2 Dec 2011

big frog

క‌ప్ప‌ల్ని పాములు తిన‌డం స‌హ‌జం.సృష్టిలో జీవులు మ‌రో జీవిని తిన‌డం ద్వారానో లేదా వాటిపై ఆధార‌ప‌డో జీవించ‌డం సాధార‌ణం.అందుకు భిన్నంగా సృష్టి ద‌ర్మానికి విరుద్ధంగా క‌ప్పే పామును నోట క‌రుచుకొనే దృశ్యాల్ని టి.వి,పేప‌ర్ల‌లో చూసిన‌ప్ప‌డు ఆశ్చ‌ర్య‌పోతుంటాం.నిజంగా ఆ జాతి కప్ప‌లు ఉన్నాయి.అవే బిగ్ ప్రాగ్స్‌.అమెరికా,కెన‌డాల్లో తొలుత వెలుగు చూసిన ఈ క‌ప్ప‌లే బుల్‌ప్రాగ్స్‌.వీటి శాస్త్రీయ‌నామం రెన‌క‌ట్స్‌బ‌య‌న్‌.ఇప్పుడు అరుద‌యిపోతున్న ఈజాతి క‌ప్ప‌లు ఒక్కో దేశంలో ఒక్కో రంగులో అక్క‌డ‌క్క‌డ ఇంకా ఉన్నాయి.సాధార‌ణ క‌ప్ప‌ల‌తో పోలిస్తే ఇవి చాలా భిన్నంగా ఉంటాయి.శ‌త్రువు నుంచి తప్పించుకోవ‌డానికో ఆహారాన్ని సేక‌రించే నిమిత్త‌మో ఇవి అచ్చు ఊస‌ర‌వెల్లిలా రంగుల్ని మారుస్తాయ‌ని ప‌లు ప‌రిశోధ‌న ప‌త్రాల్లో శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు.
నిద్ర పోని జీవి:బుల్‌ప్రాగ్ అస్స‌లు నిద్రే పోదు.ఇలాంటి జీవి భూమ్మీద బ‌హు అరుదేన‌ని చెప్పాలి.చేప‌లు క‌ళ్లు తెరుచుకొనే నిద్ర‌పోతాయి.వాటికి క‌నుపాప‌లు కూడా ఉండ‌వు.కేవ‌లం ఒక్క‌రోజే జీవించే కొన్ని కీట‌కాలకు కూడా నిద్ర‌,విశ్రాంతి త‌దిత‌రాల అవ‌సరం ఎలాగూ లేదు.వేల్స్‌,డాల్ఫిన్స్‌ల్లోని మెద‌డులో స‌గ‌భాగం మాత్ర‌మే నిద్ర‌పోతుంది.మిగిలిన స‌గ‌భాగం ఊపిరి తీసుకొనే క్ర‌మంలో నిమ‌గ్న‌మ‌వుతుంది.ఇక రోజులో ఏక‌ధాటిగా 20మైళ్లు ఈద‌గ‌ల సామ‌ర్థ్యం ఉన్న ఏనుగుల నిద్రా స‌మ‌యం కేవ‌లం నాలుగ్గంట‌లే.అదీ ద‌ఫ‌ద‌ఫాలుగానే నిద్ర‌పోతాయి.న‌త్త‌ల‌యితే ఒక‌సారి నిద్ర‌కు ఉప‌క్ర‌మిస్తే నాల్గేళ్ల వ‌ర‌కు కూడా అదే విశ్రాంతి ద‌శ‌లో ఉండిపోగ‌ల‌వు.స‌ల్మ‌న్‌,పైక్,గోల్డ్‌ఫిష్‌,యాంగ‌ర్ ఫిష్ త‌దిత‌ర చేప‌లకు కూడా నిద్రంట‌నే తెలీద‌ట‌.ఆ కోవ‌లోకే వ‌స్తుంది ఈ బుల్‌ఫ్రాగ్‌.ఇవి ప‌రిమాణంలోనూ చాలా పెద్ద‌వి.జీవిత‌కాలం కూడా ఎక్కువే.అలాగే వీటి బ‌రువును కూడా మ‌నం ఊహించ‌లేం.ఆఫ్రిక‌న్ బుల్‌ఫ్రాగ్ అయితే ఏకంగా 45 ఏళ్లు జీవించ‌గ‌ల‌ద‌ట‌.మిగిలిన ప్ర‌పంచ దేశాల్లోని ఈ జాతి క‌ప్ప‌లు 8నుంచి10ఏళ్లు కొన్న‌యితే 16ఏళ్ల వ‌ర‌కు బ‌తుకుతాయి.వీటి బ‌రువు కూడా రెండు కేజీల పైమాటే.ఈ క‌ప్ప‌ల్లో త‌ల భాగం చాలా పెద్ద‌గా ఉంటుంది.ఇవి 4నుంచి6 అంగుళాల సైజులో ఉంటాయి.ఆడ‌క‌ప్ప‌ల‌యితే మ‌గ‌వాటిక‌న్నా సైజులో ఇంకా పెద్ద‌గా ఉంటాయి.ఇవి 8నుంచి10 అంగుళాల వ‌ర‌కు కూడా పెరుగుతాయి.ఎక్కువ‌గా నీటి మ‌డుగుల్లో నివ‌సించే ఈ క‌ప్ప‌లు ఒడ్డున గుడ్లు పెడ‌తాయి.అదీ వేస‌వి ఆరంభానికి కాస్త ముందు.వేడి వాతావ‌ర‌ణాన్ని అంటే 25నుంచి28 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడిని ఇష్ట‌ప‌డ‌తాయి.వీటి క‌ద‌లిక చాలా నెమ్మ‌దిగా ఉంటుంది.వ‌ర్షాకాలంలో రాత్రి వేళ‌ల్లో ఒక‌చోటు నుంచి మ‌రోచోటుకి సంచ‌రిస్తాయి.అమెరికా,కెన‌డాల్లో ఇవి లేత ఆకుప‌చ్చ‌,లేత బూడిద రంగుల్లో క‌నిపిస్తాయి.ఆఫ్రికాలో అయితే ఇవి ఆలివ్‌గ్రీన్ రంగులో ఉంటాయి.మ‌గ‌వి లేత ప‌సుపురంగు,నారింజ‌ రంగుతో మ‌రీ సొగ‌స‌రిగా ఆక‌ర్షిస్తాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు.
పాములూ ఆహార‌మే: ఎలుక‌లు,పిచ్చుక‌లు,పాము పిల్ల‌లు,చేప‌లు వంటివి దొరికితే ఈ బుల్‌ఫ్రాగ్‌లు వ‌దిలిపెట్ట‌వు.ఇక‌ మిడ‌త‌లు,వాన‌పాములు,తొండ‌లు,కీచురాళ్లు,పేడ‌పురుగులు,ఇత‌ర కీట‌కాల్ని ఆబ‌గా లాగించేస్తాయివి.అందుకే ఈ క‌ప్ప‌ల్ని తినే మ‌నుషుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది.వీటి కాళ్ల‌కు భ‌లేగిరాకీ.ఆ రుచే వేరంటారు మాంసాహార ప్రియులు.ఎక్కువ‌గా చైనా,జ‌పాన్‌ల్లో క‌ప్ప‌ల మాంసాహార ప్రియులు అత్య‌ధికంగా ఉన్నారు.యూర‌ప్‌,ఇత‌ర పాశ్చాత్య దేశాల్లో ఏటా నాలుగు ట‌న్నుల మేర క‌ప్ప‌ల‌ను భోంచేసేస్తున్నార‌ట‌.ఎగుమ‌తి చేసే దేశాల్లో ఇండోనేసియాది ప్ర‌థ‌మ స్థానం.అమెరికా,కెన‌డాల్లో ఊపిరిపోసుకున్న ఈ బుల్‌ఫ్రాగ్స్ జాతిని ఆ దేశాలు ద‌క్షిణ‌కొరియా,వెస్ట్ర‌న్ యూర‌ప్‌,బ్రెజిల్‌,కొలంబియా,ఆస్ట్రేలియాలకు ప‌రిచ‌యం చేసి వృద్ధి చేశాయి.కానీ వీటిని ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ పాఠ‌శాల‌లు,క‌ళాశాల‌ల్లో ప్ర‌యోగాల‌కు వినియోగిస్తుండ‌డం,శాస్త్ర‌వేత్త‌లూ ఇంకా వీటిపై అనేక ప‌రిశోధ‌న‌లు సాగిస్తుండ‌డం, మ‌రోప‌క్క వీటి మాంసం రుచికి ప‌రిత‌పించే జ‌నం పెరిగిపోవ‌డంతో ఈ బుల్‌ఫ్రాగ్ జాతి ఉనికికే ప్ర‌మాదం ఏర్ప‌డింది.మందుల తయారీకి ముఖ్యంగా యాంటీబ‌యోటిక్స్ ఉత్ప‌త్తికి వీటిని వినియోగిస్తుంటారు.
-------------------------------------------------------------------------------------------------------------
INDIA

*National animal:టైగ‌ర్‌
*National bird:నెమ‌లి
*National reptile:త్రాచుపాము
*National icon:కోతి
*National marine animal:డాల్ఫిన్స్‌
*National heritage animal:ఏనుగు



---------------------------------------------------------------------------

No comments:

Post a Comment

Popular Posts

Wisdomrays