బ్రూస్‌లీ...ఆ మూడక్షరాలు...మూర్తీభవించిన ఓ పోరాట రూపం...మార్షల్ ఆర్ట్స్‌కు పర్యాయపదం. అతనో ప్రభంజనం...ఆ బ్రూస్‌లీ అకాల మరణం యావత్ ప్రపంచ యాక్షన్ సినిమా అభిమానుల్ని దుఖఃసాగరంలో ముంచేసింది.ఆ లోటు తీరేదెలా? ఎవరున్నారు? అనుకొనే దశలో నేనున్నానంటూ జాకీచాన్ తెరపైకి వచ్చాడు. ఇప్పటికీ తన 100వ సినిమాతో హవా కొనసాగిస్తున్నాడు. తన ఆరాధ్య నటుడు బ్రూస్‌లీ బాటలోనే స్టంట్‌లు చేసి జనాన్ని ఆశ్చర్య చకితుల్ని చేస్తున్న జాకీ నటనలో హాస్యాన్ని జోడించి ఫైట్స్‌కు కొత్తదనాన్ని చేకూర్చాడు.
1976లో మొదలయిన ఈ 5 అడుగుల 9 అంగుళాల హీరో పరుగు ఇంకా అదే జోరులోనే కొనసాగుతోంది.
బ్రూస్‌లీ సినిమాలు ఫస్ట్ ఫ్యూరీ, ఎంటర్ ది డ్రాగన్ సినిమాలకు జాకీనే స్టంట్ మాస్టర్. తొలిచిత్రం హ్యాండ్ ఆఫ్ డెత్.
100 వ సినిమా 1911.
ఆది నుంచి జాకీది ఒకే ఒరవడి అదే ఉరవడి.బ్రూస్‌లీవి సీరియస్ సినిమాలయితే మార్షల్ ఆర్ట్స్‌లోనూ
హాస్యాన్ని రంగరించి ఆనందడోలికల్లో ప్రేక్షకుల్ని తేలియాడించిన గొప్ప నటుడు జాకీ. 1954ఏప్రిల్7న
హాంకాంగ్‌లోని చాన్యాన్ లాంగ్‌లో చార్లెస్, లీలీచౌ దంపతులకు జన్మించాడు ఈ పాయ్‌పాయ్. ఇది జాకీ \
ముద్దుపేరు. స్టంట్ మాస్టర్‌గా 17వ ఏటనే కెరీర్‌ను ప్రారంభించి ఇప్పటికే హాలివుడ్ స్థాయి అగ్రనటుడిగా సినిమాలతో మమేకమై కొనసాగుతున్నాడు. తైవాన్ నటి లిన్‌ఫెన్‌జోను పెళ్లాడిన జాకీకి ఒకే ఒక్క కొడుకు.అతను జయ్‌సే చాన్, ఫేమస్ సింగర్.జాకీ ఏమయినా తక్కువ తిన్నడా? మనవాడిలోను ఎన్నో కోణాలున్నాయి. యాక్టర్, ఆర్టిస్ట్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్ రైటర్, యాక్షన్ కొరియోగ్రాఫర్, సింగర్, స్టంట్ డైరెక్టర్, స్టంట్ ఫెర్మారర్‌గా అన్నింటా జాకీ సక్సెస్సే. అంతేకాదు లాంబ్‌బీహుడ్‌లో యాంటీ హీరోగాను నటించాడు. జాకీ నటించిన అద్భుత చిత్రాలెన్నో. వాటిల్లో నటిస్తుండగా అతను ఎన్నోసార్లు మృత్యుదరికి వెళ్లివచ్చాడు.ఎముకలన్నీ నుజ్జునుజ్జయిపోయి నెలల తరబడి మంచానికే పరిమితమయ్యాడు. మళ్లీ పడిలేచిన కెరటంగా పైకి ఎగిశాడు. జీవించి ఉన్న గొప్ప మార్షల్ ఆర్ట్స్ నటుడిగా గిన్నీస్ బుక్‌లో పేరు నమోదు చేయించుకోగలిగాడు.
జాకీ టాప్ - 20
. ప్రొజెక్టు--ఎ . మిరాకిల్స్ . పోలీస్‌స్టోరీ . ప్రొజెక్టు-ఎ2 . డ్రాగన్స్ ఫరెవర్ . మిస్సైల్ నైస్‌గై . పోలీస్‌స్టోరీ-2
. హూ యామ్ ఐ . ది లెజెండ్ ఆఫ్ డ్రంకన్ మాస్టర్ . ది యాక్సిడెంటల్ స్పై . క్రైం స్టోరీ . పోలీస్‌స్టోరీ
. స్నేక్ ఇన్ ఈగల్స్ షాడో . మై లక్కీ స్టార్స్ . ఆర్మర్ ఆఫ్ గాడ్ . ఆర్మర్ ఆఫ్ గాడ్-2 (ఆపరేషన్ కండోర్)
. పోలీస్‌స్టోరీ-4 . హార్ట్ ఆఫ్ డ్రాగన్ . ది రంబుల్ ఇన్ ది బ్రాంక్స్ . న్యూ పోలీస్‌స్టోరీ (దిమైత్)
1996లో రంబుల్ ఇన్ ది బ్రాంక్స్ అయితే కలెక్షన్ల గ్రాస్ 11 మిలియన్ డాలర్లను వసూలు చేసి రికార్డు నెలకొల్పింది. జాకీచాన్ గురించి ఇంతే చెబితే చాలా తక్కువే. మంచి మనస్సున్న మహారాజు జాకీ. ఇటీవల బీజింగ్‌లో తన కుమారుడి అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ జాకీ తన ఆస్తి నుంచి ఒక్క సెంట్ కూడా తన కొడుకు జయ్‌సేకు చెందదని తేల్చి చెప్పాడు. అతడు సమర్థుడయితే తనంతట తనే సంపాదించుకుంటాడని పేర్కొన్నాడు. తన సంపాదనంతా తన తర్వాత ఛారిటీకే చెందుతుందని
చెప్పిన గొప్ప యోధుడు. ఇటీవల తాను చనిపోయినట్లు కొన్ని టాబ్లాయిడ్‌లు సృష్టించిన అనేక కథనాల్ని ఆయన హాస్యస్ఫూరకంగానే కొట్టి పారేశాడు. 1986 నుంచి చెప్పుకోదగ్గ సాయాలను తనతోటి జనానికి అందిస్తున్న ధన్యజీవి జాకీచాన్.
_____________________________________________________________________
-. టి.వి-9కు వరద బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. కర్నూల్‌లో ప్రజానగర్ పేరిట 750 ఇళ్ల సముదాయాల్నినిర్మించి ఇవ్వడంతో దీపావళి పర్వదినాన్న వారంతా గృహ ప్రవేశాలు చేసి మీడియా వద్ద తమ ఆనందాన్నివ్యక్తం చేశారు. మరో 500 ఇళ్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉందని దాతలిచ్చిన విరాళాల సహాయంతోనే తాము
ఈ ఇళ్లను నిర్మించగలిగినట్లు ఆ సంస్థ ప్రకటించింది.
--. వన్డే ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోని మూడో ర్యాంక్‌కు ఎగబాకాడు.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------........................................................................................................................................................................................................................................................................................
. దర్శకరత్న దాసరి నారాయణరావు సతీమణి పద్మ(61) అనారోగ్యంతో హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో
చికిత్స పొందుతూ మరణించారు.
No comments:
Post a Comment