21 Oct 2011

iceman

http://royalloyal007.blogspot.in/2012/10/michael-manic.html
ఆదిమ‌కాలం..మ‌ధ్య‌యుగం..ఆధునిక లోకం..మాన‌వ ప‌రిణామ క్ర‌మం ఎంతో నాగ‌రిక‌మ‌యిన‌ది. స‌ర్వ శ‌క్తిమంత‌మ‌యింది. ప్రాథ‌మిక ల‌క్ష్యం మాత్రం అలాగే ఉంది. ఆలోచ‌న‌..ఆస‌క్తి..అన్వేష‌ణ‌ల ప‌రంప‌ర య‌థావిధిగా కొన‌సాగుతోంది. భూమి, స‌ముద్రం, అంత‌రిక్షం ఒక‌టేమిటి..అన్నింటా ఒక‌టే శోధ‌న‌. ఎన్నో మ‌లుపులు మ‌రెన్నో వింత గొలిపే సంగ‌తులు. ఇంకా ఆ అన్వేష‌ణ క్ర‌మం ముందుకుపోతూనే ఉంది. మంచు మ‌నిషి `య‌తి` క‌థాక‌మామీషు అందులో భాగ‌మే. శ‌తాబ్దాలగా ఇంకా కొలిక్కి రాని అబ్బుర‌మిది. 
మం(చి)చు మ‌నిషి
సుమారు ఎనిమిది అడుగుల పొడ‌వు..బ‌లిష్ట‌మైన ఒళ్లు..నాలుగంగుళాల జుత్తు..ఒంటి నిండా బొచ్చు..అచ్చం పురుషుణ్నే పోలిన రూపు  

ఈ జీవి సొత్తు. సంచారం మంచు ప‌ర్వ‌త శ్రేణుల్లోన‌ని ఊహాగానాలు శ‌తాబ్దాలగా విన‌వ‌స్తూనే ఉన్నాయి. 18వ శ‌తాబ్దం నుంచే దేశ‌, విదేశీ అన్వేష‌కులు, జీవ‌శాస్త్ర‌వేత్త‌లు, ప‌ర్వ‌తారోహ‌క అన్వేష‌కులు ప‌రిశోధిస్తూనే ఉన్నారు. 2010లో ర‌ష్యాలో ఈ విష‌య‌మై జ‌రిగిన స‌ద‌స్సులో చైనా బృందం మంచుమ‌నిషి ఉనికికి 95% ఆధారాలున్న‌ట్లు పేర్కొన‌డం గ‌మ‌నార్హం. షెనాన్‌గ్జియా ప్రావిన్స్‌లో 1970-80 ద‌శ‌కంలో జ‌రిగిన అన్వేష‌ణ అంశాల‌ను బ‌ట్టి తామీ నిర్ధార‌ణ‌కు వ‌చ్చామ‌న్నారు. యోషితో త‌క‌టో నేతృత్వంలోని ఏడుగురు స‌భ్యుల బృందం 20 అక్టోబ‌ర్ 2008లో హిమాల‌య ప‌ర్వ‌త సాణువుల్లో య‌తి పాద ముద్ర‌లను ఫొటోషూట్ చేసింది. నేపాల్‌, టిబెట్ స‌రిహ‌ద్దు ప్రాంత ప‌ర్వ‌తాల్లోనే య‌తి సంచారం ఉన్న‌ట్లు 19వ శ‌తాబ్దంలో ప‌లు క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. ఎన్నో చిత్రాలు, ఫిక్ష‌న్ క‌థ‌లు,న‌వ‌ల‌లు జ‌నాన్ని అల‌రించాయి. య‌తి జాడ ప‌ర్వ‌త‌శ్రేణుల్లోనే ఉంద‌ని అక్క‌డి ప‌లువురి ప‌రిశోధ‌కుల అభిప్రాయం. ఆయా దేశాల్లో య‌తికి ఆయా పేర్లున్నాయి. బిగ్‌ఫుట్‌,హోక్స్‌,య‌బిమోన‌బుల్ ఇలా అనేక పేర్లు చ‌లామ‌ణి అవుతున్నాయి. ఈ య‌తి వియత్నాం యుద్ధంలో సైతం పాల్గొంద‌నేది నిర్ధార‌ణ కాని క‌థ‌నం.దీనిపై ఎఫ్‌బిఐ విచార‌ణ జ‌ర‌పాల‌ని క్రిప్టోజువాల‌జీ శాస్త్ర‌వేత్త డాక్ట‌ర్ హ‌ల్మాన్స్ నాడే కోరారు. య‌తి పాద‌ముద్ర‌ల్ని 1899లోనే క‌నుగొన్న‌ట్లు లారెన్స్ వాడెట్ అనే పాశ్చాత్య అన్వేష‌కుడు పేర్కొన్నారు. య‌తి త‌ల‌వెంట్రుకుల్ని ఈశాన్య భార‌త ప్రాంతంలో ఎడ్మండ్ అనే ప‌రిశోధ‌కుడు సేక‌రించిన‌ట్లు ఓ వార్తా ఉంది. ఆయ‌న 1950లోనే ఈ వెంట్రుకుల్ని డిఎన్ఏ ప‌రీక్ష‌ల కోసం ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ మ్యూజియం ఆఫ్ నేచుర‌ల్ హిస్ట‌రీ విభాగానికి అందించార‌ట‌. ఈ మేర‌కు బిబిసి క‌థ‌నాన్ని ప్ర‌సారం చేసింది. ఇంత‌కీ య‌తి పాదం పొడ‌వు 19 అంగుళాల‌ని వేళ్ల పొడ‌వు,వెడ‌ల్పు మొత్తం 25 సెంటీమీట‌ర్ల‌ని అమెరికా టెలివిజ‌న్ బృందం 2007 డిసెంబ‌ర్‌లో `డెస్టినేష‌న్ ట్రూత్‌` అనే ప్రోగ్రాంలో పేర్కొంది. క‌నుగొన్న య‌తి శిలాజం, పుర్రెను  ప‌లు పాశ్చాత్య దేశ మ్యూజియాల్లో ప్ర‌ద‌ర్శించారు. దీనిపై డెయిలీ మిర్ర‌ర్ నుంచి ప‌లు స్టోరీలు కూడా వెలువ‌డ్డాయి. నేపాల్ స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో య‌తి జాడ క‌నుగొన‌డానికి అమెరికా ఔత్సాహిక బృందం అక్క‌డ ప‌ర్య‌టించింది. అయితే ఆత్మ‌ర‌క్ష‌ణ కోస‌మైనా ఆ జీవికి ఎటువంటి హాని త‌ల‌పెట్ట‌రాద‌నే ష‌ర‌తుపైనే ఆ బృందాన్ని నేపాల్ ప్ర‌భుత్వం త‌మ దేశంలోకి అనుమతించింది.

హాలివుడ్ `ది ఐస్ మ్యాన్‌` 
చంద్రుడు,అంగార‌కుడిపై నీరుంద‌ని, జీవులుండే అవ‌కాశ‌ముంద‌ని భావిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో భూమిపై య‌తి ఉండొచ్చు, ఉండ‌క‌పోనూ వ‌చ్చు. ఇది అప్పుడూ ఇప్పుడూ రూఢీ కాని విష‌య‌మే. కానీ మంచుమ‌నిషి చాలా మంచిమ‌నిష‌ని నేపాల్ షేర్పాల‌(గైడ్లు) భావ‌న‌. మ‌నుషుల‌ జాడ‌ను గ‌మ‌నించ‌గానే య‌తి అజ్ఞాతంలోకి వెళ్లిపోతుంద‌ని వారంటారు. య‌తి బ‌హు సిగ్గ‌ర‌ట‌. రాక్ష‌స‌బ‌ల్లులపై జురాసిక్ పార్క్‌, అంత‌రిక్ష  మాన‌వుడు క‌థాంశంతో టెర్మినేట‌ర్‌, అవ‌తార్‌, కింగ్‌కాంగ్‌,యాప్‌మ్యాన్ త‌దిత‌ర చిత్రాల‌తో స్పీల్‌బ‌ర్గ్‌, కామ‌రూన్ వంటి హాలివుడ్ ద‌ర్శ‌కులు యావ‌త్ ప్ర‌పంచాన్ని ఉర్రూత‌లూగించారు. మ‌రి ఈ `ఐస్‌మ్యాన్‌`పై తాజాగా ఓ చిత్రాన్నితెర‌కెక్కిస్తే ఆ కిక్ భ‌లే కదూ!
_______________________________________________________________
e బెంగళూర్‌లో మెట్రో రైలు ఈరోజే ప్రారంభ‌మ‌యింది.
e లిబియా నియంత క‌ల్న‌ల్ గ‌డాఫీ(69) సొంతూరు స్టెర్త్‌లోనే తిరుగుబాటు ద‌ళాల చేతిలో కాల్చివేత‌కు గుర‌య్యారు

20 Oct 2011

space


మ‌నిషి శోధ‌న అనంతం..నిరంత‌రం..విశ్వం అంటే? అంత‌రిక్షంలో ఏముంది? చ‌ంద్రుడిపై నీరుందా..అంగార‌కుడు భూమికి సోద‌రుడా? అక్క‌డ వాతావ‌ర‌ణం ఏంటి? మ‌న బోటి జీవులూ ఉన్నారా? ఇలా అనాదిగా అనేక విష‌యాల‌పై మ‌న ప‌రిశోధ‌న‌లు విశ్వం..గ్ర‌హాలు..ఇత‌ర జీవుల ఉనికిపై సాగాయి..కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నో విజ‌యాలు..చిక్కువీడిన అంశాలు శాస్త్ర‌వే్త్త‌ల ద‌రికి చేరాయి. అస‌లు మ‌నిషి ఆలోచ‌నా ప‌థం ల‌క్ష ఏళ్ల నాడే ఆరంభ‌మ‌యింద‌ని అమెరికా లివ‌ర్‌ఫూల్ యూనివ‌ర్సిటీకి చెందిన శాస్త్ర‌వేత్త లారెన్స్ బ‌ల్లామ్ తెలిపారు. త‌మ మ‌నుగ‌డ కోస‌మో, ఆధిప‌త్య నిరూప‌ణ‌కో, మాన‌వాళి అభ్యున్న‌తి కోస‌మో అభివృద్ధి చెందిన దేశాలు చాలా ద‌శాబ్దాల క్రిత‌మే విశ్వాంత‌రాళ శోధ‌న‌ల‌కు న‌డుం బిగించాయి. ముఖ్యంగా అమెరికా అప్పటి సోవియ‌ట్ యూనియ‌న్ నువ్వా నేనా అన్న‌ట్లు పోటీప‌డి అనేక ప్ర‌యోగాలు చేశాయి. వాటి వ‌ల్ల చాలావ‌ర‌కు యావ‌త్ ప్ర‌పంచ జ‌నానికి మేలే ఒన‌గూరింది. అప్ప‌టి భిన్నధ్రువ ప్ర‌పంచంలో ఆ పోటీ నెల‌కొంది. ప్ర‌స్తుత ఏక‌ధ్రువ ప్ర‌పంచంలో అమెరికా మాత్ర‌మే మిగిలినా ర‌ష్యా, ఇత‌ర యూరోపియ‌న్ దేశాలు త‌మ‌వంతు చేయూత‌తో ఇంకా అనేకానేక ప్ర‌యోగాలు చేస్తూనే ఉన్నాయి. ఇప్ప‌టికిప్పుడు కాకున్నా భ‌విష్య‌త్‌లో వీటి ఫ‌లితాలు రాబోయే త‌రాల‌కు ఉప‌క‌రించాల‌న్న‌దే ప్ర‌ధాన ఉద్దేశం. మ‌న ఇస్రో చంద్ర‌యాన్ ప్ర‌యోగానికి స‌న్న‌ద్ధం కావ‌డం అందులో భాగ‌మే. మూణ్నెల్ల వ్య‌వ‌ధిలోనే మూడు శాటిలైట్ ప్ర‌యోగాల్ని చేసే మ‌న శాస్త్ర‌వేత్త‌లు విజ‌యాన్ని అందుకోవ‌డం ముదావ‌హం. ఇటీవ‌ల పి.ఎస్‌.ఎల్‌.వి-18 ప్ర‌యోగ విజ‌యంలో మ‌న‌దేశ విద్యార్థుల పాత్ర ప్ర‌శంసార్హం. అంత‌రిక్షానికి ఎగ‌సిన వివిధ ప్ర‌యోగాలు 1950-60 ద‌శ‌కంలో పోటాపోటీగా సాగిన అంత‌రిక్ష ప్ర‌యోగాలు జ‌నంలో ఉత్కంఠ‌ను క‌ల్గించాయి. సోవియ‌ట్ యూనియ‌న్ స్పూత్నిక్ మాన‌వ‌ర‌హిత రాకెట్‌ను అంత‌రిక్షానికి పంపి తొలి విజ‌యాన్ని సాధించింది. ఇందులో లైకా అనే కుక్క పిల్ల‌ను పంపారు. ఆ త‌ర్వాత 1961 ఏప్రిల్‌లో యూరిగ‌గారిన్ అంత‌రిక్షానికేగిన తొలి మాన‌వుడిగా చ‌రిత్ర లిఖించాడు. అమెరికా మెర్కురీ, జెమినీ, అట్లాస్‌, ఛాలెంజ‌ర్‌, కొలంబియా, ఒలంప‌స్ త‌దిత‌రాలెన్నింటినో ప్ర‌యోగించింది. అపోలో ఆప‌రేష‌న్స్‌ను 1969-72 మ‌ధ్య ప‌లు ద‌ఫాలు నిర్వ‌హించి స‌క్సెస్‌ను కొట్టేసింది. జులై20, 1969లో చంద్రుడిపై అడుగిడిన తొలి మానిషిగా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ వినుతి గ‌డించాడు. 
అంత‌రిక్షంలో ఇంట‌ర్నేష‌న‌ల్ స్పేస్‌స్టేష‌న్ (ఐఎస్ఎస్‌)ను అప్ప‌టి సోవియ‌ట్ యూనియ‌న్ ఆ త‌ర్వాత ర‌ష్యా, అమెరికా, యూరోపియ‌న్ స్పేస్ ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వ‌హించాయి. ఈ ఐఎస్ఎస్‌లో వంద‌ల మంది పురుష‌, స్త్రీ వ్యోమ‌గాములు ఇంత‌వ‌ర‌కు గ‌డిపి వ‌చ్చారు. అంతేనా అంత‌రిక్ష యాత్ర‌ల‌కు ఈ వ్యోమ‌గాములు విజ‌యం తెర‌తీసింది. ఈ ప్ర‌యోగ ప‌రంప‌ర‌లో విషాదాలు చోటుచేసుకున్నాయి. భార‌త సంత‌తికి చెందిన నాసా వ్యోమ‌గామి క‌ల్ప‌నాచావ్లా స‌హా 8 మంది భూమికి తిరిగి వ‌స్తుండ‌గా స్పేస్‌ష‌టిల్ క‌క్ష్య‌లోనే మండిపోవ‌డంతో వారి `ఛాలెంజ్` అర్ధంత‌రంగానే ముగిసిపోయింది. ఇక నాసాకే చెందిన మాజీ ఉద్యోగి కాలిఫోర్నియా బిలియ‌నీర్ డెన్నిస్‌టిటో(60) తొలి అంత‌రిక్ష యాత్రికుడిగా చ‌రిత్ర‌కెక్కాడు. 2001లో ఈ యాత్ర‌కు ఆయ‌న వెచ్చించింది ఎంతంటే 20 మిలియ‌న్ డాల‌ర్లు. ఎనిమిది రోజుల పాటు టిటో ఐఎస్ఎస్‌లో గ‌డిపి క్షేమంగా తిరిగి వ‌చ్చారు. అమెరికా, ర‌ష్యా, యూరోపియ‌న్ స్పేస్ ఏజెన్సీల‌తో పాటు చైనా, జ‌పాన్‌, కెన‌డా, ఇండియా, ఇజ్రాయిల్‌, బ్రెజిల్ స‌హా 30 దేశాలు వివిధ అంత‌రిక్ష కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హిస్తున్నాయి. విశ్వం ఉన్నంత కాలం ఈ ప్ర‌యోగ ప‌రంప‌ర నిరాటంకంగానే సాగుతుంటుంది. ర‌హ‌స్యాల గుట్టును విప్పి మ‌నిషి మ‌నుగ‌డ‌ను అప్ర‌తిహ‌తంగా  కొన‌సాగిస్తుంటాడు.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
తిరుమ‌ల‌లో సూప‌ర్‌స్టార్‌
రాణా సినిమా ప్రారంభ‌మ‌య్యాక అస్వ‌స్థ‌త‌కు గురైన ద‌క్షిణాది సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ తిరుమ‌ల వ‌చ్చి వెంక‌న్న‌ను  ద‌ర్శించుకున్నారు. సింగ‌పూర్‌లో చికిత్స పొంది కోలుకున్నాక త‌న అల్లుడు ధ‌నుష్ మొక్కుకున్న మేర‌కు ఆయ‌న శ్రీ‌వారి స‌న్నిధికి వ‌చ్చారు. త్వ‌ర‌లోనే సినిమా షూటింగ్‌లో పాల్గొన‌బోతున్న‌ట్లు ఆయ‌న ఈ సంద‌ర్భంగా మీడియాకు స్ప‌ష్టం చేశారు. 
బార్నెస్‌కు బుక‌ర్ ప్రైజ్‌
లండ‌న్‌లోని గిల్డ్ హాల్‌లో న్యాయ నిర్ణేత‌ల క‌మిటీ అధ్య‌క్షురాలు స్టెల్లా ప్ర‌తిష్ఠాత్మ‌క `మ్యాన్ బుక‌ర్‌ప్రైజ్‌`ను బ్రిటన్ ర‌చ‌యిత జూలియ‌న్ బ‌ర్నెస్ గెలుచుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 65 ఏళ్ల బ‌ర్నెస్‌`ద సైన్స్ ఆఫ్ యాన్ ఎండింగ్‌` పేరిట రాసిన న‌వ‌ల‌లో చిన్న‌నాటి స్నేహాలు, అస్ప‌ష్ట స్మృతుల్ని హృద్యంగా మ‌లిచారు.
స్వైన్‌ఫ్లూ ముప్పు
ఆక్స్‌ఫ‌ర్డ్ వ‌ర్సిటీ శాస్త్ర‌వేత్త‌ల ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం స్వైన్‌ఫ్లూ సోకిన గ‌ర్భిణి మృత శిశువును ప్ర‌స‌వించే ప్ర‌మాద‌ముంద‌ట‌. అయితే నివార‌ణ‌కు వారు వ్యాక్సిన్‌ను సిఫార్సు చేశారు. 

                                                                                                                                                                                                                                                               

19 Oct 2011

yuva annaa


హ్యాట్సాఫ్ యువ‌
ఫౌజా సింగ్ భార‌త సంత‌తికి చెందిన 100 ఏళ్ల న‌వ‌యువ‌కుడు. సాధించిన ఘ‌న‌త ఏంటో తెలుసా? టొరంటోలో జ‌రిగిన 42 కిలోమీట‌ర్ల మార‌థాన్ రేసును 8 గంట‌ల్లో అధిగ‌మించ‌డం ద్వారా ల‌క్ష్యాన్ని అందుకొని గిన్నీస్‌బుక్ రికార్డును సొంతం చేసుకున్నాడు.
హంటా(ర్‌)
ఇదేమిటి? ఇదో ప్రాణాంత‌క వ్యాధి. తాజాగా నెల్లూరు జిల్లాలో ఓ మ‌హిళ ఈ వ్యాధికి బ‌ల‌య్యారు. ఎలుక‌ల ద్వారా ప్లేగు వ్యాధితోపాటు ఈ హంటా 
వ్యాధి కూడా ప్ర‌బ‌లుతోంద‌ని వైద్య నిపుణులు పేర్కొన్నారు. తీవ్ర జ్వ‌రం, త‌ల‌,కీళ్ల నొప్పుల‌తో బాధితులు మ‌ర‌ణిస్తారు. ఎలుక‌ల మూత్రం నీళ్ల‌లో క‌లిసి క‌లుషిత‌మ‌వుతున్న సంద‌ర్భాల్లోను, వాటి మ‌లం మ‌ట్టిలో క‌ల‌వ‌డం వ‌ల్ల ఈ వైర‌స్ ప్ర‌బ‌లి జ‌నానికి సోకుతుంది.

___________________________________________________________
అన్నా`హ‌జార్‌` !
అన్నా ఆ పేరులోనే ఉంది సోద‌ర‌భావం. కోట్లాది భార‌తీయుల్ని క‌దిలించే రూపం. హావాభావం ఆయ‌న సొంతం. నెత్తిన గాంధీ టోపీ..ఒంటిపై ఖ‌ద్ద‌రు వ‌స్త్రాలు..అస‌లు సిస‌లైన గాంధేయ‌వాది. ఆచ‌ర‌ణ‌లోనూ అదే త్రిక‌ర‌ణ‌శుద్ధి. త‌న జీవిత‌మే సందేశ‌మ‌న్నారు గాంధీజీ..త‌న పంథానే అంద‌రికీ మేలు బాట‌గా ముందుకు ఉరుకుతున్నారీ హాజారే. మ‌హారాష్ట్ర‌లోని రాలేగాంసిద్ధినే అందుకు ప్ర‌బ‌ల సాక్ష్యం. దేశం కోసం గ్రామాల్లోనే ఉంద‌న్న బాపూజీ మాట‌నే వారికి వేద మంత్రం. త‌న స్వ‌గ్రామం అభివృద్ధిని సాధించారు. చీక‌టిని తిడుతూ కూర్చునేకంటే చిరుదివ్వెను వెలిగించ‌డం మంచిద‌ని ఆచ‌రించి చూపించారు. జాతిపిత సిద్ధాంతాల వ‌ల్లెవేత కాదు. అమ‌లుకు కంక‌ణబ‌ద్ధులైన అన్నా జాతికి స్ఫూర్తి ప్ర‌దాత‌. అవినీతికి వ్య‌తిరేకంగా ప్ర‌స్తుతం స‌మ‌ర‌శంఖం పూరించిన ఈ అభిన‌వ గాంధీ అందుకు మ‌రో స్వాతంత్ర్య సంగ్రామం అవ‌స‌ర‌మంటున్నారు. ఈ పోరులో ఏ రాజ‌కీయ ప‌క్షానికి అవ‌కాశ‌మివ్వ‌క జ‌న‌లోక్‌పాల్ కోసం నిర‌శ‌న చేప‌ట్టి పాక్షిక విజయాన్ని జాతికి ప్రోది చేసిపెట్టారు. దేశ రాజ‌ధానిలోని రాంలీలామైదాన్ వేదిక‌గా పోటెత్తిన జ‌నావ‌ళి అదే ఒర‌వ‌డికి మున్ముందూ కంక‌ణ‌బ‌ద్ధ‌మై చేయూత‌నిస్తేనే దాదాపు స‌గ‌భాగం ఉన్న నిరుపేద భార‌తానికి అభ్యున్న‌తి. మెరుగైన జీతాల కోసం విదేశాల‌కు వ‌ల‌స‌లు భారీగా జ‌రుగుతుండ‌డంతో ఇప్ప‌టికే బ్రెయిన్ డ్రెయిన్‌తో న‌ష్ట‌పోతున్న భార‌త్‌కు న‌ల్ల‌ధ‌నం మ‌రో తీర‌ని న‌ష్టం. ల‌క్షా 82 వేల కోట్ల డాల‌ర్ల న‌ల్ల‌ధ‌నం ఈ విధంగా ప‌రాయిగ‌డ్డ‌పై మూలుగుతోంద‌ని ఓ అంచ‌నా. దేశం మేధో వ‌ల‌స‌ల వ‌ల్ల పాక్షికంగా న‌ష్ట‌పోతుండ‌గా అవినీతి, పోగుప‌డిపోతున్న న‌ల్ల‌ధ‌నం యావ‌త్ దేశాభివృద్ధికి అగాధ‌మే అవుతోంది. ప్ర‌వాస భార‌తీయులు ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న మ‌న‌వాళ్లు అక్క‌డ సంపాదించిన సొమ్ముతో ఇక్క‌డ ఇతోధిక ఆర్థిక చేయూత‌నిస్తున్నారు. ఏదేశ మేగినా ఎందు కాలిడినా పొగ‌డ‌రా నీ త‌ల్లి భూమి భార‌తిన‌న్న రాయ‌ప్రోలు సుబ్బారావు మాట‌కు ఎన్ఆర్ఐలు ప్ర‌తీక‌లవుతున్నారు. దేశ సంస్కృతి సంప్ర‌దాయాల‌ను అక్క‌డా పాటిస్తూ వారు శ‌భాష్ అనిపించుకుంటున్నారు. అందుకు భిన్నంగా ఇక్క‌డ అవినీతి అక్ర‌మాల‌తో సంపాదించిన న‌ల్ల‌ధ‌నాన్ని విదేశాల్లో దాచుకొనే ఘ‌రానాల వ‌ల్లే దేశం ఇంకా తృతీయ ప్ర‌పంచ దేశాల జాబితాలోనే మిగిలిపోతోంది. అవినీతి ఆట‌క‌ట్టుతోపాటు న‌ల్ల‌ధ‌నం మ‌ళ్లీ దేశ జ‌నావ‌ళికి తిరిగి ద‌క్కేందుకు ఉద్య‌మం సాగాలి. వీట‌న్నిటి దృష్ట్యానే అన్నా త‌న నిష్క‌ళంక జ‌ట్టుతో ముంద‌డుగు వేస్తున్నారు. దేశంలో తొలి మ‌హిళా ఐపిఎస్ అయిన కిర‌ణ్‌బేడి చేపట్టిన జైళ్ల సంస్క‌ర‌ణ‌లు, విధినిర్వ‌హ‌ణ‌లో చూపిన తెగువ ఆమెకు తిరుగులేని కీర్తిని సంపాదించ‌పెట్టాయి. ఫిలిప్పైన్స్ ప్ర‌భుత్వ ప్ర‌తిష్ఠాత్మ‌క రామ‌న్ మెగ‌సెసే అవార్డుతోపాటు ప‌లు రివార్డులు బేడి సొంత‌మ‌య్యాయి. అన్నా టీంలో మ‌రో ముఖ్య స‌హ‌చ‌రుడు అర‌వింద్ కేజ్రీవాల్ ఐఎఫ్ఎస్‌. ఆయ‌నా సేవాభావం, స‌మ‌ర్థ విధి నిర్వ‌హ‌ణ‌తో రామ‌న్ మెగ‌సెసే అవార్డుతోపాటు ప‌లు అవార్డులు, రివార్డుల‌నెన్నింటినో పొందారు. తండ్రీ త‌న‌యులు శాంతి, ప్ర‌శాంత్ భూష‌ణ్‌లు దేశంలోనే ల‌బ్ధ ప్ర‌తిష్టులైన న్యాయ‌వాదులు. గాంధీజీ ఆశ‌య‌సాధ‌న‌కు దిశానిర్దేశ‌కులైన అన్నాజ‌ట్టుతో యావ‌త్ దేశ యువ‌త జ‌త‌క‌డితేనే జ‌నం క‌ల సాకారం అవుతుంది. 2050 నాటికి భార‌త్ అభివృద్ధి చెందిన దేశంగా రూపాంత‌రం చెంద‌గ‌ల‌దు.
...........................................................................................................................................................................................................................
  • జ‌న‌చేత‌న యాత్ర‌ను ప్రారంభించిన 80 ఏళ్ల బీజేపీ అగ్ర‌నేత‌ అద్వానీ ప్ర‌స్తుతం ఏపీలో ప‌ర్య‌టిస్తున్నారు.

18 Oct 2011

star



వాషింగ్ట‌న్‌లో జ‌రిగిన స్పాడ్రెడ్ సీరీస్‌-2 టోర్న‌మెంట్‌లో భార‌త టాప్ ర్యాంక్ మ‌హిళా స్క్వాష్ క్రీడాకారిణి దీపికా ప‌ల్లిక‌ల్ టైటిల్ విజేత‌గా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఫైన‌ల్‌లో ఆమె ఇంగ్లాండ్‌కు చెందిన సారా జెన్ పెరీని చిత్తుచేసింది.
                                                    క్రికెట‌ర్ స్టార్ డ‌(నే)మ్‌
                                                         గ‌వాస్క‌ర్‌-లిటిల్‌మాస్ట‌ర్‌
క‌పిల్‌దేవ్‌-హ‌ర్యానా హ‌రికేన్‌
గుండ‌ప్ప విశ్వ‌నాథ్‌-లేట్‌క‌ట్ లెజెండ్‌
ప‌టౌడీ-టైగ‌ర్‌
వెంగ్‌స‌ర్కార్‌-క‌ల్న‌ల్‌
మొహింద‌ర్ అమ‌ర్‌నాథ్‌-జిమ్మి
అజారుద్దీన్‌-రిస్టీ స్ట‌యిలిష్‌
స‌చిన్ టెండుల్క‌ర్‌-మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌
గంగూలీ-కోల్‌క‌తా ప్రిన్స్‌
ధోనీ-జార్కండ్ డైన‌మేట్‌
వీరేంద్ర సెహ్వాగ్‌-డేషింగ్ రేస‌ర్‌
ద్ర‌విడ్‌-గ్రేట్‌వాల్‌
ల‌క్ష్మ‌ణ్‌-మిస్ట‌ర్ క‌న్సిస్టెంట్‌
హ‌ర్బ‌జ‌న్‌-స్పిన్ ట‌ర్బ‌న్‌
                                     cccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccc
ఉత్త‌రాలు గ‌త కాల‌పు చిహ్నాలు
కాలం ప‌రిగెడుతోంది. స‌మాచార విప్ల‌వానిది గ్లోబ‌ల్ స్పీడ్‌. సెల్‌ఫోన్ ఇప్పుడు అంద‌రికీ స‌ర్వ‌శ్వం. మ‌న‌దేశంలోనే దాదాపు 70 కోట్ల పైచిలుకు మందికి నిత్యావ‌స‌ర సాధ‌నం. అయితే వేళ్లునుకున్న ఈ సాంకేతిక‌తే జ‌నావ‌ళి పాలిట పెనుముప్పంటోంది డ‌బ్ల్యూ.హెచ్‌.ఓ. అతి వ‌ర్జేయ‌తే అన్న‌ట్లు సెల్ విచ్చ‌ల‌విడి వాడ‌కం వ‌ల్ల బ్రెయిన్ కేన్స‌ర్ ప్ర‌మాదం పొంచి ఉందంటోంది. కాల్ క‌న్నా మెసెజ్‌లే మేల‌ట‌. మాట్లాడేట‌ప్పుడు ఇయ‌ర్ ప్లెగ్‌ల‌ను ఉప‌యోగిస్తే చాలా వ‌ర‌కు సేఫ‌ట‌.
హ‌జ్‌యాత్ర‌లో విషాదం
భార‌త్ నుంచి ఈ ఏడాది మ‌క్కా మ‌దీనాల‌కు 62 వేల మంది త‌ర‌లి వెళ్లారు. వారిలో 9 మంది దుర్మ‌ర‌ణం చెందిన‌ట్లు జెడ్డాలోని అధికార వ‌ర్గాలు పేర్కొన్నాయి.
cccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccc--
life means full of pains. if..no pains, simultaneously no gains
cccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccc
టాలివుడ్ `స్టార్‌` నేమ్స్‌
చిరంజీవి-మెగాస్టార్‌
బాల‌కృష్ణ‌-యువ‌ర‌త్న‌
నాగార్జున‌-యువ సామ్రాట్‌
వెంక‌టేష్‌-విక్ట‌రీ

                                                                                                                                                                                                                 

Popular Posts

Wisdomrays