17 Feb 2012

cable car hotel


 కేబుల్ కార్ రెస్టారెంట్ల‌కు శానిఫ్రాన్సిస్కో పేరొందింది. వాటిని త‌ల‌పించేలా దేశంలోనే తొలిసారిగా ఈ త‌ర‌హా రెస్టారెంట్లకు బెంగ‌ళూర్ వేదిక కావ‌డం గ్రీన్‌సిటీ వాసుల‌కు గ‌ర్వ‌కార‌ణ‌మే.జ‌య‌న‌గ‌ర్‌,.జె.పి.న‌గ‌ర్‌ల్లోగ‌ల ఈ ఫేమ‌స్ రెస్టారెంట్ల‌కు ఓసారి వెళ్లొస్తే పోలా!
ది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా,గ్రీన్ సిటీ,ఐటీ హ‌బ్‌,ఉద్యాన‌న‌గ‌రి ఇలా ప‌లు పేర్లు గ‌ల ప‌చ్చంధ‌నాల న‌గ‌రం బెంగ‌ళూర్‌.భార‌త‌దేశంలోని ఈ ద‌క్షిణాది నగ‌రంలో ఆక‌ర్ష‌ణ‌లు కోకొల్ల‌లు.క‌బ్బ‌న్‌పార్క్‌,ఉల్సుర్ లేక్‌, విధాన‌సౌధ‌తోపాటు వివిధ ప్ర‌కృతి అందాల‌కు నెల‌వు ఈ న‌గ‌రం.శాస్త్రీయ సంగీతం,నృత్యాల‌కూ ప్ర‌సిద్ధి.అలాగే బోటింగ్ స‌హా అనేక ఆధునిక పోక‌డ‌ల‌కు బెంగ‌ళూరు కేంద్రం.వాటిల్లో ఒక‌టి కేబుల్ కార్ రెస్టారెంట్‌.స‌రికొత్త ఊహాలోకంలో స్వ‌దేశీ,విదేశీ రుచుల‌తో సంద‌ర్శ‌కుల్ని అల‌రించే ఈ త‌ర‌హా రెస్టారెంట్లు అంద‌రికీ అందుబాటు ధ‌ర‌ల్లో లేక‌పోవ‌డం లోటేన‌న‌వ‌చ్చు.అయితే రుచుల‌కు మాత్రం కొద‌వ‌లేద‌ని కేబుల్‌కారు రెస్టారెంట్ ఖాతాదారులు న‌మ్మ‌కంగా చెబుతుంటారు.ముఖ్యంగా ఇటాలియ‌న్‌,ఇండియ‌న్ రుచులు నోరూరిస్తాయి.తండూరి దింగ్రి(మ‌ష్రూమ్స్‌),బేబీ కార్న్ తండూరి వంట‌కాలు వావ్ అనిపిస్తాయంటారు.అలాగే తండూరి ఫూల్(కాలిఫ్ల‌వ‌ర్‌)ను లొట్ట‌లేసుకుంటూ బాగా తింటామ‌ని ప‌లువురు పేర్కొన్నారు.చల్ల‌టి మ్యాంగో ల‌స్సీ కూడా కేబుల్ కార్ విందు హైలెట్టేన‌ట‌.స్విన‌క్‌,చీజ్ ర‌వొలి,దాల్ బుఖారాల‌ను సంద‌ర్శ‌కులు ఇష్టంగా ఆర‌గిస్తుంటారు.ఇక ఆలూ బిర్యానికున్న డిమాండ్ గురించి చెప్ప‌న‌క్క‌ర‌లేదు.అయితే ఈ కేబుల్ కార్ రెస్టారెంట్లు అన్నింట్లోను కేవ‌లం శాకాహారం మాత్ర‌మే ల‌భిస్తుంది.ఇటాలియ‌న్ డిషెస్‌లో గౌల‌ష్ గ్నొఖి, షిజోచెరి,పిజా నెపొలెత్న‌,సూప్ త‌దిత‌రాలంటే ఖాతాదారుల‌కెంతో క్రేజ్‌.ఉత్తార‌ది రుచుల్లో ప‌న్నిర్ బ‌ట‌ర్ మ‌సాలా,ఆలూ మ‌ట‌ర్‌,తండూరి రోటీ,నాన్‌, సొయాబిన్ చాప్‌,ప‌న్నీర్ మ‌సాలా,దాల్ ఫ్రై,దాల్ మ‌క్ని,మిక్స్‌డ్ వెజిట‌బుల్ ఆర్డ‌ర్ ఇచ్చేందుకు భోజ‌న‌ప్రియులు ఉవ్విళ్లూరుతుంటారు.

No comments:

Post a Comment

Popular Posts

Wisdomrays