మనిషి శోధన అనంతం..నిరంతరం..విశ్వం అంటే? అంతరిక్షంలో ఏముంది? చంద్రుడిపై నీరుందా..అంగారకుడు భూమికి సోదరుడా? అక్కడ వాతావరణం ఏంటి? మన బోటి జీవులూ ఉన్నారా? ఇలా అనాదిగా అనేక విషయాలపై మన పరిశోధనలు విశ్వం..గ్రహాలు..ఇతర జీవుల ఉనికిపై సాగాయి..కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నో విజయాలు..చిక్కువీడిన అంశాలు శాస్త్రవే్త్తల దరికి చేరాయి. అసలు మనిషి ఆలోచనా పథం లక్ష ఏళ్ల నాడే ఆరంభమయిందని అమెరికా లివర్‌ఫూల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త లారెన్స్ బల్లామ్ తెలిపారు. తమ మనుగడ కోసమో, ఆధిపత్య నిరూపణకో, మానవాళి అభ్యున్నతి కోసమో అభివృద్ధి చెందిన దేశాలు చాలా దశాబ్దాల క్రితమే విశ్వాంతరాళ శోధనలకు నడుం బిగించాయి. ముఖ్యంగా అమెరికా అప్పటి సోవియట్ యూనియన్ నువ్వా నేనా అన్నట్లు పోటీపడి అనేక ప్రయోగాలు చేశాయి. వాటి వల్ల చాలావరకు యావత్ ప్రపంచ జనానికి మేలే ఒనగూరింది. అప్పటి భిన్నధ్రువ ప్రపంచంలో ఆ పోటీ నెలకొంది. ప్రస్తుత ఏకధ్రువ ప్రపంచంలో అమెరికా మాత్రమే మిగిలినా రష్యా, ఇతర యూరోపియన్ దేశాలు తమవంతు చేయూతతో ఇంకా అనేకానేక ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికిప్పుడు కాకున్నా భవిష్యత్‌లో వీటి ఫలితాలు రాబోయే తరాలకు ఉపకరించాలన్నదే ప్రధాన ఉద్దేశం. మన ఇస్రో చంద్రయాన్ ప్రయోగానికి సన్నద్ధం కావడం అందులో భాగమే. మూణ్నెల్ల వ్యవధిలోనే మూడు శాటిలైట్ ప్రయోగాల్ని చేసే మన శాస్త్రవేత్తలు విజయాన్ని అందుకోవడం ముదావహం. ఇటీవల పి.ఎస్.ఎల్.వి-18 ప్రయోగ విజయంలో మనదేశ విద్యార్థుల పాత్ర ప్రశంసార్హం. అంతరిక్షానికి ఎగసిన వివిధ ప్రయోగాలు 1950-60 దశకంలో పోటాపోటీగా సాగిన అంతరిక్ష ప్రయోగాలు జనంలో ఉత్కంఠను కల్గించాయి. సోవియట్ యూనియన్ స్పూత్నిక్ మానవరహిత రాకెట్‌ను అంతరిక్షానికి పంపి తొలి విజయాన్ని సాధించింది. ఇందులో లైకా అనే కుక్క పిల్లను పంపారు. ఆ తర్వాత 1961 ఏప్రిల్‌లో యూరిగగారిన్ అంతరిక్షానికేగిన తొలి మానవుడిగా చరిత్ర లిఖించాడు. అమెరికా మెర్కురీ, జెమినీ, అట్లాస్, ఛాలెంజర్, కొలంబియా, ఒలంపస్ తదితరాలెన్నింటినో ప్రయోగించింది. అపోలో ఆపరేషన్స్‌ను 1969-72 మధ్య పలు దఫాలు నిర్వహించి సక్సెస్‌ను కొట్టేసింది. జులై20, 1969లో చంద్రుడిపై అడుగిడిన తొలి మానిషిగా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ వినుతి గడించాడు.
అంతరిక్షంలో ఇంటర్నేషనల్ స్పేస్‌స్టేషన్ (ఐఎస్ఎస్)ను అప్పటి సోవియట్ యూనియన్ ఆ తర్వాత రష్యా, అమెరికా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ ఐఎస్ఎస్‌లో వందల మంది పురుష, స్త్రీ వ్యోమగాములు ఇంతవరకు గడిపి వచ్చారు. అంతేనా అంతరిక్ష యాత్రలకు ఈ వ్యోమగాములు విజయం తెరతీసింది. ఈ ప్రయోగ పరంపరలో విషాదాలు చోటుచేసుకున్నాయి. భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి కల్పనాచావ్లా సహా 8 మంది భూమికి తిరిగి వస్తుండగా స్పేస్‌షటిల్ కక్ష్యలోనే మండిపోవడంతో వారి `ఛాలెంజ్` అర్ధంతరంగానే ముగిసిపోయింది. ఇక నాసాకే చెందిన మాజీ ఉద్యోగి కాలిఫోర్నియా బిలియనీర్ డెన్నిస్‌టిటో(60) తొలి అంతరిక్ష యాత్రికుడిగా చరిత్రకెక్కాడు. 2001లో ఈ యాత్రకు ఆయన వెచ్చించింది ఎంతంటే 20 మిలియన్ డాలర్లు. ఎనిమిది రోజుల పాటు టిటో ఐఎస్ఎస్‌లో గడిపి క్షేమంగా తిరిగి వచ్చారు. అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలతో పాటు చైనా, జపాన్, కెనడా, ఇండియా, ఇజ్రాయిల్, బ్రెజిల్ సహా 30 దేశాలు వివిధ అంతరిక్ష కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాయి. విశ్వం ఉన్నంత కాలం ఈ ప్రయోగ పరంపర నిరాటంకంగానే సాగుతుంటుంది. రహస్యాల గుట్టును విప్పి మనిషి మనుగడను అప్రతిహతంగా కొనసాగిస్తుంటాడు.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
తిరుమలలో సూపర్‌స్టార్
రాణా సినిమా ప్రారంభమయ్యాక అస్వస్థతకు గురైన దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ తిరుమల వచ్చి వెంకన్నను దర్శించుకున్నారు. సింగపూర్‌లో చికిత్స పొంది కోలుకున్నాక తన అల్లుడు ధనుష్ మొక్కుకున్న మేరకు ఆయన శ్రీవారి సన్నిధికి వచ్చారు. త్వరలోనే సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు ఆయన ఈ సందర్భంగా మీడియాకు స్పష్టం చేశారు.
బార్నెస్‌కు బుకర్ ప్రైజ్
లండన్‌లోని గిల్డ్ హాల్‌లో న్యాయ నిర్ణేతల కమిటీ అధ్యక్షురాలు స్టెల్లా ప్రతిష్ఠాత్మక `మ్యాన్ బుకర్‌ప్రైజ్`ను బ్రిటన్ రచయిత జూలియన్ బర్నెస్ గెలుచుకున్నట్లు ప్రకటించారు. 65 ఏళ్ల బర్నెస్`ద సైన్స్ ఆఫ్ యాన్ ఎండింగ్` పేరిట రాసిన నవలలో చిన్ననాటి స్నేహాలు, అస్పష్ట స్మృతుల్ని హృద్యంగా మలిచారు.
స్వైన్‌ఫ్లూ ముప్పు
ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం స్వైన్‌ఫ్లూ సోకిన గర్భిణి మృత శిశువును ప్రసవించే ప్రమాదముందట. అయితే నివారణకు వారు వ్యాక్సిన్‌ను సిఫార్సు చేశారు.
what about germany
ReplyDelete