6 Mar 2012

Super Air-Craft


టోక్యో-లండ‌న్ దూరం 5929 మైళ్లు. కేవ‌లం 2 గంట‌ల 20 నిమిషాల్లో చేరితే.. ఎలా? ఇంకెలా సూప‌ర్‌సానిక్ విమానంలో.అది గంట‌కు 5 వేల కిలోమీట‌ర్ల వేగంతో దూసుకుపోతుంది మ‌రి. అంత‌దూరం ఇంత కొద్ది సేప‌ట్లోనా..భ‌లే క‌దూ! క‌లలా అనిపించే ప్ర‌యాణం మ‌న సొంతం కావ‌డం ఇంకెంతో దూరంలో లేదంటోంది యూరోపియ‌న్ సంస్థ EADS. నావెల్ కాంబినేష‌న్ ఆఫ్ ప్రొప‌ల్ష‌న్ టెక్నాల‌జీస్ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌తోపాటు,త‌క్కువ ఖ‌ర్చుతో గ‌మ్యాన్ని శ‌ర‌వేగంగా చేరుకునే స‌దుపాయాన్నిప్ర‌యాణికుల‌కు అందించ‌ద‌ల‌చింది. అయితే ఇది స‌త్వ‌ర‌మా,సుదూర కాలంలోనా అని ఇప్పుడే చెప్ప‌లేక‌పోయినా క‌చ్చితంగా ప్ర‌యాణికుల్ని ఈ శ‌ర‌వేగ విమానంలో ఉర్రూత‌లూగించ‌డం ఖాయ‌మంటున్నారు  EADS అధికార ప్ర‌తినిధి గ్రెగ‌ర్ వొన్ క‌ర్సెల్‌.జ‌ట్‌, రాకెట్‌, రామ్‌జెట్‌ల‌నే ప్రొప‌ల్ష‌న్ సాంకేతిక‌  ప‌రిజ్ఞానంతో  ఈ విమానాలు ప్ర‌యాణికుల్ని సంభ్ర‌మ‌ప‌ర‌చ‌నున్నాయ‌న్నారు. ఇప్ప‌టికే ఈ ఆధునిక‌కాలంలో ప్ర‌పంచ‌మే ఓ కుగ్రామంగా మారిన త‌రుణంలో గ‌గ‌న‌త‌లం ద్వారాను ప్ర‌పంచ‌పు ఎల్ల‌ల్ని మాక్‌-5 స్పీడ్‌తో మ‌నం క్ష‌ణాల్లో చుట్టేయ‌డం ఇంకెంతో దూరంలో లేద‌న్న మాట‌.
శ‌ర‌వేగానికి అడ్డంకులు:శ‌ర‌వేగానికి ప‌ర్యాయ‌ప‌దంగా నిలిచే విమానాలు ఇప్ప‌టికే అందుబాటులో ఉన్నాయి.అయితే విశ్వవ్యాప్తంగా ప్ర‌స్తుతం నెల‌కొన్న ఆర్థిక‌మాంద్య ప‌రిస్థితులు,రాబ‌డులు త‌గ్గ‌డం,నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు పెరిగిన నేప‌థ్యంలో ఆ స‌ర్వీసులు నిలిపివేత‌కు గుర‌య్యాయి.2003 వ‌ర‌కు బ్రిటిష్ ఎయిర్‌వేస్‌,ఎయిర్ ఫ్రాన్స్ కాంక‌ర్డ్ విమాన స‌ర్వీసుల‌ను న‌డిపాయి. అయితే ఈ సూప‌ర్‌సానిక్ పాసింజ‌ర్ ట్రావెల్ న‌ష్టాలు చ‌విచూడ్డంతో శ‌ర‌వేగ విమానాలు రాక‌పోక‌లు ఆగిపోయాయి.ఇప్పుడు మ‌ళ్లీ ఆ స‌ర్వీసుల్ని కొన‌సాగించేందుకు ది ఏరియ‌న్ సూప‌ర్‌సానిక్ బిజినెస్ జెట్ సంసిద్ధ‌మౌతోంది.ఈ స‌ర్వీసు విమానాలు మాక్‌-1.5 వేగంతో గంట‌కు 4 వేల మైళ్ల దూరాన్ని సునాయాసంగా చేరుకుంటాయి.ఇప్ప‌టికే నాసా ఎఫ్‌-15 సూప‌ర్‌సానిక్ జెట్ వివిధ ప‌రీక్ష‌ల్లో మునిగితేలుతోంది.ఈ జెట్ ప‌రీక్ష‌లు స‌ఫ‌ల‌మ‌యితే పారిస్ నుంచి న్యూయ‌ర్‌కు గ‌ల‌ 3624 మైళ్ల దూరాన్ని 4 గంట‌ల 14 నిమిషాల్లో చేరుకోవ‌చ్చు.ప్ర‌స్తుతానిక‌యితే ఈ సూప‌ర్‌సానిక్ విమానాల‌పై అమెరికాలో ఓ ర‌క‌మైన నిషేధం ఉంది.ఈ శ‌ర‌వేగ విమానాలు ఆర్థిక‌వ్య‌వ‌స్థ‌కే కాక ప్ర‌యాణ ప‌రిమితుల‌కూ శ‌త్రువేన‌ని భావించ‌డ‌మే కార‌ణం.కానీ సూప‌ర్‌సానిక్ నేచుర‌ల్ లామిన‌ర్ ఫ్లో(ఎస్‌.ఎన్‌.ఎల్‌.ఎఫ్‌)సాంకేతిక ప‌రిజ్ఞాన విమానాల‌తో ఆర్థికంగానేకాక ప్ర‌యాణ వేగ ప‌రిమితుల‌కు లోబ‌డి శ‌ర‌వేగ విమానాల శ‌కం మ‌ళ్లీ ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి రాగ‌ల‌ద‌ని ఏరియ‌న్ అధికారి బ్ర‌య‌న్ బెరెట్స్ ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.
వైభ‌వ విహాంగాలు:నాలుగు ఇంజిన్ల‌తో మాక్-0.83 వేగంతో 50వ ద‌శ‌కాల్లో అత్య‌ధిక ప్ర‌యాణికుల్ని గ‌మ్యాల‌కు చేర్చిన ఘ‌న‌త బి-707 విమానాల‌ది. ఇప్పుడు బోయింగ్-787, ఎయిర్‌బ‌స్‌-380లు సేవ‌లు అందిస్తున్నాయి. బి-747 ఇప్పుడు 40వ పుట్టిన‌రోజును జ‌రుపుకుంటోంది. బోయింగ్ అంటేనే భారీత‌నానికి పెట్టింది పేరు. ప్ర‌యాణికుల్ని త‌ర‌లించ‌డంలోనూ సైజులోనూ దానిక‌దే సాటి. ఒక్కో విమానంలో సుమారు 4 వంద‌ల మంది ప్ర‌యాణించే అవ‌కాశ‌ముంది. ఈ కోవ‌కే చెందిందే ఎ-380.ఈ విమానం గంట‌కు 80 నుంచి 100 మైళ్ల వేగంతో ప్ర‌యాణిస్తూ భారీ సంఖ్య‌లో ప్ర‌యాణికుల్ని గ‌మ్యాల‌కు చేరుస్తుంది.

No comments:

Post a Comment

Popular Posts

Wisdomrays