http://royalloyal007.blogspot.in/2012/10/michael-manic.html
ఆదిమకాలం..మధ్యయుగం..ఆధునిక లోకం..మానవ పరిణామ క్రమం ఎంతో నాగరికమయినది. సర్వ శక్తిమంతమయింది. ప్రాథమిక లక్ష్యం మాత్రం అలాగే ఉంది. ఆలోచన..ఆసక్తి..అన్వేషణల పరంపర యథావిధిగా కొనసాగుతోంది. భూమి, సముద్రం, అంతరిక్షం ఒకటేమిటి..అన్నింటా ఒకటే శోధన. ఎన్నో మలుపులు మరెన్నో వింత గొలిపే సంగతులు. ఇంకా ఆ అన్వేషణ క్రమం ముందుకుపోతూనే ఉంది. మంచు మనిషి `యతి` కథాకమామీషు అందులో భాగమే. శతాబ్దాలగా ఇంకా కొలిక్కి రాని అబ్బురమిది.
మం(చి)చు మనిషి
సుమారు ఎనిమిది అడుగుల పొడవు..బలిష్టమైన ఒళ్లు..నాలుగంగుళాల జుత్తు..ఒంటి నిండా బొచ్చు..అచ్చం పురుషుణ్నే పోలిన రూపు
ఈ జీవి సొత్తు. సంచారం మంచు పర్వత శ్రేణుల్లోనని ఊహాగానాలు శతాబ్దాలగా వినవస్తూనే ఉన్నాయి. 18వ శతాబ్దం నుంచే దేశ, విదేశీ అన్వేషకులు, జీవశాస్త్రవేత్తలు, పర్వతారోహక అన్వేషకులు పరిశోధిస్తూనే ఉన్నారు. 2010లో రష్యాలో ఈ విషయమై జరిగిన సదస్సులో చైనా బృందం మంచుమనిషి ఉనికికి 95% ఆధారాలున్నట్లు పేర్కొనడం గమనార్హం. షెనాన్‌గ్జియా ప్రావిన్స్‌లో 1970-80 దశకంలో జరిగిన అన్వేషణ అంశాలను బట్టి తామీ నిర్ధారణకు వచ్చామన్నారు. యోషితో తకటో నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల బృందం 20 అక్టోబర్ 2008లో హిమాలయ పర్వత సాణువుల్లో యతి పాద ముద్రలను ఫొటోషూట్ చేసింది. నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంత పర్వతాల్లోనే యతి సంచారం ఉన్నట్లు 19వ శతాబ్దంలో పలు కథనాలు వెలువడ్డాయి. ఎన్నో చిత్రాలు, ఫిక్షన్ కథలు,నవలలు జనాన్ని అలరించాయి. యతి జాడ పర్వతశ్రేణుల్లోనే ఉందని అక్కడి పలువురి పరిశోధకుల అభిప్రాయం. ఆయా దేశాల్లో యతికి ఆయా పేర్లున్నాయి. బిగ్‌ఫుట్,హోక్స్,యబిమోనబుల్ ఇలా అనేక పేర్లు చలామణి అవుతున్నాయి. ఈ యతి వియత్నాం యుద్ధంలో సైతం పాల్గొందనేది నిర్ధారణ కాని కథనం.దీనిపై ఎఫ్‌బిఐ విచారణ జరపాలని క్రిప్టోజువాలజీ శాస్త్రవేత్త డాక్టర్ హల్మాన్స్ నాడే కోరారు. యతి పాదముద్రల్ని 1899లోనే కనుగొన్నట్లు లారెన్స్ వాడెట్ అనే పాశ్చాత్య అన్వేషకుడు పేర్కొన్నారు. యతి తలవెంట్రుకుల్ని ఈశాన్య భారత ప్రాంతంలో ఎడ్మండ్ అనే పరిశోధకుడు సేకరించినట్లు ఓ వార్తా ఉంది. ఆయన 1950లోనే ఈ వెంట్రుకుల్ని డిఎన్ఏ పరీక్షల కోసం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ విభాగానికి అందించారట. ఈ మేరకు బిబిసి కథనాన్ని ప్రసారం చేసింది. ఇంతకీ యతి పాదం పొడవు 19 అంగుళాలని వేళ్ల పొడవు,వెడల్పు మొత్తం 25 సెంటీమీటర్లని అమెరికా టెలివిజన్ బృందం 2007 డిసెంబర్‌లో `డెస్టినేషన్ ట్రూత్` అనే ప్రోగ్రాంలో పేర్కొంది. కనుగొన్న యతి శిలాజం, పుర్రెను పలు పాశ్చాత్య దేశ మ్యూజియాల్లో ప్రదర్శించారు. దీనిపై డెయిలీ మిర్రర్ నుంచి పలు స్టోరీలు కూడా వెలువడ్డాయి. నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో యతి జాడ కనుగొనడానికి అమెరికా ఔత్సాహిక బృందం అక్కడ పర్యటించింది. అయితే ఆత్మరక్షణ కోసమైనా ఆ జీవికి ఎటువంటి హాని తలపెట్టరాదనే షరతుపైనే ఆ బృందాన్ని నేపాల్ ప్రభుత్వం తమ దేశంలోకి అనుమతించింది.
హాలివుడ్ `ది ఐస్ మ్యాన్`
చంద్రుడు,అంగారకుడిపై నీరుందని, జీవులుండే అవకాశముందని భావిస్తున్న ప్రస్తుత తరుణంలో భూమిపై యతి ఉండొచ్చు, ఉండకపోనూ వచ్చు. ఇది అప్పుడూ ఇప్పుడూ రూఢీ కాని విషయమే. కానీ మంచుమనిషి చాలా మంచిమనిషని నేపాల్ షేర్పాల(గైడ్లు) భావన. మనుషుల జాడను గమనించగానే యతి అజ్ఞాతంలోకి వెళ్లిపోతుందని వారంటారు. యతి బహు సిగ్గరట. రాక్షసబల్లులపై జురాసిక్ పార్క్, అంతరిక్ష మానవుడు కథాంశంతో టెర్మినేటర్, అవతార్, కింగ్‌కాంగ్,యాప్‌మ్యాన్ తదితర చిత్రాలతో స్పీల్‌బర్గ్, కామరూన్ వంటి హాలివుడ్ దర్శకులు యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు. మరి ఈ `ఐస్‌మ్యాన్`పై తాజాగా ఓ చిత్రాన్నితెరకెక్కిస్తే ఆ కిక్ భలే కదూ!
_______________________________________________________________
e బెంగళూర్‌లో మెట్రో రైలు ఈరోజే ప్రారంభమయింది.
e లిబియా నియంత కల్నల్ గడాఫీ(69) సొంతూరు స్టెర్త్‌లోనే తిరుగుబాటు దళాల చేతిలో కాల్చివేతకు గురయ్యారు
No comments:
Post a Comment