మమతా వార్నింగ్
మావోయిస్టులు వారం లోపుగా ఆయుధాలను వదలి చర్చ్చ్లలకు రావాలని పశ్చిమ బెంగాల్ సీం మమతా బెనర్జీ హెచ్చరించారు. మావోయిస్టులకు పట్టున్న జంగల్ మహల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె వారిని జంగల్ మాఫియా, సుఫారి కిల్లర్స్ అంటూ ఘాటుగా విమర్శించారు. వారు జన జీవన స్రవంతిలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు, పునరావాసం కల్పిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆయుధాలను వీడందే చర్చ్చాలు సాధ్యం కావన్నారు.
----------------------------------------------------------------------------------------------
సైకో..! టూర్..?
ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో ఓ సైకో తన ఉన్మాదంతో జన్నాన్ని హడలెత్తిస్తున్నాడు. మూడు జిల్లాల్లో ఇప్పటికే జనానికి కంటి మీద కునుకు లేకుండా చేసాడు. తొలుత నెల్లూరు జిల్లా(కావలి)లో ప్రతాపం చూపాడు. అక్కడ ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ వారింట భోజనం చేసి ఆ తర్వాత గాయపరచి మళ్ళీ వస్తానని భయపెట్టి వెళ్ళే వాడని వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత అనంతపురంలో ఇళ్ళ ముందు పార్క్ చేసిన బైక్లను తగులబెడుతూ ప్రజలకు మనస్శ్హాం తి లేకుండా చేసి తాజాగా ఇప్పుడు గుంటూర్ ను వనికిస్తున్నాడు. ఆటోలో తిరుగుతూ మార్నింగ్ వాక్ కు వెళ్ళే మహిళల ఫై రాళ్ల దాడులు చేస్తున్నాడు. ఇది ఒక ఉన్మాది పనేనా లేక మరే ఆకతయిలయినా ఆ ముసుగులో
ఇలా చేస్తున్నారా? నిఘా కళ్ళకు దొరికితే తప్ప చెప్పలేము.
________________________________________________________________
ముద్దు పేర్ల మగధీరులు
రామ్చరణ్... చెర్రీ
జూనియర్ ఎన్టీఆర్ ... తారక్
నాగ చైతన్య...చై
అల్లు అర్జున్...బన్నీ