26 Oct 2011

festival of lights

 
దీపావ‌ళి అనే సంస్కృత ప‌దం అర్థం దీపాల వ‌రుస‌. హిందువులే కాదు సిక్కులు, జైనులు, బౌద్ధులు చేసుకొనే సంతోష సంబ‌రం. అస‌లు మ‌తాల‌కే అతీతంగా ప్ర‌పంచ వ్యాప్తంగా భార‌తీయులు ఘ‌నంగా జ‌రుపుకునే వేడుక‌. ఈ దీపావ‌ళికి వ‌యోభేదం కూడా లేద‌న‌వ‌చ్చు. కుటుంబం మొత్తం బాణ‌సంచాను కాలుస్తూ కేరింత‌లు కొట్ట‌డం క‌ద్దు. భార‌త్ స‌హా అమెరికా, బ్రిట‌న్‌, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, గుయానా, ఫిజి. మ‌లేసియా, నేపాల్‌, మారిష‌స్‌, మ‌య‌న్మార్‌, సింగపూర్‌, శ్రీ‌లంక‌, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఇండోనేసియా,జ‌పాన్‌, థాయిలాండ్‌ల్లో ధూం..ఢాం..ఢాం..గా జ‌నం జ‌రుపుకుంటుండ‌డం విశేషం. 

చెడుపై మంచి సాధించిన విజ‌యంగా జ‌రుపుకునే ఈ దీపావ‌ళిని ఆయా ప్రాంతాల్లో వివిధ సంద‌ర్భాల‌కు ప్ర‌తీక‌గా జ‌రుపుకుంటారు. రావ‌ణ సంహారం అనంత‌రం రాముడు అయోధ్య‌కు సీత‌,ల‌క్ష్మ‌ణ స‌మేతంగా తిరిగి రావ‌డం, శ‌క్తిని ఇచ్చిన కాళికాదేవి విజ‌యానికి ప్ర‌తిబింబంగాను, గ‌జాముఖ రూప దేవుడు వినాయ‌కుడు కొలువైన వేళ, శ్రీ‌కృష్ణుడు త‌న స‌తి స‌త్య‌భామ‌తో క‌లిసి న‌ర‌కాసురుణ్ని వ‌ధించిన సంద‌ర్భంగా మ‌రికొంద‌రు దీపావ‌ళిని బాణ‌సంచా కాల్పుల‌తో అంగ‌రంగ వైభ‌వంగా చేసుకుంటారు. ప్ర‌గ్జోతిష్‌పూర్ (ప్ర‌స్తుత అస్సాం) పాల‌కుడు న‌ర‌కాసురుడి ఆగ‌డాల‌కు చ‌ర‌మ‌గీతం పాడేందుకు ద్వార‌కాదీసుడైన‌ శ్రీ‌కృష్ణుడు స‌న్న‌ద్ధ‌మౌతాడు. మూడో భార్య అయిన స‌త్య‌భామ స‌మేతంగా త‌న గ‌రుడ వాహ‌నంపై శ్రీ‌కృష్ణుడు యుద్ధానికి వెళ్తాడు. అయితే బ్ర‌హ్మ‌దేవుని వ‌రాన్ని న‌ర‌కాసురుడు అదివ‌ర‌కే పొంది ఉంటాడు.
కేవ‌లం త‌న త‌ల్లి భూమిదేవి చేతిలోనే మ‌ర‌ణం పొంద‌డ‌మ‌న్న‌ది ఆ విశేష‌వ‌రం. న‌ర‌కాసురుడి త‌ల్లి భూమిదేవే ద్వాప‌ర‌యుగంలో స‌త్య‌భామ‌ని పురాణాలు చెబుతున్నాయి. దాంతో స‌త్య‌భామ శ‌రాఘాతంతోనే జ‌నానికి న‌ర‌కాసురుడి పీడ విర‌గ‌డ‌య్యింది.
వెలుగుల వేడుక‌
దీపావ‌ళి నాడు ఇళ్ల‌న్నీ ప్ర‌మిద‌ల వెలుగుల‌తో విరాజిల్లుతాయి. బాణ‌సంచా మోత‌ల‌తో ద‌ద్ధ‌రిల్లుతాయి.ర‌క‌ర‌కాల పిండి వంట‌ల‌తో వీధుల‌న్నీ గుభాళిస్తాయి. ల‌క్ష్మీదేవి పూజ‌ల‌తో మ‌హిళా లోకం సంద‌డిగా గ‌డుపుతుంది. పిల్లాపెద్ద‌లంద‌రికీ ప్రీతిపాత్ర‌మైన పండ‌గ‌. భార‌త రాష్ట్ర‌ప‌తి ప్ర‌తిభా దేవీసింగ్ పాటిల్ యావ‌త్ జాతికి దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు.
-------------------------------------------------------------------------------------------
ccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccc
e  భార‌త క్రికెట్ జ‌ట్టు స్వ‌దేశంలో ఇంగ్లాండ్‌తో జ‌రిగిన వ‌న్డే సీరీస్‌ను 5-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసి ఆ జ‌ట్టుపై ఇటీవ‌ల ఎదురైన ప‌రాభ‌వానికి ప్ర‌తీకారం తీర్చుకుంది. 
e వికీలీక్స్ ప‌బ్లికేష‌న్స్‌కు విరామాన్ని ఇస్తున్న‌ట్లు సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు అసాంజె ప్ర‌క‌టించారు. అమెరికా ఆర్థిక సంస్థ‌లు సృష్టిస్తున్న అడ్డంకులే అందుకు కార‌ణంగా ఆయ‌న పేర్కొన్నారు.
e 53వ కామ‌న్‌వెల్త్ పార్ల‌మెంట‌రీ అసోసియేష‌న్ (సిపిఏ) స‌మావేశాన్ని న్యూఢిల్లీలో భార‌త అధ్య‌క్షులు ప్ర‌తిభా పాటిల్ ప్రారంభించారు. ఈ స‌మావేశాలు ఈ నెల 28 వ‌ర‌కు జ‌రుగుతాయి.
మేరీలాండ్ సిస్ట‌ర్ స్టేట్‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎంపిక‌యింది. దాంతో ప్ర‌వాసాంధ్రుల‌కు ఉద్యోగావ‌కాశాలు బాగా మెరుగవుతాయి.


No comments:

Post a Comment

Popular Posts

Wisdomrays