విజయనిర్మల: అసలు పేరు నిర్మల. పరిశ్రమలో ముద్దు పేరు పని రాక్షసి. అప్పటికే నిర్మల పేరిట మరో నటి ఉండడంతో తమ సంస్థ పేరునే విజయా వారు ఆమె ముందు జత చేశారు. దాన్నే ఆమె తన మైలురాయిగా మలుచుకొని పైకెదిగారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా విజయనిర్మల గిన్నీస్ రికార్డును నమోదు చేసుకోగలిగారు. తెలుగుతోపాటు తమిళ, మలయాళం సినిమాల్లో ఆమె 250చిత్రాల్లో నటించారు. తొలిచిత్రం `ఎంగవెట్టు పెన్నె`(తమిళం), తెలుగులో బిఎన్‌రెడ్డి రంగుల రాట్నంతో అరంగేట్రం చేశారు.
దాసరినారాయణరావు: తెలుగు పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా నేనున్నానని బరిలోకి దిగే పెద్దదిక్కు. నూనుగు మీసాల నూత్నయవ్వనంలోనే (16వ ఏట) నాటకరంగంలో ప్రవేశం. ప్రజ్ఞను కనబర్చిన మేస్త్రీ. 50కు పైగా నాటకాల రూపశిల్పి. దర్శకుడిగా తాతామనవడు తొలిచిత్రం. ఇప్పటికి 150(పరమవీరచక్ర-.. బాలకృష్ణ హీరో) చిత్రాలకు దర్శకత్వం వహించారు. గిన్నీస్ రికార్డు ఆయన వద్దకు పరిగెత్తుకు వచ్చింది. తెలుగు,తమిళ,కన్నడ,హిందీ చిత్రాలకు కెప్టెన్ పాత్ర పోషించారు. 60 చిత్రాల్లో నటించారు. మామగారు చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకొన్నారు. 200 మందికి పైగానే ఆయన ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. దాసరి శిష్యుల్లో పలువురు ఆయా విభాగాల్లో పేరు గడించారు. కోడి రామకృష్ణ కూడా దర్శకుడిగా 100 చిత్రాల ముంగిట ఉన్నారు. దటీజ్ దర్శకరత్న దాసరి.
రామానాయుడు: టాలివుడ్‌లో మూవీ మొగల్‌గా ఈయన ప్రతీతి. స్టార్ ప్రొడ్యూసర్‌గా వినుతికెక్కారు. తెలుగుతో మొదలుపెట్టి లెక్క తక్కువకాకుండా 100కు పైగా సినిమాలు నిర్మించి గిన్నీస్‌బుక్‌లో స్థానం కైవసం చేసుకున్నారు. తెలుగు పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలడంలో ప్రముఖ భూమికను పోషించిన వారిలో రామానాయుడు కూడా ఒకరు. హైదరాబాద్, విశాఖపట్నంలలో తన పేరిటనే సినీ స్టూడియోలను సైతం నెలకొల్పిన దార్శనిక నిర్మాత. తన పేరునే పెట్టుకున్న మనవడు రా.నా ప్రస్తుతం టాలివుడ్‌లో యంగ్‌హీరో కాగా విక్టరీనే తన పేరు ముందు నిలుపుకొని సక్సెస్‌ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నతనయుడు వెంకటేష్ ఇప్పటికీ తెలుగులో బిజీ హీరో.
బ్రహ్మానందం: సురేష్ ప్రొడక్షన్ బేనర్‌లో రామానాయుడే నిర్మించిన `ఆహా నా పెళ్లంట `(రాజేంద్రప్రసాద్ హీరో) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన ఈ హాస్య బ్రహ్మ`ఆనందం` ఇప్పటికీ నవ్వుల్ని విరబూయిస్తూనే ఉన్నారు. లెక్చరర్‌గా ఉన్న ఆయన సినిమాల్లో చేరడం ద్వారా లక్షల మందికి కామెడీ టానిక్‌గా మారారు. ఒకే భాష (తెలుగు)లో 754 చిత్రాల్లో కామెడీ (హీరోగా బాబాయ్ హోటల్)ని పండించిన గిన్నీస్ రికార్డును తన వాకిట్లోకి తెచ్చుకున్నారు. జఫా అనే చిత్రం ఆయన దర్శకత్వంలో రానున్నట్లు బోగట్టా.
__________________________________________________________
వరుసలో విశాల్
తమిళ, తెలుగు హీరో విశాల్ ఇప్పుడు వీరి బాటలో ఉన్నారా! అదేలా? ఏమో దర్శకుడు బాల అలా చెవబుతున్నారు.
అవన్ ఇవన్ అనే తమిళ చిత్రంలో విశాల్ మృగజగా నటిస్తున్నాడు. ఆ చిత్రం రిలీజ్ అయిన మొదటిరోజునే విశాల్ గిన్నీస్ రికార్డును ఎలా ఎక్కబోతున్నాడన్నది తెలుస్తుందని ఆయన ఊరిస్తున్నారు. ఆరోజే రికార్డు కోసం దరఖాస్తు చేస్తామని బాల ముక్తాయించారు.
ccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccc
e తాజా వన్డే సీరీస్‌లో విజయంతో భారత క్రికెట్ జట్టు ర్యాకింగ్స్‌లో మూడో స్థానానికి ఎగబాకగా ఇంగ్లండ్ అయిదో స్థానానికి పడిపోయింది. స్వదేశంలో జరిగిన 5 వన్డేల్లోను జట్టు గెలుపొందగా మ్యాన్ ఆఫ్ ది సీరీస్‌ను కెప్టెన్ ధోని కైవసం చేసుకున్నాడు.
e లిబియాలోని సిరేలో ఓ ఆయిల్ ట్యాంకర్ పేలుడు దుర్ఘటనలో 100 మంది మృత్యుపాలయ్యారు.
e కలలోనయినా కలగనలేదు..! అక్షరాల అయిదుకోట్ల రూపాయల నజరానా..బీహార్‌లోని కంప్యూటర్ ఆపరేటర్ సుశీల్‌కుమార్ `అమితాబ్ కౌన్‌బనేగా కరోడ్‌పతి` విజేతగా ఆవిర్భవించాడు. ఈ పోటీలో గెలిచి ఇంత పెద్ద మొత్తాన్ని పొందుతానని తానెప్పుడూ ఊహించలేదంటున్నాడీ యువకుడు.
No comments:
Post a Comment