31 Dec 2011
28 Dec 2011
coober pedy
(you can see other posts from this blog, go threw with mozilla firefox/google chrome)
మనిషి గాల్లో,నీటిలో,అంతరిక్షంలోనూ నేడు విహరిస్తున్నాడు.కానీ శాశ్వత నివాసం మాత్రం భూమి పైనే.మరి భూమి లోపల ఇళ్లు కట్టుకొని జీవించడం సాధ్యమేనా?ఈ ప్రశ్నకు కచ్చితంగా అవుననే సమాధానమిస్తున్నారు కూబర్‌పెడి భూగర్భ పట్టణ వాసులు.నార్తరన్ సౌత్ ఆస్ట్రేలియాలో ఏకంగా ఓ పట్టణమే భూమి అడుగున నిర్మితమయింది.బహుశా ప్రపంచంలోనే ప్రస్తుతం ఇలా భూగర్భంలోగల ఏకైక పట్టణం ఇదేనేమో.ఇది ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత టూరిజం స్పాట్‌గా కూడా చరిత్ర సృష్టిస్తోంది.
ప్రఖ్యాత రాతి గని: వాస్తవానికి కూబర్‌పెడి ప్రపంచ ప్రసిద్ధ రాతి గనుల ప్రాంతం.1858లోనే ఇది వెలుగులోకి వచ్చింది.అయితే 1916 నుంచే ఇక్కడ జనావాసాల ఆలోచనకు అంకురార్పణ జరిగింది.ఆడిలైడ్‌కు ఉత్తరం నుంచి ఈ ప్రాంతం 846 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఇక్కడ ఒపల్ గనులు దాదాపు 5వేల చదరపు మైళ్ల మేర విస్తరించి ఉన్నాయి.కూబర్‌పెడికి వెళ్లేందుకు స్టౌర్ట్ హైవే నుంచి రోడ్డు మార్గం ఉంది.ఈ భూగర్భ పట్టణంలో 2006 జనాభా లెక్కల ప్రకారం సుమారు రెండువేల మంది శాశ్వత నివాసితులున్నారు.వీరి ఇళ్లను డగౌట్స్ అంటారు.కూబర్‌పెడి భూగర్భ పట్టణంపైనున్న భూఉపరితలంపై మూడు భవంతులున్నాయి.అందులో ఒకటి హాస్పిట్ భవనం.ఈ భూగర్భ పట్టణంలో ఇళ్లే కాక మ్యూజియాలు,షాపులు,ఆర్ట్ గ్యాలరీలు,చర్చ్‌లు,హోటళ్లు భూఉపరితల నగరాల్లో ఉన్న సకల సౌకర్యాలను తలదన్నెలా నిర్మితమయ్యాయి.అందుకే ఏటా ఈ పట్టణ సందర్శనకు దాదాపు లక్షమంది వచ్చి సంభ్రమాశ్చర్యాలతో తిరిగి వెళ్తుంటారు.
సమాచార ప్రవాహం: కూబర్‌పెడి వాసులకు రేడియో, టి.వి, పేపర్ సౌకర్యాలు న్నాయి. ఎబిసి నేషనల్ రేడియో, డస్ట్ రేడియో, ఫ్లో ఎఫ్.ఎం, కామా రేడియో సమాచార సేవలతో పాటు ఇంపర్జా టీవీ, సెవెన్ సెంట్రల్, ఎబిసి, ఎస్‌బిఎస్ చానళ్లు అందుబాటులో ఉన్నాయి.ఇవే కాకుండా వీక్లీగా వెలువడే కూబర్‌పెడి న్యూస్ పేపర్ లభ్యమౌతోంది. 2013లోగా డిజిటల్ టీవీ చానల్ భాగ్యాన్ని కల్గించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కూబర్‌పెడికి 42కిలోమీటర్ల దూరాన ఉన్న మంగురి సైడింగ్ వరకు ఆడిలైడ్ నుంచి రైళ్లు నడుస్తుంటాయి. అయితే ఈ పట్టణానికి రాకపోకలు సాగించేందుకు పగటి వేళల్లోనే ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. రాత్రి వేళల్లో ఈ ప్రాంతంలో చోటుచేసుకునే అతిశీతల వాతావరణమే అందుకు కారణమట.
ఉల్లాసాల వాతావరణం: కూబర్‌పెడిలో ఏడాది పొడవునా వాతావరణం ఆహ్లాదంగానే ఉంటుంది. అది వేసవి కాలమైనా అత్యధిక ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెంటీగ్రేడ్‌ను మించదు. ఇక శీతాకాలమైనా కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు దిగదు. అయితే ఈ భూగర్భ పట్టణంలో ఓసారి అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలుగా, అత్యల్ప ఉష్ణోగ్రత -2 డిగ్రీలగా నమోదయినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఏడాది మొత్తం తేమ శాతం కూడా సమతూకంతోనే ఉంటుందట. ఈ పట్టణంలో ఒక్క గడ్డిపోచ సైతం కనిపించదు.ఒక చెట్టు మాత్రం ఉంది. అది దుక్క ఇనుముతో తయారైనది,ఓ కొండ కొనపై ఇక్కడ కూబర్‌పెడి పట్టణం ఉందన్న సంకేత సూచికగా అది నిలిచి ఉంది.
వరల్డ్ అండర్‌గ్రౌండ్ చర్చ్‌లు:బ్లెస్డ్ కింగ్ చాపెల్(క్రాకౌ,పోలెండ్);కెటకోంబ్ అండర్‌గ్రౌండ్ చర్చ్(రోమ్,ఇటలీ);సెయింట్ కింగ్స్ చాపెల్;జిపాక్విర్(కొలంబియా,యూఎస్);చర్ఛ్ ఆఫ్ సెయింట్ జాన్(పిక్చరెస్క్యూ,ఫ్రాన్స్).
27 Dec 2011
kangaroo
కంగారూ..ఇదో విభిన్నమైన జంతువు.దీని పేరు చెప్పగానే గుర్తొచ్చే దేశం ఆస్ట్రేలియా.ఇది ఆ దేశపు జాతీయ జంతువు కూడా.ఎందుకంటే భూమిపై సంచరించే రకరకాల జంతువులు,పక్షులు తదితరాలు ఓ దేశంలో కనిపించేవే ప్రపంచంలోని మరో ప్రాంతంలో కూడా మచ్చుకైనా అక్కడక్కడ అగుపిస్తుంటాయి.కానీ కంగారూలు అందుకు భిన్నం.ఇవి ఆస్ట్రేలియాలో తప్పా మరెక్కడ మనగల్గలేవు.ఆడ కంగారూలు తమకు పుట్టిన పిల్లల్ని సహజసిద్ధంగా శరీరంలోనే అమరిన సంచి(మార్సుపియమ్)వంటి భాగంలో ఉంచుకొనే సాకడం కచ్చితంగా వీటికే సొంతమైన మరో ప్రత్యేకత.ఈ విధంగా ఏకంగా తొమ్మిది నెలలపాటు పిల్లల్ని సంచిలోనే పెట్టుకొని పోషిస్తాయి.మనుషుల్లో స్త్రీలు తమ గర్భంలో శిశువుల్ని మోసినట్లన్న మాట.
ఆస్ట్రేలియా నేషనల్ యానిమల్:.. కోట్ల ఏళ్ల నాడు విశ్వ విస్ఫోటనంలో నుంచి భూమండలం ఆవిర్భవించిందని బిగ్ బ్యాంగ్ థియరీ చెబుతోంది.అలా ఏర్పడిన యావత్ భూమి అఖండంగా ఉండేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.అంటే ఇప్పట్లోలా ఏడు ఖండాలు లేవు.భూపరిభ్రమణ క్రమంలో భూపలకలు విభజితమై ఏర్పడిన ఖండాల్లో అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా.ఆవిధంగా జీవకోటి జననం,సంచారం,వలసలు జరిగి ఒక్క అంటార్కిటికా మినహా అన్ని ఖండాలకు విస్తరించింది.అయితే కంగారూలకు మాత్రం ఆస్ట్రేలియా వాతావరణంలో తప్పా మరే దేశ శీతోష్ణస్థితి,భౌగోళిక పరిస్థితులు సరిపడవు.దాదాపు 60కు పైగా రకాల కంగారూలున్నాయి.వీటిలో ట్రీ కంగారూలు మాత్రం తొలుత ఇండోనేసియాలోని న్యూగునియా ప్రాంతంలోనే ఊపిరిపోసుకున్నాయని జంతుశాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.ఆ తర్వాత ఆ జాతి కంగారూలు కూడా ఆస్ట్రేలియాకే పరిమితమయ్యాయి.మేక్రోపాడ్స్ కుటుంబానికి (లార్జ్ ఫుట్)చెందిన కంగారూలే కాకుండా డింగోస్(ఆస్ట్రేలియా అటవీ జాతి కుక్కలు),వొంబేట్స్(ఓ జాతి ఎలుగుబంటి)కూడా ఆస్ట్రేలియాకే ప్రత్యేకం.కంగారూలు కేవలం ఈ దేశంలో మాత్రమే ఉండడానికి ఆస్ట్రేలియా వాతావరణం,రాతి పర్వతాలతో కూడిన భౌగోళిక స్థితిగతులు,లభించే ఆహారమే కారణమట.ఇవి పగటి వేళల్లో ఎండపొడ తగలని ప్రాంతాల్లో తలదాచుకుంటాయి.కేవలం రాత్రిళ్లే ఆహారాన్ని స్వీకరిస్తాయి.తెల్లవారుజాము,సాయంత్రం సమయాల్లోనే ఆహారం కోసం చురుగ్గా సంచరిస్తాయని తెలుస్తోంది.వీటి ఆహారం ప్రధానంగా గడ్డే.కొన్ని రకాల మొక్కల్ని తిని జీవిస్తాయి.పశువుల మాదిరిగానే ఆహారాన్ని అమాంతం తినేసి తర్వాత తీరిగ్గా నెమరవేసుకుంటాయి.అచ్చం ఎడారి ఓడ ఒంటెల్లా ఇవి మూణ్నెల్ల పాటు అస్సలు నీళ్లు తాగుకుండాను ఉండగలవు.పరుగందుకుంటే గుర్రాలనే తలపిస్తాయి.గంటకు 70 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయట.కంగారూలు ఈతలో చేపల్ని మరిపించగలవంటున్నారు శాస్త్రవేత్తలు.వీటికి డింగోస్,వేటగాళ్ల నుంచి ముప్పు ఎదురౌతోందట.ఈ కంగారూలు సంపూర్ణ వన్యప్రాణులు.అడవుల్లో అయితే 20 ఏళ్లు జీవించగలవు.ఇతర ప్రాంతాల్లో అయితే 10,12ఏళ్లు మాత్రమే బతుకుతాయి.రెడ్ కంగారూలయితే ఏకంగా 2 మీటర్ల పొడవు పెరుగుతాయి.తోక ఆసరాతో నిలబడే ఈ జీవి సుమారు ఆరడుగుల ఏడు అంగుళాల పొడవుతో ఆకట్టుకుంటుంది.ఈ జాతి కంగారూల్లో మగవి 90 కేజీల బరువు తూగుతాయి.
భాష పేరే ఈ జీవి నామం:ఆస్ట్రేలియాలోని ఓ ప్రాంత భాషైన `గూగు యిమితర` పేరే కంగారూలకు స్థిరపడింది.తొలుత గుంగూరు,తర్వాత కంగూరూ అనంతరం కంగూరూ ఆపై ఇప్పటి పేరు కంగారూగా వీటికి పేరు వచ్చింది.ఈ పదానికి `ఐడోంట్ అండర్‌స్టాండ్ యూ` అని అర్థం అట.ఇవి 50వేల ఏళ్ల క్రితమే అవతరించాయట.డింగోస్ అయితే అయిదు వేల ఏళ్ల క్రితమే జన్మించినట్లు తెలుస్తోంది.కంగారూల మాంసం చాలా శ్రేష్టమైంది.కొవ్వు శాతం చాలా తక్కువ.కంగారూల మాంసం తినడం ద్వారా బీపీ బాగా తగ్గుతుందట.దాంతో పాటు చర్మం కోసం కూడా వేటగాళ్ల వీటినే లక్ష్యంగా చేసుకుని వేటాడుతుండడంతో అటవీ అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి వస్తోంది.జెనస్ మెక్రోప్స్,రెడ్ కంగారూ,అంటిలోపైన్,ఈస్ట్రన్ గ్రే,వెస్ట్రన్ గ్రే కంగారూల్లో ప్రధాన రకాలు.స్మాలర్ మైక్రోపాడ్స్ జాతి కంగారూలు ఆస్ట్రేలియాలోనే కాకుండా న్యూగునియాలోనూ కనిపిస్తాయి.
అవార్డు అందుకున్న కంగారూ:ఇవి సాధు జీవులు.కోపమొస్తేనే తడాఖా చూపుతాయి.రేబిస్ వ్యాధి సోకిన కంగారూలు మనుషులకు హాని తలపెడతాయట.భరించలేని ఆకలి,దప్పిక సందర్భాల్లోనూ ఇవి మనుషుల్ని గాయపరిచే ప్రమాదముందని శాస్త్రవేత్తలను ఉటంకిస్తూ పలువురు ఆస్ట్రేలియన్ ఫారెస్టు ఆఫీసర్స్ వివిధ ఘటనల్ని జర్నల్స్‌లో పేర్కొన్నారు.మరికొన్ని సంఘటనల్లో ఇవి పెంపుడు జంతువుల్ని కూడా తలపిస్తాయని రుజువైంది.చెట్టు కూలుతుండగా గాయపడ్డ కంగారూ ఓ రైతు కుటుంబానికి సంకేతమిచ్చి కాపాడిన ఘటన 2003లో ఆస్ట్రేలియాలో జరిగింది.దాంతో ఆ కంగారూ 2004లో ప్రతిష్టాత్మక `ఆస్ట్రేలియా నేషనల్ యానిమల్ వెలార్`(ఆర్.ఎస్.పి.సి.ఎ)అవార్డును గెల్చుకుంది.
23 Dec 2011
vatican city
happy christmas |
పాపులను క్షమించి,బాధల్ని దిగమింగి,శాంతికి ప్రతీకగా నిలిచిన మహనీయుడే ఏసు.నాడు,నేడు,ఏనాడూ ఏసుప్రభువు ఆచరించిన మార్గమే యావత్ మానవాళికి అనుసరణీయం.హిందువులకు తిరుమల,ముస్లింలకు మక్కా ఎలాగో క్రైస్తవులకు వాటికన్ సిటీ అంతే పవిత్రం.అందుకే ప్రపంచ వారసత్వ సంపద స్థలిగా 1997లో యునెస్కో గుర్తింపునకు నోచుకుంది.వరల్డ్‌లోనే అతి చిన్నదేశమని దీనికి పేరు.కేవలం 0.2 చదరపు మైళ్ల విస్తీర్ణం.వెయ్యిలోపు జనాభా.ఇది ఇటలీ(రోమ్)లో అంతర్భాగం అయినా స్వయంపాలనా యుక్త ప్రాంతం.
vatican city masterpieces:సెయింట్ పీటర్స్ బాసిలిక,సిస్టిన్ చాపెల్,వాటికన్ మ్యూజియమ్స్,అపోస్టోలిక్ ప్యాలెస్(పోప్ నివాసిత ప్రాంతం),ఇంకా వందల కొద్దీ శిల్పాలు,చిత్రరాజాలు కొలువుదీరిన వేదిక.
శాంతి ధామం:పోప్‌జాన్‌పాల్-2 26ఏళ్ల పాలన అనంతరం 2005లో బెన్డిక్ట్-16 బాధ్యతల్ని చేపట్టారు. ఆయనే వాటికన్ సిటీకి సర్వాధికారి. ఒక్క వాటికన్లకే కాదు యావత్ యూరప్ వాసులకు పోప్ మాటే మేలు బాట. 1929లో ముస్సోలిని నిర్ణయాత్మక సంతకం(లాటెరన్ ట్రీటీ)తో వాటికన్ రాజ్యం అవతరించింది. వాటికన్‌లో కొలువుదీరిన పోప్పే సంపూర్ణ శాసన, కార్యనిర్వాహక,న్యాయాధికారాల్ని కల్గి ఉంటారు. ఆయన ద్వారానే సెక్రటరీ ఆఫ్ స్టేట్,ప్రెసిడెంట్(పాంటిఫికల్ కమిషన్),గవర్నర్ నియమితులై పాలనా బాధ్యతలను నిర్వర్తిస్తారు.సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా బెర్టొనే,పాంటిఫికల్ కమిషన్ ప్రెసిడెంట్‌గా,వాటికన్‌సిటీ గవర్నర్‌గా లజొలొ ఆ విధంగానే పదవులను చేపట్టారు.ఇక్కడ ఇంగ్లిష్,ఫ్రెంచ్,అరబిక్,చైనీస్,రష్యన్,స్పానిష్ భాషలు ప్రాచుర్యంలో ఉన్నాయి.రోమన్ల చరిత్రకు 16వ శతాబ్దపు వైభవాలకు సాక్షిగా నిలుస్తోందీ వాటికన్ సిటీ.ఈ నగరం 4వ శతాబ్దం నుంచే తన ఉనికిని నిలుపుకుంటోంది.అంతేకాదు దీర్ఘకాలంగా ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా భక్తుల్ని అలరిస్తోంది.బాసిలిక్ కళాత్మకత వన్నెలను జూలిస్-2 అద్దారు.ఇక్కడ జగత్ ప్రసిద్ధ చర్చిని కార్లో మెడెర్నో 1626లో నిర్మించారు.ప్రపంచంలోనే అతి పురాతన,చిన్న సైన్యం గల దేశమిది.1506లోనే సైన్యాన్ని జూలిస్-2 ఏర్పరిచారు.వాటికన్ సైన్యం అక్షరాల నూరు మాత్రమే.వీరే పోప్ అంగరక్షకులు కూడా.
క్రిస్మస్ సంబరాలు:క్రైస్తవుల పుణ్యక్షేత్రమైన వాటికన్ సిటీలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటుతాయి.1982 నుంచి ఇక్కడ క్రిస్మస్ ట్రీని నెలకొల్పుతున్నారు.ఈ వేడుక పోప్ జాన్‌పాల్-2 హయాంలోనే తొలిసారిగా ప్రారంభమయింది.ముఖ్యంగా బుధవారాల్లో ఇక్కడకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.వారిలో కొత్తగా పెళ్లైన జంటలే ఎక్కువ.అయితే అన్ని రోజుల్లో పోప్ దర్శనభాగ్యం మాత్రం లభించదు.క్రిస్మస్ వేడుక నాడే పోప్ అభిభాషణ యావత్ ప్రపంచ జనావళికి అందుతుంది.
----------------------------------------------------------------------------------------------------------------
* తెలుగు చిత్ర రంగ ప్రముఖులు త్రిపురనేని మహారథి కన్నుమూశారు.
* ఏపీలో విజయా డైరీ వీటా పేరిట విటమిన్ పాలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.
* ఇరాక్(బాగ్దాద్)బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది.60 మంది ప్రాణాలు కోల్పోయారు.
* సింగపూర్,ఆస్ట్రేలియాల తరహాలో భారత్‌లోనూ ప్లాస్టిక్ కరెన్సీని అమల్లోకి తెచ్చేందుకు ఆర్‌బీఐ ప్రయత్నిస్తోంది.
Subscribe to:
Posts (Atom)
Popular Posts
-
Sri Lanka 1st innings R M B 4s 6s SR ST Jayasuriya c Ganguly b Chauhan 340 799 578 36 2 58.82 MS Atapattu c †Mongia b Kulkarni 26 42 31...
-
North Pacific Coast, Japan - 11 March 2011 A powerful tsunami travelling 800km per hour with 10m-high waves swept over the east coas...