u.a.r.s. ఉపగ్రహం కెనడా తీరం(పస్పిక్ మహాసముద్రం)లో కూలిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
1979 లో స్కయిలాబ్ ఉపగ్రహం కూడా భారత్ సహా ఆసియా
దేశాలను ఇలాగే వణికించింది. అప్పుడు హిందూ మహా సముద్రంలో ఆ ఉపగ్రహం కూలింది. ప్రపంచం బాగు కోసమే ఉన్నానంటున్న
అమెరికానిజాలు మాత్రం ఎందుకు చెప్పదూ? ఇప్పుడు కూడా కెనడాతీరంలో
పడిన ఉపగ్రహం వివరాల వెల్లడిలో నాన్చివేతనే అనుసరిస్తోంది.
ఉగ్రవాది ఒసామా కథను ముగించాకా కూడా అమెరికాది ఇదే తీరు. యావత్ జనావళి ఎదురు చూసిన ఆ ఆపరేషన్ వివరాల్ని ఆ దేశం ఎందుకు వెల్లడించ లేదో ఇప్పటికి అంతుబట్టదు. లాడెన్ శవాన్ని ఖననం చేస్తే ఆ ప్రా0తం సందర్శన స్తలమౌతుందని అరేబియాలో జారవిడిచింది. ఆ దృశ్యాలను ఆపరేషన్ లో పాల్గొన్న వారు తప్పా మరే మానవుడు చూసి ఎరగడు.
ప్రస్తుతం లిబియా పోరులో ఆపన్న హస్తం ఇస్తోంది, అపట్లో ఇరాక్ ఫై యుద్ధం, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఫై బాంబుల మోతలకు (రకరకాల కారణాలు ప్రకటించి యుద్దాలు)తెగబడింది. వాస్తవాలు చెప్పడానికి మాత్రం అగ్ర రాజ్యానికి బెరుకేందుకో? ఇరాన్, ఉత్తర కొరియాల ఫై నా
ప్రపంచ పోలిస్ కు ఇంకా గుర్రే. ఈ ఏక ధ్రువ ప్రపంచములో అమెరికా మారితే మానవాళికంతటికీ మహోదయమే!
_____________________________________________________________
మంచి పుస్తకాలు: *చివరకు మిగిలేది?-బుచ్చిబాబు *అసమర్ధుని జీవయాత్ర-గోపీచంద్
_____________________________________________________________
^ నేపాల్లో విమానం కూలిన దుర్ఘటనలో 19 మంది దుర్మరణం చెందారు. మౌంట్ ఎవరెస్ట్ను తిలకించి తిరిగి వస్తుండగా జరిగిన ఈ ప్రమాదం లో అసువులు బాసిన వారిలో 10 మంది భారతీయులు.
^ పాకిస్తాన్ మాజీ పేసర్ అక్తర్ తన ఆత్మాకథ లో పేర్కొన్న అంశాలకు సంబందించి సచిన్ ద్రావిడ్ లకు క్షమాపణలు చెప్పాలని బీసీసీఐ డిమాండ్ చేసింది.
^ సైనా జోరుకు బ్రేకులు: జపాన్ ఓపెన్ సెమీస్ లో ఓటమితో ఇంటిముఖం పట్టింది.
^ వన్న్డే లు ఆకర్షణీయంగా ఉండేందుకు నాల్గు ఇన్నింగ్స్ ఉంటె బాగుంటుందన్న సచిన్ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించింది. ఇప్పటికె ఆస్ట్రేలియాలోని దేశవాళి క్రికెట్ లో ఈ ఫార్మాట్ సక్సెస్స్ అయింది.
____________________________________________________________
* జ్ఞాన సముపార్జనకు ప్రశాంత మైన మనస్సు ప్రధానం-స్వామి వివేకానంద
* మీశక్తిని వ్యర్ద్ధమైన మాటల్లో వృదా చేయక, మౌనంగా ధ్యానం చేయండి. మన:శక్తిని సమీకరించి
ఆధ్యాత్మిక శక్తి జనక యంత్రంగా అవతరించండి-స్వామి వివేకానంద
_________________________________________
No comments:
Post a Comment