ఈ భూమి మీద మాట్లాడే, నవ్వ గలిగే ఏకయిక జీవులం మనం.
మన మాత్రు భాష మీద మనకు భలే మమకారం.
ఆ క్రమంలోనే ఇక్కడ కొన్ని చెప్పుకుందాం
ఏ మాటకు ఆ మాట
* ఆలశ్యం అమృతం విషం
* నిదానమే ప్రధానం
* చెప్పే వాడికి వినే వాడు లోకువ
* శంకరుడు వంటి దేవుడు వంకాయ వంటి కూర ఉండదు
* పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం మిన్న
* నిజం గడప దాటే వేళకి అబద్ధం లోకాన్ని చుట్టేస్తుమ్ది
* లోకో భిన్న రుచి
* నేతిబీర కాయ చందం
* పోలీసుని చూసి దొంగే దొంగా దొంగా అని అరిచినట్టు
* మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ
* మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండీ
* చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు
* ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహా వృక్షమన్నట్టు
* మొక్కయి వంగనిది మానయ్యాక వంగునా
* మొక్కుబడి తంతు
* తూతూ మంత్రం
* మంత్రాలకు చింతకాయలు రాలతాయా?
_____________________________________________________________________
లవ్ ఆల్..సర్వ్ ఆల్ : సత్య సాయి
కాళ్ళ కున్న జోళ్ళ ద్వారా రాళ్ళు రప్పలు ముళ్ళు తదితర బాధల నుంచి తప్పించు కున్నట్లే
ప్రేమ నిండిన గుండెతో ని౦దలు నిష్టూరాలను తట్టుకునే శక్తి వస్తుంది.
భగవద్గీత
యోన్తా: సుఖోస్త రామస్త దాన్త జ్యోతి దేవయ:/
న యోగీ బ్రహ్మ నిర్వాణం బ్రహ్మ భూతో ధీ గచ్చతి //
తాత్పర్యం: అంతరంగ మందే ఆనందమును కలిగిన వాడును
ఉత్సాహవంతుడై అంతరంగ మందే రమించు వాడును
అంతరంగమందే లక్ష్యంను కలిగిన వాడును
అగు మనుజుడే వాస్తవమునకు పూర్నుడగు యోగి యనబడును
బ్రహ్మ భూతుడయిన అట్టివాడు
అంత్యమున పరబ్రహ్మమునే పో౦దగలడు
No comments:
Post a Comment