ఒకేలా ఉన్నా వేర్వేరయా !
* పిండే కొద్దీ రొట్టె -
చేసుకున్న వారికి చేసుకున్నంత
* ఏ రోటి కాడా పాట!
ఏ ఎండకా గొడుగు
* తాడిని తన్నే వాడి తల దన్నే వాడోచ్చినట్టు!
గద్దల్ని తినే వాళ్ళు పోయి రాబందుల్ని తినే వారోచ్చినట్టు
* రోగి కోరింది వైద్యుడిచ్చింది ఒకే మందన్నట్టు!
మందేస్తే వారానికి వేయకుంటే ఏడు రోజులకు జలుబు తగ్గినట్టు
* చదివేస్తే ఉన్న మతి పోయినట్టు !
కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు
* పేరు గొప్ప ఊరు దిబ్బ !
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమ లింగం
* మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె
సొమ్ము ఒకరిది సోకొకరిది
* నిదానమే ప్రధానం
ఆలస్యం అమృతం విషం
* పాత రోత కొత్త వింత
దూరపు కొండలు నునుపు
* రామేశ్వరం పోయినా శనీశ్వరం వదలనట్టు
మూలిగే నక్క మీద తాటి పండు పడినట్టు
_____________________________________________________________________
అగరు బత్తి కథా కమామీషు
చినీయులు జోస్ స్టిక్స్ పేరిట మన కన్నా ఎక్కువగా వీటిని వాడతారు.
జోస్ అంటే వారి భాషలో దేవత అని అర్థం
అగర అనేది చెట్టు పేరు.
జన సమూహం అధికంగా గుమిగూడే చోట చెడు వాసన రాకుండా ఉమ్డెందుకే అగరుబత్తిల్ని వెలిగిస్తారు. అక్కడి వాతావరణంలో ఈ పరిమళం ఓ విదమైన పవిత్రతతను ప్రోది చేస్తుందని పెద్దల నమ్మకం.
భగవంతునికి భక్తునికి అనుసంధానం అంబికా దర్బార్ బత్తి -
ఈ ప్రకటన పరిచయం అక్కరు లేదు కదు !
No comments:
Post a Comment