12 Feb 2012

rama sethu



ప్రేమ అదో అద్వితీయ మ‌ధుర భావ‌న‌.ప్రేమ విశ్వ‌వ్యాప్తం..
అనంతం..ప్రేమే ప్ర‌కృతి..సృష్టి..ప్ర‌తిసృష్టి.. అన్నీ..అదే 
నిత్యం.ప‌ర‌మ స‌త్యం..  ప్రేమ‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నం శ్రీ‌రాముడు.
సీతా స్వ‌యంవ‌రంలో శివ ధ‌న‌స్సును విరిచి
ఆమెను గెలుచుకున్న‌ అప్ప‌టి   నుంచి రాముడు
ఆ ప్రేమ‌కే బ‌ద్ధుడు.  ఏక‌ప‌త్నీవ్ర‌తునిగాను 
ఆద‌ర్శ‌ప్రాయుడ‌య్యాడు. త‌న‌పై ప‌గ‌తో అర్ధాంగి
మ‌హాసాధ్వి సీత‌మ్మ‌ను రావ‌ణుడు అపహ‌రించుకు పోగా
శ్రీ‌రామ‌చంద్రుడు ఆ రాక్ష‌స రాజ్యంపైకి దండెత్తాల్సి 
వ‌చ్చింది. అలా లంక‌ను చేరేందుకు వాన‌ర‌సేన స‌హాయంతో నిర్మించిందే రామ‌సేతు.ఇది  పురాణం.. నిజ‌మేన‌నేందుకు ల‌భించిన ఆధారాలే స‌సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
శ్రీ‌రామ సేతు: భార‌త్‌,శ్రీ‌లంక‌ల మ‌ధ్య ఉన్న హిందూ 
మ‌హాస‌ముద్రంపై మాన‌వ నిర్మిత వార‌ధే ఈ రామ‌సేతు.
ఇప్ప‌టి త‌మిళ‌నాడులోని రామేశ్వ‌రం నుంచి శ్రీ‌లంక‌కు 
మ‌ధ్య‌గ‌ల స‌ముద్రంపై సుమారు 18 ల‌క్ష‌ల ఏళ్ల క్రితం 
ఈ సేతు నిర్మిత‌మైంద‌ట‌. నాసా ధ్రువ‌ప‌రిచిన ఉప‌గ్ర‌హ 
ఛాయాచిత్ర‌మే అందుకు ప్ర‌బ‌ల ఉదాహ‌ర‌ణ అనేది
 ప్ర‌పంచం న‌లుమూల‌లా గ‌ల మెజార్టీ హిందువుల అభిప్రాయం.
అయితే ఈ రామ‌సేతు నిర్మాణం ఓ అబ్బుర‌మ‌న‌డం మాత్రం 
అంద‌రూ అంగీక‌రించద‌గ్గ‌ విష‌యం.ఎందుకంటే ఇప్ప‌టి 
ఏ ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం అందుబాటులోలేని 
ఆ కాలంలోనే ఏకంగా స‌ముద్రంపైనే వంతెన క‌ట్ట‌డం అంటే 
మాట‌లా మ‌రి.పోటెత్తే సాగ‌ర జ‌లాల‌పై ఓ స‌ర‌ళ‌రేఖ‌ను గీసిన మాదిరిగా ఈ వార‌ధి నిర్మిత‌మ‌యిందంటున్నారు.పెద్ద పెద్ద బండ రాళ్లు,వెదురు,గ‌డ్డి,త‌దిత‌ర సామ‌గ్రితోనే రామ‌సేతును వాన‌ర సైన్యం నిర్మించింది.అదీ కేవలం అయిదే రోజుల్లో ఇంత పెద్ద వంతెన నిర్మాణం పూర్త‌యిందంటే ఆశ్చ‌ర‌మే.సౌతీస్ట్ ఏషియాలోని అతిపెద్ద పురాత‌న హిందూ దేవాల‌యంగా చ‌రిత్ర‌కెక్కిన ప్రంబాన‌న్ శివాల‌యం(జావా-ఇండోనేసియా)లోఈ రామ‌సేతు నిర్మాణానికి సంబంధించిన శిల్పాలు ఇప్ప‌టికీ క‌నిపిస్తున్నాయి.850 ఎ.డి.కి చెందిన ఈ ఆల‌యం వ‌ర‌ల్డ్ హెరిటేజ్ సైట్‌గా యునెస్కో గుర్తింపును పొందింది.త్రేతాయుగ కాలంనాటి ఈ రామ‌సేతు గురించి వాల్మీకి రామాయ‌ణం,మ‌హాభార‌త‌గాథ‌తో స‌హా ప్రాచీన త‌మిళ సాహిత్యంలోనూ ప్ర‌స్తావ‌న ఉండ‌డం గ‌మ‌నార్హం.సేతు అనే మాట‌కు త‌మిళంలో డ్యాం అని అర్థం. ప్ర‌ఖ్యాత త‌మిళ‌క‌వి తిరున‌వుక్ర‌స‌ర్ మొద‌లు ప‌లువురు నాటి నుంచి నేటి వ‌ర‌కు రామ‌సేతు య‌థార్థ‌త‌ను ప్ర‌స్తావిస్తూనే ఉన్నారు.
ఒక‌దేశం నుంచి మ‌రోదేశానికి జ‌ల‌ర‌వాణా సుల‌భ‌మౌతుంద‌నో,నౌక‌ల‌కు ఇంధ‌న వ్య‌యం ఆదా అవుతుంద‌నో లెక్క‌ల‌తో ముడిపెట్టి చూడ‌ద‌గ్గ అంశం కింద‌కు రామ‌సేతు రాద‌ని మాత్రం మ‌నం అంద‌రం క‌చ్చితంగా పేర్కొన‌వ‌చ్చు.
-------------------------------------------------------------------------------------------------------------
ఆడిలైడ్‌::ముక్కోణ‌పు వ‌న్డే సీరిస్‌లో భార‌త్ రెండో విజ‌యాన్ని అందుకొని పాయింట్ల ప‌ట్టిక‌లో ముందు వ‌రుస‌లో ఉంది.ఆదివారం మ్యాచ్‌లో భార‌త్ 4 వికెట్ల తేడాతో మ‌రో రెండు బంతులుండ‌గానే ఆస్ట్రేలియాను ఓడించింది. ఉత్కంఠ పోరులో తొలుత గంబీర్‌, చివ‌ర్లో కెప్టెన్ ధోని భార‌త్‌కు ఈ స‌గ‌ర్వ‌మైన విజ‌యాన్ని అందించారు.

1 comment:

  1. topic selection is good

    spelling mistakes many

    ReplyDelete

Popular Posts

Wisdomrays