16 Dec 2011

eiffel tower


పారిస్‌..ఫ్రాన్స్‌కే కాదు,ఫ్యాష‌న్ ప్ర‌పంచానికీ రాజ‌ధాని.అందానికే అందం ఈ న‌గ‌రం.ఫ్రాన్స్ అన‌గానే మ‌న‌కు ఠ‌క్కున గుర్తొచ్చేది ఐఫెల్ ట‌వ‌ర్‌.మాన‌వ నిర్మిత అద్భుత క‌ట్ట‌డానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం.పారిస్‌కే మ‌కుటాయ‌మానంగా శ‌తాబ్దాల‌గా ప్ర‌త్యేక గుర్తింపునిస్తోన్న నిర్మాణ‌మిది.ఇప్ప‌టికే 50 కోట్ల మందికి పైగా ఈ ట‌వ‌ర్‌ను సంద‌ర్శించారు.పారిస్‌లోని చాంప్ డిమార్స్‌కు స‌మీపంలో సెనె న‌దీ తీరంలో దీన్ని ప్ర‌ఖ్యాత ఇంజ‌నీర్ గుస్త‌వ్ ఐఫెల్ రూపొందించారు.ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ప‌ర్యాట‌కులు సంద‌ర్శించే చిర‌స్మ‌ర‌ణీయ క‌ట్ట‌డాల్లో ఈ ఐఫెల్ ట‌వ‌ర్ ఒక‌టి.ఏటా 30ల‌క్ష‌ల మంది సంద‌ర్శ‌న‌కు నోచుకుంటోందిది.రెండేళ్ల‌కే మొత్తం నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న‌ ఐఫెల్ ట‌వ‌ర్ 1889 నుంచి సంద‌ర్శ‌కుల‌కు అందుబాటులోకి వ‌చ్చింది.తొలి ఏడాదే ఈ ట‌వ‌ర్‌ను రెండు కోట్ల మంది సంద‌ర్శించ‌డ‌మే క‌ట్ట‌డ‌పు విశిష్ట‌త‌కు నిలువుట‌ద్దంగా పేర్కొన‌వ‌చ్చు.
ఐర‌న్ ఐకాన్‌:ఆకాశాన్ని ముద్దాడుతున్న‌ట్లుండే 324 మీట‌ర్ల ఎత్తుగ‌ల ఈ ఐఫెల్ ట‌వ‌ర్ 20వేల పెద్ద ఇనుప దిమ్మెలు,30 ల‌క్ష‌ల రివెట్ల‌తో నిర్మిత‌మ‌యింది.ఆరేడేళ్ల‌కోసారి ఈ నిర్మాణానికి తుప్పు ప‌ట్ట‌కుండా ఉండేందుకు పెయింట్ వేస్తుంటారు.అందుకు అయిదు ట‌న్నుల‌కు పైగా పెయింట్‌ను వినియోగిస్తారు.ఈ ట‌వ‌ర్ శిఖ‌రం నుంచి చూస్తే పారిస్‌లోని ప్ర‌తి అంగుళం అందం క‌నిపిస్తుంది.సంధ్య‌వేళ మిరుమిట్లను వెద‌జ‌ల్లే దీప‌పు కాంతుల‌తో ఐఫెల్ ట‌వ‌ర్ దేదీప్య‌మానంగా వెలిగిపోతూ సంద‌ర్శ‌కుల మ‌దిని దోచుకుంటుంది.న్యూయార్క్‌లో క్రిస్లెర్ బిల్డింగ్ నిర్మిత‌మ‌య్యే వ‌ర‌కు అంటే 1930 వ‌ర‌కు ఐఫెల్ ట‌వ‌రే ప్ర‌పంచ‌పు మాన‌వ నిర్మిత క‌ట్ట‌డాల‌న్నింటిలోకెల్లా అతి ఎత్తైయిన‌ది.41 ఏళ్ల పాటు ఆ హోదాను నిలుపుకుంది.1957లో ఫ్రాన్స్‌లో మిలౌవ‌యుడ‌క్ట్ నిర్మాణ‌మ‌య్యే వ‌ర‌కు దేశంలో ఎత్తైన క‌ట్ట‌డాల్లో ప్ర‌థ‌మ స్థానంలో ఉంది.తొలుత ఈ ట‌వ‌ర్‌ను 20 ఏళ్ల అనంత‌రం తొల‌గించాల‌నుకున్నా మొద‌టి ప్ర‌పంచ యుద్ధంలో సాధించిన విజ‌యానికి సంకేతంగా దీన్ని య‌థావిధిగా కొన‌సాగించాల‌ని ఫ్రెంచ్ పాల‌కులు నిర్ణ‌యించారు.యూర‌ప్‌కొచ్చే ప‌ర్యాట‌కులు దాదాపు అంద‌రూ పారిస్‌ను సంద‌ర్శిస్తుంటారు.వారు ఐఫెల్ ట‌వ‌ర్‌ను ఎక్కితేనే త‌మ ప‌ర్య‌ట‌న ప‌రిపూర్ణ‌మ‌యిన‌ట్లుగా భావిస్తారు.ఇక్క‌డ షాపింగ్‌,సెనె న‌దిలో విహారాన్ని త‌మ జీవిత‌కాలంపాటు మ‌ధురానుభూతిగా త‌లుస్తుంటారు.

సంద‌ర్శించిన ప్ర‌ముఖులు:లియొనిడ్ బ్రెజ్‌నెవ్‌,మైఖెల్ గోర్బొచేవ్‌, ఫెడ‌ల్ కాస్ట్రో,బిల్ క్లింట‌న్‌,వాస్టాక్ హెవ‌ల్ త‌దిత‌రులు ఈ ట‌వ‌ర్‌ను సంద‌ర్శించారు.
మూడంతస్తుల‌తో మురిపిస్తుందీ ట‌వ‌ర్‌.తొలి రెండు అంత‌స్తుల వ‌ర‌కు మెట్ల దారి కూడా ఉంటుంది.ఇక మూడో అంత‌స్తు నుంచి ట‌వ‌ర్ శిఖ‌ర భాగం వ‌ర‌కు ఎల్వెట‌ర్ల ద్వారానే చేరుకోగ‌లం.మొద‌టి అంత‌స్తులో ఆల్టిట్యూడ్ అనే రెస్టారెంట్ ఉంటుంది. ఇది స‌ముద్ర మ‌ట్టానికి ఏకంగా 95 మీట‌ర్ల ఎత్తున ఉంటుంది.రెండో అంత‌స్తులో గ‌ల జుల్స్‌వెర్నె రెస్టారెంట్‌ సొంత లిఫ్ట్ సౌక‌ర్యాన్ని క‌ల్గి ఉంది. ప్ర‌చండ గాలుల‌ను సైతం త‌ట్టుకొని నిల‌బ‌డే విధంగా ఈ ట‌వ‌ర్ను తీర్చిదిద్దారు.ఇందులో స్నాక్‌బార్‌,అన్ని ర‌కాల వ‌స్తువులు ల‌భించే షాపింగ్‌మాల్‌, పోస్టాఫీస్‌,పారిస్ అందాల‌ను వీక్షించేందుకు వీలుగా అతిపెద్ద హాల్ కొలువుదీరి ఉన్నాయి.
పారిస్ సైట్ సీయింగ్ ఎట్రాక్ష‌న్స్‌:నొట‌ర్ డ్యామ్ కేథెడ్ర‌ల్‌,అర్కెడ్ ట్ర‌మ్పే,బాసిలిక్ డుస్ర్కె కొయ‌ర్‌,బాస్టిల్లె,చాంప్స్ క్లిసీస్‌,కాంక‌ర్డ్ స్క్వేర్‌,సేక్రెడ్ హార్ట్ మాంట్ మార్టె,సెయింట్ చాప్‌ల్‌,ది ఇన్వాల్డెస్‌,పాలిస్ గార్నియ‌ర్‌,క‌న్సియ‌ర్ గెరీ,చాటియ‌న్ డివొర్సెల్స్‌.


No comments:

Post a Comment

Popular Posts

Wisdomrays