happy christmas |
పాపులను క్షమించి,బాధల్ని దిగమింగి,శాంతికి ప్రతీకగా నిలిచిన మహనీయుడే ఏసు.నాడు,నేడు,ఏనాడూ ఏసుప్రభువు ఆచరించిన మార్గమే యావత్ మానవాళికి అనుసరణీయం.హిందువులకు తిరుమల,ముస్లింలకు మక్కా ఎలాగో క్రైస్తవులకు వాటికన్ సిటీ అంతే పవిత్రం.అందుకే ప్రపంచ వారసత్వ సంపద స్థలిగా 1997లో యునెస్కో గుర్తింపునకు నోచుకుంది.వరల్డ్‌లోనే అతి చిన్నదేశమని దీనికి పేరు.కేవలం 0.2 చదరపు మైళ్ల విస్తీర్ణం.వెయ్యిలోపు జనాభా.ఇది ఇటలీ(రోమ్)లో అంతర్భాగం అయినా స్వయంపాలనా యుక్త ప్రాంతం.
vatican city masterpieces:సెయింట్ పీటర్స్ బాసిలిక,సిస్టిన్ చాపెల్,వాటికన్ మ్యూజియమ్స్,అపోస్టోలిక్ ప్యాలెస్(పోప్ నివాసిత ప్రాంతం),ఇంకా వందల కొద్దీ శిల్పాలు,చిత్రరాజాలు కొలువుదీరిన వేదిక.
శాంతి ధామం:పోప్‌జాన్‌పాల్-2 26ఏళ్ల పాలన అనంతరం 2005లో బెన్డిక్ట్-16 బాధ్యతల్ని చేపట్టారు. ఆయనే వాటికన్ సిటీకి సర్వాధికారి. ఒక్క వాటికన్లకే కాదు యావత్ యూరప్ వాసులకు పోప్ మాటే మేలు బాట. 1929లో ముస్సోలిని నిర్ణయాత్మక సంతకం(లాటెరన్ ట్రీటీ)తో వాటికన్ రాజ్యం అవతరించింది. వాటికన్లో కొలువుదీరిన పోప్పే సంపూర్ణ శాసన, కార్యనిర్వాహక,న్యాయాధికారాల్ని కల్గి ఉంటారు. ఆయన ద్వారానే సెక్రటరీ ఆఫ్ స్టేట్,ప్రెసిడెంట్(పాంటిఫికల్ కమిషన్),గవర్నర్ నియమితులై పాలనా బాధ్యతలను నిర్వర్తిస్తారు.సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా బెర్టొనే,పాంటిఫికల్ కమిషన్ ప్రెసిడెంట్‌గా,వాటికన్‌సిటీ గవర్నర్‌గా లజొలొ ఆ విధంగానే పదవులను చేపట్టారు.ఇక్కడ ఇంగ్లిష్,ఫ్రెంచ్,అరబిక్,చైనీస్,రష్యన్,స్పానిష్ భాషలు ప్రాచుర్యంలో ఉన్నాయి.రోమన్ల చరిత్రకు 16వ శతాబ్దపు వైభవాలకు సాక్షిగా నిలుస్తోందీ వాటికన్ సిటీ.ఈ నగరం 4వ శతాబ్దం నుంచే తన ఉనికిని నిలుపుకుంటోంది.అంతేకాదు దీర్ఘకాలంగా ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా భక్తుల్ని అలరిస్తోంది.బాసిలిక్ కళాత్మకత వన్నెలను జూలిస్-2 అద్దారు.ఇక్కడ జగత్ ప్రసిద్ధ చర్చిని కార్లో మెడెర్నో 1626లో నిర్మించారు.ప్రపంచంలోనే అతి పురాతన,చిన్న సైన్యం గల దేశమిది.1506లోనే సైన్యాన్ని జూలిస్-2 ఏర్పరిచారు.వాటికన్ సైన్యం అక్షరాల నూరు మాత్రమే.వీరే పోప్ అంగరక్షకులు కూడా.
క్రిస్మస్ సంబరాలు:క్రైస్తవుల పుణ్యక్షేత్రమైన వాటికన్ సిటీలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటుతాయి.1982 నుంచి ఇక్కడ క్రిస్మస్ ట్రీని నెలకొల్పుతున్నారు.ఈ వేడుక పోప్ జాన్‌పాల్-2 హయాంలోనే తొలిసారిగా ప్రారంభమయింది.ముఖ్యంగా బుధవారాల్లో ఇక్కడకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.వారిలో కొత్తగా పెళ్లైన జంటలే ఎక్కువ.అయితే అన్ని రోజుల్లో పోప్ దర్శనభాగ్యం మాత్రం లభించదు.క్రిస్మస్ వేడుక నాడే పోప్ అభిభాషణ యావత్ ప్రపంచ జనావళికి అందుతుంది.
----------------------------------------------------------------------------------------------------------------
* తెలుగు చిత్ర రంగ ప్రముఖులు త్రిపురనేని మహారథి కన్నుమూశారు.
* ఏపీలో విజయా డైరీ వీటా పేరిట విటమిన్ పాలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.
* ఇరాక్(బాగ్దాద్)బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది.60 మంది ప్రాణాలు కోల్పోయారు.
* సింగపూర్,ఆస్ట్రేలియాల తరహాలో భారత్‌లోనూ ప్లాస్టిక్ కరెన్సీని అమల్లోకి తెచ్చేందుకు ఆర్బీఐ ప్రయత్నిస్తోంది.