19 Dec 2011

bull fight


స్పెయిన్‌లో అనాదిగా ఆచ‌రిస్తున్న సంప్ర‌దాయ క్రీడే బుల్‌ఫైట్‌. వాస్త‌వానికి ఇది మూగజీవి ర‌క్త‌పుటేరుతో సాగే రాక్ష‌స‌క్రీడ‌బ‌ల‌మైన ఎద్దును క‌ద‌నానికి క‌వ్వించి క‌ర్క‌శంగా క‌డ‌తేర్చే వికృతానంద క‌ళాకేళి. ల‌క్ష‌ల మందితో కిక్కిరిసిన స్టేడియం.. అంద‌రూ క‌ళ్లార్ప‌కుండా కేరింత‌లు కొడుతూ ఉండ‌గా..క‌సాయి క‌త్తి దూస్తూ ఉంటే ఓ మూగ‌జీవి అస‌హాయంగా నెత్తురొడుతూ బ‌లి ప‌శువుగా కుప్ప‌కూలిపోయి క‌న్నుమూస్తుంది.
స్పెయిన్ బుల్‌ఫైట్స్‌ఈ బుల్‌ఫైట్స్ 711ఎ.డి నుంచే స్పెయిన్‌లో జ‌రుగుతున్నాయి.కింగ్ అల్ఫాన్సో-8 రాజ్యాధికారిన్ని చేప‌ట్టిన సంద‌ర్భంగా తొలిసారిగా ప్రారంభ‌మ‌యిందీ క్రీడ‌.ఏడాదిలో మార్చి నుంచి అక్టోబ‌ర్ వ‌ర‌కు స్పెయిన్‌లోని వివిధ రీజియ‌న్ల‌లో ప‌లుచోట్ల ఈ బుల్‌ఫైట్లు జ‌రుగుతుంటాయి.కొన్నిచోట్ల ఏడాదిలో దాదాపు 10 ల‌క్ష‌ల మంది వ‌ర‌కు ఈ బుల్‌ఫైట్ల‌ను తిలకిస్తూ ఆనందిస్తుంటారు.దేశంలో ఏటా 20వేల‌కు పైగా ఎద్దులు సుమారు మూడు కోట్ల మంది సాక్షిగా ప్రాణాలు వ‌దులుతున్న‌ట్లు ఓ అంచ‌నా.స్పానిష్ స్ట‌యిల్ బుల్‌ఫైట్‌కు కొరిడ డిటోర్స్(ర‌న్నింగ్ ఆఫ్ బుల్స్‌)గాను లాఫీఎస్టా(ది ఫెస్టివ‌ల్‌()గా పేర్లున్నాయి.ఈ సంప్ర‌దాయ క్రీడ‌లో ముగ్గురు టోరోస్‌( (మెట‌డోర్లు)చెరో రెండు ఎద్దుల‌తో పోరాడతారు.ఒక్కో టోరో చెరో రెండు ఎద్దుల‌తో త‌ల‌ప‌డ‌తారు.ఒక్కో టోరోకు ఆరుగురు చొప్పున స‌హాయ‌కులు ఈ పోరాటంలో తోడ్ప‌డ‌తారు.350కుపైగా కేజీల బ‌రువుతో నాల్గు నుంచి ఆరేళ్ల వ‌య‌సు గ‌ల ఎద్దు క‌ద‌న‌రంగంలోకి దూకుతుంది.టోరోకు స‌హ‌క‌రించేందుకు ఇద్ద‌రు పిక‌డోర్స్‌ (అశ్వ యోధులు),ముగ్గురు బాండెరిల్లెర్స్‌,ఒక మొజోడిఎస్పాడ‌స్‌((( )(ఖ‌డ్గ‌ధారులు)బ‌రిలోకి దిగుతారు.
క‌త్తితో క‌డ‌తేరుస్తారు:ప‌్ర‌స్తుత ఆధునిక క్రీడ‌లో రింగ్‌లో ఉన్న‌ ఎద్దుపైకి గుర్రాల‌పై వ‌చ్చిన యోధులు,బుల్ ఫైట‌ర్లు,క‌త్తితో బుల్‌ను గాయ‌ప‌రిచే మ‌రో వ్య‌క్తి మూడు ద‌శ‌ల్లో ముప్పేట దాడి చేస్తారు.న‌గారా మోగ్గానే రింగ్‌లోకి ఎద్దుతో స‌హా అంద‌రూ వ‌స్తారు.పోటీ నిర్వాహ‌క అధ్య‌క్షుడికి అభివాదం చేసి ర‌క‌ర‌కాలుగా బుల్‌ను క‌వ్వించి నృత్యాలు చేసి ఆట‌ను మొద‌లు పెడ‌తారు.పోటీ ప్రారంభంలోనే ఎద్దును బాగా రెచ్చ‌గొట్టి వ్యూహాన్ని అమ‌లు చేస్తారు.అప్పుడు ప్ర‌తీకారేచ్ఛ‌తో ర‌గిలిపోయిన ఎద్దు రింగ్ అంతా పోటీదారుల‌ను ప‌రుగులు పెట్టేలా త‌రుముతుంది.ఆ స‌మ‌యంలో గుర్రాల‌ను సైతం కుమ్మేసేందుకు ఎద్దు ప్ర‌య‌త్నిస్తుంది.1930 వ‌ర‌కు ఉన్న నిబంధ‌న‌ల ప్ర‌కారం గుర్రాల‌పై ర‌క్ష‌కులు లేక‌పోవ‌డంతో అంత‌కుముందు వ‌ర‌కు ప‌లు పోటీల్లో వంద‌ల కొద్దీ గుర్రాలు సైతం ఎద్దు కొమ్ముల‌కు బ‌ల‌య్యేవి.ఈ క్రీడ‌లో రెచ్చిపోయిన ఎద్దులు రింగ్ లోప‌లే కాకుండా స్టేడియం గ్యాల‌రీల్లోకి దూసుకొచ్చిన‌ప్పుడు ప్రేక్ష‌కులు కూడా గాయ‌ప‌డ్డ ఘ‌ట‌న‌లు ఎన్నో ఉన్నాయి.2010 ఆగ‌స్టులో నార్త‌ర‌న్ స్పెయిన్ లొఫ‌ల్లాలో జ‌రిగిన ఇలాంటే ఘ‌ట‌న‌లోనే ప‌దేళ్ల బాలుడు స‌హా మొత్తం 40 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.
నిషేధాస్త్రం..:స్టేడియంలో ప్రేక్ష‌కులు ఉత్కంఠ‌తో ఉల్లాసంగా గ‌డుపుతుంటే రింగ్‌లోని ఎద్దు మాత్రం రోషంతోనే రొప్పుతూ ప్రాణాల కోసం పోరాడుతూ ఉంటుంది.అప్పుడు ఎర్ర‌టి గుడ్డ‌ను దాని క‌ళ్లెదుట ఊపుతూ మ‌ళ్లీ రెచ్చ‌గొడ‌తారు.నిజానికి బుల్స్ క‌ల‌ర్ బ్లైండెడ్‌.అవి రంగుల్ని గుర్తించ‌లేవు.బ‌రిలో ఎద్దును బాగా అల‌సిపోయే వ‌ర‌కు ఆ విధంగా ఆడించి ప‌రుగులు పెట్టించి గాయ‌ప‌రిచి అది ర‌క్త‌మోడుతూ నేల‌కూలాక ప‌దునైన పెద్ద క‌త్తితో న‌రికేస్తారు.బాగా గాయ‌ప‌డి రింగ్‌లో ర‌క్తం ధార‌క‌డుతున్నా ఇంకా క‌ద‌నానికి కాలుదువ్వే ఎద్దును నిర్వాహ‌క అధ్య‌క్షుడు విజేత‌గా ప్ర‌క‌టించే అవకాశ‌మూ ఉంది.అప్పుడు మాత్ర‌మే ఆ బుల్ మ‌ళ్లీ ప్రాణాల‌తో రింగ్ బ‌య‌ట‌కు రాగ‌ల్గుతుంది.
ఇదో ఆట‌విక క్రీడ అంటూ దీర్ఘ‌కాలంగా జంతు ప్రేమికులు గ‌గ్గోలు పెడుతూనే ఉన్నారు.ఒక్క స్పెయిన్‌లోనే కాదు ఈ వికృత క్రీడ పోర్చుగ‌ల్‌,లాటిన్ అమెరికా దేశాలైన అమెరికా,పెరూ,కొలంబియా,వెనెజువెలా,ఈక్వెడ‌ర్‌ల్లోనూ కొన్ని ప్రాంతాల్లో  కొన‌సాగుతూనే ఉంది.భార‌త్‌లోని త‌మిళ‌నాడు(మ‌దురై)లో జ‌ల్లిక‌ట్టు పేరిట‌ ఈ బుల్‌ఫైట్‌ను సంప్ర‌దాయ క్రీడ‌గా ఆచ‌రిస్తున్నారు.అయితే సంక్రాంతి సంబ‌రంగా గ్రామాల్లో జ‌రిగే ఈ బుల్‌ఫైట్‌లో ఎద్దుతో నిరాయుధులు మాత్ర‌మే త‌ల‌ప‌డ‌తారు.ఎద్దుకు ఏ హాని త‌ల‌పెట్ట‌రు,దాన్ని చంప‌రు.ప్ర‌స్తుతం ఆయా దేశాల్లో ఈ వికృత క్రీడ‌ను నిషేధించారు.1991లో స్పెయిన్‌లో ఈ బుల్‌ఫైట్‌ను తొలుత నిషేధించిన రీజియ‌న్ కెన‌రీ ఐలాండ్.2012 నుంచి కెట‌లోనియా రీజియ‌న్‌లో కూడా ఈ క్రీడ‌పై నిషేధం అమ‌ల్లోకి రానుంది. 
-------------------------------------------------------------------------------------------------------------
*భార‌తర‌త్న అవార్డుల జాబితాలోకి క‌ళ‌లు,సాహిత్యం,సేవా,ఇత‌ర రంగాల‌తోపాటు క్రీడా రంగాన్ని చేరుస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల తీసుకున్న నిర్ణ‌యాన్ని మొర‌దాబాద్ ప్ర‌స్తుత ఎంపీ(కాంగ్రెస్‌) ప్ర‌ముఖ క్రికెట‌ర్ అజ‌రుద్దీన్ స్వాగతించారు.భార‌తర‌త్న అవార్డును హాకీ దిగ్గ‌జం లెజెండ్ ధ్యాన్‌చంద్‌,మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండుల్క‌ర్ల‌కు ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు.గ‌తంలోనే భార‌త‌ర‌త్న గాన‌కోకిల ల‌తామంగేష్క‌ర్ ఈ అవార్డును స‌చిన్‌కు ప్ర‌దానం చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.మేజ‌ర్ ధ్యాన్‌చంద్ జ‌న్మించిన ఆగ‌స్టు 29వ తేదీనే ఆయ‌న సంస్మ‌ర‌ణార్థం భార‌త్‌లో జాతీయ‌క్రీడా దినోత్స‌వం జ‌రుగుతోంది. 
*మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో భార‌త్ త‌ర‌ఫున పాల్గొన్న వాసుకి సుంక‌వ‌ల్లి నిర్వహించిన షోలో ఎ.పి స‌మాచారశాఖ మంత్రి డి.కె.అరుణ ఓ అనాథ బాలిక‌తో క‌లిసి ర్యాంప్‌వాక్ చేశారు.2003లో రాజ‌స్థాన్ అప్ప‌టి సి.ఎం వ‌సుంధ‌ర రాజే సింధియా కూడా ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రై ర్యాంప్‌వాక్‌లో పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Popular Posts

Wisdomrays