e హిందూ దేవాలయాల్లో భక్తులు తమ కోరికల్ని తీర్చాలని దేవుణ్ని ప్రార్థిస్తూ కొబ్బరికాయల్ని కొట్టడం రివాజు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పూగోదావరి జిల్లాలోని పిఠాపురంలోని ఓ గుడి మాత్రం ఇందుకు భిన్నం. ఇక్కడ భక్తులు కొబ్బరికాయల్ని ఆలయ ప్రాంగణంలోని చెట్టుకు కట్టడం విశేషం. దత్తాత్రేయుని తొలి అవతారంగా ప్రతీతి చెందిన
శ్రీ బాల వల్లభుని దేవాలయం ఈ విశేషానికి వేదికగా భక్తుల్ని అలరిస్తోంది.
e ఆశా..గిన్నీస్ రికార్డు..లతా మంగేష్కర్ సోదరి ప్రఖ్యాత గాయని ఆశాబోస్లే సోలోగా 11 వేల పాటలను వివిధ భాషల్లో ఆలపించి గిన్నీస్ బుక్ రికార్డులకెక్కారు.
e ఏపీ ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఒక్లాహామా యూనివర్సిటీ ఆల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ ఘనతను అందుకొన్నరెండో భారతీయుడయ్యారు.
ccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccc
e ఆస్ట్రేలియా జాతీయ జంతువు - కంగారూ.
శ్రీలంక నేషనల్ యానిమల్ - సింహం.
కంగార్లు తమ పిల్లల్ని తమ శరీరంలోనే స్వతహాగా అమరిన సంచి వంటి భాగంలోనే ఉంచుకొని అవి నడిచే వరకు సాకుతాయి.
ccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccc
కృషి ఉంటే మనుషులు రుషులౌతారన్నారు సినీ కవి వేటూరి. దాన్ని అక్షరసత్యమని నిరూపించిన వారెందరో. ఆ కోవ లోని వారే టాలివుడ్ యువ దర్శకుడు శ్రీను వైట్ల. సినిమా పిచ్చితో ఇంటర్ విద్యతోనే సరిపుచ్చి చెన్నై రైలెక్కిన ఈ యంగ్ చాలెంజర్ దర్శకుడు 1991లో తన పనిని ప్రారంభించి స్టార్ హీరోలందరి మన్ననలకు పాత్రుడయ్యారు. ప్రేక్షకుల అభిమానాన్ని గెల్చుకున్నారు. సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి సినీ పరిశ్రమలో తనదైన స్థానాన్ని సాధించుకోగలిగారు. భార్య రూప, పిల్లలు ఆనంది,అద్య,అహన ఈయన కుటుంబం.
శ్రీను వైట్ల చిత్రరాజాలివే
నీ కోసం, ఆనందం, సొంతం, వెంకీ, అందరివాడు, ఢీ,
దుబాయ్ శ్రీను, రెఢీ, కింగ్, నమో వెంకటేశ, దూకుడు
-------------------------------------------------------------------------------------------------------------
e ^ టర్కీలో సుమారు 1000 మంది దుర్మరణం పాలయినట్లు ప్రాథమిక వార్తల కథనం. పెను భూకంపం
రాజధాని అంకారాకు 1200 కిలోమీటర్ల పరిధిలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
టర్కీలో ఇదే అతిపెద్ద భూకంపమని ఆ వర్గాలు తెలిపాయి.
No comments:
Post a Comment