భూమిపై మనిషి జీవనం సాగించని ప్రాంతం ఏదైనా ఉందా? ఇతర గ్రహాలపై జీవుల ఉనికి కోసం అన్వేషణ కొనసాగిస్తున్న తరుణంలో వాతావరణం , నీరున్న భూమిపైనే తన ఉనికి లేని ప్రాంతం కూడా ఉందని 1820లోనే గుర్తించగలిగాడు. అదే అంటార్కిటికా ఖండం. భూమిపైగల ఏడు ఖండాల్లో ఈ ఒక్క ఖండమే మనిషి శాశ్వత జీవనం సాగించలేని ఏకైక ప్రాంతం. అంటార్కిటికా ఖండం విస్తీర్ణంలో అయిదోది. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాల తర్వాతది. ఆస్ట్రేలియా విస్తీర్ణం కంటే రెండు రెట్లు, యూరఫ్ కంటే 1.3 రెట్లు పెద్ద ఖండం. ఏడాదిలో అదీ వేసవిలోనే వెయ్యి నుంచి అయిదు వేల మంది ఇక్కడ అడుగు పెడుతుంటారు. ఇక్కడ నెలకొన్న అతిశీతల వాతావరణమే అందుకు కారణం. అంటార్కిటికాలో-89 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఏడాది పొడవునా మనిషి ఈ ఖండంపై మనగలగడం కష్టమే. ఈ వాతావరణంలో ఉనికిని చాటుకుంటున్న కొన్ని జీవులూ లేకపోలేదు. కొన్ని రకాల జంతువులు,మొక్కలు,జీవులూ నెలకొని ఉన్నాయి. ఆల్గే,జంతువుల్లో మైట్స్, నెమటిడ్స్, పెంగ్విన్స్, సీల్స్, టార్టిగ్రేడ్స్, బ్యాక్టీరియా, ఫంగి, ప్లాంట్స్, ప్రాటస్టీ తదితరాలే ఆ జీవులు.
* 1820లో తొలిసారిగా రష్యా పరిశోధన బృందం ప్రాబియన్ గాటిలెబ్‌వాన్, బెల్లింగ్ షాసెన్, మైఖెల్ లజరెన్‌లు ఈ ఖండంలో కాలుమోపారు.
* అంటార్కిటికా ట్రీటీపై 1959లో తొలుత 12 దేశాలు సంతకాలు చేశాయి. ఇప్పుడు ఆ సంఖ్య 47కు చేరింది. ఈ ఒప్పందం ప్రకారం మిలటరీ, మైనింగ్, అణుపరీక్షలు, విద్యుదుత్పాదన నిషిద్ధం.ప్రస్తుతం వివిధ దేశాలకు చెందిన నాలుగువేల మంది శాస్త్రవేత్తలు ఇక్కడ పరిశోధనలు సాగిస్తున్నారు.
*1890 నుంచే దీన్ని అంటార్కిటికా ఖండంగా పిలుస్తున్నారు. ఈ గ్రీకు పదానికి ఆపోజిట్ ఆర్కిటిక్ అని అర్థం.
* 1773 జనవరి 17లోనే కెప్టెన్ జేమ్స్ కుక్ నేతృత్వంలోని నౌకా బృందం అంటార్కిటికా సర్కిల్ జలాల్లోకి ప్రవేశించింది.
1820లోనే అని ధ్రువీకరించాయి.
* ఒంటరిగా ఈ ఖండానికి సాహసయాత్ర సాగించిన తొలి ఔత్సాహికుడు న్యూజిలాండ్‌కు చెందిన డేవిడ్ హెన్రీ.
* ఈ ఖండం సముద్ర తీర పొడవు 17,968 కిలోమీటర్లు. రోజ్‌సీ, వెడ్లే సముద్ర తీరాలకు అంటార్కిటికా అతి సమీపాన ఉంది. విన్‌సన్ మసిఫి ఈ ఖండంలో అత్యంత ఎత్తైన శిఖరం.
* అంటార్కిటికాలో 70కు పైగా సరస్సులున్నాయి. వీటిలోని మంచు ఒకదాంట్లో నుంచి మరోదాంట్లోకి ప్రవహిస్తుంటుంది.
* 170 మిలియన్ ఏళ్ల క్రితం గొండ్వానాలో అంతర్భాగమైన అంటార్కిటికా తర్వాత విడివడి ఇప్పటి మంచుఖండంగా ఏర్పడింది. ఇది జరిగి 25 మిలియన్ సంవత్సరాలయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
* అంటార్కిటికాలో చర్చ్‌లు.. 2004లో రష్యాకు చెందిన బెల్లింగ్ షెసెన్ స్టేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ అర్థోడాక్స్,ట్రినిటీ చర్చ్‌లు ప్రారంభమయ్యాయి. ఇద్దరు మతాధికారులు కూడా రొటేషన్ పద్ధతిలో ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.
* అంటార్కిటికాలో పుట్టిన తొలి మనిషి అర్జెంటినాకు చెందిన ఎమిలియో మార్కొస్ పర్మా(1978). ఆ దేశ ప్రభుత్వం ఈ మంచుఖండంలో మానవులు ఏమేరకు జీవించగలరో కనుగొనే ఉద్దేశంతో ఏడు జంటల్నిఇక్కడకు పంపింది. అంటార్కిటికా పరిధిలో బేస్ ఎస్పరంజ్‌లో ఈ తొలి మనిషి ఊపిరి పోసుకున్నాడు.
ప్రమాదం...మనిషి వాడుతున్న అనేకానేక ఆధునిక యంత్రాల వల్ల వెలువడే ఫ్లోరోక్లోరో కార్బన్‌లు ఓజోన్ పొరను దెబ్బతీస్తుండడం తెలిసిందే. ఈ పొర సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిని చేరకుండా నిలువరిస్తూ ఉంటాయి. ఆ పొరకే రంధ్రం ఏర్పడుతుండడం ప్రమాధభరితంగా పరిణమించింది. 1985లో హేలీ స్టేషన్ నుంచి బ్రిటిష్ శాస్త్రవేత్తల బృందం ఇదే విషయాన్ని పేర్కొంటూ అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్‌కు ఏర్పడిన రంధ్రం గురించి సమాచారమిచ్చింది. 2065 నాటికి ఆ రంధ్రం ఏ స్థాయికి చేరుకుంటుందో ఊహిస్తుంటేనే భీతిగల్గుతోందంది. నాసా శాస్త్రవేత్తలు 2006లో వేసిన అంచనా ప్రకారం ఓజోన్ పొర దాదాపు 27.5 మిలియన్ కిలోమీటర్ల పరిధిలో పలుచబడే ప్రమాదం ఉందంది.అదే జరిగితే ఇక్కడ వాతావరణం వేడెక్కి ఈ ఖండపు మొత్తం మంచు కరిగి సముద్రాలు ఉప్పొంగితే దేశాలకు దేశాలే ప్రపంచ పటం నుంచి అదృశ్యమయిపోతాయి. బ్రిటిష్ అంటార్కిటికా సర్వే బృందం 2008జనవరిలో పేర్కొన్న ప్రకారం 10 వేల ఏళ్ల క్రితం అంటార్కిటికా చరిత్రలో ఈ ప్రాంత పరిధిలో చోటుచేసుకున్నఓ భారీ అగ్నిపర్వత పేలుడు వల్ల లావాతో పాటు వెలువడిన బూడిద ఈ ఖండంపైనే పరుచుకుని ఉంది.
____________________________________________________________________________________________________________--------------------------------------------------------------------------------------
eఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా హిందూపురంలో రూప అనే మహిళ ఓ వింత శిశువుకు జన్మనిచ్చింది. నాలుగు కాళ్లు, నాలుగు చేతులు, రెండు శరీరాలతో ఉన్న శిశువు పుట్టిన వెంటనే మరణించింది.
eప్రపంచ జనాభా ఈ అక్టోబర్ 31కి 700 కోట్లకు చేరుకోనున్నట్లు ఐక్యరాజ్యసమితి జనాభా లెక్కల విభాగం ప్రకటించింది.
No comments:
Post a Comment