భూమిపై మనిషి జీవనం సాగించని ప్రాంతం ఏదైనా ఉందా? ఇతర గ్రహాలపై జీవుల ఉనికి కోసం అన్వేషణ కొనసాగిస్తున్న తరుణంలో వాతావరణం , నీరున్న భూమిపైనే తన ఉనికి లేని ప్రాంతం కూడా ఉందని 1820లోనే గుర్తించగలిగాడు. అదే అంటార్కిటికా ఖండం. భూమిపైగల ఏడు ఖండాల్లో ఈ ఒక్క ఖండమే మనిషి శాశ్వత జీవనం సాగించలేని ఏకైక ప్రాంతం. అంటార్కిటికా ఖండం విస్తీర్ణంలో అయిదోది. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాల తర్వాతది. ఆస్ట్రేలియా విస్తీర్ణం కంటే రెండు రెట్లు, యూరఫ్ కంటే 1.3 రెట్లు పెద్ద ఖండం. ఏడాదిలో అదీ వేసవిలోనే వెయ్యి నుంచి అయిదు వేల మంది ఇక్కడ అడుగు పెడుతుంటారు. ఇక్కడ నెలకొన్న అతిశీతల వాతావరణమే అందుకు కారణం. అంటార్కిటికాలో-89 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఏడాది పొడవునా మనిషి ఈ ఖండంపై మనగలగడం కష్టమే. ఈ వాతావరణంలో ఉనికిని చాటుకుంటున్న కొన్ని జీవులూ లేకపోలేదు. కొన్ని రకాల జంతువులు,మొక్కలు,జీవులూ నెలకొని ఉన్నాయి. ఆల్గే,జంతువుల్లో మైట్స్, నెమటిడ్స్, పెంగ్విన్స్, సీల్స్, టార్టిగ్రేడ్స్, బ్యాక్టీరియా, ఫంగి, ప్లాంట్స్, ప్రాటస్టీ తదితరాలే ఆ జీవులు.
*1820లో తొలిసారిగా రష్యా పరిశోధన బృందం ప్రాబియన్ గాటిలెబ్వాన్, బెల్లింగ్ షాసెన్, మైఖెల్ లజరెన్లు ఈ ఖండంలో కాలుమోపారు.
* అంటార్కిటికా ట్రీటీపై 1959లో తొలుత 12 దేశాలు సంతకాలు చేశాయి. ఇప్పుడు ఆ సంఖ్య 47కు చేరింది. ఈ ఒప్పందం ప్రకారం మిలటరీ, మైనింగ్, అణుపరీక్షలు, విద్యుదుత్పాదన నిషిద్ధం.ప్రస్తుతం వివిధ దేశాలకు చెందిన నాలుగువేల మంది శాస్త్రవేత్తలు ఇక్కడ పరిశోధనలు సాగిస్తున్నారు.
*1890 నుంచే దీన్ని అంటార్కిటికా ఖండంగా పిలుస్తున్నారు. ఈ గ్రీకు పదానికి ఆపోజిట్ ఆర్కిటిక్ అని అర్థం.
* 1773 జనవరి 17లోనే కెప్టెన్ జేమ్స్ కుక్ నేతృత్వంలోని నౌకా బృందం అంటార్కిటికా సర్కిల్ జలాల్లోకి ప్రవేశించింది.
*నాసా, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలు మానవుడు ఈ ఖండంపై అడుగిడింది
1820లోనే అని ధ్రువీకరించాయి.
* ఒంటరిగా ఈ ఖండానికి సాహసయాత్ర సాగించిన తొలి ఔత్సాహికుడు న్యూజిలాండ్‌కు చెందిన డేవిడ్ హెన్రీ.
*ఈ ఖండం సముద్ర తీర పొడవు 17,968 కిలోమీటర్లు. రోజ్సీ, వెడ్లే సముద్ర తీరాలకు అంటార్కిటికా అతి సమీపాన ఉంది. విన్సన్ మసిఫి ఈ ఖండంలో అత్యంత ఎత్తైన శిఖరం.
* అంటార్కిటికాలో 70కు పైగా సరస్సులున్నాయి. వీటిలోని మంచు ఒకదాంట్లో నుంచి మరోదాంట్లోకి ప్రవహిస్తుంటుంది.
* 170 మిలియన్ ఏళ్ల క్రితం గొండ్వానాలో అంతర్భాగమైన అంటార్కిటికా తర్వాత విడివడి ఇప్పటి మంచుఖండంగా ఏర్పడింది. ఇది జరిగి 25 మిలియన్ సంవత్సరాలయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
*అంటార్కిటికాలో చర్చ్‌లు.. 2004లో రష్యాకు చెందిన బెల్లింగ్ షెసెన్ స్టేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ అర్థోడాక్స్,ట్రినిటీ చర్చ్‌లు ప్రారంభమయ్యాయి. ఇద్దరు మతాధికారులు కూడా రొటేషన్ పద్ధతిలో ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.
*అంటార్కిటికాలో పుట్టిన తొలి మనిషి అర్జెంటినాకు చెందిన ఎమిలియో మార్కొస్ పర్మా(1978). ఆ దేశ ప్రభుత్వం ఈ మంచుఖండంలో మానవులు ఏమేరకు జీవించగలరో కనుగొనే ఉద్దేశంతో ఏడు జంటల్నిఇక్కడకు పంపింది. అంటార్కిటికా పరిధిలో బేస్ ఎస్పరంజ్లో ఈ తొలి మనిషి ఊపిరి పోసుకున్నాడు.
ప్రమాదం...మనిషి వాడుతున్న అనేకానేక ఆధునిక యంత్రాల వల్ల వెలువడే ఫ్లోరోక్లోరో కార్బన్లు ఓజోన్ పొరను దెబ్బతీస్తుండడం తెలిసిందే. ఈ పొర సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిని చేరకుండా నిలువరిస్తూ ఉంటాయి. ఆ పొరకే రంధ్రం ఏర్పడుతుండడం ప్రమాధభరితంగా పరిణమించింది. 1985లో హేలీ స్టేషన్ నుంచి బ్రిటిష్ శాస్త్రవేత్తల బృందం ఇదే విషయాన్ని పేర్కొంటూ అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్‌కు ఏర్పడిన రంధ్రం గురించి సమాచారమిచ్చింది. 2065 నాటికి ఆ రంధ్రం ఏ స్థాయికి చేరుకుంటుందో ఊహిస్తుంటేనే భీతిగల్గుతోందంది. నాసా శాస్త్రవేత్తలు 2006లో వేసిన అంచనా ప్రకారం ఓజోన్ పొర దాదాపు 27.5 మిలియన్ కిలోమీటర్ల పరిధిలో పలుచబడే ప్రమాదం ఉందంది.అదే జరిగితే ఇక్కడ వాతావరణం వేడెక్కి ఈ ఖండపు మొత్తం మంచు కరిగి సముద్రాలు ఉప్పొంగితే దేశాలకు దేశాలే ప్రపంచ పటం నుంచి అదృశ్యమయిపోతాయి. బ్రిటిష్ అంటార్కిటికా సర్వే బృందం 2008జనవరిలో పేర్కొన్న ప్రకారం 10 వేల ఏళ్ల క్రితం అంటార్కిటికా చరిత్రలో ఈ ప్రాంత పరిధిలో చోటుచేసుకున్నఓ భారీ అగ్నిపర్వత పేలుడు వల్ల లావాతో పాటు వెలువడిన బూడిద ఈ ఖండంపైనే పరుచుకుని ఉంది.
eఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా హిందూపురంలో రూప అనే మహిళ ఓ వింత శిశువుకు జన్మనిచ్చింది. నాలుగు కాళ్లు, నాలుగు చేతులు, రెండు శరీరాలతో ఉన్న శిశువు పుట్టిన వెంటనే మరణించింది.
eప్రపంచ జనాభా ఈ అక్టోబర్ 31కి 700 కోట్లకు చేరుకోనున్నట్లు ఐక్యరాజ్యసమితి జనాభా లెక్కల విభాగం ప్రకటించింది.
. హూ యామ్ ఐ . ది లెజెండ్ ఆఫ్ డ్రంకన్ మాస్టర్ . ది యాక్సిడెంటల్ స్పై . క్రైం స్టోరీ . పోలీస్‌స్టోరీ
. స్నేక్ ఇన్ ఈగల్స్ షాడో . మై లక్కీ స్టార్స్ . ఆర్మర్ ఆఫ్ గాడ్ . ఆర్మర్ ఆఫ్ గాడ్-2 (ఆపరేషన్ కండోర్)
. పోలీస్‌స్టోరీ-4 . హార్ట్ ఆఫ్ డ్రాగన్ . ది రంబుల్ ఇన్ ది బ్రాంక్స్ . న్యూ పోలీస్‌స్టోరీ (దిమైత్)
1996లో రంబుల్ ఇన్ ది బ్రాంక్స్ అయితే కలెక్షన్ల గ్రాస్ 11 మిలియన్ డాలర్లను వసూలు చేసి రికార్డు నెలకొల్పింది. జాకీచాన్ గురించి ఇంతే చెబితే చాలా తక్కువే. మంచి మనస్సున్న మహారాజు జాకీ. ఇటీవల బీజింగ్‌లో తన కుమారుడి అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ జాకీ తన ఆస్తి నుంచి ఒక్క సెంట్ కూడా తన కొడుకు జయ్సేకు చెందదని తేల్చి చెప్పాడు. అతడు సమర్థుడయితే తనంతట తనే సంపాదించుకుంటాడని పేర్కొన్నాడు. తన సంపాదనంతా తన తర్వాత ఛారిటీకే చెందుతుందని
చెప్పిన గొప్ప యోధుడు. ఇటీవల తాను చనిపోయినట్లు కొన్ని టాబ్లాయిడ్లు సృష్టించిన అనేక కథనాల్ని ఆయన హాస్యస్ఫూరకంగానే కొట్టి పారేశాడు. 1986 నుంచి చెప్పుకోదగ్గ సాయాలను తనతోటి జనానికి అందిస్తున్న ధన్యజీవి జాకీచాన్.
-. టి.వి-9కు వరద బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. కర్నూల్లో ప్రజానగర్ పేరిట 750 ఇళ్ల సముదాయాల్నినిర్మించి ఇవ్వడంతో దీపావళి పర్వదినాన్న వారంతా గృహ ప్రవేశాలు చేసి మీడియా వద్ద తమ ఆనందాన్నివ్యక్తం చేశారు. మరో 500 ఇళ్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉందని దాతలిచ్చిన విరాళాల సహాయంతోనే తాము
ఈ ఇళ్లను నిర్మించగలిగినట్లు ఆ సంస్థ ప్రకటించింది.
--. వన్డే ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోని మూడో ర్యాంక్‌కు ఎగబాకాడు.
ఈ నలుగురు..గిన్నీస్ బుక్కెక్కారు. ఎవరీ నలుగురు? ఏమా కథ! తెలుగు పరిశ్రమకు చెందిన ఉద్ధండులైన లేడీ లెజెండ్ `విజయ`నిర్మల, దర్శకరత్న దాసరినారాయణరావు, మూవీ మొగల్ రామానాయడు, `హస్య`బ్రహ్మానందం. ఇంతకీ వీరంతా ఏంచేశారు..అంటే నమ్ముకున్న పరిశ్రమలో జస్ట్ పరిశ్రమించారంతే. కీర్తి ప్రతిష్టలు వారి వెంట క్యూ కట్టాయి. రికార్డులు వాటంతటవే ఒళ్లో వాలాయి. అవి వారికి ఓవర్‌నైట్ విక్టరీలు మాత్రం కావు. 20 ఏళ్లకు పైబడిన వారి తపస్సు ఫలితాలవి.
విజయనిర్మల: అసలు పేరు నిర్మల. పరిశ్రమలో ముద్దు పేరు పని రాక్షసి. అప్పటికే నిర్మల పేరిట మరో నటి ఉండడంతో తమ సంస్థ పేరునే విజయా వారు ఆమె ముందు జత చేశారు. దాన్నే ఆమె తన మైలురాయిగా మలుచుకొని పైకెదిగారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా విజయనిర్మల గిన్నీస్ రికార్డును నమోదు చేసుకోగలిగారు. తెలుగుతోపాటు తమిళ, మలయాళం సినిమాల్లో ఆమె 250చిత్రాల్లో నటించారు. తొలిచిత్రం `ఎంగవెట్టు పెన్నె`(తమిళం), తెలుగులో బిఎన్‌రెడ్డి రంగుల రాట్నంతో అరంగేట్రం చేశారు. దాసరినారాయణరావు: తెలుగు పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా నేనున్నానని బరిలోకి దిగే పెద్దదిక్కు. నూనుగు మీసాల నూత్నయవ్వనంలోనే (16వ ఏట) నాటకరంగంలో ప్రవేశం. ప్రజ్ఞను కనబర్చిన మేస్త్రీ. 50కు పైగా నాటకాల రూపశిల్పి. దర్శకుడిగా తాతామనవడు తొలిచిత్రం. ఇప్పటికి 150(పరమవీరచక్ర-.. బాలకృష్ణ హీరో) చిత్రాలకు దర్శకత్వం వహించారు. గిన్నీస్ రికార్డు ఆయన వద్దకు పరిగెత్తుకు వచ్చింది. తెలుగు,తమిళ,కన్నడ,హిందీ చిత్రాలకు కెప్టెన్ పాత్ర పోషించారు. 60 చిత్రాల్లో నటించారు. మామగారు చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకొన్నారు. 200 మందికి పైగానే ఆయన ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. దాసరి శిష్యుల్లో పలువురు ఆయా విభాగాల్లో పేరు గడించారు. కోడి రామకృష్ణ కూడా దర్శకుడిగా 100 చిత్రాల ముంగిట ఉన్నారు. దటీజ్ దర్శకరత్న దాసరి. రామానాయుడు: టాలివుడ్లో మూవీ మొగల్‌గా ఈయన ప్రతీతి. స్టార్ ప్రొడ్యూసర్‌గా వినుతికెక్కారు. తెలుగుతో మొదలుపెట్టి లెక్క తక్కువకాకుండా 100కు పైగా సినిమాలు నిర్మించి గిన్నీస్‌బుక్‌లో స్థానం కైవసం చేసుకున్నారు. తెలుగు పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలడంలో ప్రముఖ భూమికను పోషించిన వారిలో రామానాయుడు కూడా ఒకరు. హైదరాబాద్, విశాఖపట్నంలలో తన పేరిటనే సినీ స్టూడియోలను సైతం నెలకొల్పిన దార్శనిక నిర్మాత. తన పేరునే పెట్టుకున్న మనవడు రా.నా ప్రస్తుతం టాలివుడ్లో యంగ్‌హీరో కాగా విక్టరీనే తన పేరు ముందు నిలుపుకొని సక్సెస్ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నతనయుడు వెంకటేష్ ఇప్పటికీ తెలుగులో బిజీ హీరో. బ్రహ్మానందం: సురేష్ ప్రొడక్షన్ బేనర్లో రామానాయుడే నిర్మించిన `ఆహా నా పెళ్లంట `(రాజేంద్రప్రసాద్ హీరో) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన ఈ హాస్య బ్రహ్మ`ఆనందం` ఇప్పటికీ నవ్వుల్ని విరబూయిస్తూనే ఉన్నారు. లెక్చరర్‌గా ఉన్న ఆయన సినిమాల్లో చేరడం ద్వారా లక్షల మందికి కామెడీ టానిక్‌గా మారారు. ఒకే భాష (తెలుగు)లో 754 చిత్రాల్లో కామెడీ (హీరోగా బాబాయ్ హోటల్)ని పండించిన గిన్నీస్ రికార్డును తన వాకిట్లోకి తెచ్చుకున్నారు. జఫా అనే చిత్రం ఆయన దర్శకత్వంలో రానున్నట్లు బోగట్టా. __________________________________________________________ వరుసలో విశాల్
తమిళ, తెలుగు హీరో విశాల్ ఇప్పుడు వీరి బాటలో ఉన్నారా! అదేలా? ఏమో దర్శకుడు బాల అలా చెవబుతున్నారు.
అవన్ ఇవన్ అనే తమిళ చిత్రంలో విశాల్ మృగజగా నటిస్తున్నాడు. ఆ చిత్రం రిలీజ్ అయిన మొదటిరోజునే విశాల్ గిన్నీస్ రికార్డును ఎలా ఎక్కబోతున్నాడన్నది తెలుస్తుందని ఆయన ఊరిస్తున్నారు. ఆరోజే రికార్డు కోసం దరఖాస్తు చేస్తామని బాల ముక్తాయించారు.
e తాజా వన్డే సీరీస్‌లో విజయంతో భారత క్రికెట్ జట్టు ర్యాకింగ్స్లో మూడో స్థానానికి ఎగబాకగా ఇంగ్లండ్ అయిదో స్థానానికి పడిపోయింది. స్వదేశంలో జరిగిన 5 వన్డేల్లోను జట్టు గెలుపొందగా మ్యాన్ ఆఫ్ ది సీరీస్‌ను కెప్టెన్ ధోని కైవసం చేసుకున్నాడు.
e లిబియాలోని సిరేలో ఓ ఆయిల్ ట్యాంకర్ పేలుడు దుర్ఘటనలో 100 మంది మృత్యుపాలయ్యారు.
e కలలోనయినా కలగనలేదు..! అక్షరాల అయిదుకోట్ల రూపాయల నజరానా..బీహార్‌లోని కంప్యూటర్ ఆపరేటర్ సుశీల్‌కుమార్ `అమితాబ్ కౌన్‌బనేగా కరోడ్‌పతి` విజేతగా ఆవిర్భవించాడు. ఈ పోటీలో గెలిచి ఇంత పెద్ద మొత్తాన్ని పొందుతానని తానెప్పుడూ ఊహించలేదంటున్నాడీ యువకుడు.