అట్లాంటిక్ సముద్రం..బెర్ముడా, మియామి, సాన్‌జాన్, ఫ్లోరిడా, పొర్టోరికా..ఈ తీరం మధ్యన బెర్ముడా ట్రయాంగిల్.
దినదినాభివృద్ధి చెందుతున్న సైన్స్‌ను ప్రశ్నిస్తున్న వింత ప్రకృతే ఈ ప్రాంతం..మానవమేధకు సవాలు విసురుతున్న వైనం..నేనేంటో కనుక్కోండి చూద్దామంటూ శాస్త్రవేత్తల ఎదుట తిష్ట వేసుక్కూర్చున్న రహస్యం. కదిలే నగరాల్నే తలపించే నౌకలు, విమానాలు ఏవైనా ఈ మార్గంలోకి ప్రవేశించాయో అంతే సంగతులు..మాయం..రాడర్లకు అంతుచిక్కని లోగుట్టు. స్కోపులకూ ఆనవాళ్లు కూడా దొరకని మర్మం.
అదృశ్య రహస్యం
గ్రుమన్ కుగట్ జెట్..పైలెట్ జాన్ వెర్డి, కో- పైలట్ పాల్ లుకారిస్ 25,300 అడుగుల ఎత్తున ఆకాశం నుంచి ఆల్‌వెల్..అని సందేశం..రాడర్‌కు చేరిన మాటలు..అంతా నిశ్శబ్దం..అవే వారి నోట చివరి మాటలు..మళ్లీ ఏమీ వినపడలేదు. జెట్ అదృశ్యం. అదే కథ పునరావృతం..ఇప్పటికే అధికారిక, అనధికారిక లెక్కల ప్రకారం ఈ ట్రయాంగిల్ మీదుగా ప్రయాణించిన వందల వేల నౌకలు, విమానాల ఉనికి దొరికితే ఒట్టు.
1780 నుంచి అనేక రవాణా, ప్రయాణికుల భారీ నౌకలు బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో ప్రయాణిస్తూ మటుమాయమయ్యాయి. 59 సంవత్సరాలుగా ఉద్ధృతంగా సాగిన శోధనలన్నీ విషాదగాథలే.కోస్ట్‌గార్డ్
రిపోర్టులు, యూఎస్ స్టేట్ రిజిస్ర్టీ లెక్కల ప్రకారమే 75 విమానాలు, 2 వేల పైచిలుకు నౌకలు సముద్ర గర్భాన కలిసిపోయాయి. 1949-71 మధ్య ఈ ప్రాంతంలో స్టార్ ఏరియల్, ఫ్లైట్ 19, ఏవియన్ ఎ 16, పిబిఎం, స్టింగ్ 27 విమానాలు కనుమరుగయ్యాయి. నాలుగింజన్ల కెబి 50 ఏరియల్ టాంకర్ కథా విషాదగాథే. 19,20 శతాబ్దాల్లో మాయమైన ప్రఖ్యాత నౌకలు రిట,టమండ్ర(1917), 309 మంది ప్రయాణికులతో ప్రయాణించిన సిక్లాప్ (1918), కొటావిక్స్ (1925), సుడప్కొ (1926), 34 మంది ప్రయాణికుల ది ట్రామ్ ఆంగ్లో ఆస్ర్టేలియన్ (1938), మేడ్కొ (1948), సాండ్ర (1950), హోమ్‌స్టేట్ హోమ్ (1955), యల్‌రెవెన్ (1958) నీటి పాలయ్యాయి. 1960-63 మధ్య ఎథెల్ సి, కలిస్టా 3, ఎవెంజలిన్, విండ్‌పాల్, మెరెన్ సల్ఫర్ క్వీన్..విన్‌క్రాఫ్ట్‌దయితే విజయంలో అపజయం. హార్బర్ ముంగిటకు వచ్చాక కోస్ట్‌గార్డ్‌లు అక్కడకి చేరుకొనే 19 నిమిషాల వ్యవధిలో నీట మునిగిపోయింది.
1975లో డచ్‌ట్రీట్, కలియా3, ఎస్ఎస్ ఫాయల్, పాలిమర్3, రియల్ షైన్‌ల ప్రయాణమూ విషాదకాసారమే.
జామ్నిక్ కె-1995(1999), వెస్టిండీస్ తీరజలాల్లోకి ప్రవేశించాక ట్రోపిక్‌బర్డ్ (2000)జలాల్లో మునిగిపోయింది.
ఎందుకిలా..
విపరీత ఎలక్ట్రో మాగ్నేటిక్ వేవ్సే కారణమన్నది ఇప్పటి వరకు శాస్త్రవేత్తల ప్రాథమిక పరిశోధనా భావన. కాలచక్రగమనంలో అసాధ్యమన్నదే మనిషికి లేదు. ఈ మిస్టరీ ట్రయాంగిల్ లోగుట్టు ఛేదన భవిష్యత్‌లో మనకు సాధ్యమే.
_______________________________________________________________
* స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న 5 వన్డేల సీరీస్‌లో ఇంతవరకు జరిగిన మూడింటా గెలిచి భారత్ విజయబావుటా ఎగుర వేసింది.
* స్టాక్‌హోమ్ ఓపెన్ టెన్నీస్‌లో రోహన్‌బొపన్న (భారత్), ఖురేషీ (పాకిస్థాన్)ల జోడీ ఫైనల్లో బాగ్దాటిస్ (సైప్రస్), డెల్‌పొట్ర (అర్జెంటినా)లపై గెలిచి టైటిల్ సాధించింది.
* చిత్తూరు జిల్లా నుంచి నఫీసా ఒకే కాన్పులో ఇద్దరు ఆడ, ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చింది.
_______________________________________________________________
లిండ్సే లోహన్‌కు జైలు-బెయిలు
బంగారు ఆభరణాలు పోయాయని ఫిర్యాదు చేసి కోర్టుకు హాజరుకాని హాలివుడ్ నటీమణి లిండ్సే లోహన్ తొలుత 36 గంటల సామాజిక సేవాశిక్షకు గురయింది. ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనక కోర్టు ధిక్కారానికి పాల్పడ్డంతో ఆమెకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. చివరికి లక్ష డాలర్ల పూచీకత్తుపై బెయిల్ పొంది బతుకు జీవుడా అని బయటపడింది.
interesting,what now the present situation
ReplyDelete