sachin
tendulkar gets 100th international 100's-first man on earth
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ వందో వందను అందుకున్నాడు. భారత్,పాకిస్థాన్,బంగ్లాదేశ్,శ్రీలంకలు పాల్గొన్న ఆసియాకప్‌లో మాస్టర్ అందరి ఆకాంక్షల్ని నెరవేర్చాడు.బంగ్లాదేశ్ బౌలర్ షకిబ్ బౌలింగ్‌లో సింగిల్ తీయడం ద్వారా సచిన్ ఖాతాలో వందో సెంచరీ చేరింది.23 ఏళ్ల కెరీర్‌లో సచిన్ 1990లో ఇంగ్లండ్‌పై ఆ దేశంలో జరిగిన టెస్టు సీరీస్‌లో తొలిసెంచరీ చేశాడు.అలా ఇప్పటికి 51 టెస్టు సెంచరీలను నమోదు చేయగలిగాడు.ఇక వన్డేలో తొలి సెంచరీని 1994లో ఆస్ట్రేలియాపై సాధించాడు. అప్పటి నుంచి ప్రతిఏటా కనీసం ఓ వన్డే సెంచరీ సచిన్ ఖాతాలో చేరుతోంది.వన్డేల్లో మొత్తం 49 సెంచరీలను చేశాడు.సచిన్ సాధించిన వంద సెంచరీల్లో భారత్ 53 విజయాలను అందుకోగా 25 మ్యాచ్‌లోనే ఓడింది.
మరో 20 డ్రా కాగా 2 మ్యాచ్‌ల ఫలితాలు తేలలేదు.
|
No comments:
Post a Comment