27 Dec 2011

kangaroo



కంగారూ..ఇదో విభిన్న‌మైన జంతువు.దీని పేరు చెప్ప‌గానే గుర్తొచ్చే దేశం ఆస్ట్రేలియా.ఇది ఆ దేశ‌పు జాతీయ జంతువు కూడా.ఎందుకంటే భూమిపై సంచ‌రించే ర‌క‌ర‌కాల జంతువులు,ప‌క్షులు త‌దిత‌రాలు ఓ దేశంలో క‌నిపించేవే ప్ర‌పంచంలోని మ‌రో ప్రాంతంలో కూడా మ‌చ్చుకైనా అక్క‌డ‌క్క‌డ అగుపిస్తుంటాయి.కానీ కంగారూలు అందుకు భిన్నం.ఇవి ఆస్ట్రేలియాలో త‌ప్పా మ‌రెక్క‌డ మ‌న‌గ‌ల్గ‌లేవు.ఆడ కంగారూలు త‌మకు పుట్టిన‌ పిల్ల‌ల్ని స‌హ‌జ‌సిద్ధంగా శ‌రీరంలోనే అమ‌రిన సంచి(మార్సుపియ‌మ్‌)వంటి భాగంలో ఉంచుకొనే సాక‌డం క‌చ్చితంగా వీటికే సొంత‌మైన‌ మ‌రో ప్ర‌త్యేక‌త‌.ఈ విధంగా ఏకంగా తొమ్మిది నెల‌ల‌పాటు పిల్ల‌ల్ని సంచిలోనే పెట్టుకొని పోషిస్తాయి.మ‌నుషుల్లో స్త్రీలు త‌మ గ‌ర్భంలో శిశువుల్ని మోసిన‌ట్లన్న మాట‌.
ఆస్ట్రేలియా నేష‌న‌ల్ యానిమ‌ల్‌:.. కోట్ల ఏళ్ల నాడు విశ్వ విస్ఫోట‌నంలో నుంచి భూమండ‌లం ఆవిర్భ‌వించింద‌ని బిగ్ బ్యాంగ్ థియ‌రీ చెబుతోంది.అలా ఏర్ప‌డిన యావ‌త్ భూమి అఖండంగా ఉండేద‌ని శాస్త్ర‌వేత్త‌లు స్ప‌ష్టం చేస్తున్నారు.అంటే ఇప్ప‌ట్లోలా ఏడు ఖండాలు లేవు.భూప‌రిభ్ర‌మణ క్ర‌మంలో భూప‌ల‌క‌లు విభ‌జిత‌మై ఏర్ప‌డిన ఖండాల్లో అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా.ఆవిధంగా జీవ‌కోటి జ‌న‌నం,సంచారం,వ‌ల‌స‌లు జ‌రిగి ఒక్క అంటార్కిటికా మిన‌హా అన్ని ఖండాల‌కు విస్త‌రించింది.అయితే కంగారూలకు మాత్రం ఆస్ట్రేలియా వాతావ‌ర‌ణంలో త‌ప్పా మ‌రే దేశ శీతోష్ణ‌స్థితి,భౌగోళిక ప‌రిస్థితులు స‌రిప‌డ‌వు.దాదాపు 60కు పైగా ర‌కాల కంగారూలున్నాయి.వీటిలో ట్రీ కంగారూలు మాత్రం తొలుత ఇండోనేసియాలోని న్యూగునియా ప్రాంతంలోనే ఊపిరిపోసుకున్నాయ‌ని జంతుశాస్త్ర‌వేత్త‌లు స్ప‌ష్టం చేస్తున్నారు.ఆ త‌ర్వాత ఆ జాతి కంగారూలు కూడా ఆస్ట్రేలియాకే ప‌రిమిత‌మ‌య్యాయి.మేక్రోపాడ్స్ కుటుంబానికి (లార్జ్ ఫుట్‌)చెందిన కంగారూలే కాకుండా డింగోస్‌(ఆస్ట్రేలియా అట‌వీ జాతి కుక్క‌లు),వొంబేట్స్‌(ఓ జాతి ఎలుగుబంటి)కూడా ఆస్ట్రేలియాకే ప్ర‌త్యేకం.కంగారూలు కేవ‌లం ఈ దేశంలో మాత్ర‌మే ఉండ‌డానికి ఆస్ట్రేలియా వాతావ‌ర‌ణం,రాతి ప‌ర్వ‌తాల‌తో కూడిన భౌగోళిక స్థితిగ‌తులు,ల‌భించే ఆహార‌మే కార‌ణ‌మ‌ట‌.ఇవి ప‌గ‌టి వేళ‌ల్లో ఎండ‌పొడ త‌గ‌ల‌ని ప్రాంతాల్లో త‌ల‌దాచుకుంటాయి.కేవ‌లం రాత్రిళ్లే ఆహారాన్ని స్వీక‌రిస్తాయి.తెల్ల‌వారుజాము,సాయంత్రం స‌మ‌యాల్లోనే ఆహారం కోసం చురుగ్గా సంచ‌రిస్తాయ‌ని తెలుస్తోంది.వీటి ఆహారం ప్ర‌ధానంగా గ‌డ్డే.కొన్ని ర‌కాల మొక్క‌ల్ని తిని జీవిస్తాయి.ప‌శువుల మాదిరిగానే ఆహారాన్ని అమాంతం తినేసి త‌ర్వాత తీరిగ్గా నెమ‌ర‌వేసుకుంటాయి.అచ్చం ఎడారి ఓడ ఒంటెల్లా ఇవి మూణ్నెల్ల పాటు అస్స‌లు నీళ్లు తాగుకుండాను ఉండ‌గ‌ల‌వు.ప‌రుగందుకుంటే గుర్రాల‌నే త‌ల‌పిస్తాయి.గంట‌కు 70 కిలోమీట‌ర్ల వేగాన్ని అందుకుంటాయ‌ట‌.కంగారూలు ఈత‌లో చేప‌ల్ని మ‌రిపించ‌గ‌ల‌వంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు.వీటికి డింగోస్‌,వేట‌గాళ్ల నుంచి ముప్పు ఎదురౌతోంద‌ట‌.ఈ కంగారూలు సంపూర్ణ వ‌న్య‌ప్రాణులు.అడ‌వుల్లో అయితే 20 ఏళ్లు జీవించ‌గ‌ల‌వు.ఇత‌ర ప్రాంతాల్లో అయితే 10,12ఏళ్లు మాత్ర‌మే బ‌తుకుతాయి.రెడ్ కంగారూల‌యితే ఏకంగా 2 మీట‌ర్ల పొడ‌వు పెరుగుతాయి.తోక ఆస‌రాతో నిల‌బ‌డే ఈ జీవి సుమారు ఆర‌డుగుల ఏడు అంగుళాల పొడ‌వుతో ఆక‌ట్టుకుంటుంది.ఈ జాతి కంగారూల్లో మ‌గ‌వి 90 కేజీల బ‌రువు తూగుతాయి. 
భాష పేరే ఈ జీవి నామం:ఆస్ట్రేలియాలోని ఓ ప్రాంత భాషైన `గూగు యిమిత‌ర` పేరే కంగారూల‌కు స్థిర‌ప‌డింది.తొలుత గుంగూరు,త‌ర్వాత కంగూరూ అనంత‌రం కంగూరూ ఆపై ఇప్ప‌టి పేరు కంగారూగా వీటికి పేరు వ‌చ్చింది.ఈ ప‌దానికి  `ఐడోంట్ అండ‌ర్‌స్టాండ్ యూ` అని అర్థం అట‌.ఇవి 50వేల ఏళ్ల క్రిత‌మే అవ‌త‌రించాయ‌ట‌.డింగోస్ అయితే అయిదు వేల ఏళ్ల క్రిత‌మే జ‌న్మించిన‌ట్లు తెలుస్తోంది.కంగారూల మాంసం చాలా శ్రేష్టమైంది.కొవ్వు శాతం చాలా త‌క్కువ‌.కంగారూల మాంసం తిన‌డం ద్వారా బీపీ బాగా త‌గ్గుతుంద‌ట‌.దాంతో పాటు చ‌ర్మం కోసం కూడా వేట‌గాళ్ల వీటినే ల‌క్ష్యంగా చేసుకుని వేటాడుతుండ‌డంతో అట‌వీ అధికారులు అత్యంత అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల్సి వ‌స్తోంది.జెన‌స్ మెక్రోప్స్‌,రెడ్ కంగారూ,అంటిలోపైన్‌,ఈస్ట్ర‌న్ గ్రే,వెస్ట్ర‌న్ గ్రే కంగారూల్లో ప్ర‌ధాన ర‌కాలు.స్మాల‌ర్ మైక్రోపాడ్స్ జాతి కంగారూలు ఆస్ట్రేలియాలోనే కాకుండా న్యూగునియాలోనూ క‌నిపిస్తాయి.
అవార్డు అందుకున్న కంగారూ:ఇవి సాధు జీవులు.కోప‌మొస్తేనే తడాఖా చూపుతాయి.రేబిస్ వ్యాధి సోకిన కంగారూలు మ‌నుషుల‌కు హాని త‌ల‌పెడ‌తాయ‌ట‌.భ‌రించ‌లేని ఆక‌లి,ద‌ప్పిక సంద‌ర్భాల్లోనూ ఇవి మ‌నుషుల్ని గాయ‌ప‌రిచే ప్ర‌మాద‌ముంద‌ని శాస్త్ర‌వేత్త‌లను ఉటంకిస్తూ ప‌లువురు ఆస్ట్రేలియ‌న్ ఫారెస్టు ఆఫీస‌ర్స్ వివిధ ఘ‌ట‌న‌ల్ని జ‌ర్న‌ల్స్‌లో పేర్కొన్నారు.మ‌రికొన్ని సంఘ‌ట‌న‌ల్లో ఇవి పెంపుడు జంతువుల్ని కూడా త‌ల‌పిస్తాయ‌ని రుజువైంది.చెట్టు కూలుతుండ‌గా గాయ‌ప‌డ్డ కంగారూ ఓ రైతు కుటుంబానికి సంకేత‌మిచ్చి కాపాడిన ఘ‌ట‌న 2003లో ఆస్ట్రేలియాలో జ‌రిగింది.దాంతో ఆ కంగారూ 2004లో ప్ర‌తిష్టాత్మ‌క `ఆస్ట్రేలియా నేష‌న‌ల్ యానిమ‌ల్ వెలార్‌`(ఆర్‌.ఎస్‌.పి.సి.ఎ)అవార్డును గెల్చుకుంది.

No comments:

Post a Comment

Popular Posts

Wisdomrays