26 Oct 2011

festival of lights

 
దీపావ‌ళి అనే సంస్కృత ప‌దం అర్థం దీపాల వ‌రుస‌. హిందువులే కాదు సిక్కులు, జైనులు, బౌద్ధులు చేసుకొనే సంతోష సంబ‌రం. అస‌లు మ‌తాల‌కే అతీతంగా ప్ర‌పంచ వ్యాప్తంగా భార‌తీయులు ఘ‌నంగా జ‌రుపుకునే వేడుక‌. ఈ దీపావ‌ళికి వ‌యోభేదం కూడా లేద‌న‌వ‌చ్చు. కుటుంబం మొత్తం బాణ‌సంచాను కాలుస్తూ కేరింత‌లు కొట్ట‌డం క‌ద్దు. భార‌త్ స‌హా అమెరికా, బ్రిట‌న్‌, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, గుయానా, ఫిజి. మ‌లేసియా, నేపాల్‌, మారిష‌స్‌, మ‌య‌న్మార్‌, సింగపూర్‌, శ్రీ‌లంక‌, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఇండోనేసియా,జ‌పాన్‌, థాయిలాండ్‌ల్లో ధూం..ఢాం..ఢాం..గా జ‌నం జ‌రుపుకుంటుండ‌డం విశేషం. 

చెడుపై మంచి సాధించిన విజ‌యంగా జ‌రుపుకునే ఈ దీపావ‌ళిని ఆయా ప్రాంతాల్లో వివిధ సంద‌ర్భాల‌కు ప్ర‌తీక‌గా జ‌రుపుకుంటారు. రావ‌ణ సంహారం అనంత‌రం రాముడు అయోధ్య‌కు సీత‌,ల‌క్ష్మ‌ణ స‌మేతంగా తిరిగి రావ‌డం, శ‌క్తిని ఇచ్చిన కాళికాదేవి విజ‌యానికి ప్ర‌తిబింబంగాను, గ‌జాముఖ రూప దేవుడు వినాయ‌కుడు కొలువైన వేళ, శ్రీ‌కృష్ణుడు త‌న స‌తి స‌త్య‌భామ‌తో క‌లిసి న‌ర‌కాసురుణ్ని వ‌ధించిన సంద‌ర్భంగా మ‌రికొంద‌రు దీపావ‌ళిని బాణ‌సంచా కాల్పుల‌తో అంగ‌రంగ వైభ‌వంగా చేసుకుంటారు. ప్ర‌గ్జోతిష్‌పూర్ (ప్ర‌స్తుత అస్సాం) పాల‌కుడు న‌ర‌కాసురుడి ఆగ‌డాల‌కు చ‌ర‌మ‌గీతం పాడేందుకు ద్వార‌కాదీసుడైన‌ శ్రీ‌కృష్ణుడు స‌న్న‌ద్ధ‌మౌతాడు. మూడో భార్య అయిన స‌త్య‌భామ స‌మేతంగా త‌న గ‌రుడ వాహ‌నంపై శ్రీ‌కృష్ణుడు యుద్ధానికి వెళ్తాడు. అయితే బ్ర‌హ్మ‌దేవుని వ‌రాన్ని న‌ర‌కాసురుడు అదివ‌ర‌కే పొంది ఉంటాడు.
కేవ‌లం త‌న త‌ల్లి భూమిదేవి చేతిలోనే మ‌ర‌ణం పొంద‌డ‌మ‌న్న‌ది ఆ విశేష‌వ‌రం. న‌ర‌కాసురుడి త‌ల్లి భూమిదేవే ద్వాప‌ర‌యుగంలో స‌త్య‌భామ‌ని పురాణాలు చెబుతున్నాయి. దాంతో స‌త్య‌భామ శ‌రాఘాతంతోనే జ‌నానికి న‌ర‌కాసురుడి పీడ విర‌గ‌డ‌య్యింది.
వెలుగుల వేడుక‌
దీపావ‌ళి నాడు ఇళ్ల‌న్నీ ప్ర‌మిద‌ల వెలుగుల‌తో విరాజిల్లుతాయి. బాణ‌సంచా మోత‌ల‌తో ద‌ద్ధ‌రిల్లుతాయి.ర‌క‌ర‌కాల పిండి వంట‌ల‌తో వీధుల‌న్నీ గుభాళిస్తాయి. ల‌క్ష్మీదేవి పూజ‌ల‌తో మ‌హిళా లోకం సంద‌డిగా గ‌డుపుతుంది. పిల్లాపెద్ద‌లంద‌రికీ ప్రీతిపాత్ర‌మైన పండ‌గ‌. భార‌త రాష్ట్ర‌ప‌తి ప్ర‌తిభా దేవీసింగ్ పాటిల్ యావ‌త్ జాతికి దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు.
-------------------------------------------------------------------------------------------
ccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccc
e  భార‌త క్రికెట్ జ‌ట్టు స్వ‌దేశంలో ఇంగ్లాండ్‌తో జ‌రిగిన వ‌న్డే సీరీస్‌ను 5-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసి ఆ జ‌ట్టుపై ఇటీవ‌ల ఎదురైన ప‌రాభ‌వానికి ప్ర‌తీకారం తీర్చుకుంది. 
e వికీలీక్స్ ప‌బ్లికేష‌న్స్‌కు విరామాన్ని ఇస్తున్న‌ట్లు సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు అసాంజె ప్ర‌క‌టించారు. అమెరికా ఆర్థిక సంస్థ‌లు సృష్టిస్తున్న అడ్డంకులే అందుకు కార‌ణంగా ఆయ‌న పేర్కొన్నారు.
e 53వ కామ‌న్‌వెల్త్ పార్ల‌మెంట‌రీ అసోసియేష‌న్ (సిపిఏ) స‌మావేశాన్ని న్యూఢిల్లీలో భార‌త అధ్య‌క్షులు ప్ర‌తిభా పాటిల్ ప్రారంభించారు. ఈ స‌మావేశాలు ఈ నెల 28 వ‌ర‌కు జ‌రుగుతాయి.
మేరీలాండ్ సిస్ట‌ర్ స్టేట్‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎంపిక‌యింది. దాంతో ప్ర‌వాసాంధ్రుల‌కు ఉద్యోగావ‌కాశాలు బాగా మెరుగవుతాయి.


25 Oct 2011

legend lenin

http://royalloyal007.blogspot.in/2011/12/babaji.html
క‌మ్యూనిస్టు యోధుడు వ్లాదిమిర్ లెనిన్‌. సామాజిక న్యాయం, సమానత్వం కోసం రాజ‌కీయ ఉద్య‌మాన్నియావ‌త్ సోవియ‌ట్ జాతికి అందించిన ధీశాలి. 1870 ఏప్రిల్ 22న పుట్టిన లెనిన్ 53 ఏళ్ల‌కే 1924 జ‌న‌వ‌రి 21న‌ మృత్యుఒడికి చేరారు. ఆయ‌న‌కు నివాళ‌ల‌ర్పిస్తూ అప్ప‌టి చైనా ప్ర‌ధాని స్యునాయ‌త్సెన్sc "లెనిన్‌..నువ్వు భౌతికంగా దూర‌మ‌య్యావు..నీ మాట‌లు మాత్రం అంద‌రిలో స‌దా స‌జీవం. ఓ కొత్త దేశానికి సృష్టిక‌ర్త‌వు, అంద‌రూ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల కూడ‌లిని చూపిన దార్శ‌నికుడ‌వు. శ‌తాబ్దాలుగా అణ‌గారిన వ‌ర్గాల స్మృతిప‌థంలో చెర‌గ‌ని ముద్ర నీది. యూ గ్రేట్ మ్యాన్" అంటూ చేసిన వ్యాఖ్య‌లే అందుకు నిలువుట‌ద్దం. నాడు లెనిన్‌ భౌతిక‌కాయాన్ని మాస్కోలోని ఆయ‌న సొంత ఎస్టేట్ గోర్కి సెటిల్‌మెంట్‌(ప్ర‌స్తుత గోర్కి లెనిస్కీ)లో 9 ల‌క్ష‌ల‌ మంది ద‌ర్శించుకోవ‌డ‌మే లెనిన్ గొప్ప‌ద‌నానికి తార్కాణం. ఆయ‌న త‌ర్వాత అధికారానికి వ‌చ్చిన స్టాలిన్‌ అందుకే ఆ మ‌హ‌నీయుని కోరిక‌ను తోసిరాజ‌న్నారు. లెనిన్ పార్థివ దేహ ఖ‌న‌నాన్ని నిరాక‌రించి ఎప్ప‌టికీ
ఆ లెజెండ్ భౌతిక‌రూపాన్ని జ‌నం సంద‌ర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. పెట్రోగాడ్ పేరును ఆ ధీరుడు మ‌ర‌ణించిన మూడో రోజుకే లెనిన్ గ్రాడ్‌గా మార్చారు. లెనిన్‌తో సిద్ధాంత వైరుధ్యాలున్నా స్టాలిన్ ఆ రివ‌ల్యూష‌న‌రీ క‌మ్యూనిస్టుకు ఆ విధంగా గౌర‌వాన్నిచ్చారు. ర‌సాయ‌న లేప‌నాల‌తో లెనిన్ దేహం మాస్కోలోని lenin mausoleum.లో జ‌న సంద‌ర్శ‌న శాశ్వ‌త కేంద్రంగా భాసిల్లుతోంది. నిజానికి లెనిన్ పీట‌ర్‌బ‌ర్గ్‌లో గ‌ల‌ త‌న త‌ల్లి స‌మాధి ప‌క్క‌నే త‌నను ఖ‌న‌నం చేయాల‌ని కోరారు. రక్త‌ర‌హిత విప్ల‌వంగా ప్ర‌పంచ చ‌రిత్ర‌లోనే సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గిన అక్టోబ‌ర్‌(బోల్ష‌విక్‌) విప్ల‌వం సార‌థి. సోవియ‌ట్ యూనియ‌న్ ర‌థ‌సార‌థిగా త‌న ప‌ద‌వీకాలంలో రోజూ 16 గంట‌ల‌పాటు నిర్విరామంగా ప‌నిచేశారు. 1918లోనే ఆయ‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. ఆయ‌న చ‌నిపోయే ముందు సంవ‌త్స‌రం వ‌ర‌కు ఓ బుల్లెట్‌ ఆయ‌న శ‌రీరంలోనే ఇరుక్కుని ఉంది. 
లెనిన్ లాయ‌ర్‌. గొప్ప వ‌క్త‌. మార్క్సిజం, లెనినిజం సిద్ధాంత క‌ర్త‌గా పేరుమోసిన ఆయ‌న రివ‌ల్యూష‌న‌రీ
క‌మ్యూనిస్టుగా రూపాంత‌రం చెంద‌డానికి జార్జి ప్లెక‌నోవ్ ప్ర‌భావ‌మూ ఉంది. 1916లో లెనిన్ ర‌చించిన‌ ఇంపీరియిజం ది హ‌య్య‌స్ట్ స్టేజ్ ఆఫ్ కేప్ట‌లిజం ప్ర‌సిద్ధి చెందింది. సోవియ‌ట్ జాతికే పూర్తి అధికారం చేజిక్క‌డ‌మ‌న్న‌ది శాంతియుత యుద్ధం ద్వారానే సాధ్య‌మూ, అనివార్య‌మ‌ని లెనిన్ దృఢంగా విశ్వ‌సించారు. లెనిన్ మ‌ర‌ణం స‌హ‌జ‌మైన‌ది కాక‌పోవ‌చ్చ‌ని విష‌ప్ర‌యోగం జ‌రిగి ఉండొచ్చ‌ని భావించే వారిలో స్టాలిన్ కూడా ఒక‌రు. అయితే ఆయ‌న న్యూరో సిఫలిస్ వ‌ల్లే చ‌నిపోయాడ‌ని అప్ప‌ట్లో శ‌వ ప‌రీక్ష నిర్వ‌హించిన వైద్య‌శాస్త్ర‌వేత్త ఇవాన్ పాలొవ్‌ అంచ‌నాకు వ‌చ్చారు. 2004లో ఇదే విష‌యాన్ని ఉటంకిస్తూ యూరోపియ‌న్ జ‌ర్న‌ల్ ఆఫ్ న్యూరాల‌జీకి చెందిన ప‌బ్లికేష‌న్‌లో శాస్త్ర‌వేత్త వి.లెర్న‌ర్ పేర్కొన్నారు. భ‌విష్య‌త్‌లో అందుబాటులోకి వ‌చ్చే అడ్వాన్స్‌డ్‌ డి.ఎన్‌.ఏ టెక్నాల‌జీ ద్వారా ఇప్ప‌టికీ భ‌ద్రంగానే ఉన్న లెనిన్ మెద‌డు ప‌రీక్ష‌ల‌తో ఆయ‌న మ‌ర‌ణానికి కార‌ణం న్యూరో సిఫ‌లిసిస్సే కార‌ణ‌మా కాదా అన్న‌ది వెలుగులోకి రాగ‌ల‌ద‌ని లెర్న‌ర్ అభిప్రాయ‌ప‌డ్డారు.
goodbye lenin.ru
2011 జ‌న‌వ‌రి 11న యునైటెడ్ ర‌ష్యా పార్టీ goodbye lenin.ru. పేరిట వెబ్‌సైట్‌ను ప్రారంభించి లెనిన్ దేహం ఖ‌ననానికి జ‌నాభిప్రాయ ఓటింగ్‌ను కోరుతోంది. ది గ్రేటెస్ట్ జీనియ‌స్ ఆఫ్ మ్యాన్‌కైండ్‌..ది లీడ‌ర్ అండ్ ది టీచ‌ర్ ఆఫ్ ది పీపుల్స్ ఆఫ్ ది హోల్ వ‌ర‌ల్డ్‌.
______________________________________________________________________

ఓటుకు నోటు కేసులో అమ‌ర్‌సింగ్‌కు కోర్టు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ ఇచ్చింది.
లూసియానా గ‌వ‌ర్న‌ర్‌గా ఎన్ఆర్ఐ బాబి జిందాల్ రెండోసారీ అత్య‌ధిక ఓట్ల‌తో గెలిచారు.
ఏపీలోని విశాఖ‌ప‌ట్నంలో చిరుత ఇంకా హ‌డ‌లెత్తిస్తోంది.

23 Oct 2011

winner

 హిందూ దేవాల‌యాల్లో భ‌క్తులు త‌మ కోరిక‌ల్ని తీర్చాల‌ని దేవుణ్ని ప్రార్థిస్తూ కొబ్బ‌రికాయ‌ల్ని కొట్ట‌డం రివాజు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తూర్పూగోదావ‌రి జిల్లాలోని పిఠాపురంలోని ఓ గుడి మాత్రం ఇందుకు భిన్నం. ఇక్క‌డ భ‌క్తులు కొబ్బ‌రికాయ‌ల్ని ఆల‌య ప్రాంగ‌ణంలోని చెట్టుకు క‌ట్ట‌డం విశేషం. ద‌త్తాత్రేయుని తొలి అవ‌తారంగా ప్ర‌తీతి చెందిన 
శ్రీ బాల వ‌ల్ల‌భుని దేవాల‌యం ఈ విశేషానికి వేదిక‌గా భ‌క్తుల్ని అల‌రిస్తోంది.

ఆశా..గిన్నీస్ రికార్డు..ల‌తా మంగేష్క‌ర్ సోద‌రి ప్ర‌ఖ్యాత గాయ‌ని ఆశాబోస్లే సోలోగా 11 వేల పాట‌ల‌ను వివిధ భాష‌ల్లో ఆల‌పించి గిన్నీస్ బుక్ రికార్డులకెక్కారు.

 ఏపీ ఐటీ శాఖ మంత్రి పొన్నాల ల‌క్ష్మ‌య్య అరుదైన గౌర‌వాన్ని అందుకున్నారు. త‌ను పోస్ట్ గ్రాడ్యుయేష‌న్‌ చేసిన ఒక్లాహామా యూనివ‌ర్సిటీ ఆల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు ద‌క్కించుకున్నారు. ఈ ఘ‌న‌త‌ను అందుకొన్న‌రెండో భార‌తీయుడయ్యారు.




ccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccc


ఆస్ట్రేలియా జాతీయ జంతువు - కంగారూ.

శ్రీ‌లంక నేష‌న‌ల్ యానిమ‌ల్ - సింహం.

కంగార్లు త‌మ పిల్ల‌ల్ని త‌మ శ‌రీరంలోనే స్వ‌త‌హాగా అమ‌రిన సంచి వంటి భాగంలోనే ఉంచుకొని అవి న‌డిచే వ‌ర‌కు సాకుతాయి.
ccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccc
స‌క్సెస్ స్టార్స్ @  శ్రీ‌ను వైట్ల‌

  కృషి ఉంటే మ‌నుషులు రుషులౌతార‌న్నారు సినీ క‌వి వేటూరి. దాన్ని అక్ష‌ర‌స‌త్య‌మ‌ని నిరూపించిన‌ వారెంద‌రో. ఆ కోవ లోని వారే టాలివుడ్ యువ ద‌ర్శ‌కుడు శ్రీ‌ను వైట్ల‌. సినిమా పిచ్చితో ఇంట‌ర్ విద్య‌తోనే స‌రిపుచ్చి చెన్నై రైలెక్కిన ఈ యంగ్ చాలెంజ‌ర్ ద‌ర్శ‌కుడు 1991లో త‌న ప‌నిని ప్రారంభించి స్టార్ హీరోలంద‌రి మ‌న్న‌న‌ల‌కు పాత్రుడ‌య్యారు. ప్రేక్ష‌కుల అభిమానాన్ని గెల్చుకున్నారు. సాధార‌ణ వ్య‌వ‌సాయ కుటుంబం నుంచి వ‌చ్చి సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌దైన స్థానాన్ని సాధించుకోగ‌లిగారు. భార్య రూప‌, పిల్ల‌లు ఆనంది,అద్య‌,అహ‌న ఈయ‌న‌ కుటుంబం. 
శ్రీ‌ను వైట్ల చిత్ర‌రాజాలివే

నీ కోసం, ఆనందం, సొంతం, వెంకీ, అంద‌రివాడు, ఢీ, 
దుబాయ్ శ్రీ‌ను, రెఢీ, కింగ్‌, న‌మో వెంక‌టేశ‌, దూకుడు
-------------------------------------------------------------------------------------------------------------
^ ట‌ర్కీలో సుమారు 1000 మంది దుర్మ‌ర‌ణం పాల‌యిన‌ట్లు ప్రాథ‌మిక వార్త‌ల క‌థ‌నం. పెను భూకంపం
రాజ‌ధాని అంకారాకు 1200 కిలోమీట‌ర్ల ప‌రిధిలో ఈ భూకంప కేంద్రం ఉన్న‌ట్లు అధికార వ‌ర్గాలు పేర్కొన్నాయి.
ట‌ర్కీలో ఇదే అతిపెద్ద భూకంపమ‌ని ఆ వ‌ర్గాలు తెలిపాయి.

22 Oct 2011

mystery


అట్లాంటిక్ స‌ముద్రం..బెర్ముడా, మియామి, సాన్‌జాన్‌, ఫ్లోరిడా, పొర్టోరికా..ఈ తీరం మ‌ధ్య‌న బెర్ముడా ట్ర‌యాంగిల్‌.
దిన‌దినాభివృద్ధి చెందుతున్న సైన్స్‌ను ప్ర‌శ్నిస్తున్న వింత ప్ర‌కృతే ఈ ప్రాంతం..మాన‌వ‌మేధ‌కు స‌వాలు విసురుతున్న వైనం..నేనేంటో క‌నుక్కోండి చూద్దామంటూ శాస్త్ర‌వేత్త‌ల ఎదుట తిష్ట వేసుక్కూర్చున్న‌ ర‌హ‌స్యం. క‌దిలే న‌గ‌రాల్నే త‌లపించే నౌక‌లు, విమానాలు ఏవైనా ఈ మార్గంలోకి ప్రవేశించాయో అంతే సంగ‌తులు..మాయం..రాడ‌ర్ల‌కు అంతుచిక్క‌ని లోగుట్టు. స్కోపుల‌కూ ఆన‌వాళ్లు కూడా దొర‌క‌ని మ‌ర్మం.
అదృశ్య ర‌హ‌స్యం
గ్రుమ‌న్ కుగ‌ట్ జెట్‌..పైలెట్ జాన్ వెర్డి, కో- పైల‌ట్ పాల్ లుకారిస్ 25,300 అడుగుల ఎత్తున ఆకాశం నుంచి ఆల్‌వెల్‌..అని సందేశం..రాడ‌ర్‌కు చేరిన మాట‌లు..అంతా నిశ్శ‌బ్దం..అవే వారి నోట చివ‌రి మాట‌లు..మ‌ళ్లీ ఏమీ విన‌ప‌డ‌లేదు. జెట్ అదృశ్యం. అదే క‌థ పునరావృతం..ఇప్ప‌టికే అధికారిక‌, అన‌ధికారిక లెక్క‌ల ప్ర‌కారం ఈ ట్ర‌యాంగిల్ మీదుగా ప్ర‌యాణించిన వంద‌ల వేల నౌక‌లు, విమానాల ఉనికి దొరికితే ఒట్టు.
1780 నుంచి అనేక ర‌వాణా, ప్ర‌యాణికుల భారీ నౌక‌లు బెర్ముడా ట్ర‌యాంగిల్ ప్రాంతంలో ప్ర‌యాణిస్తూ మ‌టుమాయ‌మ‌య్యాయి. 59 సంవ‌త్స‌రాలుగా ఉద్ధృతంగా సాగిన శోధ‌న‌ల‌న్నీ విషాద‌గాథ‌లే.కోస్ట్‌గార్డ్‌
రిపోర్టులు, యూఎస్ స్టేట్ రిజిస్ర్టీ లెక్క‌ల ప్ర‌కార‌మే 75 విమానాలు, 2 వేల పైచిలుకు నౌక‌లు స‌ముద్ర‌ గ‌ర్భాన క‌లిసిపోయాయి. 1949-71 మ‌ధ్య ఈ ప్రాంతంలో స్టార్ ఏరియ‌ల్, ఫ్లైట్ 19, ఏవియ‌న్ ఎ 16, పిబిఎం, స్టింగ్ 27 విమానాలు క‌నుమ‌రుగ‌య్యాయి. నాలుగింజ‌న్ల కెబి 50 ఏరియ‌ల్ టాంక‌ర్ క‌థా విషాద‌గాథే. 19,20 శ‌తాబ్దాల్లో మాయ‌మైన ప్ర‌ఖ్యాత నౌక‌లు రిట‌,ట‌మండ్ర‌(1917), 309 మంది ప్ర‌యాణికుల‌తో ప్ర‌యాణించిన‌ సిక్లాప్ (1918), కొటావిక్స్ (1925), సుడ‌ప్కొ (1926), 34 మంది ప్ర‌యాణికుల ది ట్రామ్ ఆంగ్లో ఆస్ర్టేలియన్‌ (1938), మేడ్కొ (1948), సాండ్ర (1950), హోమ్‌స్టేట్ హోమ్ (1955), య‌ల్‌రెవెన్ (1958) నీటి పాల‌య్యాయి. 1960-63 మ‌ధ్య ఎథెల్ సి, క‌లిస్టా 3, ఎవెంజ‌లిన్‌, విండ్‌పాల్‌, మెరెన్ స‌ల్ఫ‌ర్ క్వీన్‌..విన్‌క్రాఫ్ట్‌ద‌యితే విజ‌యంలో అప‌జ‌యం. హార్బ‌ర్ ముంగిట‌కు వ‌చ్చాక కోస్ట్‌గార్డ్‌లు అక్క‌డ‌కి చేరుకొనే 19 నిమిషాల వ్య‌వ‌ధిలో నీట మునిగిపోయింది.
1975లో డ‌చ్‌ట్రీట్‌, క‌లియా3, ఎస్ఎస్ ఫాయ‌ల్‌, పాలిమ‌ర్‌3, రియ‌ల్ షైన్‌ల ప్ర‌యాణ‌మూ విషాద‌కాసార‌మే.
జామ్నిక్ కె-1995(1999), వెస్టిండీస్ తీర‌జ‌లాల్లోకి ప్ర‌వేశించాక ట్రోపిక్‌బ‌ర్డ్ (2000)జ‌లాల్లో మునిగిపోయింది.
ఎందుకిలా..
విప‌రీత ఎల‌క్ట్రో మాగ్నేటిక్ వేవ్సే కార‌ణ‌మ‌న్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కు శాస్త్ర‌వేత్త‌ల ప్రాథ‌మిక ప‌రిశోధ‌నా భావ‌న‌. కాల‌చ‌క్ర‌గ‌మ‌నంలో అసాధ్య‌మ‌న్న‌దే మ‌నిషికి లేదు. ఈ మిస్ట‌రీ ట్ర‌యాంగిల్ లోగుట్టు ఛేద‌న భ‌విష్య‌త్‌లో మ‌న‌కు సాధ్య‌మే.
_______________________________________________________________
* స్వ‌దేశంలో ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న 5 వ‌న్డేల సీరీస్‌లో ఇంత‌వ‌ర‌కు జ‌రిగిన మూడింటా గెలిచి భార‌త్ విజ‌య‌బావుటా ఎగుర‌ వేసింది.
* స్టాక్‌హోమ్ ఓపెన్ టెన్నీస్‌లో రోహ‌న్‌బొప‌న్న (భార‌త్‌), ఖురేషీ (పాకిస్థాన్‌)ల జోడీ ఫైన‌ల్లో బాగ్దాటిస్ (సైప్ర‌స్‌), డెల్‌పొట్ర (అర్జెంటినా)ల‌పై గెలిచి టైటిల్ సాధించింది.
* చిత్తూరు జిల్లా నుంచి న‌ఫీసా ఒకే కాన్పులో ఇద్ద‌రు  ఆడ‌, ఇద్ద‌రు మ‌గ పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది.
_______________________________________________________________
లిండ్సే లోహ‌న్‌కు జైలు-బెయిలు
బంగారు ఆభ‌ర‌ణాలు పోయాయ‌ని ఫిర్యాదు చేసి కోర్టుకు హాజ‌రుకాని హాలివుడ్ న‌టీమ‌ణి లిండ్సే లోహ‌న్‌ తొలుత 36 గంట‌ల సామాజిక సేవాశిక్ష‌కు గుర‌యింది. ఆ కార్య‌క్ర‌మంలో కూడా పాల్గొన‌క కోర్టు ధిక్కారానికి పాల్ప‌డ్డంతో ఆమెకు న్యాయ‌స్థానం జైలు శిక్ష విధించింది. చివ‌రికి ల‌క్ష డాల‌ర్ల పూచీక‌త్తుపై బెయిల్ పొంది బ‌తుకు జీవుడా అని బ‌య‌ట‌ప‌డింది.

Popular Posts

Wisdomrays