసారి మ‌దిలో మెద‌ల‌గా పాల‌కులు 1934లో ప్రాథ‌మిక అంచానా ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టారు.
1944లో అమెరికాకు చెందిన బ్యూరో ఆఫ్ రిక్ల‌మేష‌న్ చీఫ్ డిజైన్ ఇంజినీర్ జాన్ ఎల్‌.సేవెజ్ ఆధ్వ‌ర్యంలో స‌ర్వే జ‌రిగింది. 54 మంది చైనా ఇంజినీర్ల బృందం ఈ ప్రాజెక్టు కోసం శిక్ష‌ణ‌కు అమెరికా వెళ్లారు.అయితే చైనా సివిల్ వార్ వ‌ల్ల 1947లో ఈ ప్రాజెక్టుకు ఆటంకం ఏర్ప‌డింది. 1949లో క‌మ్యూనిస్ట్‌ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక మావో జెడాంగ్ కూడా త్రీగోర్జెస్ డ్యాంకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అయితే ముందు మాత్రం గెజ్హాబా డ్యాంను ప్రారంభించారు. త‌ర్వాత గ్రేట్ లీప్‌ ఫార్వార్డ్‌, సాంస్కృతిక విప్ల‌వం, యాంగ్జె వ‌ర‌ద‌ల వ‌ల్ల 1956లో డ్యాం ప‌నులు అట‌కెక్కాయి. ఈ డ్యాం నిర్మాణాన్ని మావోజెడాంగ్ ఎంత‌గా ప్రేమించారంటే 1958లో దీనిపై ఆయ‌న ఏకంగా `స్విమింగ్‌` పేరిట ఓ ప‌ద్యాన్నే రాసేశారు. ఎట్ట‌కేల‌కు 1992లో నేష‌న‌ల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆమోదంతో మ‌ళ్లీ త్రీగోర్జెస్ ప్రాజెక్టు ప‌ట్టాల‌కెక్కింది.క‌న్‌స్ట్ర‌క్ష‌న్ 1994 డిసెంబ‌ర్ 14న మొద‌ల‌యింది. అక్క‌డ నుంచి ఒక్కో ద‌శ శ‌ర‌వేగంగా పూర్త‌వుతూ త్వ‌ర‌లోనే అందుబాటులోకి వ‌చ్చింది. ఈ డ్యాంను చూడ్డానికి మావో జెడాంగ్ నోచుకోక‌పోవ‌డ‌మే చైనీయుల‌కు బాధ‌ను క‌ల్గించే విష‌యం.
త్రీగోర్జెస్-త్రీబెనిఫిట్స్:వ‌ర‌ద‌ల నివార‌ణ, చౌక‌గా విద్యుదుత్పాద‌న, వ్య‌వ‌సాయ అవ‌స‌రాల‌కు స‌మృద్ధిగా జ‌లాలు. ఈ మూడింటిని సాధించేందుకు చైనా క‌మ్యూనిస్టులు దేశ‌, విదేశాల్లో ఎదురైన వ్య‌తిరేక‌త‌కు ఎదురునిలిచి ప్రాజెక్టును పూర్తి చేశారు. ప్ర‌పంచంలో భారీ డ్యాంగా పేరొందిన త్రీగోర్జెస్ ఎత్తు 181 మీట‌ర్లు కాగా పొడ‌వు 2,335 మీట‌ర్లు. ఏటా విద్యుదుత్ప‌త్తి 80 టిడ‌బ్ల్యూహెచ్. ఈ ప్రాజెక్టుకే మ‌రో హైలైట్ షిప్‌లిఫ్ట్‌. ఈ ప‌నులు 2012 నాటికి మొత్తంగా పూర్తి కానున్నాయి. థ‌ర్మ‌ల్‌,విండ్‌,న్యూక్లియ‌ర్ త‌దిత‌ర ఏ ఇత‌ర విద్యుదుత్పాద‌న‌ల క‌న్నా హైడ్రో విద్యుదుత్పాద‌నే కారుచౌక‌. 66 దేశాల్లో 50% విద్యుత్ ఉత్ప‌త్తి హైడ్రో ప‌వ‌ర్ కావ‌డ‌మే అందుకో చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణ‌. అస‌లు ప్ర‌పంచంలోనే అన్ని దేశాల విద్యుదుత్పాద‌న‌లో హైడ్రో వాటా 20%. పైగా కాలుష్య ర‌హితం. త్రీగోర్జెస్ రాక‌తో చైనాలోని 31 మిలియ‌న్ ట‌న్నుల బొగ్గు ఆదా అయిన‌ట్లు నేష‌న‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ రిఫార్మ్స్ క‌మిష‌న్ పేర్కొంది. అంతేకాదు 100 మిలియ‌న్ ట‌న్నుల గ్రీన్‌హౌస్ వాయువుల్ని నివారించ‌గ‌లిగార‌ట. ఇదో చారిత్ర‌క సాంకేతిక‌ నైపుణ్యాల‌కు నిలువుట‌ద్దంగా చైనా పేర్కొంటోంది. ఇంత‌కీ త్రీగోర్జెస్ చైనాలో ఎక్క‌డుందంటే హుబె ప్రావిన్స్‌లో సాండేపింగ్,యిచాంగ్ ప‌ట్ట‌ణాల మ‌ధ్య‌న ఉంది. షాంఘై న‌గరానికి ఈ ప్రాజెక్టు 1000 మైళ్ల దూరం. తొలిసారిగా హైడ్రో ప‌వ‌ర్ వెలుగులీనింది మాత్రం 1878లో నార్తంబెర్లాండ్‌(ఇంగ్లాండ్‌)లోని క్రాగ్‌స‌యిడ్ హౌస్‌లోనే. 1882లో అమెరికాలోని ఫాక్స్ రివ‌ర్ నుంచి ఉత్ప‌త్తి చేసిన హైడ్రో ప‌వ‌ర్‌ను రెండు చిన్న‌త‌ర‌హా పేప‌ర్‌మిల్స్‌లో వినియోగించారు.
హైడ్రో ప‌వ‌ర్ ఉత్ప‌త్తిలో టాప్ టెన్ దేశాలు
త‌జికిస్థాన్-5,27,700 (మెగావాట్లు); 
కెన‌డా-3,41,312(మెగావాట్లు); 
అమెరికా-3,19,484 (మెగావాట్లు); 
బ్రెజిల్-2,85,603 (మెగావాట్లు); 
చైనా-2,04,300 (మెగావాట్లు);   
ర‌ష్యా-1,60,500 (మెగావాట్లు); 
నార్వే-1,21,824(మెగావాట్లు); 
జ‌పాన్-84,500 (మెగావాట్లు); 
ఇండియా-82,237 (మెగావాట్లు); 
ఫ్రాన్స్‌-77,500 (మెగావాట్లు).
వ‌ర‌ల్డ్ టాప్-10 హైడ్రో ప‌వ‌ర్ ప్రాజెక్ట్స్‌
*త్రీగోర్జెస్ డ్యాం: 2008-22.5(జి.డ‌బ్ల్యూ)-చైనా(యాంగ్జె న‌ది)
*ఇట‌యిపు హైడ్రో ఎల‌క్ట్రిసిటీ ప‌వ‌ర్ ప్లాంట్‌:2003-14,000(ఎం.డ‌బ్ల్యూ)-బ్రెజిల్‌
*గురి డ్యాం: 10.2(జి.డ‌బ్ల్యూ)-వెనిజులా(క‌రోని న‌ది)
*టుకురాయ్ డ్యాం:1975-8.5(జి.డ‌బ్ల్యూ)-టుకురాయ్ కౌంటీ, బ్రెజిల్‌ 
*గ్రాండ్ కౌలీ హైడ్రో ఎల‌క్ట్రిక్ ప‌వ‌ర్ ప్లాంట్‌-7000(ఎం.డ‌బ్ల్యూ)-అమెరికా
*స‌యానొ-షుష్నెస్క్యా-1978-6,400(ఎం.డ‌బ్ల్యూ)-ర‌ష్యా
*క్ర‌స్నోయార్స్క్ హైడ్రో ఎల‌క్ట్రిక్ ప‌వ‌ర్ ప్లాంట్‌-1972-6000(ఎం.డ‌బ్ల్యూ)-ర‌ష్యా(మెనిసె న‌ది)
*రాబ‌ర్ట్ బౌర్సా హైడ్రో ఎల‌క్ట్రిక్ ప‌వ‌ర్ ప్లాంట్‌-5,600(ఎం.డ‌బ్ల్యూ)-కెన‌డా(లిగ్రాండె)
*చ‌ర్చిల్ ఫాల్స్ జ‌న‌రేటింగ్ స్టేష‌న్‌-5,400(ఎం.డ‌బ్ల్యూ)-కెన‌డా
*లాంగ్టాన్ డ్యాం-2(జి.డ‌బ్ల్యూ)-చైనా(హొమ్ష్యా న‌ది)
______________________________________________________________
వెయిటింగ్ రికార్డ్స్:ముంబాయి..వెస్టిండీస్‌-భార‌త్ సీరీస్‌లో చివ‌రిద‌యిన మూడో టెస్ట్‌..ఇందులో ఏముంది కొత్త విష‌యం..ఎందుకంటే ఇప్ప‌టికే సీరీస్‌ను ఇండియా గెలిచేసింది. మ‌రి మ‌జా ఏంటంటే మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ నూరో
శ‌త‌కం కోస‌మే ప్ర‌పంచ క్రికెట్ అభిమానుల ఆత్రం.అదీ స‌చిన్ త‌న సొంత గ్రౌండ్‌లో సాధిస్తాడ‌నే స‌గ‌టు అభిమానులంతా వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు.ఇంతేనా అంటే ఇంకా ఉంది..గ్రేట్‌వాల్ ద్ర‌విడ్ టెస్టుల్లో 13వేల ప‌రుగుల రికార్డు చెంత‌, డాషింగ్ రేస‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ 8 వేల ప‌రుగుల ముంగిట ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవ‌రిప్పుడు త‌మ‌ రికార్డును లిఖిస్తారో రేప‌టి వ‌ర‌కు వేచి చూడాలి.
  ‌

Popular Posts

Wisdomrays