13 Mar 2012

Large Bridge



గోదావ‌రి దేశంలోనే రెండో పెద్ద‌న‌ది. ద‌క్షిణ గంగ‌గా ప్ర‌తీతి.ప‌శ్చిమ క‌నుమ‌ల్లో మ‌హారాష్ట్ర‌లోని త్ర‌యంబ‌కేశ్వ‌ర్‌(నాసిక్‌) వ‌ద్ద పుట్టింది. వివిధ రాష్ట్రాల మీదుగా పారుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని బాస‌ర‌(ఆదిలాబాద్‌) గుండా రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో ప్ర‌వ‌హించి అంత‌ర్వేది వ‌ద్ద బంగాళాఖాతంలో క‌లుస్తోంది. 1,465 కిలోమీట‌ర్ల సుదీర్ఘ ప్ర‌యాణంలో ఈ న‌ది అఖండ గోదావ‌రిగా క‌నిపించేది మాత్రం ద‌క్షిణ కాశీగా పేరొందిన రాజ‌మండ్రి (తూర్పుగోదావ‌రి జిల్లా)వ‌ద్ద‌నే. రైస్ బౌల్ ఆఫ్ ఎ.పి (ఇండియా)గా ఖ్యాతి గ‌డించిన ఉభ‌య‌గోధావ‌రి జిల్లాల‌ను క‌లిపే ఓ పెద్ద వంతెన ఈ న‌దిపై ఉంది. అదే రోడ్‌కంరైల్ బ్రిడ్జి.ఈ త‌ర‌హా బ్రిడ్జ్‌లు ప్ర‌పంచంలో కొన్ని ఉన్నాయి. అయితే ప్ర‌త్యేక‌త‌ల్లో ఈ బ్రిడ్జి త‌న‌కు త‌నే సాటి. ఆసియాలోనే రెండో అతి పొడ‌వైన వంతెన‌గా దీనికి పేరు. మొత్తం పొడ‌వు 4,732 మీ. చారిత్ర‌క‌,సాంస్కృతిక‌,సంస్క‌ర‌ణ‌శీల న‌గ‌రంగా విరాజిల్లుతున్న రాజ‌మండ్రిలో ఈ వంతెన నిర్మితం కావ‌డాన్ని ఇక్క‌డ న‌గ‌ర‌వాసులు గ‌ర్వ‌కార‌ణంగా భావిస్తారు. వ్యాపార‌,వాణిజ్య కేంద్ర‌మైన రాజ‌మండ్రి అతి పురాత‌న న‌గ‌రాల్లో ఒక‌టి.చాళుక్య రాజైన రాజరాజ న‌రేంద్రుడు 1022 ఎ.డి కాలంలో ఇక్క‌డ పాల‌న సాగించారు. మ‌హాభార‌తాన్ని తెనుగీక‌రించిన క‌విత్ర‌యంలోని ఆదిక‌వి న‌న్న‌య్య ఈ నేల‌పై తిరుగాడిన వారే. సంఘ సంస్క‌ర్త తొలి తెలుగు న‌వ‌లా(రాజ‌శేఖ‌ర చ‌రిత్ర‌) ర‌చ‌యిత కందుకూరి వీరేశ‌లింగం ఈ న‌గ‌ర‌వాసే. ఇలా ప్ర‌ముఖుల‌తోనే కాక ఇప్ప‌టికీ అనేక అల‌రించే ప్రాంతాల‌తో తులతూగుతున్న ప్రాంత‌మిది. పురాత‌న తాళ‌ప‌త్ర గ్రంథాల‌తో స‌హా ప‌లు ప్రాచీన సాహిత్య పుస్త‌కాల‌తో కొలువుదీరిన గౌత‌మీ గ్రంథాల‌యం,దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాల‌రీ,రాళ్లబండ మ్యూజియం,ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజీ,కాట‌న్ మ్యూజియం త‌దిత‌రాలెన్నింటినో నిత్యం ఇక్క‌డ‌కు వ‌చ్చి అనేక‌మంది సంద‌ర్శిస్తుంటారు.
రోడ్‌కంరైల్ బ్రిడ్జ్‌: గోదావ‌రి జ‌లాలు నిరుప‌యోగంగా స‌ముద్రంలో క‌లిసిపోవ‌డాన్ని గుర్తించిన బ్రిటిష్ పాల‌కుడు స‌ర్ ఆర్ధ‌ర్ థామ‌స్ కాట‌న్ 1850లో ధ‌వ‌ళేశ్వ‌రం వ‌ద్ద ఆన‌క‌ట్ట‌ను నిర్మించారు.ఆయ‌నే 1900లో రాజ‌మండ్రి-కొవ్వూరుల‌ను క‌లుపుతూ గోదావ‌రి న‌దిపై తొలి వంతెన క‌ట్టారు.ఇది రైలు వంతెన‌. కేవ‌లంరాతి సున్నం,ఇనుప దిమ్మెల‌తోనే నిర్మిత‌మైన ఈ పాత వంతెన దాదాపు 100 ఏళ్లు సేవ‌లందించి ఇప్ప‌టికీ నిలిచి ఉంది.అప్పటి ఇంజ‌నీరింగ్ నైపుణ్యానికిదో మ‌చ్చు తున‌క‌.ఈ వంతెన‌తోపాటు మ‌రో వంతెన అవ‌స‌రాన్ని గుర్తించిన భార‌త ప్ర‌భుత్వం రోడ్ కంరైల్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేప‌ట్టింది.63 కోట్ల స్వ‌ల్ప మొత్తంతోనే ఏర్ప‌డిన ఈ కొత్త వంతెనను 1972లో అప్ప‌టి భార‌త ప్ర‌ధాని ఇందిరాగాంధీ ప్రారంభించారు.ఈ కొత్త బ్రిడ్జి నిరాటంకంగా సేవ‌లందిస్తోంది.డ‌బుల్ డెక‌ర్ బ‌స్సులు,రైళ్ల‌ను త‌ల‌పించే ఈ వంతెన‌పై గ‌ల రోడ్డు మార్గంలో బిల‌బిల మంటూ ప్ర‌యాణించే వాహ‌న‌శ్రేణులు,ఆ కింద‌నే దూసుకుపోయే రైళ్ల‌ను చూడ్డం భ‌లే క‌నువిందు. లెక్క‌కు మించి వాహ‌నాలు ప్ర‌యాణించే సౌక‌ర్యమే కాక కింద‌న గ‌ల ట్రాక్‌పై గంట‌కు 75 మైళ్ల వేగంతో రైళ్లను ప‌రిగెత్తించ‌గ‌ల సామ‌ర్థ్యం ఈ కొత్త బ్రిడ్జి సొంతం.ఈ రోడ్ కం రైల్ బ్రిడ్జిని భర‌త్ బారీ ఉద్యోగ నిగం లిమిటెడ్ నిర్మించింది.ఈ వంతెన ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌లోగ‌ల గ్రాఫ్ట‌న్ బ్రిడ్జ్‌ను పోలి ఉంటుంది. ప్ర‌స్తుతం ఈ వంతెన‌పై ఒత్తిడిని త‌గ్గించేందుకు రోడ్డు ర‌వాణా కోసం మ‌రో పొడ‌వైన వార‌ధి నిర్మించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం అవుతున్నాయి.
ఆర్క్ బ్రిడ్జి: రాజ‌మండ్రి-కొవ్వూరుల మ‌ధ్య ముచ్చ‌ట‌గా మూడో రైలు వంతెన కూడా నిర్మిత‌మైంది.1997 నుంచి అందుబాటులోకి వ‌చ్చిన ఈ స్విట్జ‌ర్లాండ్ మోడ‌ల్ ఆర్క్ బ్రిడ్జికీ ప్ర‌త్యేక‌త ఉంది. ఇది డ‌బుల్ ట్రాక్ రైల్ బ్రిడ్జ్‌.ప‌క్క‌ప‌క్క‌నే గ‌ల ట్రాక్‌ల‌పై ఏక‌కాలంలో రెండు రైళ్లు ప్ర‌యాణించొచ్చు.అదీ గంట‌కు 350 కిలోమీట‌ర్ల‌ వేగంతో రైళ్లు దూసుకుపోయే సామ‌ర్థ్యాన్ని ఈ వంతెన క‌ల్గి ఉండ‌డం విశేషం.అయితే ఈ వంతెన‌పై ప్ర‌స్తుతానికి ఒక ట్రాక్‌ను మాత్ర‌మే రైల్వే శాఖ వినియోగించుకుంటుంది.ఈ ఆర్క్ బ్రిడ్జ్‌ను హిందుస్థాన్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కంపెనీ తీర్చిదిద్దింది. 

Top-10 longest bridges in the World

Danyang–Kunshan Grand Bridge 
1. Danyang–Kunshan Grand Bridge –It is a 164.8 kilometres (102.4 mi) long viaduct on the Beijing–Shanghai High-Speed Railway. The bridge is located between Shanghai and Nanjing in East China’s Jiangsu province.
2. Tianjin Grand Bridge – As of 2011 Guinness World Records recorded it as the second longest bridge in the world. runs between Langfang and Qingxian, part of the Beijing–Shanghai High-Speed Railway. It is one of the longest bridges in the world with a total length of about 373,000 ft, or 113.7 kilometres (70.6 mi).
3. The Weinan Weihe Grand Bridge – connects Zhengzhou and Xi’an, in China. The bridge is 79,732 m (261,588 ft) (49.5 Miles) long crossing the Wei River twice, as well as many other rivers, highways and railways.
4. The Bang Na Expressway –The Bang Na Expressway, officially Burapha Withi Expressway, is a 54 km long six-lane elevated highway in Bangkok, Thailand.
5. Beijing Grand Bridge –Is a 48.153 kilometres (29.921 mi) long railway viaduct on the Beijing–Shanghai High-Speed Railway, located in Beijing.
6. Jiaozhou Bay Bridge - T” shaped with 3 entry/exit points roadway bridge in eastern China’s Shandong province. It transects Jiaozhou Bay, connecting Huangdao District, the city of Qingdao and Hongdao Island.  Jiaozhou Bay Bridge is 42.5 kilometres (26.4 mi) long.
7. The Lake Pontchartrain Causeway - Consists of two parallel bridges crossing Lake Pontchartrain in southern Louisiana, United States. The longer of the two bridges is 23.83 miles (38.35 km) long. Since 1969 it was listed by Guinness World Records as the longest bridge over water in the world.
8. The Manchac Swamp Bridge - Is a twin concrete trestle bridge in the US state of Louisiana. With a total length of 22.80 miles (36.69 km. Opening in 1979.
9. Yangcun Bridge – People´s Republic of China presents with pleasure various ostentatious constructions. One of them is Yangcun (35,8 kms), the fourth longest bridge of the world. It makes a part of railway between towns of Beijing and Tian-jin

10. Hangzhou Bay Bridge - Is a long highway bridge with a cable-stayed portion across Hangzhou Bay in the eastern coastal region of China. It connects the municipalities of Jiaxing and Ningbo in Zhejiang province. At 35.673 km (22 mi) in length, Hangzhou Bay Bridge is one of the longest trans-oceanic bridges in the world.


11 Mar 2012

Stalwart Putin

(you can see other posts from this blog,go through with mozilla firefox/google chrome)

ర‌ష్యా ఓ అమేయ శ‌క్తి...అగ్ర రాజ్య అరుణ‌ ప‌తాక‌..... అంత‌రిక్షం నుంచి ఆయా రంగాల వ‌రకు ముందుండి త‌న‌దైన ముద్ర వేసిన దేశం. కానీ సోవియ‌ట్ యూనియ‌న్ 1991లో అంత‌ర్థాన‌మైన నేప‌థ్యంలో ర‌ష్యా ఒక్క‌సారిగా అత‌లాకుత‌ల‌మ‌యింది. లెనిన్‌, స్టాలిన్‌, బ్రెజ్నెవ్ త‌దిత‌ర మేరున‌గ ధీరులు ప‌రిచిన బాట‌లు బ‌దాబ‌ద‌లై ఏకంగా దేశ‌మే కుదేల‌యింది. సోవియ‌ట్ యూనియ‌న్ చివ‌రి అధ్య‌క్షుడు గోర్బోచేవ్ అమ‌లు చేసిన గ్లాస్‌నోస్త్‌, పెరెస్త్రోయికా సంస్క‌ర‌ణ‌ల ఫ‌లాల మాటేమో గానీ యావ‌త్ ర‌ష్యా అనేక స‌మ‌స్య‌ల వ‌ల‌యాల్లో కూరుకుపోయింది. ఆ త‌ర్వాత ర‌ష్యా అధ్య‌క్షుడిగా ఎల్సిన్ జ‌మానా వెల‌వెల‌బోయిన త‌రుణంలో పేద‌రికం, నిరుద్యోగం, ఆర్థిక తిరోగ‌మ‌నం అగ్ర‌దేశాన్ని కాస్తా అయ్యో అనే స్థితికి తీసుకువ‌చ్చాయి. ఎవ‌రో వ‌స్తార‌ని ఏదో చేస్తార‌ని ఎదురు చూస్తున్న స‌గ‌టు ర‌ష్య‌న్ల‌కు అస‌లు సిస‌లైన సాహ‌సి దొరికాడు.అత‌నే స్టాల్‌వార్ట్ పుతిన్‌.
Boy Putin
సాహ‌స నాయ‌కుడు పుతిన్‌:`స్టాల్‌వార్ట్‌`పుతిన్ ఇది ర‌ష్య‌న్లు త‌మ అధ్య‌క్షుడికి ఇచ్చిన కితాబు కాదు.పుతిన్‌ను ఉద్దేశిస్తూ సాక్షాత్తు అమెరికా అధ్య‌క్షుడు నోటివెంట వెలువ‌డిన ప్ర‌శంస అది.2007లో జి-8 దేశాల స‌ద‌స్సు సాక్షిగా అప్ప‌టి అమెరికా అధ్య‌క్షుడు జార్జిబుష్ టెర్ర‌రిజం అణ‌చివేత‌లో ర‌ష్యా అధ్య‌క్షుడైన పుతిన్ సామ‌ర్థ్యాన్ని అభినందిస్తూ ఈ కాంప్లిమెంట్ ఇచ్చారు.రుబుల్ ప‌త‌నంతోపాటు విచ్ఛిన్న‌పుటంచుల్లో నిలిచిన దేశాన్ని స‌మైక్యంగా సుస్థిరంగా ఆర్థిక పురోగ‌మ‌న మార్గంలో న‌డిపించిన స‌మ‌ర్థ‌నేత పుతిన్‌.అందుకే 59 ఏళ్ల పుతిన్‌కే మూడోసారి తిరుగులేని మెజార్టీతో  ఆదేశ ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు.ఎల్సిన్ చేసిన మంచిప‌నుల్లో మొద‌టిగా చెప్పుకోవాల్సిందేమంటే త‌న ప్ర‌ధానుల కూట‌మిలోకి పుతిన్‌ను తీసుకోవ‌డ‌మే.లా ప‌ట్టాను పొంద‌డమే కాక కె.జి.బి స‌ర్వీసులో ఉన్న పుతినే భావి ర‌ష్యా ప‌థ నిర్దేశికుడిగా ఆనాడే ఎల్సిన్ గుర్తించ‌డం ఆ దేశానికి ఎంతో మేలునే చేసింది.తొమ్మిదేళ్లు తిర‌క్కుండానే 1999లో తొలుత ర‌ష్యా తాత్కాలిక అధ్య‌క్షుడిగాను ఆ త‌ర్వాత నాలుగు నెల‌ల‌కే జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలిచి దేశ అధ్య‌క్షుడిగా పుతిన్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.మ‌ళ్లీ 2004లోనూ ఆయ‌నే అధ్య‌క్షుడు. ర‌ష్యా నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌రుస‌గా మూడోసారి అధ్య‌క్షుడిగా పీఠం ఎక్కే అవ‌కాశం లేక‌పోవ‌డంతో ప్ర‌ధానిగా ఆయ‌న బాధ్య‌త‌లు తీసుకున్నారు. 2008 నుంచి మ‌ళ్లీ ఇప్పుడు అధ్య‌క్షుడు అయ్యే వ‌ర‌కు దేశ సంక్షేమం కోసం నిరంతరం పోరాడారు.
ర‌ష్యా పూర్వ‌వైభ‌వం:ర‌ష్యాకు మ‌ళ్లీ పూర్వ వైభ‌వం వ‌చ్చిందంటే అది పుతిన్ హయాం వ‌ల్లే అంటే అతిశ‌యోక్తి ఎంత‌మాత్రం కాదు.ఆ దేశ ప్ర‌స్తుతాభివృద్ధిలో ఆయ‌న పాలనా ముద్ర అంత‌గా ప‌డింది.ముఖ్యంగా ఎన‌ర్జీ సెక్టార్‌లో ర‌ష్యా ఇప్పుడు తిరుగులేని శ‌క్తి.ఆయిల్‌,నేచుర‌ల్‌గ్యాస్‌,ఖ‌నిజాల ఎగుమ‌తుల్లో ఆధిప‌త్యాన్ని క‌న‌బ‌రుస్తోంది.ప్ర‌పంచ భూభాగంలో ర‌ష్యాది మొద‌టిస్థానం.ఆ దేశంలో మొత్తం 9 టైంజోన్‌లు ఉన్నాయి.ర‌ష్యా భూభాగంలో 60 శాతం నార్త‌ర‌న్‌ఆసియాలో 40 శాతం యూర‌ప్‌లోను విస్త‌రించి ఉంది.  జ‌నాభాలో తొమ్మిదో పెద్ద దేశ‌మైన ర‌ష్యా ఐక్య‌రాజ్య‌స‌మితిలోని భ‌ద్ర‌తామండ‌లిలో శాశ్వ‌త స‌భ్య‌దేశం.ఐ.ఎం.ఎఫ్ తాజా నివేదిక ప్ర‌కారం అత్య‌ధిక జి.డి.పి గ‌ల దేశాల జాబితాలో 11వ స్థానంలో ఉంది.అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌లు,అణుపాట‌వ,సైనిక‌శ‌క్తిలో ర‌ష్యా సామ‌ర్థ్యం తిరుగులేనిదే. ర‌ష్యా మ‌ళ్లీ పూర్వ వైభ‌వాన్ని అందుకుంటుంద‌న‌డానికి ఆ దేశంలో పెరిగిన కొనుగోలు శ‌క్తే తిరుగులేని ఉదాహ‌ర‌ణ‌.ఇక పుతిన్ అధ్య‌క్షుడిగా ప‌ద‌విలో ఉన్న కాలం 1999 నుంచి 2008 మ‌ధ్య ఆ దేశంలో జి.డి.పి శాతాలు వ‌రుస‌గా 6.5,10,5.7,4.9,7.3,7.2,6.4,8.2,5.2 గా న‌మోద‌య్యాయి.పేద‌రికం శాతం 14కు త‌గ్గింది.జూడోలోనూ నిపుణుడైన పుతిన్‌ నిస్సందేహంగా గొప్ప సాహ‌సి.

లీడ‌ర్స్ ఆర్ నాట్ బోర్న్ దే ఆర్ మేడ్ అంటారు.పుతిన్ అలా తిరుగులేని నాయ‌కుడిగా ఎద‌గ‌డంలో ప్ర‌త్య‌క్షంగానో ప‌రోక్షంగానో కార‌కులైన వారిలో లెనిన్‌గ్రాడ్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ అన‌తోలి సొబ్చాక్ ఒక‌రు.సొబ్చాక్ లెనిన్‌గ్రాడ్ మేయ‌ర్‌గా ప‌ద‌విలో ఉన్న‌ప్పుడు కూడా పుతిన్‌ను ప్రోత్స‌హించారు.త‌న‌కు ప్ర‌త్యామ్నాయం చూప‌గ‌లిగిన‌వాడే నిజ‌మైన నాయ‌కుడ‌ని పెద్ద‌లంటారు.భ‌విష్య‌త్‌లో ఆ ప‌ని చేయాల్సిన బాధ్య‌త పుతిన్‌పైనే ఉంది.


10 Mar 2012

Admission to other institutes based on IIT-JEE 2012 ranks


GUYS
V.Uma Shankar,Mechanical engineer
 Sr.Manager , VIZAG STEEL PLANT 
Message from Guys column 
(Guts Utilized Youth`s Success)



Admission to other institutes based on IIT-JEE 2012 ranks
Candidates should note that the institutes listed below will admit students based
on the IIT-JEE 2012 ranks. They are advised to apply saperately to these
insttutes and visit the respective website for more details.
  • Rajiv Gandhi Institute of Petroleum Technology, Rae Bareli for admission to the 
  • following B.Tech courses
    • B. Tech in Petroleum Engineering (earlier called Petroleum Reservoir and
    • Production Engineering) - 40 seats
    • B. Tech in Chemical Engineering (earlier called Petroleum Refining Engineering)
    •  - 35 seats
  • Indian Institutes of Science Education and Research (IISER) for admission to their 
  • 5 year integrated Master of Science (MS) program.
  • Indian Maritime University to the following courses:
    • 3-year B.Sc.(Nautical Science) degree course at T.S. Chanakya, Navi Mumbai,
    • Mumbai campus.
    • 4-year B.Tech. (Marine Engineering) degree course at Marine Engineering &
    • Research Institute, Kolkata, Kolkata campus and National Maritime Academy,
    • Chennai, Chennai campus.
    • 3-year B.Sc. (Maritime Science) degree course at Marine Engineering and 
    • Research Institute, Mumbai, Mumbai campus.
    • 4-year B.Tech. (Naval Architecture & Ocean Engineering) degree course
    • at Visakhapatnam campus.

MQMR and Cut off marks for jee 2011 exact


MQMR and Cut-off marks


Category
Subject wise cut-off
Merit list cut-off marks
Chemistry
Physics
Mathematics
GE
20
20
34
229
OBC
18
18
31
207
SC
10
10
17
119
ST
10
10
17
115
PD
10
10
17
115

Popular Posts

Wisdomrays