5 Dec 2011

babaji

http://royalloyal007.blogspot.in/2012/09/t-hunts-down-d.html
శ‌రీరం అశాశ్వ‌తం..ఆత్మ శాశ్వ‌తం..ఇది స‌ర్వుల విశ్వాసం.జ‌న్మించిన వారికి మ‌ర‌ణం త‌ప్ప‌దు.మ‌ర‌ణించిన వారికి జ‌న‌నం త‌ప్ప‌దు అనేది గీతాసారం.అయితే చిరంజీవులు ఉండ‌రా?హ‌నుమంతుడు చిరంజీవి..హిమాల‌యాల్లో ఇంకా త‌ప‌స్సులో నిమ‌గ్న‌మై ఉన్నాడ‌న్న‌ది పురాణాల ఆధారంగా హిందువుల్లో అత్య‌ధిక సంఖ్యాకుల న‌మ్మిక‌.న‌మ్మ‌కం మ‌నిషికో ఆయుధం.ఇత‌రుల‌కు భంగ‌క‌రం కానంత‌వ‌ర‌కు,అది మూఢ న‌మ్మ‌కంగా పెడ‌దారి ప‌ట్ట‌నంత‌కాలం ఎవ‌రైనా ఆచ‌రించ‌వ‌చ్చు.ఆ కోవ‌లోనే ఇప్ప‌టికీ రెండువేల ఏళ్లగా మ‌హావ‌తార బాబాజీ స‌జీవంగా విరాజిల్లుతున్న‌ట్లు భావించేవారు ఉన్నారు.ఏ విశ్వాస‌మైనా మ‌తాసార‌మైనా ఒక్క‌టే మంచిని పెంచ‌డం,శాంతిని స్థాపించ‌డ‌మే.సృష్టి ఉన్న‌ప్ప‌టి నుంచి సైన్స్ ఉంది.సాధ‌న‌,శోధ‌న అనే క్ర‌మంలో అది కొన‌సాగుతూనే ఉంది.సూర్య‌చంద్రాదులున్నంత వ‌ర‌కు కొన‌సాగుతూనే ఉంటుంది.నిన్న‌టి సిద్ధాంతం రేప‌టిరోజున త‌ప్పుకావ‌చ్చు.నిన్న‌టి ప‌రిశోధ‌న‌లు నేటికి నిజంగా చ‌లామ‌ణి అవ్వొచ్చు.భ‌విష్య‌త్‌లో మ‌రో శోధ‌న ఇదే క‌చ్చితం అంటూ నిరూపించవ‌చ్చు.అయితే ఏదీ ప‌రిపూర్ణం కాదు.సైన్స్ ప‌రిభ్ర‌మణంలో అవ‌న్నీ ద‌శ‌లు.అందుకే ప్ర‌పంచ ప్ర‌సిద్ధ శాస్త్ర‌వేత్త‌లు,వైద్యాచార్యులు సైతం మిస్ట‌రీలను కొట్టివేయ‌డం లేదు.అద్భుతాల‌ను కాదంటూ బ‌ల్ల‌గుద్దడం లేదు.ప్ర‌పంచంలో మొత్తం మాన‌వాళి ఇంకా పాత‌,కొత్త విష‌యాల‌ను తెలుసుకొనే ప్ర‌య‌త్నంలోనే ముందుకు వెళ్తోంది.
బాబాజీ:భార‌త‌దేశానికి పెట్ట‌ని కోట‌యిన హిమాల‌యాల్లో రెండువేల ఏళ్ల‌గా జీవిస్తున్న యోగి ఈ మ‌హావ‌తార బాబాజీ.నిత్య య‌వ్వ‌నుడు.చిరంజీవి.మ‌హాకాయ బాబాజీగానూ భ‌క్తులు పిలుచుకుంటారు.`క్రియా యోగ`ప్ర‌దాత‌.మెడ‌లో రుద్రాక్ష‌లు,ఒళ్లంతా పులిమిన‌ట్లు క‌న్పించే బూడిద‌,నుదుటిన కుంకుమ‌బొట్టు..ఆక‌ర్ష‌ణీయ‌మైన ముఖ‌వ‌ర్చ‌స్సు,వెలుగులు విర‌జిమ్మే నేత్రాల‌తో ప‌ద్మాస‌న ముద్ర‌లో ద‌ర్శ‌న‌మిస్తార‌ని హిమాల‌య సాణువుల‌కు వెళ్లే సాధువులు,రుషులు,ప‌ర‌మ భ‌క్తులు విశ్వ‌సిస్తుంటారు.బ‌ద్రీనాథ్‌కు ఎగువున గ‌ల శిఖ‌రాల్లో బాబాజీని ఆర్తిగా స్మ‌రిస్తే ఆ దివ్య పురుషుడు ద‌ర్శ‌నం ల‌భిస్తుంద‌ట‌.మ‌న‌కు ద‌గ్గ‌ర్లోనే ఆ స్వామి కొలువున్న‌ట్లు అనిపిస్తుంది.ఎంత న‌డిచినా ఆ యోగి ద‌రికి మాత్రం చేర‌లేమ‌ట‌.ఇంత‌కు ముందు మ‌న‌కు క‌నిపించినంత‌టి దూరంలోనే ఉండి బాబాజీ ఆశీర్వ‌దిస్తున్న‌ట్లు భావ‌న క‌ల్లుతుంద‌ట‌.ఈ విశ్వాసం త‌ర‌త‌రాలుగా వేల ఏళ్లుగా హిమాల‌య శిఖ‌రాల్లో సంచ‌రించే సాధువులు,బాబాలు,యోగుల్లో ఉంది.ఇప్ప‌టికీ చాలామంది భ‌క్తులు న‌మ్ముతారు.సౌత్ ఇండియా సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ బాబాజీ ఉనికిని బ‌లంగా న‌మ్మే వారిలో ఒక‌రు.ఎంత‌గానంటే ఏడాదికో రెండేళ్ల‌కోసారి ఆయ‌న దాదాపు ఆరునెల‌లు అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు.ఎక్క‌డుంటారంటే నెల‌ల త‌ర‌బ‌డి హిమాల‌యాల్లోనే బాబాజీ ధ్యానంలోనే గ‌డుపుతారు.ఆ బాబాజీ పేరు మీద ఏకంగా ఆయ‌న బాబా అనే సినిమాను కూడా చిత్రీక‌రించారు. 
యోగా-చిరంజీవి: యోగా సాధ‌న ఆరోగ్య‌దాయ‌కం.త‌ద్వారా జీవ‌న ప్ర‌మాణం పెరిగే అవ‌కాశ‌ముంది.హిమాల‌యాల్లో స్వ‌చ్ఛ‌మైన ప్ర‌కృతి ఒడిలో ఆశ్ర‌మ జీవ‌నం గ‌డ‌పడం,సంజీవిని త‌ర‌హా ఔష‌ధ మొక్క‌లు,వ‌న‌మూలిక‌లు,పండ్లు,కంద‌మూలాలతో కూడిన ఆహారం త‌మ‌ను చిరంజీవుల్ని చేస్తుందంటారు యోగులు.స్థిర‌చిత్తం,స్థిత‌ప్ర‌జ్ఞ‌త‌లు కూడా వారి జీవ‌నానికి వ‌రాలే.అందుకే వంద‌ల ఏళ్లు జీవించే బాబాలు,యోగినుల‌కెంద‌రికో హిమాల‌యాలు వేదిక‌.ప‌ర‌మ‌హంస యోగానంద త‌న `యోగి`అనే పుస్త‌కంలో బాబాజీ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర అంశాల్ని ప్ర‌స్తావించారు.క్రియా యోగాల‌యాన్ని నిర్వ‌హిస్తున్న కెన‌డాకు చెందిన మార్ష‌ల్ గోవింద‌న్ కూడా త‌ను రాసిన ప‌లు పుస్త‌కాల్లో ఎన్నో అద్భుత‌,కొత్త విష‌యాల్ని పేర్కొన్నారు.ఆరోగ్యప‌రిర‌క్ష‌ణ‌కు యోగా చ‌క్క‌ని వ‌న‌రు.ఆయుర్వేదం భార‌త్‌కు చెందిన ప్రాచీన వైద్య‌విధానం.ఎన్నో దీర్ఘ‌కాలిక వ్యాధుల నివారిణి.ప్ర‌పంచ‌వ్యాప్తంగా రోగ‌పీడితులకు అమృత తుల్యంగా మ‌న్న‌న‌లు పొందుతోంది.ఇక హిమాల‌యాల్లో వ‌న‌మూలిక‌ల‌కు కొద‌వుండ‌ద‌ని అందుకే అక్క‌డ యోగులు చిరంజీవులుగా ఉండ‌డం సాధ్య‌మేన‌ని వివిధ స‌ద‌స్సుల్లో స‌ద‌స్స్యులు అభిప్రాయ‌ప‌డ్డారు.బాబాజీ ప్ర‌భావం ఆదిశంక‌రాచార్య‌,క‌బీర్‌,షిర్డీసాయిబాబా,గ‌జాన‌న మ‌హ‌రాజ్‌,స్వామి స‌మ‌ర్తా త‌దిత‌రుల‌పైన ఉంద‌ని కాలిఫోర్నియాలో జ‌రిగిన ఓ అధ్యాత్మిక స‌ద‌స్సులో కొంద‌రు త‌మ‌ భావ‌న‌గా పేర్కొన్నారు.మ‌హాత్మాగాంధీ,పండిట్ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ త‌దిత‌ర ప్ర‌ముఖులెంద‌రికో వైద్యం చేసిన డాక్ట‌ర్ రామ్‌బోస్లే(బొంబాయి)బాబాజీకి ప‌ర‌మ‌భ‌క్తులు.విదేశాల్లో జ‌రిగిన 160కు పైగా స‌ద‌స్సుల్లో పాల్గొన్న ఆయ‌న బాబాజీకి సంబంధించి త‌న‌కు గ‌ల అనేక అనుభూతుల్ని వివిధ వేదిక‌ల‌పై పంచుకున్నారు.బాబాజీ అద్వితీయ‌మైన మహాపురుషుడిగా ప‌లు ప‌త్రాలు,పుస్త‌కాల్లో పేర్కొన్నారు. 
-------------------------------------------------------------------------------
* జీవ‌న ప్ర‌మాణం:భార‌త్‌లో జీవ‌న‌ప్ర‌మాణం 64 ఏళ్లు.
(మ‌నిషి నూరేళ్లు జీవిస్తాడంటారు.వందేళ్ల‌కు పైగా బ‌తికిన వాళ్లు,ప్ర‌స్తుతం బ‌తుకుతున్న వాళ్లు ప్ర‌పంచం న‌లుమూల‌లా ఇప్ప‌టికీ కొంద‌రున్నారు.అలాగే భార‌త్‌లో కూడా ఉన్నారు.)

2 Dec 2011

big frog

క‌ప్ప‌ల్ని పాములు తిన‌డం స‌హ‌జం.సృష్టిలో జీవులు మ‌రో జీవిని తిన‌డం ద్వారానో లేదా వాటిపై ఆధార‌ప‌డో జీవించ‌డం సాధార‌ణం.అందుకు భిన్నంగా సృష్టి ద‌ర్మానికి విరుద్ధంగా క‌ప్పే పామును నోట క‌రుచుకొనే దృశ్యాల్ని టి.వి,పేప‌ర్ల‌లో చూసిన‌ప్ప‌డు ఆశ్చ‌ర్య‌పోతుంటాం.నిజంగా ఆ జాతి కప్ప‌లు ఉన్నాయి.అవే బిగ్ ప్రాగ్స్‌.అమెరికా,కెన‌డాల్లో తొలుత వెలుగు చూసిన ఈ క‌ప్ప‌లే బుల్‌ప్రాగ్స్‌.వీటి శాస్త్రీయ‌నామం రెన‌క‌ట్స్‌బ‌య‌న్‌.ఇప్పుడు అరుద‌యిపోతున్న ఈజాతి క‌ప్ప‌లు ఒక్కో దేశంలో ఒక్కో రంగులో అక్క‌డ‌క్క‌డ ఇంకా ఉన్నాయి.సాధార‌ణ క‌ప్ప‌ల‌తో పోలిస్తే ఇవి చాలా భిన్నంగా ఉంటాయి.శ‌త్రువు నుంచి తప్పించుకోవ‌డానికో ఆహారాన్ని సేక‌రించే నిమిత్త‌మో ఇవి అచ్చు ఊస‌ర‌వెల్లిలా రంగుల్ని మారుస్తాయ‌ని ప‌లు ప‌రిశోధ‌న ప‌త్రాల్లో శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు.
నిద్ర పోని జీవి:బుల్‌ప్రాగ్ అస్స‌లు నిద్రే పోదు.ఇలాంటి జీవి భూమ్మీద బ‌హు అరుదేన‌ని చెప్పాలి.చేప‌లు క‌ళ్లు తెరుచుకొనే నిద్ర‌పోతాయి.వాటికి క‌నుపాప‌లు కూడా ఉండ‌వు.కేవ‌లం ఒక్క‌రోజే జీవించే కొన్ని కీట‌కాలకు కూడా నిద్ర‌,విశ్రాంతి త‌దిత‌రాల అవ‌సరం ఎలాగూ లేదు.వేల్స్‌,డాల్ఫిన్స్‌ల్లోని మెద‌డులో స‌గ‌భాగం మాత్ర‌మే నిద్ర‌పోతుంది.మిగిలిన స‌గ‌భాగం ఊపిరి తీసుకొనే క్ర‌మంలో నిమ‌గ్న‌మ‌వుతుంది.ఇక రోజులో ఏక‌ధాటిగా 20మైళ్లు ఈద‌గ‌ల సామ‌ర్థ్యం ఉన్న ఏనుగుల నిద్రా స‌మ‌యం కేవ‌లం నాలుగ్గంట‌లే.అదీ ద‌ఫ‌ద‌ఫాలుగానే నిద్ర‌పోతాయి.న‌త్త‌ల‌యితే ఒక‌సారి నిద్ర‌కు ఉప‌క్ర‌మిస్తే నాల్గేళ్ల వ‌ర‌కు కూడా అదే విశ్రాంతి ద‌శ‌లో ఉండిపోగ‌ల‌వు.స‌ల్మ‌న్‌,పైక్,గోల్డ్‌ఫిష్‌,యాంగ‌ర్ ఫిష్ త‌దిత‌ర చేప‌లకు కూడా నిద్రంట‌నే తెలీద‌ట‌.ఆ కోవ‌లోకే వ‌స్తుంది ఈ బుల్‌ఫ్రాగ్‌.ఇవి ప‌రిమాణంలోనూ చాలా పెద్ద‌వి.జీవిత‌కాలం కూడా ఎక్కువే.అలాగే వీటి బ‌రువును కూడా మ‌నం ఊహించ‌లేం.ఆఫ్రిక‌న్ బుల్‌ఫ్రాగ్ అయితే ఏకంగా 45 ఏళ్లు జీవించ‌గ‌ల‌ద‌ట‌.మిగిలిన ప్ర‌పంచ దేశాల్లోని ఈ జాతి క‌ప్ప‌లు 8నుంచి10ఏళ్లు కొన్న‌యితే 16ఏళ్ల వ‌ర‌కు బ‌తుకుతాయి.వీటి బ‌రువు కూడా రెండు కేజీల పైమాటే.ఈ క‌ప్ప‌ల్లో త‌ల భాగం చాలా పెద్ద‌గా ఉంటుంది.ఇవి 4నుంచి6 అంగుళాల సైజులో ఉంటాయి.ఆడ‌క‌ప్ప‌ల‌యితే మ‌గ‌వాటిక‌న్నా సైజులో ఇంకా పెద్ద‌గా ఉంటాయి.ఇవి 8నుంచి10 అంగుళాల వ‌ర‌కు కూడా పెరుగుతాయి.ఎక్కువ‌గా నీటి మ‌డుగుల్లో నివ‌సించే ఈ క‌ప్ప‌లు ఒడ్డున గుడ్లు పెడ‌తాయి.అదీ వేస‌వి ఆరంభానికి కాస్త ముందు.వేడి వాతావ‌ర‌ణాన్ని అంటే 25నుంచి28 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడిని ఇష్ట‌ప‌డ‌తాయి.వీటి క‌ద‌లిక చాలా నెమ్మ‌దిగా ఉంటుంది.వ‌ర్షాకాలంలో రాత్రి వేళ‌ల్లో ఒక‌చోటు నుంచి మ‌రోచోటుకి సంచ‌రిస్తాయి.అమెరికా,కెన‌డాల్లో ఇవి లేత ఆకుప‌చ్చ‌,లేత బూడిద రంగుల్లో క‌నిపిస్తాయి.ఆఫ్రికాలో అయితే ఇవి ఆలివ్‌గ్రీన్ రంగులో ఉంటాయి.మ‌గ‌వి లేత ప‌సుపురంగు,నారింజ‌ రంగుతో మ‌రీ సొగ‌స‌రిగా ఆక‌ర్షిస్తాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు.
పాములూ ఆహార‌మే: ఎలుక‌లు,పిచ్చుక‌లు,పాము పిల్ల‌లు,చేప‌లు వంటివి దొరికితే ఈ బుల్‌ఫ్రాగ్‌లు వ‌దిలిపెట్ట‌వు.ఇక‌ మిడ‌త‌లు,వాన‌పాములు,తొండ‌లు,కీచురాళ్లు,పేడ‌పురుగులు,ఇత‌ర కీట‌కాల్ని ఆబ‌గా లాగించేస్తాయివి.అందుకే ఈ క‌ప్ప‌ల్ని తినే మ‌నుషుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది.వీటి కాళ్ల‌కు భ‌లేగిరాకీ.ఆ రుచే వేరంటారు మాంసాహార ప్రియులు.ఎక్కువ‌గా చైనా,జ‌పాన్‌ల్లో క‌ప్ప‌ల మాంసాహార ప్రియులు అత్య‌ధికంగా ఉన్నారు.యూర‌ప్‌,ఇత‌ర పాశ్చాత్య దేశాల్లో ఏటా నాలుగు ట‌న్నుల మేర క‌ప్ప‌ల‌ను భోంచేసేస్తున్నార‌ట‌.ఎగుమ‌తి చేసే దేశాల్లో ఇండోనేసియాది ప్ర‌థ‌మ స్థానం.అమెరికా,కెన‌డాల్లో ఊపిరిపోసుకున్న ఈ బుల్‌ఫ్రాగ్స్ జాతిని ఆ దేశాలు ద‌క్షిణ‌కొరియా,వెస్ట్ర‌న్ యూర‌ప్‌,బ్రెజిల్‌,కొలంబియా,ఆస్ట్రేలియాలకు ప‌రిచ‌యం చేసి వృద్ధి చేశాయి.కానీ వీటిని ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ పాఠ‌శాల‌లు,క‌ళాశాల‌ల్లో ప్ర‌యోగాల‌కు వినియోగిస్తుండ‌డం,శాస్త్ర‌వేత్త‌లూ ఇంకా వీటిపై అనేక ప‌రిశోధ‌న‌లు సాగిస్తుండ‌డం, మ‌రోప‌క్క వీటి మాంసం రుచికి ప‌రిత‌పించే జ‌నం పెరిగిపోవ‌డంతో ఈ బుల్‌ఫ్రాగ్ జాతి ఉనికికే ప్ర‌మాదం ఏర్ప‌డింది.మందుల తయారీకి ముఖ్యంగా యాంటీబ‌యోటిక్స్ ఉత్ప‌త్తికి వీటిని వినియోగిస్తుంటారు.
-------------------------------------------------------------------------------------------------------------
INDIA

*National animal:టైగ‌ర్‌
*National bird:నెమ‌లి
*National reptile:త్రాచుపాము
*National icon:కోతి
*National marine animal:డాల్ఫిన్స్‌
*National heritage animal:ఏనుగు



---------------------------------------------------------------------------

30 Nov 2011

views













navayuva page viewer friends list


Pageviews by Countries
India
1,120
United States
414
Russia
105
Latvia
8
Germany
7
Malaysia
5
Indonesia
3
Brazil
1
Chile
1
Malta
1
Sweeden
1
New Caledonia
1
Saudi Arabia
1
 
 
 
 


29 Nov 2011

belum caves


ప్ర‌కృతిలో భూమి కూడా ఓ అద్భుతాల స‌మాహార‌మే. కొండ‌లు, గుట్ట‌లు, న‌దులు, చెట్లు, తోట‌లు ఎన్నెన్నో. అన్నీ మ‌న‌ల్ని ఆక‌ట్టుకొనేవే. ఉల్లాస‌ప‌రిచి సేద‌తీర్చేవి. అందులో గుహ‌లు ఎంద‌రో సంద‌ర్శ‌కుల్ని ఆక‌ర్షిస్తుంటాయి. అటువంటి వాటిల్లో ఒక‌టి ఈ బెలుం గుహ‌లు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోగ‌ల క‌ర్నూల్ జిల్లాకు చెందిన ఈ గుహ‌లు భార‌త ఉప‌ఖండంలోనే విస్త‌ర‌ణ‌రీత్యా రెండో స్థానాన్ని ఆక్ర‌మించాయి. దేశంలో అతిపెద్ద గుహ‌లివి. కొలిమిగుండ్ల‌కు కేవ‌లం మూడు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న బెలుం గ్రామంలో నెల‌కొంది.బిలం అనే సంస్కృత ప‌దం నుంచి తెలుగులో బెలుం గుహ‌లగా పేరు స్థిర‌ప‌డింది.1884లోనే బ్రిటిష్ స‌ర్వేయ‌ర్ రాబ‌ర్ట్ బ్రూస్‌ఫుట్ వీటిని తొలుత క‌నుగొన్నారు.అయితే 1982లో జ‌ర్మ‌నీకి చెందిన డేనియ‌ల్ గెబ‌ర్ నేతృత్వంలోని గుహ‌ల ప‌రిశోధ‌న‌,అధ్య‌య‌న క‌ర్త‌ల బృందం బెలుంగుహ‌ల్ని గుర్తించి లోతైన ప‌రిశోధ‌న‌లు సాగించింది.

బెలుం గుహ‌లు భ‌ళా: 1988లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఈ గుహ‌ల‌ను ప‌రిర‌క్షించి ప‌ర్యాట‌క‌క్షేత్రంగా తీర్చి‌దిద్ద‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.1999లో ఈ మేర‌కు ప‌నుల‌ను ప్రారంభించి 2002 ఫిబ్ర‌వ‌రిలో ఈ బెలుంగుహ‌ల్ని జ‌న సంద‌ర్శ‌న‌కు సిద్ధం చేసింది.ఎపీటీడీసీ ద్వారా ఈ గుహ‌ల‌ను అభివృద్ధి ప‌రిచారు.ఈ గుహ‌లు 3,229 మీట‌ర్ల దూరం విస్త‌రించాయి. వీటి ప్ర‌త్యేక‌త ఏమంటే అంత‌ర్లీన గుహ‌లివి. పైకి మైదాన‌ప్రాంతంగా పొలాలు,ర‌హ‌దారిగా క‌నిపిస్తుంది.ఈ గుహ‌ల ద్వారం వ‌ద్ద‌కు వ‌చ్చేవ‌ర‌కు ఇక్క‌డ ఇవి ఉన్న‌ట్లే తెలీదు.3.5కిలోమీట‌ర్ల గుహ‌లో 1.5 కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు మాత్ర‌మే జ‌నాన్ని అనుమ‌తిస్తారు.‌గుహ‌ల లోప‌ల పొడ‌వైన బాట‌లున్నాయి.వెడ‌ల్పైన ప‌లు గదులు నెల‌కొన్నాయి.జాలువారే స్వ‌చ్ఛ‌మైన చిన్న జ‌ల‌సేల‌యేరు సంద‌ర్శ‌కుల‌కు భ‌లే క‌నువిందు.భార‌త పురావ‌స్తు ప‌రిశోధ‌న శాఖ‌(ఏఎస్ఐ)ఈ గుహ‌ల్లో క్రీస్తు పూర్వం 4500 నాటి పాత్ర‌ల‌ను క‌నుగొంది.ఇందులో బౌద్ధ స‌న్యాసుల ధ్యాన‌మందిరాన్ని వారు ఉప‌యోగించిన వ‌స్తువులు త‌దిత‌రాల్ని గుర్తించింది.గుహ‌ల లోప‌ల 2కిలోమీట‌ర్ల మేర న‌డ‌క‌దారిని ఏపీటీడీసీ అభివృద్ధిప‌రిచింది.
చూడ బు(ద్ధి)ద్ధ‌:బెలుం గుహ‌ల‌కెళ్లే మార్గంలో ధ్యాన‌ముద్ర‌లో ఉన్న నిలువెత్తు బుద్ధ‌విగ్ర‌హం సంద‌ర్శ‌కుల‌కు స్వాగ‌తం ప‌లుకుతున్న‌ట్లు ఉంటుంది.గుహ‌ల లోప‌ల ప‌లు వంతెన‌లు,మెట్ల వ‌రుస‌లు అనేకం ఉన్నాయి.గాలి ఆడేందుకు ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేశారు.కాల్షియం కార్బొనేట్‌తో రూపుదాల్చిన వేల‌కొద్దీ శివ‌లింగాలు కోటిలింగాల ఛాంబ‌ర్ వ‌ద్ద అల‌రిస్తూ క‌నిపిస్తాయి.ఇక్క‌డ ప్ర‌వ‌హిస్తూ క‌నిపించే పాతాల గంగ‌(సెల‌యేరు)ఎటుపోతోందో మాత్రం మ‌న‌కు అంతుచిక్క‌దు.ఈ గుహాల‌కు రెండు కిలోమీట‌ర్ల దూరంలోగ‌ల ఓ బావిలోకి ఈ నీరు చేరుతోంద‌ట‌.2006 నుంచి స‌ప్త‌స్వ‌రాల‌(మ్యూజిక‌ల్ ఛాంబ‌ర్‌)సంగీతం ఈ గుహ‌ల్లో సంద‌ర్శ‌కుల‌కు వీనులవిందు క‌ల్గిస్తోంది.ఇందులో గ‌ల ధ్యాన‌మందిరం అచ్చం ఓ మంచం,దానిపై దిండు ఉన్న ఆకృతిలో చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటోంది.బెలుంగుహ‌ల లోప‌ల పైభాగాన్ని చూస్తుంటే వేల‌కొద్దీ పాములు ప‌డ‌గ‌విప్పిన‌ట్లు మ‌న‌కు అనుభూతి క‌ల్గుతుంది.ఇందులోని మ‌ర్రిచెట్టు హాల్‌ను తిల‌కిస్తే సంభ్ర‌మాశ్చ‌ర్యాలు క‌ల్గుతాయి.మండ‌పం లోగిలి కూడా జ‌నాన్ని చూపుమ‌ర‌ల్చుకోనివ్వ‌దు.బెంగుళూరు నుంచి అలాగే హైద‌రాబాద్ నుంచి కూడా ఈ బెలుం గుహలు 320 కిలోమీట‌ర్ల దూరంలోనే ఉన్నాయి. క‌ర్నూల్ నుంచి ఇక్క‌డ‌కు 106 కిలోమీట‌ర్ల దూరం కాగా అనంత‌పురం నుంచి 85 కిలోమీట‌ర్లు ఉంటుంది.తాడిప‌త్రి నుంచి బెలుంగుహ‌ల‌కు 30 కిలోమీట‌ర్ల దూరం.అదే బ‌న‌గాన‌ప‌ల్లి నుంచ‌యితే కేవ‌లం 20కిలోమీట‌ర్లే దూరం.
భార‌త్‌లో పేరొందిన గుహ‌లు: అజ‌ంతా, ఎల్లోరా (మ‌హారాష్ట్ర‌); ఎలిఫెంటా గుహ‌లు (మ‌హారాష్ట్ర‌); క‌న్హెరి గుహ‌ల (మ‌హారాష్ట్ర‌). 
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బెలుం గుహ‌లు(క‌ర్నూల్);బొర్రా గుహ‌లు(విశాఖ‌ప‌ట్నం);గుత్తికొండ,యాగంటి,ఉండ‌వ‌ల్లి గుహ‌లూ(గుంటూరు) ప్ర‌సిద్ధి చెందాయి.
వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ టాప్‌-10 కేవ్స్ 
*ములు కేవ్స్‌(మ‌లేసియా)
*జ‌యిట‌గ్రొట్టో(లెబ‌నాన్‌)
*కార్ల్స్ బ‌డ్ కేవ్ర‌న్స్‌(న్యూమెక్సికో-యు.ఎస్‌)
*స్కోజ‌న్ కేవ్‌(స్లొవేనియా)
*మ‌జ్లిస్ అల్‌జిన్‌(ఒమ‌న్‌)
*వైటొమొ(న్యూజిలాండ్‌)
*ఫ్యూర్టోప్రిన్సెస్‌(ఫిలిప్పైన్స్‌)
*కేవ్ ఆఫ్ క్రిస్ట‌ల్స్‌(మెక్సికో)
*రీడ్‌ఫ్లూట్ కేవ్స్‌(చైనా)
*ఇజ్రిసెన్వెల్ట్‌(జ‌ర్మ‌నీ)

Popular Posts

Wisdomrays